భవిష్య మహా పురాణము
84. ఆదిత్య వార కల్పమున సౌమ్యవిధి వర్ణనము
మూ. బ్రహ్మోవాచ : -
నక్షత్రం రోహిణీ వీర! యదావారేఽ స్య వైభవేత్ యాత్యసౌ సౌమ్యతాం వీర! స సౌమ్యః పరికీర్తితః
స్నానం దానం జపో హోమః పితృదేవాదితర్పణమ్ అక్షయం స్యాన్న సందేహస్త్వత్ర వారే మహాత్మనః
నక్తం సమాశ్రితో యోఽత్ర పూజయేద్భాస్కరం నరః యాతి లోకం సదేవస్య భాస్కరస్యన సంశయః
రక్తోత్పలాని వైతత్ర తథా రక్తంచ చందనమ్ సుగంధశ్చాపి ధూపస్తు నైవేద్యం పాయసం తథా బ్రాహ్మణాయచ దాతవ్యం భోక్తవ్యం చాత్మనా తథా
య ఏవం పూజయే త్సౌమ్యే చిత్రభానుం గవాం పతిమ్ స విముక్తస్తు పాపేభ్యస్త్వాష్రీం కాంతి మవాప్నుయాత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి ఆదిత్యవారకల్పే సౌమ్యవిధి వర్ణనం నామ చతుర శీతి తమోఽధ్యాయః
తా॥ ఆదిత్య వారమునాడు రోహిణీ నక్షత్రము వచ్చెనేని యాదినము సౌమ్యత్వమును పొందును. అందుచేనది 'సౌమ్య'మని పేర్కొనబడును, మహాత్ముడైన సూర్యునకు సంబంధించిన ఈ వారమున నాచరింపబడు స్నానము, దానము, జపము, హోమము అక్షయమగును. అందు సందేహము లేదు. నక్త వ్రతము నాశ్రయించి యీ దినమున సూర్యదేవుని పూజించు మానవుడు సూర్యలోకమునందుననుటలో సంశయము లేదు. ఎఱ్ఱఁగలువలు, ఎఱచందనము, సుగంధధూపము, పాయసనైవేద్యములతో సూర్యభగవానుని పూజించి బ్రాహ్మణునకు దక్షిణ సమర్పించి తన పరివారముతో భోజనము చేయవలెను. ఇట్లు ఈ “సౌమ్య 'వారమున భానుదేవుని పూజించువాడు విశ్వకర్మ తీర్చిన సూర్యతేజస్సును పొందును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమునందు, ఆదిత్యవార కల్పమున సౌమ్యవిధి వర్ణనమను ఎనుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 84 of the Bhavishya Mahā Purana is as follows:
The Saumya-vidhi is the Sunday worship appropriate for the most gentle and beneficent of the weekly configurations. Saumya means gentle, cool, moonlike — and this configuration balances the intense solar energy with a softer, more nurturing quality. The Saumya-vidhi is particularly prescribed for those suffering from inflammatory conditions, for women seeking gentle protection of pregnancy, and for those whose temperament is already fiery and who need Sūrya's warming energy to be experienced in its cooling, sustaining aspect rather than its burning, purifying aspect. White flowers, milk, and white sandalwood paste are the characteristic offerings of this procedure.