95. సప్తమీ కల్పమున ఆదిత్యాలయ మహాత్య్మ వర్ణనము

 బ్రహ్మోవాచ : -

త్రిభిః ప్రదక్షిణాం కృత్వా యో నమస్కురుతే రవిమ్ భూమౌ గతేన శిరసా సయాతి పరమాం గతిమ్

సోపానత్కోదేవ గృహ మారో హేద్యస్తు మానవః సయాతి నరకం ఘోరం తామిస్రం నామ నామతః

శ్రేష్మ మూత్ర పురీషాణి సముత్సృజతి యస్తువై దేవస్యాయతనే భానోః సగచ్ఛేన్నరకం క్రమాత్

 ఘృతం మధు పయస్తోయం తథేక్షురసముత్తమమ్ స్నపనార్థంతు దేవస్య యేదథతీహ మానవాః సర్వ కామానవా ప్యేహ తేయాంతి హేలి మండలమ్

 స్నాప్యమానం రవీంభక్త్యాయే పశ్యంతి వృషధ్వజ! తేశ్వమేధ ఫలం ప్రాప్య లయం యాంతి వృషధ్వజే

 స్నపనం యేచకుర్వంతి భానోర్భక్తి సమన్వితాః లభంతే తత్ఫలం భీమ! రాజసూయాశ్వమేధయోః

. యథాన లంఘయేత్కశ్చిత్స్నపనం భాస్కరస్యతు తథాకార్యం ప్రయత్నేన లంఘితం హ్య సుఖావహమ్

తామిస్రం నరకం యాతి లంఘయేచ్చసరౌరవాన్ తస్మాత్సర్వ ప్రయత్నేనన కార్యం స్నపన మాదితః

ఘృతేన స్నాప పయేద్దేవం కంజ మాప్నోతి మానవః మధునా ప్రియమాయాతి తోయేనాపీ ఘృతాకసమ్

ఇక్షుర సేన సంస్నాప్య పయసాకంజజ ధ్వజమ్ ఏవమేభిః స్నాపయేద్వై రవి మిహిత మాప్నుయాత్

ఇతి శ్రీ భవి ష్యే మహా పురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్నే ఆదిత్యాలయ మాహాత్మ్య వర్ణనం నామ పంచ నవతి తమోఽధ్యాయః

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను “ముమ్మాకు ప్రదక్షిణ మాచరించి నేలపై తలయాన్చి సూర్య నమస్కారము చేయువాడు పరమ గతి నందును. పాదరక్షలతో సూర్య దేవాలయమున ప్రవేశించువాడు భయంకరమగు తెమిస్రమను నరకమునఁబడును. దేవాయతనమున కఫ మలమూత్ర విసర్జన చేయువాడు క్రమమున నేక వింశతి నరకములనుభవించును, నేయి, తేనె, పాలు, నీరు, ఉత్తమమైన చెఱుకు రసము సూర్యాభిషేకార్థమై ఇచ్చువారు ఇహలోకమున సర్వకామములను పొంది సూర్య మండలమునకు బోవుదురు. అభిషిక్తుడైన సూర్య భగవానుని భక్తితో దర్శించుకొనువారు, అశ్వమేథ యాగ ఫలమును పొంది శివునిలో లీనమగుదురు. సూర్య భగవానునకు స్నానము చేయించు భక్తులు రాజసూయ, అశ్వమేధ యాగములు చేసిన పుణ్య ఫలమును పొందుదురు. సూర్య దేవున కభిషేకము చేసిన జలము నెవరును దాటకుండునట్లేర్పాటు చేయవలెను. అభిషిక్త జలమును దాటుట కష్టములు కలిగించును. దాటువాడు భయంకరమగు తామిస్రమను నరకమును పొందును. కావున ప్రయత్న పూర్వకముగ స్నపన కార్యము మొదటనే చేయవలెను. సూర్యదేవుని నేతితో స్నానము చేయించినవాడు బ్రహ్మలోకమునకుఁబోవును. తేనెతో చేయించినవాడు తనకు ప్రియమైన స్థానమును చేరును. జలముతో నభి షేకించువాడు బ్రహ్మలోకమునకుఁబోవును. సూర్య దేవునిట్లభి షేకించిన నీప్సితార్థ సిద్ధియగును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్యాలయ మాహాత్మ్యవర్ణనమను తొంబది యైదవ అధ్యాయము సమాప్తము.