81. విజయ సప్తమీ వర్ణనము

బ్రహ్మోవాచ :-

 మూ॥ జయాచ విజయాచైవ జయంతీ చాపరాజితా మహాజయాచ నందాచ భద్రాచాన్యా ప్రకీర్తితా

శుక్లపక్షస్య సప్తమ్యాం సూర్యవారో భవేద్యది సప్తమీ విజయానామ తత్ర దత్తం మహాఫలమ్

స్నానం దానం తథా హోమ ఉపవాసస్తథైవచ సర్వం విజయ సప్తమ్యాం మహాపాతక నాశనమ్

పంచమ్యామేక భుక్తం స్యాత్ షష్ఠ్యాం నక్తం ప్రచక్షతే ఉపవాసస్తు సప్తమ్యా మష్టమ్యాం పారణం భవేత్

కేచిద్దేవముశంత్యేవ నేతిచాన్యే గణాధిప! అభిప్రేతస్తు మేషష్ఠ్యాముపవాసో గణోత్తమ!

చతుర్థ్యామేక భుక్తంతు పంచమ్యాం నక్తమాదిశేత్ ఉపవాసస్తు షష్ఠ్యాం స్యాత్సప్తమ్యాం పారణం భవేత్

 ఉపవాస పరః షష్ఠ్యామబ్ధేశం పూజయద్బుధః గంధ పుష్పోప హారైశ్చ భక్త్యాశ్రద్ధా సమన్వితః

 ప్రకల్ప్య పూజాం భూమౌతు దేవస్య పురతః స్వపేత్ జపమానస్తు గాయత్రీం సౌరసూక్తమథాపి వా

 అక్షరం వా మహాశ్వేతం షడక్షర మథాపివా విబుద్ధస్త్వధ సప్తమ్యాం కృత్వాస్నానం గణాధిప!

గ్ర హేశం పూజయిత్వాతు హోమం కృత్వావిధానతః బ్రాహ్మణాన్భోజ యేద్భక్త్యా శక్త్యాచ గణనాయక!

తా॥  బ్రహ్మదేవుడిట్లనెను. “జయ, విజయ, జయంతి, అపరాజిత, మహాజయ, నంద, భద్ర అని ఏడు విధములైన సప్తమీ తిథులు చెప్పబడినవి. శుక్లపక్ష సప్తమీ దినమున ఆదివారమయ్యెనేని అది 'విజయ' అను పేరుగల సప్తమీ యనబడును. ఆ దినమున నీయబడు దానము గొప్పఫలమునిచ్చును. ఈ విజయ సప్తమీనాడు చేసిన స్నాన, దాన, హోమ, ఉపవాసములు మహాపాపములను కూడ నశింపఁజేయును. పంచమినాడేకభుక్తము, షష్టినాడు రాత్రిభోజనము, సప్తమీనాడు ఉపవాసము, అష్టమినాడు పారణ చేయవలయునని చెప్పబడినది. కొందదేవుని తమ నియమ నిష్టలతో వశీకరించుకొందురు. కొందఱట్లు చేయజాలరు. షష్ఠినాడు కూడా ఉపవసింపవలెనని తలంపబడిన కారణమున నట్లు చెప్పుచున్నాను. చతుర్థినాడు ఏకభుక్తము, పంచమినాడు నకబోజనము పగివచునమసనాసుము చేసిన సుసగు కలిగి షష్ఠినాడు గంథపుష్పాద్యుపచారములతో సూర్యదేవుని పూజింపవలెను. భూమి పైననే సూర్యపూజనేర్పాటు చేసి రాత్రి సమయముననా దేవుని ముందు పరుండవలెను, గాయత్రీమంత్రమును జపించుచు లేక సౌరసూక్తమును పఠింపుచు శయనింప వలెను. సప్తమీనాడు మేల్కొని స్నానమాచరించి మహాశ్వేత మంత్రాక్షరములు, లేక షడక్షరి జపించవలేను. పిమ్మట సూర్యభగవాను నర్చించి విధి విధానముగ హోమము చేయవలెను. తరువాత యధాశక్తిగ, భక్తితో బ్రాహ్మణులకు భోజన సంతర్పణము చేయవలెను.

మూ॥ శాల్యోదన మపూపాంశ్చ ఖండవేషాంశ్చ శక్తితః సఘృతంపాయసం దద్యాత్తథా విప్రేషు శక్తితః

దత్వాచ దక్షిణాం భక్త్యా తతో విప్రాన్విసర్జయేత్ ఇత్యేషా కథితా దేవ! పుణ్యావిజయసప్తమీ

యాముపోష్యనరో గచ్ఛేత్పదం వైరోచనం పరమ్ కరవీరాణి రక్తాని కుంకుమంచ విలేపనమ్

విజయం ధూపమస్యాంతు భానోస్తుష్టి కరాణివై ఏషా పుణ్యపాపహరా మహాపాతకనాశినీ

అత్ర దత్తం హుతం చాపి క్షీయతే న గణాధిప! స్నానందానం తథా హోమః పితృదేవాభిపూజనమ్

 సర్వం విజయ సప్తమ్యాం మహాపాతక నాశనమ్ ఆదిత్య వారేణ యుతా స్మృతా విజయసప్తమీ

ఇత్యేషా కథితా వీర! సర్వకామ ప్రదాయినీ ధన్యం యశస్య మాయుష్యం కీర్తితం శ్రవణం తథా

 స్మరణంతు తథాస్యాంతు పుణ్యదం త్రిపురాంతక!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి

సప్తమీ కల్పే విజసప్తమీ వర్ణనం నామై కాశీతి తమోఽధ్యాయః

 తా॥ శాల్యన్నము, భక్ష్యములు, బూరెలు, నేయి, పాయసము, మున్నగు పదార్థములతో శక్తిననుసరించి బ్రాహ్మణ భోజనము సభక్తికముగ నిర్వహింపవలెను. సగౌరవముగ దక్షిణలిచ్చి బ్రాహ్మణులను పంపవలెను. ఈ విధముగ పుణ్యప్రదముగు విజయసప్తమీ ప్రతాచరణమును గూర్చి చెప్పబడినది. ఉపవాస వ్రతముతో దీని ననుష్ఠించినచో నుత్తమమగు సూర్యలోకపదము లభించును. ఎఱ్ఱని గన్నేరుపూలు, కుంకుమ విలేపనము. విజయధూపము, ఈ వ్రతమున సూర్యదేవునకు తృప్తి కలిగించు ఇది పాపహరము. పుణ్యప్రదము. మహాపాపములను కూడా నశింపజేయునది. ఈ సందర్భమున చేసిన దానము, హవనము, అక్షయమైయుండును. విజయసప్తమీనాడు చేసిన స్నానదాన హోమ పితృపూజనములు. మహాపాపవినాశకములు. భాను వాసరముతోఁగూడిన సప్తమీయే విజయసప్తమీయని చెప్పబడును. సర్వకామ ప్రదాయిని యగు నీ వ్రత విధానము నిట్లు నీకు తెలిపితిని. త్రిపురాంతకా! పుణ్యప్రదమైన దీనిని స్మరించినను, వినినను, కీర్తినిఆయుష్యమును, ధన్యతను చేకూర్చునని ప్రశంసింపబడినది.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు విజయ సప్తమీ వర్ణనమను ఎనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.