79. ఆదిత్య మాహాత్మ్య వర్ణనము

సమంతురువాచ :

మ॥ ఏతచ్చ్రుత్వాతు కార్త్య్వేన హృష్టోజాంబవతీ సుతః జాత కౌతూహలోభూయః పరిపప్రచ్చ నారదమ్

సాంబ ఉవాచ :

అహో సూర్యస్య మాహాత్మ్యం వర్ణితం హర్షవర్ధనమ్ యేన మే భక్తి రుత్పన్నా పురాహ్యస్మిస్వభావసౌ

తతో రాజ్ఞీం మహాభాగం నిక్షుభాంచ మహామునే! దిండినం పింగలాదీంశ్చ సర్వానథయమేమునే!

నారద ఉవాచ :

ప్రాగుక్తేఽర్కస్యద్వే భార్యే రాజ్ఞీనిక్షుభ సంజ్ఞతే తయోర్షిరాజ్జీ ద్యౌర్జ్ఞేయా నిక్షుభా పృథివీ స్మృతా

సౌమ్య మాసస్యసప్తమ్యాం ద్యావార్కః సహయుజ్యతే మాఘకృష్ణస్య సప్తమ్యాం మహ్యాసహభవేద్రవిః భూరాదిత్యశ్చ భగవాన్గచ్ఛత: సంగమం తథా

ఋతుస్నాతా మహీతత్ర గర్భం గృహ్ణాతి భాస్కరాత్ ద్యౌర్జలం సూయతే గర్భం వర్షాస్విహచ భూతలే

తతస్త్రైలోక్య భూత్యర్థం మహీసస్యాని సూయతే సస్యోపయోగ సంహృష్టా జుహ్వత్యాహుతయో ద్విజాః

స్వాహాకార స్వధాకారైర్య జంతి పితృదేవతాః

నిక్షుభసూయతే యస్మాదన్నౌషధి సుధామృతైః మర్త్యా నితౄంశ్చ దేవాంశ్చ తేన భూర్నిక్షుభాస్మృతా

యథారాజ్జీ ద్విథా భూతా యస్యచేయం సుతామతా అపత్యాని చ యాన్యస్యాస్తాని వక్ష్యామ్యశేషతః

తా॥ సుమంతుముని యిట్లనెను. జాంబవతీ సుతుడైన సాంబుడిదంతయు విని మిక్కిలి సంతోషించి, మల నాసక్తికలిగి నారదునిట్లడిగెను-1. “ఆహా! సూర్యుని మాహాత్మ్యమును నా సంతోషమతిశయించునట్లు వర్ణించితిరి. మీ కథనము పూర్తికాక ముందే సూర్యభగవానుని యందు నాలో భక్తి ఉదయించినది-2. మునీశ్వరా! ఇక నాకు రాజ్ఞి, నిక్షుభ, దిండి, పింగలుడు మొదలగు సూర్యపరివార దేవతలందఱిని గూర్చి తెలుపుడు”-3. సాంబుని ఆసక్తిని గమనించి నారదుడిట్లు చెప్పఁదొడగెను. “రాజ్జి, నిక్షుభ అనువారిద్దఱు సూర్యుని భార్యలని లోగడ చెప్పియున్నాను. వారిలో రాజ్ఞయనునామె అకాశమనియు, నిక్షుభయనునామె భూమియనియు నెఱుంగవలెను-4: పుష్యశుద్ధ సప్తమీనాడు సూర్యుడు, ఆకాశము కలిసియుందురు. మాఘబహుళ సప్తమీనాడు సూర్యుడు, భూమితో కలిసియుండును. అనగా నాదినమును సూర్యుడు భూమి సంగమింతురు-5. ఋతుస్నాతమైన భూమి సూర్యుని వలన గర్భము ధరించును. ఆకాశము వర్షర్తువులలో భూతలము పై జలమును ప్రసవించును (వర్షించును)-6. ముల్లోకములలో సంపదలను కలిగించుటకు భూమి పంటలనిచ్చును. సస్యములతో సంతుష్టులై బ్రాహ్మణులు యజ్ఞములొనర్తురు.-7. స్వాహా కారములతో దేవతలను, స్వథాకారములతో పితృదేవతలను పూజింతురు-8. అన్నములను, ఓషదులను ప్రసవించి సుధామృతముల చేత మానవులను, పితరులను, దేవతలను తృప్తిపఱచుచుండుటచే భూమి, నిక్షుభయనబడును-9.ఇక రాజ్జి రెండు రూపములేట్లు ధరించెనో, ఆమె సంతానమెవరో, ఆమె యెవరి సంతానమో ఆ వివరములన్నింటిని చెప్పెదను.

మూII మరీచిర్ర్బహ్మణః పుత్రో మరీచేః కశ్యపః సుతః తస్మాద్ధిరణ్య కశిపుః ప్రహ్లాదస్తస్య చాత్మజః

ప్రహ్లాదస్య సుతో నామ్నా విరోచన ఇతి శ్రుతః విరోచనస్య భగినీ సంజ్ఞాయా జననీ శుభా

హిరణ్య కశిపోః పౌత్రీ దితేః పుత్రస్యసాస్మృతా సా విశ్వకర్మణః పుత్రీ ప్రాహ్లాదీ ప్రోచ్యతే బుధైః

అధనామ్నా సురూ పేతి మరీ చేర్దుహితా శుభా పత్నీహ్యంగిరసః సాతు జననీతు బృహస్పతేః

బృహస్పతేస్తు భగినీ విశ్రుతా బ్రహ్మవాదినీ ప్రభాసస్యతు సాపత్నీ వసూనా మష్టమస్యతు

ప్రసూతా విశ్వకర్మాణం సర్వశిల్పకరం వరమ్ సవై నామ్నాపునస్త్వష్టా త్రిదశానాంచ వార్థకి:

దేవా చార్యశ్చ తస్యేయం దుహితా విశ్వకర్మణః సురేణురితి విఖ్యాతా త్రిషులోకేషు భామినీ

రాజ్ఞిసంజ్ఞాచ ద్యౌస్త్వాష్ట్రీ ప్రభా సైవ విభావ్యతే తస్యాస్తుయా తనుచ్ఛాయా నిక్షుభాసా మహీమయీ

సాతుభార్యా భగవతో మార్తాండస్య మహాత్మనః సాధ్వీ పతివ్రతా దేవీ రూప యౌవన శాలినీ

నతు తాం నరరూపేణ సూర్యోభజతి వైపుగా ఆదిత్య స్యేహ తద్రూపం మహతా స్వేన తేజసా

తా॥ బ్రహ్మపుత్రుడు మరీచి మరీచి, పుత్రుడు కశ్యపుడు. అతని పుత్రుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు-11. విరోచనుడు ప్రహ్లాదుని తనయుడు. ఈ విరోచనుని సోదరియే సంజ్ఞాదేవికి తల్లి-12. దితిపుత్రుడైన హిరణ్యకశిపుని మనుమరాలే ఈమె. ఈమె విశ్వకర్మకు పుత్రికయగును. ఆమెను దేవతలు ప్రాహ్లాది యని పిలుతురు-13. సురూపయను పేరుగల మరీచి పుత్రిక అంగిరసుని భార్య. ఈమెయే బృహస్పతికి తల్లి-14. బృహస్పతి సోదరి బ్రహ్మవాదిని ప్రసిద్ధమైనది. వసువులలో నెనిమిదవ వాడగుప్రభాసునకీమె సోదరి బ్రహ్మవాదిని ప్రసిద్ధమైనది. వసువులలో నెనిమిదవ వాడగు ప్రభాసునకీమె భార్యయగును.-15. వీరి సంతానమే శిల్పవిద్యానిపుణుడగు విశ్వకర్మ అతనికే మఱియొక పేరు త్వష్ట అతడే దేవ శిల్పియయ్యెను-16. దేవాచార్యుడయ్యెను. ఇట్టి యీ విశ్వకర్మ కుమార్తె సురేణువుగా ముల్లోకములలో ప్రఖ్యాతిబడ సేను-17. ఆమెయే రాజ్జీ, సంజ్ఞాద్యౌ, త్వాష్టీ, ప్రభాయని పిలువబడుచుండెను. ఆమె ఛాయయే పృథ్వీరూపమగు నిక్షుభ-18. ఆమె భగవంతుడైన సూర్యదేవుని భార్య. రూపయౌవనములతో ప్రకాశించు సాధ్వి, పతివ్రత-19. సూర్యడామెను నరరూపముతో మొదట స్వీకరింపకుండెను, అతనికి తన అతిశయించిన తేజస్సు చేత నామె రూపము, వ్యక్తము కాకుండెను.

మూ॥ గాత్రేష్వప్రతి రూపేషు నాతి కాంత మివాభవత్ అనిష్పన్నేషు గాత్రేషు గోలం దృష్ట్వా పితామహః

మార్తస్త్వంభవ చాండస్తు మార్తాండస్తేన స స్మృతః దేవానాంచ యతస్త్వాదిస్తేనాదిత్య ఇతి స్మృతః

అతః పరంప్రవక్ష్యామి ప్రజాస్తస్య మహాత్మనః త్రీణ్యపత్యాని సంజ్ఞాయాం జనయామాస వైరవిః

వర్షాణాం తు సహస్రంవై వసమానా పితుర్గృహే భర్తుః సమీపం యాహీతి పిత్రోక్తాసాపునః పునః

అగచ్ఛద్వడవా భూత్వా త్యక్త్వారూపం యశస్వినీ ఉత్తరాంశ్చకురూన్గత్వా తృణాన్యనుచచారహ

పితుః సమీపం యా భార్యా సంజ్ఞాయా వచనేన సా సంజ్ఞాయా ధారయద్రూపం ఛాయా సూర్యముపస్థితా

ద్వితీయాయాంతు సంజ్ఞాయాం సంజ్ఞేయమితి చింతయన్ ఆదిత్యో జనయామాస పుత్రౌ కన్యాంచ రూపిణీమ్

పూర్వజస్య మనోస్తుల్యౌ సాదృశ్యేన చ తావుభౌ శ్రుతశ్రవాశ్చ ధర్మజ్ఞః శ్రుత కర్మాతథైవచ

శ్రుత శ్రవా మనుస్తాభ్యాం సావర్ణిర్యో భవిష్యతి శ్రుత కర్మాతు విజ్ఞేయో గ్రహో యోవైశనైశ్చరః

కన్యాచ తపతీనామ రూపేణా ప్రతిరూపిణీ సంజ్ఞాతు పార్థివీ తేషా మాత్మజానాం యథాకరోత్

నస్నేహం పూర్వజానాంతు తథా కృతవతీతుసా మనుస్తు క్షమతే తస్యా యమస్తస్యా న చక్షమే

తా॥ అనురూపముగ లేని అవయవములందు ఆకర్షణ కలుగదయ్యెను. నిష్పన్నములుకాని అవయవములందలి గోళాకారమును చూచి బ్రహ్మదేవుడు మార్తమైన అండముకలవాడవు కమ్మని సూర్యునకు సూచించేను-21. అందువలన నతడు మార్తాండుడనబడెను. దేవతలందలోను మొదటి వాడగుటచే నాదిత్యుడనబడెను-22. ఇంక నిటు పైన మహాత్ముడైన సూర్యదేవుని సంతానముల గుణించి చెప్పేదను. సంజ్ఞయందతనికి ముగ్గురు బిడ్డలు కలిగిరి-23. భర్త కడకు వెడలుమని తండ్రి మఱల మఱల చెప్పినను వినక, సంజ్ఞ వేయిసంవత్సరములు తండ్రి వద్దనే ఉండేను-24. ఆమె తన స్వీయ రూపమును వదలి ఆడు గుఱ్ఱము రూపమును ధరించి ఉత్తర కురుదేశములకుఁబోయి గడ్డిమేయుచు కాలము గడుపుచుండెను-25. సంజ్ఞమాటననుసరించి ఛాయ, సంజ్ఞరూపమును ధరించి సూర్యుని వద్దకు చేరెను-26. సంజ్ఞారూపమున నున్న ఛాయను సంజ్ఞగానే భావించి సూర్యదేవుడామెయందు ఇద్దలు కుమారులను, ఒక సౌందర్యవతియైన కుమార్తెను కనెను-27. వారిద్దఱు కుమారులును, శ్రుతశ్రవుడు, శ్రుతకర్మ అనువారలు మనువుతో సమానులైయుండిరి-28. శ్రుత శ్రవుడు మునుముందు సావర్ణియను మనువు కాగలిగియుండెను. శ్రుతకర్మను శనైశ్చర గ్రహముగా నెఱుంగవలేను-29, కుమార్తెయగు తపతి అసమాన సౌందర్యరాశియై విలసిల్లెను. సంజ్ఞ తమ బిడ్డల యెడ ప్రేమతో వర్తించి యుండినట్లు-30. ఛాయ, సంజ్ఞ బిడ్డల యెడ వర్తింపకుండెను. దీనిని మనువు సహించెను కాని యముడు సహింపలేక పోయెను.

మూll  బహుశో యాత్యమానస్తు పితుః పత్న్యాసు దుఃఖితః సవై కోపాచ్చ బాల్యాచ్చ భావినోఽర్థస్వ వైబలాత్

పదా సంతర్జయామస సంజ్ఞాం వైవస్వతో యమః తం శశాప తతః క్రోథా త్సంజ్ఞా సా పార్థివీ భృశమ్

పదా తర్జయ సే యన్మాం పితుర్భార్యాం గరీయసీమ్ తస్మాత్తవైష చరణః పతిష్యతి నసంశయః

యమస్తు తేన శాపేన భృశం పీడిత మానసః మనునా సహ తన్మాతుః పితుః సర్వం న్యవేదయత్

స్నేహేన తుల్యమస్మాసు మాతాదేవ! నవర్తతే నిః స్నేహా జ్ఞ్యాయసోహ్యస్మాన్కనీయాంసం బుభూషతి

తస్యామయోద్యతః పాదోనతు దేవ! నిపాతితః బాల్యాద్వాయది వా మోహాత్తద్భవాన్ క్షంతుమర్హతి

శప్తోఽహమస్మిన్ లో కేశ! జనన్యా తపతాoవర! తవ ప్రసాదాచ్చరణ స్త్రాయతాం మహతోభయాత్

రవిరువాచ :

అసంశయం మహత్పుత్ర! భవిష్యత్యత్రకారణమ్ యేనత్వామావి శత్క్రోధో ధర్మజ్ఞం ధర్మశాలినమ్

సర్వేషా మేవ శాపానాం ప్రతిఘాతస్తు విద్యతే నతు మాత్రాభిశప్తానాం క్వచిన్మోక్షో భవేదిహ

తా॥ తండ్రి భార్యయగు ఛాయచేత పెక్కు పర్యాయములవమానింపబడి యముడు మిక్కిలి దుఃఖితుడై, కోపముచేతను, కుజ్ఞతనము వలనను, ముందుజరుగబోవు ప్రయోజన బలమువలనను-32. సంజ్ఞారూపముననున్న తల్లిని, పాదమును లేవనెత్తి, తన్నుదునని బెదరించెను. ఆమెయు మిక్కిలి కోపించి అతనినిట్లు శపించెను. “తండ్రిభార్యను, పెద్దదాననైన నన్ను కాలులేపి తన్నుదునని బెదిరించితి కావున నీకాలు నిస్సంశయముగ పడిపోగలదు”. ఈ శాపవాక్కువలన యముడు మిక్కిలి కలఁత పడి మనువుతో గూడి తండ్రి వద్దకుఁబోయి జరిగిన దంతయును నీవేందించేను-35.' తండ్రీ! ఈ యమ్మ తన బిడ్డల పై ప్రేమ జూపునట్లు మాపైఁజూపుటలేదు. తాను పెద్దదియే నావంటి చిన్నవానియెడల నిర్దయగా వర్తింపనిచ్చగించుచున్నది-36. నేను పాదము నెత్తితిని గాని తన్నియుండలేదు. నేనిట్టిపనిని బాల్యచాపల్యము వలననో అజ్ఞానము వలననో చేసితిని. కావున ఆమె క్షమించి యుండవచ్చును-37. ఈ చిన్న తప్పు వలన ఆ తల్లి చేత నేను శపింపబడితిని. మీరనుగ్రహించి ఈ భయంకరమగు శాపభయము నుండి నన్ను, నా కాలిని రక్షింపుడు”-38. యముని వాక్యములు విని సూర్యదేవుడిట్లనెను. “పుత్రా! ధర్మజుడవు, ధర్మశాలివియునైన నిన్ను వివశుని చేసిన ఈ తప్పిదము చిన్నదేమైనను ఇపుడు పెద్ద పరిణామమునకు కారణము కాగలదనుట నిస్సంశయము-39. కాని వత్సా! అందజేశాపములకు పరిహారముండునుకాని తల్లిశాపమునకు గుతియగు వారికి శాపమోక్షములేదు.

మూ॥ నశక్యమేతన్మిథ్యామే కర్తుం మాతుర్వచస్తవ కించిత్తేఽహం విధాస్యామి పితృస్నేహాదనుగ్రహమ్

కృమయోమాంసమాదాయ యాస్యంతితు మహీతలే కృతం తస్యావచః సత్యం త్వం చ త్రాతో భవిష్యసి

సుమంతురువాచ :

ఆదిత్యస్త్వబ్రవీచ్ఛాయాం కిమర్థం తనయావుభౌ తుల్యేష్వభ్యధికః స్నేహః ఏకత్రక్రియతే త్వయా

సాతత్పురాభవం తస్మైనాచచక్షే వివస్వతే ఆత్మానం స సమాధాయ వక్తుం తస్యామపశ్యత

తాంశప్తు కామో భగవానుద్యతః కుపితస్తతః తతశ్చాయా యథావృత్తమాచచక్షే వివస్వతే

వివస్వాంస్తు తతఃక్రుద్ధః శ్రుత్వాశ్వశురమాగతః సచాపి తం యథాన్యాయ మర్చయిత్వా దివాకరమ్ నిర్దగ్ధుకామంరో షేణ సాంత్వయామాస తం శనైః

విశ్వకర్మోవాచ

తవాతి తేజసావిష్టమిదం రూపం సుదుఃసహమ్ అసహంతీ తు సంజ్ఞాచ వనే చరతి శాద్వలే

ద్రక్ష్యతే తాంభవానద్య స్వాం భార్యాం శుభచారిణీమ్ రూపార్థం భవతోరణ్యే చరంతీ సుమహత్తపః

రూపంతే బ్రహ్మణో వాక్యాద్యదివై రోచతే విభో! ప్రశాతయామి దేవేంద్ర! శ్రేయోఽర్థం జగతః ప్రభో!

సంతుష్టస్తస్య తద్వాక్యం బహుమనే మహాతపాః తతోన్వజానత్త్వష్టారం రూపనిర్వర్తనాయ తు

తా॥ “నీ మాతృశాపమును వమ్ముచేయుటకు నాకు సాధ్యముకాదు, కాని పితృవాత్సల్యమున కొంతవఱకు నిన్ననుగ్రహింతును-41. కృములు నీకాలి మాంసమును తీసికొని నేలమీదకు వెడలిపోవును. అప్పుడామే శాపవాక్యము నిజమగును. అంతటితో నీవు రక్షింపబడగలవు”-42. సుమంతుముని యిట్లనెను. “సూర్యదేవుడు సంజ్ఞారూపమున నున్న ఛాయతో నిట్లు పలికెను. “నీ కిరువురును సమానులైన పుత్రులేకదా! ఒకరియందు మాత్రమధికమగు ప్రేమ చూపించుచుండుటకేమి కారణము?”-43. నిర్లక్ష్యముగ ఆమె జరిగిన విషయమేదియును సూర్యునితో విన్నవించక మిన్నకుండెను. తనను తాను సమాధానపఱచుకొని సూర్యుడేదో చెప్పుటకన్నట్లు ఆమెవైపు చూచెను-44. అంతలోననే అతడు కోపముతో ఆమెను శపించుటకుద్యుక్తుడయ్యెను. అప్పుడు ఛాయ, తాను సంజ్ఞారూపముననచటకు వచ్చిన వివరములన్నింటిని సూర్యునితో చెప్పెను-45, సూర్యదేవుడామె చెప్పిన విషయములను విని మిక్కిలి క్రుదుడై వెంటనే తన మామయగు విశ్వకర్మకడకు బోయెను. విశ్వకర్మ, సూర్యుని యథావిధిగ పూజించెను. రోషముతో దహించుకొనిపోవుచున్న సూర్యునోదార్చెను-46. ఓదార్చి విశ్వకర్మయిట్లనెను. “అతిమాత్రమైన ప్రకాశముతోనావరింపబడి చూచుటకసాధ్యమైన నీరూపమును చూడ శక్యముగాక సంజ్ఞ, అడవులలోని గడ్డిమైదానములలో (పచ్చిక బయళ్లలో) తిరుగుచున్నది-47. నీరూపము కొఱకు గాఢమైన తపశ్చర్యలో, అడవిలోనున్న పవిత్రచరిత్రయగు నీ భార్యను నీవు నేడు చూడగలవు-48. బ్రహ్మదేవుని వాక్యము ననుసరించి నీ రూపమును సంస్కరించుకొను నుద్దేశము కలదేనీ, జగత్కల్యాణము కొఱకు నీ ఆకృతిని చెక్కీచక్కఁ జేయుదును”-49. విశ్వకర్మ వాక్యములకు సూర్యదేవుడు సంతసించి తన రూపమును చక్కదిద్దుటకనుమతించెను.

మూ॥ విశ్వకర్మాహ్యనుజ్ఞాతః శాకద్వీపే వివస్వతః భ్రమిమారోప్య తత్తేజః శాతయామాస తస్యవై

ఆజాను లిఖితశ్చాసౌ నిపుణవిశ్వకర్మణా లేఖనం నాభ్యనందత్తు తతస్తేన నివారితః

తత్ర తద్భాసితం రూపం తేజసాప్రకృతేన తు కాంతాత్కాంత తరం భూత్వా అధికం శుశుభే తతః

దదర్శ యోగమాస్థాయ స్వాం భార్యాం వడవాం తథా అదృశ్యాం సర్వభూతానాం తేజసా స్వేనసంవృతామ్

అశ్వరూపేణ మార్తాండస్తాం ముఖేన సమాసగత్ మైథునాయా విచేష్టంతీం పరపుంసో వీశంకయా

సా తం వివస్వతః శుక్రం నాసాభ్యాం సమధారయత్ దేవౌ తస్యామజాయేతామశ్వినౌభిషజాం వరౌ

నాసత్యశ్చైవ దస్రశ్చతౌస్మృతౌ నామతోఽశ్వినౌ అతఃపరం స్వకం రూపం దర్శయామాస భాస్కరః తద్దృష్ట్వాచాపి సంజ్ఞాతు తుతోష చ ముమోహ చ

తతస్తు జనయామాస సంజ్ఞా సూర్యసుతం శుభమ్ రూపేణ చాత్మనస్తుల్యం రేవతం నామ నామతః

పితుర్గృహ్యాష్టమం సోఽశ్వం జాతమాత్ర:పలాయత స తస్మిన్తకృదారూఢస్తమశ్వం నైవ ముంచతి

తతోర్కేణ సమాదిష్టౌ దండనాయక పింగలౌ అశ్వం ప్రత్యానయేథాం మే మాబలాచ్ఛిద్రతోఽస్యతు

తా॥ విశ్వకర్మ సూర్యునిచే ననుజ్ఞాతుడై శాకద్వీపమునందు, తిరుగు యంత్రము సహాయముతో సూర్యుని తేజమును చెక్కడము చేసెను-51. మిక్కిలి నిపుణముగా మోకాళ్ల వఱకు చెక్కిన పిదప లేఖనము సంపన్నము కాకమును పే సూర్యుడు దానిని నివారించెను-52. అప్పుడతని రూపము ప్రకృష్టమైన తేజముతో అత్యంతాకర్షణీయమై ప్రకాశించెను-53. సూర్యదేవుడు యోగదృష్టితో అశ్విని రూపముననున్న తన భార్యను చూచేను. ఏ ప్రాణికీని కనబడకుండ తన తేజస్సుతోనావరింపబడి అడవులలో తిరుగుచున్న ఆమెను సమీపించి అశ్వరూపమున నామెను 'కది సెను'. పర పురుష శంకతో-55. నాతని వీర్యమునా ముక్కరంధ్రములతో వెలిగ్రక్కుటకు ధరించెను. అందుండి దేవవైద్యశ్రేష్ఠులగు అశ్వినీ కుమారులు పుట్టిరి-56. అశ్వినులైన వారిరువురు నాసత్యుడు, దస్రుడు అని పేర్కొనబడిరి. ఆ పిదప తన నిజరూపమును చూపి భాస్కరుడామెనాశ్చర్యపఱచెను. తన భర్తరూపమును చూచి సంజ్ఞ మురిసిపోయి మోహము చెందెను-57. ఫలితముగ నామే సూర్యుని వలన, సూర్యుని తేజస్సుతో సమానమైన తేజస్సుగల రేవంతుడను కుమారునకు జన్మనిచ్చెను-58. పితృపరాధీనము కాదగిన ఆ ఎనిమిదవ గుఱ్ఱము పుట్టుటతోడనే పలాయన మయ్యెను. ఒకసారి అధిరోహించిన గుఱ్ఱము నెవడును విడిచి పెట్టడు-59. ఆ గుఱ్ఱమును, అర్భకమైనను, బలమునుయోగింపక, ఏ హానియు చేయక తనకు తెచ్చి పెట్టుమని సూర్యుడు దండనాయక పింగలులను పార్శ్వవర్తుల నాదేశించెను.

మూ॥ పార్శ్వస్థౌ తిష్ఠతస్తస్య అశ్వచ్ఛిద్రాభికాంక్షిణౌ నచ్ఛిద్రంతు లభేతే తౌ తస్యాద్యాపి మహాత్మనః

ప్లవన్గచ్ఛత్యసౌ యస్మాత్సంజ్ఞాయాః శాంతిదః సుతః రేవృస్తు చ గతౌ ధాతూ రేవంతస్తేన సస్మృతః

మనుర్యమో యమీ చైవ సావర్ణిః స శనైశ్చర: తపతీ చాశ్వినౌ చైవ రేవంతశ్చ రవేః సుతాః

ఏవమేషా పురాసంజ్ఞా ద్వితీయా పార్థివీ స్మృతా యా సంజ్ఞా సా స్మృతా రాజ్జీఛాయా యాసాతు నిక్షుభా

రాజృదీప్తౌ స్మృతో ధాతూ రాజా రాజతి యత్సదా అధికః సర్వ భూతేభ్యో రాజతేచ దివాకరః

అధికం రాజతే యస్మాత్త స్మాద్రజాస ఉచ్యతే రాజ్ఞః పత్నీతు సా యస్మాత్తస్మాద్రాజ్ఞీ ప్రకీర్తితా

క్షుభ సంచలనే ధాతుర్నిశ్చలా తేన నిక్షుభా భవంతీత్యథవా యస్మాత్స్వర్గీయాః క్షుద్వివర్జితాః ఛాయాం తాం విశతే దివ్యాం స్మృతీ సాతేన నిక్షుభాః

దృష్టా జనం సదాతాత! భృశం పీడిత మానసమ్ ధర్మేణ రంజయామాస ధర్మరాజస్తతః స్మృతః

శుద్ధేన కర్మణా తాత! శుభేన పరమ ద్యుతిః పితృణామాధి పత్యంచ లోకపాలత్వ మాపచ

సాంప్రతం వర్తతే యోఽయం మనుర్లోకే మహామతే! యస్యాన్వవాయే జాతస్తు శంఖచక్రగదాధరః

తా॥ సూర్యున కిరుప్రక్కలలో నిలబడియున్న దండనాయక పింగలులు, అశ్వమున నేదేని బలహీనతను, దోషమును వేదుక గోరిరి కాని నేటి వఱకును అతనిలో నట్టి ఛిద్రమును కనుగొనలేకపోయిరి-61. దాట్లువేయుచుఁబోవు రేవంతుడు సంజ్ఞాదేవికి శాంతినిచ్చువాడయ్యేను. 'రే వృప్లవగతౌ ప్లవగతాఅనుధాతువు ననుసరించి, గంతులు వేయుచుఁబోవువాడు గావున నాతడు రేవంతుడనబడెను-62. మనువు, యముడు, యమి, సావర్ణి, శనైశ్చరుడు, తపతి, అశ్వినులు, రేవంతుడు అనువారు సూర్యుని సంతానము-63. ఇట్లు సూర్యుని మొదటి భార్య సంజ్ఞ. రెండవభార్య పార్ధివి (పృథివీ సంబంధి) సంజ్ఞ, రాజ్ఞయనియు, ఛాయ(పార్థివి) నిక్షుభయనియు పిలువబడును-64. 'రాజ' దీప్తా అను ధాతువును బట్టి, సర్వభూతముల కంటే నధికముగ ప్రకాశించువాడు కావున సూర్యుడు రాజనబడును-65. అట్టి విశేష కాంతితో ప్రకాశించు 'రాజైన' సూర్యుని భార్య కావున నామే 'రాజ్ఞయని పిలువబడును-66. 'క్షుభ సంచలనే అను ధాత్వర్థమును బట్టి, చలింపదు (చలించును) గావున భూమికి 'నిక్షుభ' యని పేరు. స్వర్గీయులైన దేవతలు క్షుద్వివర్జితులు. అట్టివారు దివ్యమైన ఛాయను ప్రవేశింతురుగాన ఆమె నిక్షుభ యనబడును-67. మిక్కిలిగా పీడింపబడు మనస్సులు గల జనమును చూచి యా జనమును ధర్మముతో రంజింపజేసినందువలన యముడు ధర్మరాజుగ పేర్కొనబడెను-68. మిక్కిలి తేజస్వియై తన శుద్ధమైన, శుభప్రదమైన కర్మచేత, పితృదేవతల కాధిపత్యమును, లోకపాలత్వమును అతడు పొందగలిగెను-69. ఈ మనువిప్పుడు (తన) లోకముననుండును. శంఖచక్రగదాధరుడగు విష్ణువతని వంశముననే పుట్టియుండెను.

మూII యమస్య భగినీ యాతు యమికన్యా యశస్వినీ సొభవత్సరితాంశ్రేష్ఠా యమునా లోకపావనీ

మనుః ప్రజాపతిస్తేషు సావర్ణిః స మహాయశాః భవిష్యన్సమనుస్తాత! అష్టమః పరికీర్తితః

మేరు పృష్ఠే తపో దివ్యమద్యాపి చరతే ప్రభుః భ్రాతా శనైశ్చరస్తస్య గ్రహత్వం సతులబ్ధవాన్

తపతీనామ యానామ్నా తయోః కన్యాగరీయసీ సా బభూవ శుభాపత్నీ రాజ్ఞః సంవరణస్యతు

తాపీ నామ నదీచేయం వింధ్యమూలా ద్వినిఃసృతా నిత్యం పుణ్యజలా స్నానే పశ్చిమో దధిగామినీ

సౌమ్యయా సంగతా సాతు సర్వపాప భయాపహా వైవస్వతీ యథా వీర! సంగతా శివ కాంతయా

అశ్వినౌ దేవవైద్యత్వం లబ్ధవంతౌ యదూత్తమ తయోః కర్మోప జీవంతి లోకేస్మినిషజఃసదా

రేవంతో నామ యోఽర్కస్య రూపేణా రసమఃసుతః అశ్వానామాధిపత్యేతు యోజిత సతు భానునా

క్షేమేణ గచ్ఛతేఽధ్వానం యస్తంపూజయతే పథి సుఖ ప్రసాద్యో మర్త్యానాం సదా యదుకులోద్వహ!

త్వష్టాపి తేజసా తేన మార్తాండ స్యైవ చాజ్ఞయా భోజానుత్పాదయామాస పూజాయై తస్య సువ్రత!

య ఇదం జన్మదేవస్య శృణుయాద్వా పఠేత వా వివస్వతో హి పుత్రాణాం సర్వైషామమితౌజసామ్

సర్వపాపవినిర్ముక్తో యాతి సూర్యసలోకతామ్ ఇహ రాజాభవత్యేవ పునరేత్య న సంశయః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్సే ఆదిత్య మాహాత్మ్య వర్ణనం నామైకో నా శీతి తమోఽధ్యాయః

తా॥ యముని సోదరియగు 'యమి' యను కీర్తిశాలిని నదులలో శ్రేష్ఠమైన యమునా నదియై లోకపావని యయ్యెను-71. సావరియను సూర్యతనయుడు ఎనిమిదవ మనువే కీర్తి గడించేను-72. అతడీనాటికి గూడ మేరు పర్వత మూలమున నుండి దివ్యముగ తపమాచరించుచున్నాడు. అతని సోదరుడగు శనైశ్చరుడు గ్రహత్వమును పొందెను-73. తపతి యను పేరంబరగు సూర్యుని పెద్ద కుమార్తె సంవరణుడను రాజుకు భార్యయయ్యెను-74. వింధ్య పర్వతము మూలమునుండి ప్రవహించు తాపి యనునది ఈమెయే, ఈ నది స్నానార్ధ మగు పవిత్ర జలములతో ప్రవహించుచు పశ్చిమ సముద్రమున గలయును-75. సర్వపాపములను భయములను తొలగించునట్టి ఈ నది, యమున గంగయందువలే, సౌమ్యానదిలో సంగమించును-76. రాజా! అశ్వినీ కుమారులు దేవ వైద్యులైరి. ఈ లోకమునందలి వైద్యులందలు వారి వృత్తి ననుసరించియే ఎప్పటికి జీవించుచుందురు-77. రేవంతుడనువాడు సూర్యునితో సమానమైన రూపముగలవాడు. అతడు తన తండ్రియగు సూర్యభగవానునిచే అశ్వాధిపతిగ నియుక్తు డయ్యెను. మార్గమున పయనించుంచుండువాడతనిని పూజించినచో క్షేమముగా తన గమ్యము చేరును. మానవులకెల్లప్పుడాతడు సుఖము నిచ్చుచుండును-79. మార్తాండుని ఆజ్ఞ చేత త్వష్ట కూడ సూర్యునారాధించు కొఱకు అతని తేజస్సుతో భోజులను సృష్టించెను-80. ఈ సూర్య జన్మ ప్రకారము, మిక్కిలి తేజోవంతులైన అతని బిడ్డల గుంచికాని, చదివిన వాడు వినినవాడు-81. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. తిరిగి భూలోకమునకు వచ్చి రాజగును. సంశయము లేదు.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్య మాహాత్మ్య వర్ణనమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.