96.సప్తమీ కల్పమున జయనామ సప్తమీ మహాత్మ్య వర్ణనము

మూII దిండి రువాచ : -

“యశ్చైతాః సప్త సప్తమ్యో భవతా కథితామమ తాసాం యా ప్రథమా దేవ! కథితా సా సవిస్తరా

యాస్త్వన్యా దేవశార్దూల! తాః సర్వాః కథయస్వమే యేనోపోష్య తతస్తాస్తు వ్రజేహం హెలిసద్మవై”

 బ్రహ్మోవాచ : -

శుక్ల పక్షస్య సప్తమ్యాం నక్షత్రం పంచతారకమ్ యదాస్యాత్సా తదా జ్ఞేయా జయానామేతి సప్తమీ

 తస్యాం దత్తం హుతం జాపస్తర్పణం దేవపూజనమ్ సర్వం శతగుణం ప్రోక్తం పూజాచాపి దివాకరే

భాస్కరస్య ప్రియా హ్యేషా సప్తమీ పాపనాశినీ ధన్యాయశస్యా పుత్ర్యాచ కామదా కంజజావహా

 విధినానేన కర్తవ్యా తిథిర్యామమ విద్యతే తం శృణుష్వ విధిం మత్తాయేన కృత్వార్థ మశ్నుతే

హంసే హంస స మారూఢే శుక్లయం సప్తమీ పురా సముపోష్యచకర్తవ్యా విధానానేన శంకర!

పారణా తృతీయాఽహే స్యాత్కథితం గోవృషావహమ్ ప్రథమం చతురోమాసాన్పారణం కథితం బుధైః

కథితాన్యత్ర పుష్పాణి కరవీరస్య సువ్రత! చందనంచ తథారక్తం ధూపార్థం గుగ్గులం పరమ్

కాంసారంతు సుపక్వంచ నైవేద్యం భాస్కరాయవై అనేన విధినా పూజ్య మార్తాండం విబుధాధిపమ్

పూజయేద్భ్రాహ్మణాన్భీమ! భక్ష్యభోజ్యైర్యధావిధీ కాంసారం భోజయే ద్విప్రాన్పారణే స్మిస్వచక్షణః స్వయమేవతథాశ్నీయాత్ప్రయాతో మౌనమాశ్రితః

తా॥ దీండి యిట్లనెను. “దేవా! ఏడు సప్తమీ తిథులను గూర్చి నాకుఁదేలిపితిరి. పోనీలో మొదటి సప్తమీ గుఱించి సవిస్తరముగ నుడివిత్తిరి. ఇతరములైన ఆటు సప్తములను గూర్చి వివరించిచెప్పుడు. వానిని ఉపవాసాదులతో నాచరించి నేను సూర్యలోకమునకుఁ బోవఁజాలుదును”. బ్రహ్మ దేవుడిట్లు నుడివెను. “ఐదు తారలుగల నక్షత్రము శుక్ల పక్ష సప్తమీ నాడేర్పడినచో నది 'జయ' అను. పేరుగల సప్తమీగా తెలియవలెను. ఆ దినమున చేసిన దానము, హవనము, జపము; తర్పణము, దేవతార్చనము, సూర్యపూజ - అన్నియును నూఱురెట్లు ఫలమిచ్చునని చెప్పఁబడినది. ఇది భాస్కర దేవునకు ప్రియమైన దినము. పాపములను నశింపఁ జేయునది. కృతార్థతను, యశస్సును, సంతానమును, అభీష్టసిద్ధిని, ఐశ్వర్యమును ఇచ్చునది. నేను చెప్పిన ఈ తిథి వర్తించునప్పు డే విధిని పాటింపవలెనో చెప్పుచున్నాను వినుము. పాటించు వారభీష్ట ప్రయోజనమును పొందుదురు. శంకరా! సూర్యుడు హస్తానక్షత్రమున ప్రవేశించినపుడది 'శుక్ల సప్తమీ'గా పూర్వము వ్యవహరింపబడెను. ఆనాడు ఉపవాసము చేసి వక్ష్యమాణ విధిగా ప్రతాచరణము నిర్వర్తింపవలేను. మూడవ దినమున పారణ చేయవలెనని చెప్పబడినది. అటుల చేయుట తేజస్సును, ధర్మమును కలిగించును. మొదటి పారణము నాలుగు మాసములకు చేయవలెను. అనగా సంవత్సరము సాంతమునకు మూడు పారణములు. ఈ సందర్భమున గన్నేరు పువ్వులు, ఎట్టి చందనము, శ్రేష్ఠమైన గుగ్గులు ధూపము. నైవేద్యము కొఱకు కాంసారము (గోధుమ పిండిని నేతిలో వేయించి శర్కర పాకముతో చేయబడు తీపి పదార్థము=పంజీరి) భాస్కర దేవుని పూజలో వినియోగింపవలెను. విధి పూర్వకముగ సూర్యునిట్లు పూజించి. పారణమునందు బ్రాహ్మణులను సూర్య దేవుని ప్రసాదములతో భుజింపజేసిమౌన వ్రతుడై తాను కూడా భుజింపవలేను.

మూII పంచమ్యామేక భక్తంతు షష్ఠ్యాం నక్తం ప్రవర్తతే కృత్వోపవాసం సప్తమ్యా మష్టమ్యాం పారణం భవేత్

షష్ట్యా సమేతా కర్తవ్యా నాష్టమ్యేయం కదాచన యస్సోహవాసనాయైవ షష్ట్యా మాహురుపోషితమ్

యథైకాదశ్యాం కుర్వంతి ఉపవాసం మనీషిణః ఉపవాసనాయద్వాదశ్యాం తథ్యం పరికీర్తితా

 భానుత్మేప్రియాతామత్ర దంతకాష్ఠం తథార్కజమ్

ఇత్యేష కథిత స్తాత! ప్రథమే పారణే విధిః ద్వితీయం శ్రూయతాం భీమ! పారణం గదతో మమ

మాలతీ కుసుమానీహ శ్రీ ఖండం చందనం తథా నైవేద్యం పాయసం భానోర్ధూపం విజయమాదిశేత్

బ్రాహ్మణాన్భోజయేద్వాపి తథాశ్నీయాత్స్వయం విభో! రవిర్మేప్రియతామత్ర నామదేవస్య కీర్తయేత్

ప్రాశయేత్పంచ గవ్యంతు ఖాదిరం దంత ధావనే ద్వితీయేపారణే వీర! విధిరుక్తోమయాధునా

 తృతీయం పారణం చాపి కథ్యమానం నిబోధమే అగస్తికుసుమైరత్ర పూజయేద్భాస్కరం బుధః

తా॥  పంచమినాడేకాహారుడై షష్ఠినాడు నక్త వ్రతముతోనుండి, సప్తమీనాడు ఉపవసించిన అష్టమినాడు పారణమగును. షష్టితో గూడిన సప్తమీనాడే ఉపవసింపవలెనుగాని, అష్టమితో గూడిన సప్తమీనాడు ఉపవసింపరాదు. అష్టమినాడు పారణ నిమిత్తముగా సప్తమీతో గూడిన షష్టినాడు ఉపవసింపవలెనని చెప్పుదురు. ద్వాదశినాడు పారణ చేయుటకొఱకు ఏ కాదశినాడు ఉపవాసము చేసినట్లదియును అటులే చెప్పబడినది. “భానుర్మేప్రియతామత్ర” (సూర్యదేవుడు ప్రీతుడైనన్ను గ్రహించునుగాక) అను మంత్రమునుచ్చరింపుచుస్తానము, గోమయ భక్షణము చేయవలెను. దంత ధావనము కొఱకు జిల్లేడు కళి పుల్లనుపయోగింపవలెను. ఇట్లు మొదటి పారణ విధి చెప్పబడినది. ఇక రెండవ పారణ విధి చెప్పుచున్నాను వినుము.. జాజి పూలు, శ్రీ ఖండము (చందనము) 'విజయ' ధూపము, నైవేద్యము కొఱకు పాయసము, సూర్యదేవుని పూజకు వినియోగింపవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి యాపిదప తాను భుజింపవలెను. ఈ సందర్భమునఁజేయు ప్రతిపనియందును “రవిర్మేప్రియతామత్ర' అనుచు సూర్యదేవుని స్మరించుచుండవలెను. ద్వితీయ పారణమున పంచగవ్య ప్రాశనము చేయవలెను. దంత ధావనమునకు చండ్ర కఱ్ఱపుల్లనుపయోగింపవలెను. రెండవ పారణ మెట్లు పూర్తి చేయవలెనో ఆ విధానము చెప్పితిని. ఇప్పుడు మూడవ పారణమును గూర్చి చెప్పబోవుచున్నాను. దానిని తెలిసికొనుము. ఈ సందర్భమున సూర్యదేవుని అగిసే పూలతో పూజింపవలెను.

మూ! సమాలంభన మంత్రోక్తం శ్రీ ఖండం కుసుమంతధా సిహ్లాకో ధూప ఉద్దిష్టో భానోః ప్రీతికరః పరః

శాల్యోదనంతు నైవేద్యం రసాలోపరి సంయుతమ్ బ్రాహ్మణానాంతు దాతవ్యం భక్షయేత తథాత్మనా

 కుశోదక ప్రాశనంతు బదర్యా దంత ధావనమ్ 'వికర్తనః ప్రీయతాంమే' నామ దేవస్య కీర్తయేత్

 వర్షాసు దేవదేవస్య పూజా కార్యా విధానతః గంధ పుష్పోప హారైస్తు నానా ప్రేక్షణకై స్తథా

గోదానైర్భూమి దానైర్వా బ్రాహ్మణానాంచ తర్పణైః ఇత్థం సంపూజ్య దేవేశం దేవస్య పురతః స్థితః

కారయేత్పరమం పుణ్యం ధన్యం పుస్తక వాచనమ్ వస్త్రైర్గంధై స్తథా ధూపై ర్వాచకం పూజయేత్తతః

 దేవస్య పురతః స్థిత్వా తతో మంత్ర ముదీరయేత్ ‘దేవదేవ! జగన్నాథ! సర్వరోగార్తి నాశన! గ్రహేశ! లోకనయన! వికర్తన! తమోపహ!

కృతేయం దేవదేవేశ! జయానామేతి సప్తమీ మయా తవ ప్రసాదేన ధన్యా పాపహరా శివా'

 అనేన విధినా వీర! యః కుర్యాత్సప్తమి మీమామ్తస్య స్నానాదికం సర్వం భవేచ్ఛత గుణం విభో!

 కృత్వేమాం సప్తమిం వీర! పురుషః ప్రాప్నుయాద్యశః ధనం ధాన్యం సువర్ణంచ పుత్రమాయుర్బలం శ్రియమ్

 ప్రా పేహ దేవశార్దూల! సూర్యలోకం సగచ్ఛతి తస్మాదేత్య పునర్భూమౌ రాజరాజో భవేద్బుధః

 ఇత్యేషా కథితా వీర! జయానామేతి సప్తమీ కృతాస్మృతా శ్రుతా సాతు హేలిలోక ప్రదాయినీ

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణీ సప్తమీ కల్పే జయానామ సప్తమీ మాహాత్మ్య వర్ణనం నామ షణ్ణవతి తమోఽధ్యాయః

 తా॥ గంధలేపన మంత్రముతో శ్రీ ఖండము; పుష్పములు, అందుగు మాకువలనఁబుట్టిన యావన ధూపము - సూర్య దేవునకు ప్రియములైన ఈ పూజా ద్రవ్యములతో నా దేవుని పూజింపవలెను. నైవేద్యమునకు పైన చక్కెర చల్లిన (లేక .మామిడి పండ్ల రసముతో) శాల్యన్నమునుపయోగింపవలెను. బ్రాహ్మణులకు అన్నదానము చేసి ఆపై తాను భుజింపవలెను. ఈ సందర్భమున కుశోదక ప్రాశనము చేయవలెను. రేఁగు పుల్లతో దంతధావనము చేసికొనవలెను “వికర్తనః ప్రీయతాంమే” (సూర్య దేవుడు నాయీ భక్త్యుపచారమునకు ప్రీతుడగుగాక) అను మంత్రమును తఱచుగ నుచ్చరించుచుండవలెను. వర్షర్తువునందు గంధ పుష్పోపహారములతో, వివిధములైన నృత్య నాటక సంగీతాది కార్యక్రమములతోను సూర్య భగవానునికి యథావిధిగా పూజ చేయవలెను. గోదాన భూదానాదులతో బ్రాహ్మణులను తృప్తి పలుపవలేను. ఇట్లు పూజించి యాదేవ దేవుని సమక్షమున, పరమ పుణ్య కారణము, ధన్యమునైన పురాణ ప్రవచనమును జరిపింపవలెను. అనంతరము వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, ధూపములు మున్నగువానితో పౌరాణికుని పూజింపవలెను. పిదప దేవుని యెదుట నిలచి ఈ మంత్రమును పఠింపుచు సూర్యదేవుని ప్రార్థింపవలెను. “ఓ దేవదేవా! జగన్నాథా! సర్వ రోగములను, బాధలను పోగొట్టువాడా! గ్రహరాజా! లోకమునకు చూపునిచ్చువాడా! విశ్వ కర్మచేత సుందర రూపముగ తీర్చబడినవాడా! చీకట్లను పారద్రోలువాడా! దేవదేవేశా! నేను నీ అనుగ్రహముచే, ధన్యమైనది, పాపహరమైనది, శివంకరమైనదియు నైన జయాసప్తమీని నా శక్తి కొలదిగా చేసితిని. నన్ననుగ్రహింపుము". ఇది జయాసప్తమీ విధి. ఈ విధానముగ నీ సప్తమీ వ్రతమాచరించిన వానికి - స్నానాది కర్మలన్నింటికిని నూడు రెట్లు ఫలము లభించును. ఈ సప్తమీ వ్రతమాచరించి పురుషుడు కీర్తిని, ధనమును, ధాన్యమును, బంగారము, పుత్రులను, ఆయువును, సంపదలను పొందజాలును. పొంది, పరమున సూర్యలోకమునకుఁబోవును. అటనుండి తిరిగి భూలోకమునకేతెంచి యిట చక్రవర్తి యగును. త్రిపురాంతకా! ఇట్లు జయసప్తమీ గూర్చి వివరించితిని. ఇది చేసినను, స్మరించినను, వీనినను సూర్య లోకప్రాప్తిని కలుగజేయును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు జయానామ సప్తమీ మాహాత్మ్య వర్ణనమను తొంబది యాఱవ అధ్యాయము సమాప్తము.