92. ఆదిత్య వార కల్పమున మహాశ్వేత వార వర్ణనము

 బ్రహ్మోవాచ : -

మూ॥ యస్త్వా దిత్య గ్రహస్యాస్య వారో దేవస్య సువ్రత! శస్యః ప్రోక్తః ప్రియోలోకే ఖ్యాతో గో శ్రుతి భూషణః

యస్తు పూజయతే తస్మిన్పతంగం పతగప్రియమ్ గంథ పుష్పోపపరైస్తు సూర్యలోకం సగచ్ఛతి

సోపవాసో గుణ శ్రేష్ఠ! ఆదిత్య గ్రహణే శుచిః జపమానో మహాశ్వేతాం ఖదోష మధవాశివమ్

పూజయేజ్జిగతా మిశం తమోనాశన మాశుగమ్ పూజయిత్వా ఖపోషంతు మహాశ్వేతాం తతో జపేత్

 పూజయిత్వా మహాశ్వేతాం రవిందేవం సమర్చయేత్ మహాశ్వేతాం ప్రతిష్టాప్య గంధపుష్పైః సుపూజితామ్

తస్యా ఏవ బహిఃకార్యం స్థండిలం సుసమాహితః శుచౌ భూమి విభాగేతు వీరం సంస్థాప్య యత్నతః

కుర్యాదోమం తిలైఃస్నాతః  సర్పిషాచ విశేషతః ఆదిత్య గ్రహవేలాయాం జపేచ్చ్వే తాం మహామతే!

 ముక్తే దినకరే పశ్చాత్న్యానం కృత్వా సమాహితః పూజయిత్వా మహాశ్వేతాం ఖగోల్కం చగ్రహాధిపమ్

బ్రాహ్మణాన్వాచయిత్వాచ తతో భుంజీత వాద్యతః ఆదిత్య గ్రహ యుక్తే స్మిన్వారే త్రిపుర సూదన!

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “సూర్య గ్రహణమునాడాదివారమగునేని అది మిక్కిలి ప్రశస్తమైనది. చెప్పుటకు, వినుటకును అలంకార ప్రాయమైనది. లోకమున ప్రసిద్ధమైనది. ఆ దినమున గంధ పుష్పోపహారములతో సూర్యభగవానుని పూజించువాడు సూర్యలోకమునకుఁబోవును. సూర్య గ్రహణమున నుపవాసవ్రతుడై, శుచిర్భూతుడై, మహాశ్వేతను, లేక సూర్యదేవుని, లేక శివపంచాక్షరిని జపించుచుండవలెను. చీకట్లను పారద్రోలువాడు, వేగముగ పయనించుచుండువాడునైన జగదీశ్వరుని, అనగా సూర్య భగవానుని ముందు పూజించిన పిమ్మట మహాశ్వేతను జపింపవలెను. మహాశ్వేతను పూజించి సూర్యార్చన పూర్తిచేయవలెను. మహాశ్వేత ఛండిలమును బయట సిద్ధము చేసి, సుసమాహితుడై యా దేవిని ప్రతిష్టించి గంధపుష్పములతో పూజింపవలెను. పవిత్రమైన ప్రదేశమునందు సూర్య భగవానుని స్థాపించి పూజింపవలెను, . స్నానమాచరించి నువ్వులచేత, ముఖ్యముగా నేతితో హోమము చేయవలెను. గ్రహణ సమయమున మహాశ్వేతా జపము చేయుచుండవలయును. గ్రహణము విడిచిన పిదప శ్రద్దా మనస్కుడై స్నానము చేసి మహాశ్వేతను, సూర్య భగవానుని పూజింపవలెను. సూర్య గ్రహణ యుక్తమైన ఈ ఆదివారమునాడు సూర్య పూజానంతరము బ్రాహ్మణులచేత పురాణ ప్రవచనముగావింపజేసి, వారి భోజన దక్షిణాదులు పూర్తి చేసి వాజ్నియమముగలవాడై తాను భుజింపవలెను.

మూ! యత్కర్మ క్రియతే పుణ్యం తత్సర్వం శుభదం భవేత్ స్నానదాన జపాదీనాం కర్మణాం గోవృషధ్వజ!

అనంతం హి ఫలం తేషాం భవత్యస్మిన్నసంశయః కృతానాంతు గణశ్రేష్ఠ! భాస్కరస్యవచో యథా

తస్మాద్ద్విజ గణైః కార్యం పుణ్య కర్మవిచక్షణైః ఏక భక్తంచ నక్తంచ ఉపవాసం గణాధిప!

యేత్వాదిత్యదినే కుర్యుస్తే యాంతి పరమం పదమ్ ధర్మ్యం పుణ్యం యశస్వంచ పుత్రీయం కామదం తథా

 తస్మిన్దాన మపూపస్య గోదానేన సమంభవేత్ ద్వాదశైతే మహాబాహో! వీర భానోర్మహాత్మనః

తుష్టిదాః కథితాస్తుభ్యం సర్వపాప భయాపహాః పఠతాం శృణ్వతాం తాత! కుర్వతాంచ విశేషతః

కృత్వైక మేషాం విధివద్వారం వృషభవాహన! వృషాది త్రితయం ప్రాప్య చాత్రిజామచలాం తథా

తతో యాతిపరం లోకం వృషకేతో మహాత్మనః తేజసాంబుజ సంకాశః ప్రభయాండజ సన్నిభః

పవి హేతిసమో వీర్యే కాంత్యా చంద్ర సమప్రభః

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే బ్రాహ్మే పర్వణ్యాదిత్య వారకల్పే మహాశ్వేత వారవిధి వర్ణనం నామ ద్వినవతి తమోఽధ్యాయః

తా॥  ఆ దినమునఏ పుణ్య కర్మ చేసినను అది శుభ ఫలమునిచ్చును. స్నానము, దానము, జపము మొదలగు కర్మల కన్నింటిని శుభ ఫలము లభించును. నిస్సంశయముగ ఈ నాటి కర్మల కనంతమైన ఫలము కలుగునని భాస్కర దేవుడే స్వయముగ వచించియుండెను.. కాబట్టి విచక్షణులు, బ్రాహ్మణులు, ఒకేపూట భోజనము, రాత్రి ఉపవాసము మున్నగు పుణ్య కర్మ చేయవలెను . ఆదిత్య వారమునాడీట్లు పుణ్య కర్మాచరణము చేయువారు సద్గతిని పొందేదరు. ఇది ధర్మ సమ్మతము, పుణ్య ప్రదము, కీర్తి కరము, సంతాన ప్రదము, వాంఛిత ఫలదాయకమైనది. ఈ సందర్భముగ చేసిన భక్ష్య దానము గోదానముతో సమానమగును. దిండిన్! ఇవి మహాత్ముడు, ప్రతాప వంతుడునై సూర్య భగవానుని పన్నెండు వారములు. సర్వ పాపములను, భయములను పోగొట్టునవి, సంతోషమునిచ్చునవియునైన వీనిని గూర్చి నీకుఁదెలిపితిని, వీనిని చదువువారికి, వినువారికి, అంతకంటెను చేయువారికీఫలముకలును. వీనిలో నొక్క వారమునైనను యథావిధిగ నాచరించినచో ధర్మార్థ కామములు సిద్ధించుటయేగాక అచంచలమైన సంపదను పొంది. చంద్రుని కాంతి వంటి కాంతి కలిగి, సూర్యుని తేజస్సువంటి తేజస్సుతో ప్రకాశించుచు. ఇంద్రుని పరాక్రమముతో సమానమైన పరాక్రమముతో వెలుగుచు తేజస్సుచే పద్మ సన్నిభుడై, వీర్యమున వజ్రాయుధసముడై, కాంతిచేత చంద్రుని వలె వెలుగుచు పరమున శివలోకమునకుఁబోవును.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమునందు, ఆదిత్య వారకల్పమున మహాశ్వేత వార వర్ణనమను తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.