93. సప్తమీ కల్పమున భానుమహిమ వర్ణనము

బ్రహ్మోవాచ : -

మూ॥ యేషాం ధర్మ క్రియాః సర్వాః సదైవోద్దిశ్య భాస్కరమ్ నకులే జాయతే తేషాం దరిద్రో వ్యాధితోఽపివా

దేవాయతన భూమేస్తు గోమయేనోపలేపనమ్ యఃకరోతి నరో భక్త్యా సద్యః పాపాత్ప్రముచ్యతే

శ్వేతయా రక్తయావాపి పీత మృత్తిక యాపివా ఉపలేపన కర్తాపై చింతితం లభతే ఫలమ్

చిత్ర భానుం విరచ్యైవ కుసుమైర్యః సుగంధిభిః పూజయేతోపవాసస్తు సకామానీప్సితాన్లభేత్

దీపతైల ప్రదానేన నయాతి నరకం నరః దీపతైలం తిలాశ్చైవ మహాపాతక నాశనాః

దీపం దదాతి యో నిత్యం భాస్కరాయతనేషుచ చతుష్పథేషు తీర్దేషు రూపౌజస్వీహ జాయతే

 యస్తు కారయతే దీపం రవేర్భక్తి సమన్వితః సకామానీప్సితాన్రాప్య వృందారకపురం వ్రజేత్

యః సమాలభతే సూర్యం చందనాగురు కుంకుమైః కర్పూరేణ విమిత్రైశ్చ తథాకస్తూరి కాన్వితైః

శుభం కాలంకోటి శతం విహృత్యచ భవాలయే పునః సంజాయతే భూమౌ రాజరాజోన సంశయః సర్వకామ సమృద్ధాత్మా సర్వలోకనమస్కృత:

తా॥ బ్రహ్మదేవుడిట్లునుడివెను. “ఎవరి కులమున నెల్లప్పుడును సూర్యదేవునుద్దేశించి యిట్టి ధర్మ కార్యములు చేయబడు చుండునో వారి కులమున దరిద్రుడుగాని, రోగగ్రస్తుడుగాని జన్మింపడు. సూర్య దేవాలయ ప్రదేశమున నావు పేడతో భక్తి మెయినలుకువాడు తతణమే పాపమునుండి ముక్తుడగును. తెల్లమట్టి, ఎఱ్ఱమట్టి లేక పచ్చని మట్టితోగాని సూర్య మందిరముననులేపనము చేయువాడు తలచిన ఫలమును పొందగలడు, పరిమళ భరితములైన పుష్పములతో సూర్యమూర్తిని రచించి, ఉపవాస వ్రతముతో పూజించువానికి కోరిన కోరికలు లభించును. నేతితోగాని నువ్వుల నూనెతోగాని సూర్యదేవునికి దీపమును వెలిగించువాడు శతకోటి దీపములతో నావరింపబడి వైభవముగ సూర్య లోకమునకుఁబోవును. సూర్య పూజా సంబంధముగ వెల్గింపబడు దీపమునకై నూనె దానము చేయువాడు నరకప్రాప్తినందడు. దీపము కొఱకగునూనె, నువ్వులు మహాపాపములను నశింపజేయునవి. ప్రతి దినము సూర్య దేవాలయమున దీపము వెలిగించువాడు, సూర్య తీర్ధములందలి చదుకములందు దీపకాంతులు ప్రసరింపజేయువాడు మిక్కిలి తేజోవంతమైన రూపముగలవాడగును. సూర్య దేవుని కొఱకు భక్తితో దీప సేవ చేయించువాడు కోరిన కోరికలన్నింటిని సఫలము చేసికొని దేవ లోకమునకుఁబోవును. చందనము, అగరు, కుంకుమము మున్నగు సుగంధ ద్రవ్యములు కర్పూరముతో కస్తూరితోను కలిపి సూర్యునకు మై పూతలు చేయువాడు . శతకోటి సంవత్సరముల కాలము శివలోకమున హాయిగా విహరించి మఱల భూ లోకమున జన్మించి చక్రవర్తియగును. సందేహములేదు. అంతేకాక కోర్కెలన్నింటిని సంపూర్ణముగ సఫలముచేసికొని సర్వలోక పూజ్యుడగును

మూ! చందనోదక మిశ్రైశ్చ దత్వార్ఘ్యం కుసుమై రవేః సపుత్ర పౌత్ర పత్నీకః స్వర్గలోకే మహీయతే

సుగంధోదక మిశ్రాస్తు దత్వార్జ్యం కుసుమై రవే: దేవలోకే చిరం స్థిత్వా రాజా భవతి భూతలే

సహిరణ్యేన చార్ఘ్యేణ రక్తోదక యుతేనవా కోటీశతంతు వర్షాణాం స్వర్గలోకే మహీయతే

పద్మైరభ్యర్చనం కృత్వా రవేః స్వర్గ గతోనరః పద్మే వసతి వర్షాణాం. స్త్రీ పద్మ శత సంవృతః

గుగ్గలం సఘృతం దత్వా రవేర్భక్తి సమన్వితః తతణాత్సర్వ పాపేభ్యో ముచ్యతేనా త్రసంశయః

పక్షంతు గగ్గులం దత్వా ముచ్యతే బ్రహ్మహత్యయా సంవత్సరేణ లభతే అశ్వమేధ ఫలం శివ!

ధూ పేన లభతే స్వర్గం తురు షేణ సుగంధినా కర్పూరాగరు ధూపేన రాజ సూయ ఫలం లభేత్

 పూర్వాహ్ణే మానవో భక్త్యా శ్రద్ధయా యోఽర్చయే ద్రవిమ్ సతత్ఫలమవాప్నోతి యద్దత్తే కపిలాశతే

మధ్యాహ్నేయ్కోఽర్చయే త్సూర్యం ప్రయతాత్మా జితేంద్రియః లభతే భూమి దానస్య గోశతస్యచ తత్ఫలమ్

పశ్చిమాయాంతు సంధ్యామాం యోఽర్చయే ద్భాస్కరం నరః శుచిః శుక్లాంబరోష్ణీషో గోసహస్ర ఫలం లభేత్ .

తా॥ చందనము కలిపిన నీరు, పుష్పములును కలిపి సూర్యున కర్ష్య మిచ్చువాడు భార్యాపుత్ర పౌత్రాదులతో సుఖ జీవనము గడిపి స్వర్గమునకుఁబోవును. సుగంధ మిశ్రితములైన జలములచేత, పుష్పములచేత నర్ఘ్య ప్రదానము చేయువాడు చిరకాలము దేవ లోకమున నుండి పిదప భూతలమున రాజగురు. బంగారము కలిపిన నీటితో, లేక కుంకుమ మిశ్రితమైన ఎఱ్ఱని నీటితో నర్ఘ్యమిచ్చిన యెడల శతకోటి సంవత్సరములు స్వర్గవాసములభించును. తామరపువ్వులతో సూర్యదేవుని పూజించినచో స్వర్గ నివాస సౌఖ్యము, పెక్కు సంవత్సరముల వఱక ఖండైశ్వర్యము, ఉత్తమ స్త్రీలతో సాంగత్యము లభించును. భక్తి యుక్తుడై సూర్య భగవానునకు నేతితో గూడిన గుగుల(ధూప)ము సమర్పించినచో తక్షణమే సర్వపాపములనుండి ముక్తుడగును. సందేహములేదు. ఒక పక్షము దినములు గుగ్గులమర్పించువాడు బ్రహ్మహత్య నుండి ముక్తుడగును. సంవత్సరము వఱకు సమర్పించుచుండినచో అశ్వమేధ ఫలము కలుగును. తురుష్క దేశపు సుగంధ ధూపమర్పించిన స్వర్గము లభించును. కర్పూరము, అగరు ధూపములతో రాజ సూయ ఫలము కలుగును. భక్తి శ్రద్దలతో గూడి పూర్వాహ్లామున సూర్య పూజ చేసినచో నూజు కపిల గోవులను దానము చేసిన ఫలము లభించును. నిశ్చలమగు బుద్దితో జితేంద్రియుడై మధ్యాహ్నము సూర్యార్చన చేయువాడు వంద గోదానములు, భూ దానము చేసిన ఫలమును పొందును. సాయం సంధ్యా కాలమున సూర్యదేవుని, శుచియై, తెల్లని తలపాగ ధరించి, పూజించువానికి వేయి గోవులను దానము చేసిన ఫలము కలుగును.

మూ. అర్థరాత్రేతు యోహేలీం భక్త్యాసం పూజయేన్నరః జాతిస్మరత్వమాప్నోతి కులే జాతో వృషాన్వితః

ప్రదోష రాత్రి వేలాయాం యః పూజయతి భాస్కరమ్ సగత్వా సహసావీర! క్రీడెత్సౌమనసం క్షయమ్

 దండ నాయక వేలాయాం ప్రభాత సమయే పునః పూజయిత్వా రవీం భక్త్యా ప్రజేదనిమిషాలయమ్.

ఏవం వేలాసు సర్వాసు అవేలాసుచమానవః భక్త్యా పూజయతే యోఽర్కమర్క పుష్పైః సమాహితః తేజసాదిత్య సంకాశోహ్యర్కలోకే మహీయతే

 అయనే తూత్తరే సూర్యమథవా దక్షిణాయనే పూజయేద్యస్తువై భక్త్యా సగచ్ఛేత్కంజ జాలయమ్

తత్రస్థః పూజ్యతే దేవైః సర్వైః సుమన సైస్తథా గోపతిః పూజ్యతే యద్వ ద్గోపతి ప్రముఖైః సురైః

విషువేషూపరాగేషు షడశీతి ముఖేషుచ పూజయిత్వా రవిం భక్త్యా నాత్మానం శోచతే నరః

 విబుధ్యవా స్వయం వాపియో నమస్కురుతే రవిమ్ సంతుష్టా భాస్కరస్త స్మై గతి మిష్టాం ప్రయచ్ఛతి

 కృశరా పాయసాపూప పలలోన్మిశ్ర మోదకై: బలిం కృత్వాతు సూర్యాయ సర్వకామ మవాప్నుయాత్

మోదకానాం ప్రదానేన పాయసస్యచ సువ్రత! మధు మాంసర సై శ్చాపి ప్రియతేఽ తీవ భాస్కరః

తా॥  అర్ధరాత్రి సమయమున భక్తితో సూర్యదేవుని పూజించువానికి తన పూర్వజన్మల జ్ఞానము కలుగును. ధర్మాత్ముడై సత్కులమున జన్మించును. మునిమాపుదాటిన రాత్రివేళ యందు సూర్యార్చన చేయువాడు ప్రళయ పర్యంతము స్వర్గమున క్రీడించును. సేనాధిపతి నగరమును తిరుగువేళ, మల వేకువ జామున భక్తితో సూర్యారాధన చేయువాడు స్వర్గ వాస లాభమును పొందును. ఇట్లు సర్వ కాలములయందును సమాహిత చిత్తుడై జిల్లేడు పువ్వులతో, భక్తి శ్రద్ధా సమన్వితుడై సూర్యదేవునర్చించు మనుష్యుడు సూర్య లోకమునకుఁబోవును. ఉత్తరాయణమునగాని, దక్షిణాయనమునగాని భక్తి యుక్తుడై సూర్య పూజ చేయువాడు బ్రహ్మ లోకమునందును . అచటి నింద్రాదిదేవతలచేత సూర్య భగవానుడు పూజింపబడునట్లు, సకల దేవతల చేత పూజలందుచుండును. విషువత్పుణ్య కాలములందు, గ్రహణ పర్వములయందు, షడశీతి పుణ్య కాలములందు రవిదేవుని భక్తితో పూజించువానికి దుఃఖము కలుగదు. ఒకరు చెప్పుటచేగాని (మేల్కోని)లేక స్వయముగ గాని సూర్య నమస్కారములు చేయువాని యెడ నా సూర్యదేవుడు సంతుష్టుడై అతనికి నిష్టమైన గతినిచ్చును. సేవియలు, పాయసము, భక్ష్యములు, నూవుల పిండితో గూడిన లడ్డువములు, వీనితో సూర్యదేవునకు బలిచేసిన కోరికలన్నియు సఫలము చేసికొనవచ్చును. లడ్డువములు, పాయసము, మధు మాంసరసములతో సూర్య దేవుడు మిక్కిలి ప్రీతుడగును.

మూII ఘృతేన తర్పణం కృత్వా సదాస్నిగ్ధో భవేన్నరః తర్పయిత్వాతు మాం సేన సద్యః పాపాత్ప్రముచ్యతే

ఘృతేన స్నపనం కృత్వా ఏకాహముదయే రవే: గవాం శత సహస్రస్య దత్తస్య ఫలమశ్నుతే

గవాం క్షీరేణ సంతర్ప్య పుండరీక ఫలం లభేత్ రసేన స్నాపయేద్దేవ మశ్వమేధ ఫలం లభేత్

సూర్యాయ తరుణీం ధేనుంగామేకాం యః ప్రయచ్ఛతి కంజజా మచలాం ప్రాప్య పునర్లేఖపురం వ్రజేత్

గో శరీరేతు రోమాణి యావన్తి త్రిపురాంతక! సతావద్వర్షకోటీస్తు లేఖ లోకే మహీయతే

గోశతం భానవే దత్వా రాజసూయ ఫలం లభేత్ అశ్వమేధ ఫలంతస్య యః సహస్రం ప్రయచ్ఛతి

గుగ్గులుం దేవదారుంచ దహేన్నిత్యం ఘృత స్రవమ్ ఆజ్య ధూమోహి దేవానాం ప్రకృత్యైవ ప్రియః సదా

 భేర్యాదీనిచ వాద్యాని శంఖ వేణ్వాదికానిచ యే ప్రయచ్ఛంతి సూర్యాయ యాంతి తే హంసమందిరమ్

వజ్ర మాహరతే యస్తు రవేర్భక్తి సమన్వితః తీర్ధోదక మథైవాన్యః సయాతి విబుధాలయమ్

 విమానైః స్త్రీశతా కీర్ణైః క్రీడయిత్వా చిరంనరఃమానుషత్వమను ప్రాప్య రాజాభవతి ధార్మికః

తా॥ ఏ మానవుడైనను సూర్యదేవునకు నేతితో తర్పణము చేసి స్నేహముగలవాడగును. మాంసముతో తర్పణము చేసి అప్పటికప్పుడే పాప విముక్తుడగును. ఒక్క దినమునము మాత్రమే ఉదయ కాలమున సూర్యదేవునకు నేతితో అభిషేకము చేసిన యెడల లక్ష గోవులను దానము చేసిన ఫలము కలుగును. ఆవుపాలతో స్నానము చేయించినచో పౌండరీక ఫలము లభించును. చెఱుకు రసముతో నభిషేకించిన నశ్వమేధ ఫలము కలుగును. సూర్యదేవుని కొఱకు సుపుష్టమైన ఒక లేగటి యావు నిచ్చువాడు భూదానము చేయువాడు అచంచలమైన సంపదను పొంది, పరమున సూర్య లోకమునకు బోవును. ఆవు శరీరము పై నెన్ని రోమములుండునో అన్ని కోట్ల సంవత్సరముల వఱకు సూర్య లోకమున నుండును. సూర్య భగవానుని కొఱకు నూఱు గోవుల నిచ్చిన రాజసూయ యాగ ఫలము కలుగును. వేయి గోవుల నిచ్చువానికి అశ్వ మేధ ఫలము దక్కును. గుగ్గులు, దేవదారు, నేతి చుక్కలతో కాల్చుచు సూర్య దేవునకు ధూపము వేయవలెను. నేతి ధూపమే దేవతలకు స్వాభావికముగ ప్రియమైనది. భేరి మొదలగు వాద్యములు, శంఖములు, వేణువులు మొదలగు వానిని సూర్యదేవుని కొఱకు నిచ్చువారు సూర్యలోకమునకుఁబోవుదురు. భక్తితో గూడీ ఆ దేవదేవునకు వజ్రము సమర్పించువాడు, పుణ్య తీర్థము నందలి యుదకము సమర్పించువాడు దేవలోకమునకుఁబోవును. అచట విమానములలో స్త్రీ సమూహములతో చిరకాలము క్రీడించి, మల మనుష్యత్వమును పొంది, భూ లోకమున ధార్మికుడగు రాజగును.

 మూII ఛత్రం ధ్వజం వితానంచ పతాకాశ్చామరాణిచ హేమదండానిపై దద్యా ద్రవేర్యో భక్తిమాన్నరః

విమానేన సదివ్యేన కింకిణీ జాల మాలినా సూర్యలోకమతో గత్వా భవత్యప్సరసాంపతిః

తత్రోష్య సుచిరం కాలం స్వర్గాత్ప్రత్యాగతఃపునః మానుష్యే జాయతే రాజా సర్వరాజ నమస్కృతః

 దత్వా వాసాంసి సూర్యాయ అలంకారాంస్తథైవచ క్రీడతే జనలోకస్థో యావదాభూత సంప్లవమ్

 గీతవాదిత్ర నృత్యైశ్చ కుర్యాజ్జాగరణం రవేః గంధర్వాప్సరసాం మధ్యే క్రీడతే

సుచిరం నరః

గంధైః పుష్పైస్తథా పత్రైః స్తోతైర్వా వివిధేస్తథా యేస్తువంతి రవిం భక్త్యాతేయాంతి పతగాలయమ్

ఉషః స్తువంతియే సూర్యముపగాయంతితే సదా పాఠకాశ్చారణాశ్చైవ సర్వేతే స్వర్గగామినః

అశ్వయుక్తం యుగైర్యుక్తం యోదద్యాద్రవయే రథమ్ కాంచనం వాపి రౌప్యంవా మణి రత్నా న్వితం శుభమ్

సయానేనార్కవర్ణేన కింకిణీ జాల మాలినా స్వర్గలోక మితో గత్వా క్రీడతేఽ ప్సరసాసహ

యస్తు దారుమయం కుర్యాద్రవే రథమనుత్తమమ్ సయాత్యర్క సవర్ణేన విమానేనార్కమండలమ్

 తా॥  గొడుగు, టెక్కెము, మేలుకట్టు, పతాకములు, చామరములు, హేమ దండములు మున్నగు వానిని భక్తితో సూర్యదేవునకు సమర్పించువాడు. చిఱు గంటల వరుసలతో నలంకరింపబడిన దివ్య విమానమున పయనించి సూర్య లోకమును జేరియచట అప్సర స్త్రీలకు భర్తయగును. అచట చిరకాలముండి స్వర్గమునకుబోయి మఱల మనుష్య లోకమున రాజులందజీ చేత నమస్కరిపంబడు సార్వ భౌముడుగ జన్మించును. సూర్య భగవానునకు వస్త్రములు, అలంకారములు సమర్పించువాడు సృష్ట్యాది ప్రళయ పర్యంతము జన లోకమున వినోదించును. గీత వాద్య నృత్యములతో గూడి భానుదేవునుద్దేశించి జాగరణము చేయువాడు చిరకాలము గంధర్వాప్సరో భామినులతో క్రీడించుచుండును. సుగంధములు, పుష్పమలు, పత్రములు, వివిధములైన స్తోత్రములతో సూర్యుని భక్తితో స్తుతించువారు సూర్య లోకమునకుఁబోవుదురు. ఉదయ కాలమున సూర్య భగవానుని స్తుతించుచు, కీర్తనలు బాడుచుండు స్తోత్రపాఠకులు, కైవారములు చేయు భక్తులు సర్వులును స్వర్గమునకుఁబోవుదురు. బంగారముతో చేయబడినదిగాని లేక వెండితోజేయబడినదిగాని, మణి రత్నాద్యలంకారములతో గూడిన రథమును, గుఱ్ఱములతోను కాడితోను నొగలతోను గూడ సూర్యదేవునకు సమర్పించువాడు. చిరుగంటల వరుసలతోను, మిక్కిలి తేజస్సుతోను ప్రకాశించు విమానమున పయనించి స్వర్గమునకుఁబోయి అచట అప్సర స్త్రీలతో విహరించును. రవిదేవుని కొఱకు శ్రేష్ఠమైన కఱ్ఱ రథమును చేసియిచ్చువాడు సూర్య వర్ణముతో మెఱయుచుండు విమానమునెక్కి సూర్యలోకమునకుఁబోవును.

మూ॥ యాత్రాం కుర్వంతి యే భానోర్నరాః సంవత్సరాదపి షణ్మాసాద్వా గణశ్రేష్ఠ! తేషాం పుణ్య ఫలం శృణు

ధ్యానినో యోగినశ్చైవ ప్రాప్ను వంతీహ యాంగతిమ్ తాం గతిం ప్రతి పద్యంతే సూర్య వర్త్మావ గాహినః

రథం వహంతియే భానోర్నరా భక్తి సమన్వితాః అరోగాశ్చాదరిద్రాశ్చ జాతౌ జాతౌ భవంతితే

 కర్తారో రథయాత్రాయా యేనరా భాస్కరస్యతు తేభానులక మాసాద్య విహరంతి యథా సుఖమ్

 యాత్రాభంగంతు యోయోహాత్క్రో ధార్వాకురుతే నరః మందేహాస్తే నరాజైయా రాక్షసాః పాపకారిణః

 ధనం ధాన్యం హిరణ్యం వా వాసాంసి వివిధానిచ యే ప్రయచ్ఛంతి సూర్యాయ తేయాంతి పరమాంగతిమ్

 గా వాధ మహిషీర్వాపి గజానశ్వాంశ్చ శోభనాన్ యఃప్రయ.చ్ఛతి సూర్యాయతస్యపుణ్య ఫలం శృణు

 అక్షయం సర్వ కామియ మశ్వ మేధ ఫలం లభేత్ సహస్ర గుణితం తచ్చదాన మస్యోపతిష్ఠతి

 మహీం దదాతి యోఽర్కాయ కృష్టాం ఫలవతీం శుభమ్ సతారయతి వై వంశ్యాన్దశ పూర్వాష్ట శాపరాన్

విమానేనచ దివ్యేన గోపురం గోపతేర్ర్వజేత్ క్రీడత్యప్సరసాంమధ్యే కరీవ కరిణీ గణే

తా॥  ఒక సంవత్సరము వఱకు గాని, ఆు మాసముల వఱకు గాని నిత్యము సూర్య రథయాత్ర నిర్వహించువారు పొందేడి పుణ్య ఫలమును చేప్పెదను వినుము. వారు, ధ్యాననిషులు, యోగులు, సూర్య భక్తి మార్గమున నడచువారు పొందెడి యుత్తమ ఫలమును పొందుదురు. భక్తియుక్తులై సూర్య రథమును లాగువారు ప్రతి జన్మమునందును ఆరోగ్యవంతులై, ధనవంతులై యుందురు. సూర్య రథయాత్రను చేయువారు సూర్య లోకమును పొంది అచట సుఖముగా విహరింతురు. మోహము వలనగాని, క్రోధమువలన గాని సూర్య రథయాత్రను భంగము చేయువారు పాపకృత్య పరాయణులైన మందేహ రాక్షసులని యెఱుంగవలెను. ధనము, ధాన్యము, బంగారము, వివిధములైన వస్త్రములు, సూర్యదేవునకిచ్చువారు పరమగతినందుదురు. గోవులను, గేదెలను, ఏనుగులను, చక్కని గుఱ్ఱములను సూర్య భగవానునకిచ్చువాని పుణ్య ఫలమును వినుము. సర్వ కామ్యములక్షయములై సిద్ధించుటయేగాక అశ్వమేధ ఫలముకూడ లభించును. చేసిన దానమునకు వేయిరెట్ల ఫలము వీనిని చేరును. సారవంతమైన దున్నిన భూమిని సూర్య భగవానునకు సమర్పించినవాడు తన వంశీయులను గడచిన పది తరముల వారిని, రాబోవు పది తరములవారిని తరింపజేయును. అట్టివాడు దివ్య విమానము నధిరోహించి సూర్యలోకముంజేరియచట, మదపుటేనుగు ఆడయేనుగుల మధ్య క్రీడించునట్లు అప్సర స్త్రీల మధ్య వినోదించుచుండును.

మూ! గ్రామం దదాతి యో భక్త్యా సూర్యాయమతి మాన్నరః విమానేనార్క వర్ణేన సయాతి పరమాం గతిమ్

ఆరామాన్యే ప్రయచ్ఛంతి పత్ర పుష్పఫలోపగాన్ భానవే భక్తియుక్తాస్తు చేయాంతి పరమాంగతిమ్

 మానసం వాచికం వాపి కర్మజం యచ్చదుష్కృతమ్ సర్వం సూర్యప్రసాదేన అశేషంచ ప్రణశ్యతి

ఆర్తోవా వ్యాధితో వాపి దరిద్రో దుఃఖితోఽపివా ఆదిత్యం శరణం గత్వా నాత్మానం శోచతే నరః

ఏకాహేనాపి యద్భానోః పూజాయాః ప్రాప్యతే ఫలమ్ తద్వైక్రతు శతై రిష్టైః ప్రాప్యతే ఫలముత్తమమ్

 కృత్వా ప్రేక్షణకం భానోర్దివ్య మాయతనే శుభమ్ అక్షయం సర్వకామియం రాజసూయ ఫలం లభేత్.

 వేశ్యాకదంబకం యస్తు దద్యాత్సూర్యాయ భక్తితః సగచ్ఛేత్పరమం స్థానం యత్రతిష్ఠతి భానుమాన్

 పుస్తకం భానవే దద్యాద్భారతస్య గణాధిప! సర్వపాప విముక్తాత్మా విష్ణులోకే మహీయతే

రామాయణస్య దత్వాతు పుస్తకం త్రిపురాంతక! వాజపేయ ఫలం ప్రాప్య గోపతేః పురమావ్రజేత్

 భవిష్యం సాంబ సంజ్ఞాంవా దత్వా సూర్యాయ పుస్తకమ్ రాజ సూయాశ్వమేధా భ్యాం ఫలం ప్రాప్నోతి మానవః

తా॥  సూర్యునకు భక్తితో నొక గ్రామమును సమర్పించు బుద్ధిమంతుడు సూర్య వర్ణమున ప్రకాశించు విమానమున పయనించి యుత్తమగతిని చేరుకొనును. పత్ర పుష్పఫల భరితములైన తోటలను భక్తితో సూర్య దేవునకిచ్చువారు పరమ గతినందుదురు. సూర్య భగవానుని యనుగ్రహమువలన మనో వాక్కాయకర్మలతో వారు చేసిన పాపమంతయు నశించిపోవును. ఆర్తుడుగాని, రోగ గ్రస్తుడుగాని, దరిద్రుడుగాని, దుఃఖితుడుగాని సూర్య భగవానుని శరణు పొందినచో నీక దుఃఖింపనక్కరలేదు. నూలు క్రతువులను జేసి పొందేడి యుత్తమ ఫలము ఒక్కనాడు సూర్య పూజతో పొందిన ఫలమునకు సమానమగును. సూర్య దేవాలయమున నా దేవదేవుని లీలావిలాసముల ప్రదర్శించు నృత్య నాటకాదులు నిర్వహించెనేని అట్టి వాని కోరికలన్నియు నక్షయముగ సిద్ధించి, రాజసూయ యాగ ఫలము కలగును. వారకాంతలను సూర్యదేవుని సేవకై భక్తితో సమర్పించువాడు పరమస్థానమగు సూర్యలోకమునకుఁబోవును, ఆ దేవుని సేవకై భారత గ్రంథము నిచ్చువాడు సర్వపాపములనుండి ముక్తుడై విష్ణులోకమగు వైకుంఠమునకుఁబోవును. రామాయణ పుస్తకమునిచ్చువాడు వాజపేయ యాగ ఫలమును పొంది సూర్యలోకప్రాప్తినందును. ఆ దేవ దేవునకు భవిష్య పురాణముగాని లేక సాంబ పురాణముగానీ సమర్పించిన మానవుడు రాజసూయ, అశ్వమేధ యాగముల ఫలములను పొందును.

మూII సర్వాన్కామానవాప్నోతి యాతి సూర్యసలోకతామ్ సూర్యలోకే చిరంస్థిత్వా బ్రాహ్మలోకం వ్రజేత్పునః  స్థిత్వా కల్పశతం తత్ర రాజాభవతి భూతలే

భానో రాయతనే యస్తు ప్రపాంకుర్యాద్గణాధిప! సయాతి పరమంస్థానం దివ్యం సౌమనసం నరః

 శీతకాలే ఘనం దద్యాన్నరాణాంశీతనాశనమ్ భానోరాయతనే దేవ! అశ్వమేధఫలం లభేత్

ఇతిహాస పురాణాభ్యాం పుణ్యం పుస్తకవాచనమ్ అశ్వమేధ సహస్రం యో నిత్యం కర్తుంప్రవర్తతే న తత్ఫలమవాప్నోతి యదాప్నోత్యస్య కర్మణః

 తస్మాత్సర్వ ప్రయత్నేన కార్యం పుస్తక వాచనమ్ ఇతిహాస పురాణాభ్యాంభానో రాయతనే శుభమ్

నాన్యత్పుష్టికరం భానో స్తథాతుష్టికరంపరమ్ పుణ్యాఖ్యాన కథా యాస్తు యథా తుష్యతి భాస్కరః

ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే భానుమహిమ వర్ణనం నామ త్రినవతి తమోఽధ్యాయః

 తా॥  కోరికలనన్నింటిని సఫలము చేసికొని సూర్యలోకమునకుఁబోవును. అచ్చట చిరకాలము నివసించి యటు పైన బ్రహ్మలోకమునకు బోవును. అచట నూఱు కల్పముల కాలము నివసించి భూలోకమున జన్మించి రాజగును. సూర్యభగవానుని యాలయమున చలిపందిరులు, 'నీటివసతులు' ఏర్పరచువాడు పరమస్థానమగు దేవలోకమునకుఁబోవును. చలికాలమున చలిని పోగొట్టగలుగు కంబళ్లు మొదలగు వానిని సూర్యాలయమున, వలసినవారికి దానము చేయవలెను. దానివలన నశ్వమేథ యాగము చేసిన ఫలము లభించును. రామాయణ మహాభారతములను, పురాణములను నిత్యమును ప్రవచనము చేయించుట పుణ్యప్రదమైనది. అట్టివానికి వేయి అశ్వమేధములు చేసిన ఫలము కలుగును. ఈ పనీ వలన కలుగు ఫలమింక దేని వలనను కలుగనేరదు. కాబట్టి ఎన్ని ప్రయత్నములు చేసినను సూర్యదేవాలయమున నితిహాస పురాణముల ప్రవచనములనేర్పాటు చేయవలెను. అది మిక్కిలి శుభకరమైనది. పుణ్య కథలను చెప్పించుట, వినిపించుట వలన కలుగు పుష్టి, తుష్టి సూర్యదేవునకు మజీ దేని వలనను కలుగదు.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భాను మహిమ వర్ణనమను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.