భవిష్య మహా పురాణము
82. ఆదిత్య వారకల్పమందు నంద విధి వర్ణనము
మూ-దిండి రువాచ :-
మూ!! “యేత్వాదిత్యదినే బ్రహ్మన్పూజయంతి దివాకరమ్ స్నాన దానాదికం తేషాం కింఫలంస్యాద్భ్రవీతు మే
పుణ్యాసా సప్తమీ ప్రోక్తా యుక్తాతేన పితామహా! విజయేతి తథానామ వర్ణ్యతామస్య పుణ్యతా”
బ్రహ్మోవాచ
“యేత్వాదిత్య దినే బ్రహ్మన్! శ్రాద్ధం కుర్వంతి మానవాః సప్తజన్మసు తేజాతాః సంభవంతి విరోగిణః
నక్తం కుర్వంతి యే తత్ర మానవాః స్థైర్యమాశ్రితాః జపమానాః పరం జాప్యమాదిత్య హృదయం పరమ్
ఆరోగ్యమిహ వైప్రాప్య సూర్యలోకం వ్రజంతితే ఉపవాసంచ యే కుర్యురాదిత్యస్య దినే సదా
జపంతిచ మహాశ్వేతాం తేలభంతే యథేప్సితమ్ అహోరాత్రేణ నక్తేన త్రిరాత్ర నియమేనవా
జపమానో మహాశ్వేతా మీప్సితం లభతే ఫలమ్ విశేషతః సూర్యదినే జపమానో గణాధిప!
షడక్షరం తథాశ్వేతాం గచ్ఛేద్వైరోచనం పదమ్ ద్వాదశేహ స్మృతా వారా ఆదిత్యస్య మహాత్మనః
తా॥ దిండి యిట్లనెను. “భాను వారమునాడు సూర్యదేవుని పూజించు వారికిని, స్నానదానాదులు చేయువారికిని ఏఏ ఫలములు కలుగునో నాకుఁ దెలుపుడు. ఆదివారముతోఁగూడిన సప్తమీ పుణ్యాసప్తమీ యని చెప్పబడినది. విజయ యనికూడ పేర్కొనబడినది. దీని పుణ్యత్వమెట్టిదో వివరింపగోరుచున్నాను”. బ్రహ్మయిట్లు నుడివెను. “ఆదిత్వ దినమున శ్రాద్ధము పెట్టు మానవులు ఏడు జన్మలలోను రోగ రహితులై ఆరోగ్యముగ నుందురు. ఆ దినమున స్థిర చిత్తులై నక్త భోజనము మాత్రము చేసి, తత్పూర్వము శ్రేష్ఠమైనదగు ఆదిత్యహృదయమును జపించు మానవులు. ఇహమున నారోగ్యవంతులై ఆ పిదప సూర్యలోకమును చేరుకొందురు. ఎల్లప్పుడును ఆదివారములయందు ఉపవాసము చేయువారు, ‘మహాశ్వేత'ను జపించువారును ఈప్సితార్థములను పొందుదురు. అహోరాత్రములు నక్త నియమముచేగాని, త్రిరాత్ర నియమమునగాని. మహాశ్వేతను జపించుచుండినచో కోరిన కోరికలను సఫలము చేసికొందురు. ప్రత్యేకముగ సూర్యదినమున. సూర్య షడక్షరిని, మహాశ్వేతను జపించువాడు సూర్యలోకమునకుబోవును. ఆదిత్యుని వారములు పన్నెండు చెప్పబడినవి.
మూ॥ నందో భద్ర స్తథా సౌమ్యః కామదః పుత్రదస్తథా జయో జయంతో విజయ ఆదిత్యాభిముఖస్థితః
హృదయో రోగహా చైవ మహాశ్వేత ప్రియోఽపరః శుక్ల పక్షస్య షష్ఠ్యాంతు మాఘే మాసి గణాధిప!
యే కుర్యాత్స భ వేద్భూవః సర్వపాపభయాపహః అత్రనక్తం స్మృతం పుణ్యం ఘృతేన స్నపనం రవే
అగస్త్యకుసుమాలీహ భానో స్తుష్టికరాణితు విలేపనం సుగంధస్తు శ్వేత చందన ముత్తమమ్
ధూపస్తు గుగ్గులుః శ్రేష్ఠో నైవేద్యం పూపమేవహి దత్వాపూపంచ విప్రస్య తతో భుంజీత వాద్యతః
నక్షత్ర దర్శనాన్నక్తం కేచిదిచ్ఛంతి మానద! ముహూర్తానం దినం కేచిత్ర్పవదంతి మనీషిణః
నక్షత్ర దర్శనాన్నక్తమహం మన్యే గణాధిప! ప్రస్థమాత్రం భవేత్పూపం గోధూమ మయముత్తమమ్
యవోద్భవం వా కుర్వీత సుగుడం సరిషాన్వితమ్ సహిరణ్యంచ దాతవ్యం బ్రాహ్మణే సేతిహాసకే
భౌమే దివ్యధవా దేయం న్య సేద్వాపురతో రవేః దాతవ్యో మంత్రతశ్చాయం మండకో గ్రాహ్య ఏవహి
భూత్వాదిత్యేన వై భక్త్యా ఆదిత్యం తు నమస్య చ ఆదిత్య తేజసోత్పన్నం రాజ్ఞీకర వినిర్మితమ్ శ్రేయసే మమ విప్ర! త్వం ప్రతీచ్ఛాపూప ముత్తమమ్
కామదం సుఖదం ధర్మ్యం ధనదం పుత్రదం తథా సదాస్తుతే ప్రతీచ్ఛామి మండకం భాస్కర ప్రియమ్
ఏతౌ చైవ మహా మంత్రౌ దానాదానే రవిప్రియౌ అపూపస్య గణశ్రేష్ట! శ్రేయసే నాత్ర సంశయః
తా॥ నంద, భద్ర, సౌమ్య, కామద, పుత్రద, జయ, జయంత, విజయ, ఆదిత్యాభిముఖ. హృదయ, రోగహ, మహాశ్వేతాప్రియ ఇవియే పన్నెండు సూర్యవారములు, మాఘమాసమునందు శుక్లపక్ష షష్ఠినాడు అనగా. నందపంజ్ఞగల యీ దినమున సూర్య వ్రతమాచరించువాడు సర్వపాపములనుండి, భయములనుండీ ముక్తుడై రాజగును. ఈ సందర్భమున సూర్యదేవునకు ఘృత స్నానము చేయించుట, నక చతమాచరించుట పుణ్యప్రదమని చెప్పబడినదీ. అగీసే పలు సూరంభగవామనడు శ్వేతచందనము, సుగంధవిలేపనముగా శ్రేష్ఠమైనది. ధూపమునకు గుగ్గులు, నైవేద్యమునకు భక్ష్యము ఉత్తమములైనవి. వాజ్నియమము గలవాడై బ్రాహ్మణునకు భక్ష్యవాయన మిచ్చి, తాను భుజింపవలేను. నక్షత్ర దర్శనముతో నక్తమని కొందఱు, ఒక ముహూర్తకాలము తక్కువ కాగల దినాంత భాగము నక్తమని మణికొందఱు చెప్పుచున్నారు. నక్షత్ర దర్శనముననే నక్తమని నాయభిప్రాయము. గోధుమ లేక. జవ్వల పిండి, బెల్లము, నేయితో కుంచెడు కొలదిగ భక్ష్యము చేయవలెను. పౌరాణికుడైన బ్రాహ్మణునకు భక్ష్యదానముతో దక్షిణ ఈయవలెను. స్వచ్చమైన స్వర్ణ (లోహ)పాత్రయందు గాని సూర్యదేవుని ముందుంచిగాని ఈ క్రింది మంత్రములతో ఈయవలెను బ్రాహ్మణుడు స్వీకరింపవలెను. “సూర్యుని చేతఁబుట్టి, సూర్యుని తేజస్సువలన రూపొంది, రాజ్ఞచేతులతో చేయబడిన ఈ భక్ష్యమును సూర్యునకు భక్తితో నమస్కరించి నాశ్రేయస్సు కొఱకు మీకిచ్చుచున్నాను. ఓ విప్రోత్తమా! దీనిని స్వీకరిపుడు.” (ఇది యిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము). కామదము, సుఖదము, ధర్మ్యము, ధనదము, పుత్రదమై ఈ భక్ష్యము నిన్ను కాపాడుగాక! భాస్కరదేవునకు ప్రియమైన దీనిని నేను స్వీకరించుచున్నాను. (ఇది స్వీకరించువాడు పఠింపవలసిన మంత్రము). ఇవి రెండును భక్ష్య దాన ప్రతిగ్రహణ మంత్రములు. సూర్య దేవునకు ప్రీతికరములైనవి. అందు సందేహము ' లేదు.
మూ॥ ఏష నంద విధిః ప్రోక్తో నరాణాం శ్రేయసే విభో! అనేన విధినా యస్తు నరః పూజయతే రవిమ్ సర్వపాప వినిర్ముక్తః సూర్యలోకే మహీయతే
న దారిద్ర్యం నరోగశ్చ కులేతస్యమహాత్మనః యోఽనేన పూజయద్భానుం నక్షయః సంతతేస్తథా
సూర్యలోకాచ్చ్యుతశ్చాసౌ రాజాభవతి భూతలే బహురత్న సమాయుక్త స్తే జసాద్విజ సన్నిభః
పఠతాం శృణ్వతాం చేదం విధానం త్రిపురాంతక! కం దదాత్యచలం దివ్యమంబుజా మచలాంతథా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి ఆదిత్యవార కల్పే నందవిధి వర్ణనం నామ ద్వ్యశీతితమోఽధ్యాయః
తా॥ గణాధిపా! మానవుల శ్రేయస్సు కొఱకేర్పరుపబడిన ‘నందవిధి' యిదియే. ఈ విధిననుసంరించి సూర్యుని పూజించువాడు సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమున వెలుగొందును. అట్టి మహాత్ముని కులమున దారిద్ర్యముగాని రోగములు కాని ఉండవు. ఈ విధానమున రవిని పూజించువానీ సంతానము నష్టము కాకుండును. సూర్యలోకము నుండి విడివడిన పిదపనాతడు భూలోకమున రాజుగ జన్మించును. రత్నరాశులతో యుక్తుడై సూర్యుని వలె తేజస్వియై ప్రకాశించును. ఈ విధానమును చదువు వారికిని విను వారికిని సుఖమును, అచంచలమైన లక్ష్మిని అసూర్యదేవుడొసంగును.
శతార్థ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యపార కల్పమునందు నందవిధి వర్ణనమను ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 82 of the Bhavishya Mahā Purana is as follows:
The Āditya-vāra Kalpa — the section of the Saptamī Kalpa devoted specifically to Sunday worship — opens with the Nanda-vidhi, the worship procedure appropriate when Sunday falls on a Nandā tithi (the first, sixth, or eleventh of the fortnight). This configuration creates a particularly joyful and auspicious energy, and the worship procedure emphasises the celebratory aspects of Sūrya worship: abundant flowers, sweet food offerings, music, the wearing of new clothes, and the distribution of sweets to children. The Nanda configuration of Sunday is particularly propitious for beginning new ventures, making major purchases, and celebrating family milestones, and the chapter provides specific mantras for invoking Sūrya's blessing on each type of new beginning.