98. సప్తమీ కల్పమున అపరాజితా వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూII మాసిభాద్రపదే శుక్లా సప్తమీ యాగణాధిప! అపరాజితేతి విఖ్యాతా మహాపాతకనాశినీ

చతుర్థ్యామేక భక్తంతు పంచమ్యాం నక్తమాదిశేత్ ఉపవాసం తథా షష్ట్యాం సప్తమ్యాం పారణం స్మృతమ్

పారణాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః పుష్పాణి కరవీరస్య తథైరక్తంచ చందనమ్

ధూపక్రియా గుగ్గులేన నైవేద్యం గుడ పూపకాః భాద్రపదాది మాసేషు వీధిరేష ప్రకీర్తితః

శ్వేతాని భీమ! పుష్పాణి తథాశ్వతంచ చందనమ్ ధూపమాజ్య మిహాఖ్యాతం నైవేద్యం పాయసంరవేః

 మార్గశీర్షాది మాసేషు విధిరేష ప్రకీర్తితః తతోఽగస్తస్య పుష్పాణి కుంకుమంచ విలేపనమ్

ధూపార్థం సిహ్లకం ప్రోక్తమధవా రవివర్ణకమ్ శాల్యోదనం చ నైవేద్యం సరసం ఫాల్గునాదిషు

రక్తోత్పలాని భూతేశ! సాగురుం చందనం తథా అనంతో ధూప ఉద్దిష్టో నైవేద్యం ఖండపూపకాః

శ్రీ ఖండం గ్రంథి సహితమగురుః సిహ్లకం తథా ముస్తా తథద్రం భూతేశ! శర్కరా గృహ్యతే త్ర్యహమ్

 ఇత్యేష ధూపోఽనంతస్తు కథితో దేవసత్తమ! జ్యేష్ఠాది మా సేషు తథా విధిరుక్తోమనీషిభిః

తా॥  బ్రహ్మదేవుడిట్లు చెప్పెను. “భాద్రపద మాసమునందలి శుక్లపక్ష సప్తమీ తిథి అపరాజిత యను పేరుతో ప్రసిద్ధమైనది. అది మహా పాపములను నశింపజేయగలది. చతుర్థినాడేక భుక్తము, పంచమినాడు నక్తము, షష్ఠినాడు ఉపవాసము, సప్తమీనాడు పారణయు నీ విధియందు చెప్పబడినది. ఇందు కూడ నాలుగు పారణలు పండితులచే చెప్పబడినవి. గన్నేరు.. పువ్వులు, రక్తచందనము. గుగ్గులధూపము, బెల్లపు భక్ష్యములు నైవేద్యము పూజార్థము చెప్పబడినవి. భాద్రపదాది మాసములందీ విధానము నిర్దేశింపబడినది. తెల్ల గన్నేరుపూలు, శ్వేతచందనము, ఆజ్యధూపము, పాయసనైవేద్యము. మార్గశీరాది మాసములందు సూర్యపూజకై వినియోగింపవలెనని విధానము నిర్దిష్టమైనది. పిమ్మట అగి సెపూలు, కుంకుమ విలేపనము, అందుగుమ్రాకు  వలన బుట్టిన ధూపము శాల్యన్ననైవేద్యము ఫాలునాది మాసములందు సూర్యపూజకు వినియోగింపవలెను. ఎఱ్ఱఁగలువలు, అగురుతోగూడిన చందనము, అనంత ధూపము, ఖండశర్కరతోజేయబడిన అపూపములు. ఇవి సూర్య పూజార్థము పయోగింపవలెను. శ్రీ ఖండము, (గనుపులతో గూడినది), అగురు, యావనము, ముస్తలు, శర్కర, సౌవర్చలము. వీని మిశ్రమము 'అనంత' మను ధూపముగా చెప్పబడును. జ్యేష్ఠాది మాసములందు నీ విధానముగ ప్రతాచరణము చేయనగునని బుద్దిమంతులు చెప్పుదురు.

 మూII శృణు నామాని దేవస్య ప్రాశనాని చ సువ్రత! సుధాంశు రర్యమా చైవ సవితా త్రిపురాంతకః

పారణే ష్వేవ సర్వేషు ప్రీయతామితి కీర్తయేత్ గోమూత్రం పంచగవ్యంతు ఘృతం చోష్ణం పయోదధి

యస్త్వేతాం సప్తమీం కుర్యాదనేన విధినా నరః అపరాజితో భవేత్సోసౌ సదా శత్రుభిరాహవే

జిత్వా శత్రుం లభేతాపి త్రివర్గం నాత్రసంశయః త్రివర్గ మథ సంప్రాప్య స్వర్భానోఃపుర మశ్నుతే

తతః పూర్ణేషు మా సేషు పూజయచ్ఛక్తితః ఖగమ్ గంథ పుష్పోప హారైస్తు పురాణ శ్రవణేనచ

అశ్వదానేనచ విభోర్భ్రాహ్మణానాంచ తర్పణైః వాచకం పూజయిత్వాచ భాస్కరస్య ప్రియం సదా

భాస్కరాయ ధ్వజాన్దద్యాన్నైనా రత్న విభూషితాన్ య ఇత్థం కురుతే వీర! సప్తమీం యత్నతః సదా

స పరాజిత్యవై శత్రుం యాతి హంస సూకతామ్

శుక్లాశ్వోద్భవ యానేన ఆపగేన పతాకినా ఆపగాధిప సంకాశ ఆపగానుచరో భవేత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే

అపరాజితా వర్ణనం నామాష్ట నవతి తమోఽధ్యాయః

తా॥ సూర్యదేవుని ప్రార్థింపవలసిన నామములను, ప్రాశనము చేయదగిన వస్తువులను గూర్చి వినుము. “సుధాంశుడు, అర్యముడు, సవిత, త్రిపురాంతకుడు. ప్రీతుడగుగాక” అని అన్ని పారణములందును సూర్యదేవుని కీర్తింపవలెను. ఆవు మూత్రము, నేయి, పేడ, పాలు, పెరుగుల మిశ్రమమగు పంచగవ్యమును ప్రాశన చేయవలెను. ఈ విధానమున నీ సప్తమీ వ్రతము నాచరించువాడు ఎప్పుడును యుద్దమునందు శత్రువులచే ఓడింపబడక జయమందును. శత్రువులను జయించి ధర్మార్థ కామములను పొందుననుటలో సందేహము లేదు. ఇట్లు త్రివర్గములను పొంది సూర్యలోక ప్రాప్తినందును. అన్ని మాసములందు యథాశక్తిగ, గంథపుష్పోపహారములతో, పురాణ శ్రవణములతో. అశ్వదానముతోను బ్రాహ్మణ భోజన సంతర్పణలతోను, సూర్య ప్రియుడైన పౌరాణి కుని సమ్మానముతోను సూర్యభగవానుని పూజింపవలేను. భాస్కరదేవునకు వివిధ రత్నములతో నలంకరింపబడిన ధ్వజములను సమర్పింపవలేను. పూనికతో నిట్లు సప్తమీవ్రతము నాచరించువాడు శత్రువునోడించి సూర్య లోకమునకుఁబోవును. స్వర్ణ ధ్వజ పతాకములతో, శ్వేతాశ్వములతో శోభించు వాహనము పై పయనించి వరుణ ప్రభుడై వరుణ దేవునిఁజేరి యాతని యనుచరుడగును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు అపరాజితా వర్ణనమను తొంబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.