91. ఆదిత్య కల్పమున రోగహరవిధి వర్ణనము

బ్రహ్మోవాచ : -

మూII  పూష్ణో భవేద్యదా ఋక్షం భవేచ్చ భగదైవతమ్ వాసరః స మహాన్ప్రోక్తః సర్వ రోగ భయాపహః

యోఽత్ర పూజయతే భానుం శుభ గంధ విలేపనైః సర్వ రోగ వినిర్ముక్తో యాతిభాను సలోకతామ్

 అర్క పత్రపుటేకృత్వా పుష్పాణ్యర్కస్య సువ్రత! దేవస్య పురతో రాత్రౌ భక్త్యా యః స్థాపయేద్బుధః

 పూజయిత్వార్క పుష్పైస్తు అర్కమర్క ప్రియం సదా ప్రాశయిత్వార్క పుష్పంతు దత్వా విప్రాయ దక్షిణామ్

 భక్త్యాచ పాయసం వీర! రాత్రౌ స్వపితి భూతలే అనేన విధినాయస్తు పూజయే దత్ర వై రవిమ్

స ముక్తః సర్వరోగైస్తు గచ్ఛేద్దిన కరాలయమ్ తస్మాదపి వ్రజేల్లోకం ఫుంకారారవ హేతినః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణ్యాదిత్య కల్పే రోగ హరవిధి వర్ణనం నామైక నవతి తమోఽధ్యాయః

 తా॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పెను “భగదైవత్యమగు ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఆదిత్య వారము నాడైనచో నా దినము మహత్తరమైనది. సర్వ రోగములను, భయములను హరించి వేయునది. ఈ దినమున శ్రేష్ఠములైన గంధ పుష్పాదులతో సూర్య భగవానుని పూజించువాడు సర్వ రోగములనుండి ముక్తుడై సూర్య లోకమునకుబోవును. జిల్లేడాకులతో రెండు దొప్పలు చేసి, వానిలో జిల్లేడు పూలనుంచి, వానిని రాత్రి సమయమున సూర్య దేవుని ముందుంచి. ఆ పుష్పములతో ప్రాతః కాలమున నర్క ప్రియుడగు సూర్యదేవుని పూజించి, అర్క పుష్పమును ప్రసాదముగ స్వీకరించి, బ్రాహ్మణునకు దక్షిణ నిచ్చి,. సూర్య భగవానుని యందు భక్తితో పొయసము భుజించి నేలపై పరుండవలెను. ఈ విధానముగ నీ దీనమున సూర్యారాధన చేయువాడు. సర్వ రోగముల నుండి ముక్తుడై సూర్యలోకమున కేగును. అట నుండి స్వర్గమునకుఁబోవును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్య కల్పమునందు ‘రోగ హర విధి వర్ణన'మను తొంబది యొకటవ అధ్యాయము సమాప్తము.