83. ఆదిత్యవార కల్పమున భద్ర విధి వర్ణనము

 బ్రహ్మోవాచ : -

మూ!! మాసి భాద్రపదే వీర! శుక్లపక్షేతు యోభవేత్ షష్ఠ్యాం గణకుల శ్రేష్ఠ! స భద్రః పరికీర్తితః

తత్ర నక్తంతు యః కుర్యాదుపవాస మథాపివా హంసయాన సమారూఢో యాతి హంససలోకతామ్

 మాలతీ కుసుమానీహ తథాశ్వేతంచ చందనమ్ విజయంచ తథా ధూపం నైవేద్యం పాయసంపరమ్

పూజాయాం భాస్కర సేహ కుర్యాత్రిపురసూదన! ఇత్థం సంపూజ్య దేవేశం మధ్యాహ్నేచ దినాధిపమ్

దత్వాతు దక్షిణాం శక్త్యా తతో భుంజీత వాగ్యతః పాయసం గణశార్దూల! సగుడం సర్ఫిషా సహ

య ఏవం పూజయేద్భక్త్యా మానవాస్తిమిరాపహమ్ సర్వకామానవాప్నోతి పుత్ర దార ధనాదికాన్

 విముక్తః సర్వపాపేభ్యో వ్రజేద్భాను సలోకతామ్ ఏష భద్రా విధిః ప్రోక్తోమయా యస్తే గణాధిప!

 శ్రుత్వా కృత్వాచ యతాపాన్ముచ్యతే మానవో' భువి

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్య సంహితాయాం బ్రహ్మేపర్వణి ఆదిత్యవోరకల్చే భద్ర విధి వర్ణనం నామ త్ర్యశీతి తమోఽధ్యాయః

తా॥  భాద్రపదమాస శుక్లపక్ష షష్టియందువచ్చునది భద్రయని చెప్పబడును. ఆ దినమున నక్తము పవసించువాడు హంసయానమునందధిరోహించి సూర్యలోకమునకుఁబోవును ఆనాడు జాజిపువ్వులు, తెల్ల చందనము, విజయధూపము, పాయస నైవేద్యము. సూర్యపూజలో వినియోగించుట శ్రేష్ఠము, ఇట్లు సూర్యభగవానుని మధ్యాహ్నము పూజించి. బ్రాహ్మణునకు యధాశక్తిగ దక్షిణనిచ్చి వాజ్నియమము గలవాడై తాను భోజనము చేయవలెను. పాయసమును నేయినీ, బెల్లమునుపయోగించి చేయవలెను. ఈ విధముగ సూర్యదేవుని భక్తితో పూజించువాడు, భార్యాపుత్ర ధనాది రూపమగు సర్వవాంఛితములను పొందును. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమును పొందును. ఇదియే భద్రయనబడిన వ్రత విధి. దీనిని నీకు వివరించితిని. దీనిని వినియు చేసియు మానవుడు పాపముల నుండి విడివడును.

శ్రీ భవిష్యపురాణము నందలి బ్రహ్మపర్వమున ఆదిత్య వారకల్పమున భద్ర విధి వర్ణనమను ఎనుబది మూడవ అధ్యాయము సమాప్తము.