భవిష్య మహా పురాణము
106. సప్తమీ కల్పమున పాపనాశినీ వ్రత విధి వర్ణనము
బ్రహ్మోవాచ :
మూ॥ పునశ్చైతన్మహా భాగ! శ్రూయతాంగదతో మమ ప్రోక్తం ఖగేన దేవానాం తిథి మాహాత్మ్యముత్తమమ్
విష్ణురువాచ :
విజయాతిజయాచైవ జయంతీచ మహాతిథిః త్వత్తః శ్రుతా సుర శ్రేష్ఠ! బ్రూహిమే పాపనాశినీమ్
తథోత్తరాయణం బ్రూహీ శస్తం యద్భాస్కరార్చనే యత్ర సంపూజతితో భాను ర్భవేత్సర్వాఘనాశనః
తన్మేకథ య యత్నేన భక్త్యా పృష్టోఽక్షయం ఫలమ్
బ్రహ్మోవాచ :
శుక్ల పక్షేతు సప్తమ్యాం యదరంతు రవేర్భవేత్ తదా స్యాత్సా మహాపుణ్యా సప్తమీ పాపనాశినీ
తస్యాం సంపూజ్య దేవేశం చిత్రభానుం జగద్గురుమ్ సప్త జన్మ కృతాన్పాపాన్ముచ్యతే నాత్ర సంశయః
యశ్చోపవాసం కురుతే తస్యాం నియత మానసః సర్వ పాప విముక్తాత్మా సూర్యలోకే మహీయతే
దానం యద్దీయతే కించిత్తముద్దిశ్య దివాకరమ్ హోమోవా క్రియతే తత్ర తత్సర్వం చాక్షయం భవేత్
ఏక ఋగ్వేదః పురతో జప్త: శ్రద్ధాపరేణతు ఋగ్వేదస్య సమస్తస్య యచ్ఛతే సత్ఫలం ధ్రువమ్
సామవేద ఫలం సామ యజుర్వేద ఫలం యజుః అధర్వా అధర్వాంగిరసో నిఖిలం యచ్ఛతే రవిః
తారకా ఇవ రాజంతే ద్యోతమానా దీవానిశమ్ సమభ్యర్చ్య చ సప్తమ్యాం దేవ దేవం దివాకరమ్
యత్ర పాప మశేషం వై నాశ యత్యత్ర భాస్కరః కర్తవ్యా సప్తమీ కృష్ణ! తేనోక్తా పాపనాశినీ
అస్యాం సమభ్యర్చ్య రవిం యాతి సౌరపురం నరః విమాన వర మారుహ్య కర్పూరోద్భవ ముత్తమమ్
తేజసా కవి సంకాశః ప్రభలో సూర్య సన్నిభః కాంత్యాత్రేయ సమకృష్ణ! శౌర్యే హరి సమః సదా
మోదతే తత్ర సుచిరం బృందారక గణైః సహ పున రేత్య భువం కృష్ణ! భవేద్వే క్ష్మాధిపాధిపః
ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే బ్రా హ్మే పర్వణి సప్తమీ కల్సే పాపనాశినీ వ్రత విధాన వర్ణనం నామ షడధిక శతతమోఽధ్యాయః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “మహా భాగా! మఱియొక వ్రతమును గూర్చి చెప్పుచున్నాను వినుము. ఈ తిథి మాహాత్మ్యము పూర్వము సూర్య భగవానుని చేత దేవతలకు చెప్పబడినది”. అది విని విష్ణు భగవానుడిట్లనెను. “సుర శ్రేషా! విజయ, అతిజయ, మహాతిథియగు జయంతి యను తిథులను గూర్చి మీరు చెప్పగా వినియుంటిని. ఇక నాకు పాపనాశిని గురించి తెలుపుడు. అటు పిమ్మట సూర్య పూజకు ప్రశస్తమైన ఉత్తరాయణమును గుఱించి చెప్పుడు: ఉత్తరాయణమున సూర్య భగవాను నర్చించు వారి పాపములు నశింపజేసి, యా దేవుడక్షయ ఫలము లిచ్చు విషయమును భక్తితో నడుగుచున్న నాకు తెలియజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడగెను. “శుక్ల పక్ష సప్తమీ దినమున సూర్య నక్షత్రమయ్యెనేని యది మహా-పుణ్యప్రదమగు పాప నాశినీ సప్తమీ” యన బరగును. ఆ తిథియందు జగద్గురువైన చిత్రభాను దేవేశుని పూజించినచో నాతడేడు జన్మలలోను చేసియుండిన పాపముల నుండి ముక్తునిఁజేయు ననుటలో సందేహము లేదు-5. నియత మానసుడై యా దినమున నుపవసించువాడు సర్వ పాప విముక్తుడై సూర్యలోక విభవము ననుభవించును. సూర్య దేవునుద్దేశించి యాదినమున చేసిన స్వల్పమైన దానము గాని, చేసిన హోమము గాని, యదియంతయు నక్షయమగును. సూర్య దేవుని సమక్షమున శ్రద్ధాపరుడై ఒక్క ఋగ్వేద మంత్రమునైనను జపించువానికి సమస్త ఋగ్వేదమును పఠించిన సత్పలము నా దేవదేవుడొసంగును. ఇది నిశ్చయము. ఒక్క సామము సామవేద సర్వస్వ ఫలము, ఒక్క యజుస్సు, యజుర్వేద సర్వస్వ పఠన ఫలమును, ఒక్క అధర్వ మంత్ర పఠన మఖిలాధర్వవేద పఠన ఫలము నోసంగునట్లా సూర్య దేవుడనుగ్రహించును. సప్తమీనాడు దేవ దేవుడైన దివాకరుని పూజించువారు రాత్రింబవలును తారకల వలె ప్రకాశించుచుందురు. భాస్కరుడిట్టి భక్తుల యశేషపాపములను నశింపజేయును. సూర్య ప్రోక్తమైన యీ పాపనాశినీ సప్తమీ వ్రతమును తప్పక చేయవలయును. ఈ తిథి యందు సూర్యార్చన చేయువాడు సూర్య లోకమునకుత్తమమైన కర్పూర విమానము పై పయనించి చేరుతు. తేజస్సు చేత శుక్ర సంకాశుడై, ప్రభ చేత సూర్య సన్నిభుడై, కాంతిచే చంద్రసముడై, శౌర్యము నందు హరి సమానుడై. వెలుగుచు. నచట దేవగణములతో గూడి సుఖముగ నుండును. మఱల నీ భువికేతెంచి చక్రవర్తి యగును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు 'పాప నాశినీ' వ్రత విధి వర్ణనమను నూటయాఱవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 106 of the Bhavishya Mahā Purana is as follows:
The Pāpanāśinī ("sin-destroying") vrata on the saptamī tithi is presented as the most comprehensive of all the purificatory practices in the Saptamī Kalpa. While other vratas may remove specific categories of sin, the Pāpanāśinī vrata destroys accumulated karmic debt across all categories — sinful actions in this life and previous lives, actions committed knowingly and unknowingly, sins of body, speech, and mind. The procedure involves a complete confession before Sūrya at dawn, a full day of fasting and mantra recitation, and an act of significant charitable giving at sunset. The chapter narrates the story of a man who had committed serious offences in youth and who, through the Pāpanāśinī vrata practised for twelve consecutive saptamīs, was completely purified and ultimately liberated.