78. సూర్య మహీహా వర్ణనము

మూ॥ నారద ఉవాచ :

తుల్యం యుగ సహస్రస్య నైశం కాలముపాస్యసః శర్వర్యంతే ప్రకురుతే బ్రహ్మత్వం సర్గకారణాత్

సలిలేనా ప్లుతాం భూమిం దృష్ట్యా కార్యం విచింత్యసః భూత్వాసతు వరాహోవై అపః సంవిశతే ప్రభుః

సంచింత్వైవం సదేవేశో భూమే రుద్ధరణేక్షమః మహీం మహార్ణవే మగ్నా ముద్ధర్తుముపచక్రమే

ఉత్తిష్ఠతస్తస్య జలార్ద్ర కుక్షేర్మహావరాహస్య మహీం విధార్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థామునయోజపంతి

ఉద్ధృత్యోర్వీం స సలిలా త్ర్పజా సర్గమకల్ప్యత మనసా జనయామాన పుత్రానాత్మసమాఞ్చుభాన్

భృగ్వంగిరసమత్రించ పులస్త్యం పులహం క్రతుమ్ మరీచి మథదక్షంచ వశిష్ఠం నవమం తథా

నవ ప్రజాపతీన్ సృష్ట్యా తతః సపురుషోత్తమః ప్రాదుర్భూతోఽదితేః పుత్రః ప్రజానాంహిత కామ్యయా

మరీచాత్కశ్యపం పుత్రం యం వేధా జనయజ్జలే ప్రజాపతీనాం దశమం తేజసా బ్రహ్మణః సమమ్

వృక్ష కన్యాఽదితిర్నామ్నా పత్నీసా కశ్యపస్యతు అండం సా జనయామాస భూర్భువః స్వస్త్రి సంయుతమ్

తత్రోత్పన్నః సహస్రాంశు ర్ద్వాదశాత్మాదివాకరః నవ యోజన సాహసో విస్తారోఽస్య మహాత్మనః విస్తారాత్రి గుణశ్చేస్య పరిణాహో విభావసోః

తా॥ నారదుడిట్లనెను. “వేయి యుగములకు సమానమైన రాత్రి కాలమును గడిపి, ఉదయ కాలమున నతడు సృష్టి చేయుట కొఱకు బ్రహ్మత్వమును పొందును. నీట మునిగియున్న భూమిని చూచి, చేయదగు కార్యమును గూర్చి ఆలోచించి ప్రభువైన ఆ పరమ పురుషుడు వరాహరూపమును ధరించి నీటిలోనికి ప్రవేశించును-2. భూమినుద్దరించుటకు సమర్థుడైన ఆ దేవేశుడు బాగుగనాలోచించి నీట మునిగియున్న భూమినుద్ధరించుటకు పూనుకొనెను-3. భూమిని ధరించి జలగర్భమునుండి భూమిని పైకెత్తుచున్న వేదమయుడగు నా మహావరాహుని శరీరము కంపితమగుచుండగా రోమములలో నుండిన మునులాతనిని స్తుతించుచుండిరి-4. నీట మునిగి యుండిన భూమిని ఉద్దరించి అతడు ప్రజా సృష్టిచేసెను. మొదట తనతో సమానులైన పుత్రులను మనస్సుతో జనియింపజేసెను-5. భృగువు, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మరీచి, దక్షుడు, తొమ్మిదవవాడు. వసిష్టుడు-6 ఆ పురుషోత్తముడిట్లు తొమ్మండుగురు ప్రజాపతులను మానస పుత్రులుగా సృష్టించి తాను ప్రజా హితమును గోరి అదితి పుత్రుడుగా నవతరించెను-7. బ్రహ్మతో సమానమగు తేజస్సు గల కశ్యపుడు, ప్రజాపతులలో పదవవాడయ్యెను. అతడు మరీచి కుమారుడు-8. దక్ష ప్రజాపతి పుత్రికయగు అదితి, కశ్యపుని భార్యయయ్యెను. ఆమె, భూర్బువస్వగ్త్ కములతో కూడిన అండమును ప్రసవించెను-9. అందుండియే ద్వాదశాత్ముడగు సూర్య భగవానుడు సహస్రకిరణుడై ప్రకటమయ్యెను. ఈ మహాత్ముని దైర్ఘ్యము తొమ్మిది వేల యోజనములు, వైశాల్యము దానికి మూడురెట్లధికమై యుండును-10.

మూ॥ యథాపుష్పం కదంబస్య సమంతాత్కేశరైర్వృతమ్ తథైవ తేజసాం గోలం సమంతాద్రశ్మిభిర్వృతమ్

సహస్ర శీర్షా పురుషో బ్రహ్మం యోగముదాహరన్ తైజసస్యచ గోలస్య సతు మధ్యే వ్యవస్థితః

ఆదత్తే సతురశ్మీనాం సహస్రేణ సమంతతః అపో నదీ సముద్రేభ్యో హ్రద కూపేభ్య ఏవచ

సౌరీ ప్రభా యాదేవస్య అస్తంయాతే దివాకరే అగ్నిమావిశతే రాత్రౌ తస్మాద్దూరాత్ర్పకాశతే

ఉదితేచ తతః సూర్యే తేజ ఆగ్నేయమావిశత్ పాదేన తేజసశ్చాగ్నే స్తస్మాత్స తపతే రవీః

ప్రకాశత్వం తథోష్ణత్వం సూర్యేఽగ్నౌచ ప్రకీర్తితే పరస్పరాను ప్రవేశాదాప్యాయేతే దీవానిశమ్

వ్యాపకత్వంచ రశ్మీనాం నా మానిచ నిబోధమే హేతయః కిరణాగావో రశ్మయోఽథ గభస్తయః

అభీషవో ఘనం చోస్రా వసవోఽథ మరీచయః నాడ్యో దీధితయః సాధ్యా మయూఖా భానవోంశవః

సప్తార్చయః సువర్ణాశ్చ కరాః పాదాస్తథైవచ ఏషాంతు నామ్నాం రశ్మీనాం పర్యాయావింశతి స్మృతాః

తా॥ కడిమి పువ్వు అంతటను కేసరములతో నావరింపబడి యుండునట్లు సూర్యుని తేజస్సుల గోళము చుట్టును కిరణములతో నాపరింపబడియుండెను-11, సహస్ర శీరుడైన పురుషుడు బ్రహ్మ పదార్థమనబడువాడు ఈ తేజో గోళము మధ్య భాగమున వ్యవస్థితుడై యుండును--12. తన సహస్ర కిరణములచేత అంతటనున్న జలములను, నదులనుండి, సముద్రముల నుండీ, హ్రదముల నుండి. బావులనుండి గ్రహించుచుండును-13. సూర్యుడస్తమించినప్పుడతని కాంతి అగ్నిని చేరును. అందువలననే రాత్రి సమయమున అగ్ని, దూరమునుండియు ప్రకాశించుట కన్పట్టును-14. సూర్యుడుదయింపగనే తిరిగి ఆ ప్రకాశమగ్నినుండి సూర్యునిలోనికి ప్రవేశించును, ఆగ్నేయమగు నా తేజః కరణములాతనిలో చేరుటవలననే అతడు ప్రకాశించుచుండును-15. ఉష్ణత్వ ప్రకాశత్వములు రెండును అగ్నిలోను, సూర్యునిలోను ఉండును. రాత్రింబవలు వీనిని పరస్పరము ఇచ్చిపుచ్చుకొనుట ద్వారా ఒకరినొకరు తృప్తి పచుచుందురు-16. సూర్య కిరణముల వ్యాపకత్వము, వాని నామములును చెప్పుచున్నాను వినుము, హేతి, కిరణ, గౌరశ్మి, గభస్తి-17. అభీషు,ఘన, ఉగ్ర, వసు, మరీచి, నాడి, దీధితి, సాధ్య, మయూఖ, భాను, అంశు-18. సప్తార్చి, సుపర్ణ, కర, పాద నామములతో సూర్యకిరణములకు ఇరువది పర్యాయపదములు చెప్పబడినవి-19.

మూ॥ చందనాదీని, వక్ష్యామి నామాన్యేషాంపృథక్ఫృథక్ సహస్రం తాత! కథితం శీత వర్షోష్ణ నిఃశ్రవమ్

తేషాం చతుఃశతం నాడ్యో వర్షంతే చిత్రమూర్తయః చందనాశ్చైవ మందాశ్చ కేతునామానుమాస్తథా అమృతానామతే సర్వే రశ్మయో వృష్టిహేతవః

హిమోద్వాహాస్తు తత్రాన్యే రశ్మయస్త్రిశతం స్మృతాః చంద్రాస్తే నామతః సర్వే పీతాస్తేతు గభస్తయః

సౌమ్యశాశ్చైవ వామాశ్చ హ్లాదినో హిమసర్జనాః శుక్లాశ్చ కకుభశ్చైవ గావో విశ్వభృతస్తథా

శుక్లా స్తే నామతః సర్వేత్రిశతం ధర్మ సర్జనాః సమం బిభ్రతితే సర్వే మనుష్యాదేవతాస్తథా

మనుష్యానోషధీభిస్తు స్వథయాచ పితృనపి అమృతేన సురాన్సర్వాంస్త్రయస్త్రిభి రతర్పయన్

వసంతే చైవ గ్రీష్మేచ శతైః స తపతేత్రిభిః వర్షా శరత్సు చైవేశ స్తపతే సంప్రవర్షతే

హేమంతే. శిశిరే చైవ హిమోత్సర్గం చ స త్రిభిః ఓషధీషు బలం ధత్తే స్వధాయాంచ స్వధాం పునః అమరేష్వమృతం సూర్యస్త్రయంత్రిషు నియచ్ఛతి

కాలోగ్నిర్వత్సర శ్చైవ ద్వాదశాత్మా ప్రజాపతిః తపత్యేషు సురశ్రేష్ఠ స్క్రీన్లోకా న్సచరాచరాన్.

ఏష బ్రహ్మ తథా విష్ణు రేష ఏవ మహేశ్వరః ఋచో యజూంషి సామాని ఏష ఏవ న సంశయః

ఋచాభిః స్తూయతే పూర్వం మధ్యాహ్నే యజుర్భిః సదా సామాభిస్త్యపరాహ్ణేషు మహేశానైః ప్రపూజ్యతే

తా॥ సూర్యదేవుని కిరణముల చందనాది నామములను వేజ్వేజుగ చెప్పుచున్నాను. ఒక వేయిగా చెప్పబడు నిట్టి కిరణములు శీతోష్ణ వర్షప్రదములని వినుచున్నాము-20. వానిలో నాలుగు వందల కిరణములు చందన, మంద, కేతు, అమృత నామములతో పిలువబడునవి వర్షకారణములై జగత్తునకు వరము నిచ్చుచున్నవి-21. మూడు వందల కిరణములు. మంచుతో గూడి యున్నవిగ చెప్పబడినవి. ఇవి పసుపు వన్నెకలిగి చంద్రకిరణములుగ పేర్కొనఁబడుచున్నది-22. ఇవి సౌమ్యముగ ప్రకాశించుచు, రుచిరములై, ఆహ్లాదజనకములై, మంచును కురిపించునవియై, తెల్లని వన్నె కలిగి, దిక్కులకు వ్యాపించుచు విశ్వమునంతయును భరించుండు రశ్ములు-23. వర్ణముననుసరించి వాని పేరు శుక్లములు. సంఖ్యచేనివి మూడువందలై ధర్మమును వర్షించుచు దేవతలను మనుష్యులను సమానముగ భరించుచుండును-24. మనుష్యులనోషధుల చేత, పితరులను స్వధలచేత, దేవతలనమృతము చేత ఈ మువ్వురిని మూడించిచేత నివి తృప్తి పఱచుచుండును-25. వసంత గ్రీష్మర్తువులందు సూర్యభగవానుడు మూడు వందల కిరణముల చేత ప్రకాశించుచుండును. వర్షాశరత్తులందును మూడువందల కిరణములతో తపించుచు వర్షించుచునుండును

హేమంత శిశిర ఋతువులలోను మూడువందల కిరణములతో వెలుగుచు మచును ముగించుచుండును. ఓషదులకు బలమును శ్రీ పితృదేవతల హవిస్సులకు స్వధాత్వమును, దేవతలకొఱకైన అమృతమున కమృతత్వమును- మూటిచే మూటికి- ఇచ్చుచుండును-27. ద్వాదశాత్ముడైన ప్రజాపతి అయన, ఋతువులతో గూడిన కాలస్వరూపుడుగను, అగ్నిరూపుడగను చరాచరములతో గూడిన మూడు లోకములను తన ఉష్ణప్రకాశములచే తనియించుచుండును-28. అతడే బ్రహ్మ అతడే విష్ణువు, అతడే మహేశ్వరుడు. ఋగ్యజుస్సామ వేదములు కూడ అతడే. ఇందు సంశయమెంతమాత్రమును లేదు-29. మహేశ్వరాదుల రూపముననితనిని ప్రాతస్సంధ్యా సమయమున ఋక్కులతోను, మధ్యాహ్న కాలమున యజస్సులతోను, అపరాష్ట్రమున సామములతోను స్తుతించుచు పూజింతురు.

మూII పూజ్యమానస్తు నిత్యంవై తపత్యేష దివస్పతిః సదైవ తేజసాం రాశిర్దీప్తి మాన్త్సర్వలోకగః

పార్శ్వ తోర్థ్వమథశ్చైవ తాపయత్యేష సర్వతః బ్రహ్మ విష్ణు మహేశానైః పూజ్యమానస్తు నిత్యశః

యథా సర్వగతో వాయుర్వాహ మానస్తు తిష్ఠతి తద్వత్సహస్ర కిరణో గ్రహరాజో దివస్పతిః

సూర్యోగోభిర్జగత్కృత్స్నమాదీపయతి సర్వశః త్రీణి రశ్మిశతాన్యస్య భూర్లోకం ద్యోతయంతివై

త్రీణి త్రీణి తథాచాన్యౌ ద్వౌలోకౌ తాపయంత్యుత శతంచాపి

అధస్తాత్తు పాతాలం తాపయంత్యుత

ఇత్యే తన్మండలం శుక్లం భాస్వరం హేలి సంజ్ఞతమ్ నక్షత్ర గ్రహ సోమానాం ప్రతిష్టాయోని రేవచ విధు ఋక్ష గ్రహాః సర్వే విజ్ఞేయాః సూర్యసంభవాః

రవేః కర సహస్రం యత్ర్పాజ్మయా సముదాహృతమ్ తేషాంశ్రేష్టాః పునః సప్త రశ్మయో గ్రహ సంజ్ఞతాః

సుషుమ్ణో హరికేశశ్చ విశ్వకర్మాతథైవచ సూర్యశ్చైవాపరో రశ్మిర్నామ్నా విష్ణురితి స్మృతః

సుసత్వః సర్వబంధుస్తు జీవాయతిచ వై జగత్ సప్తజః ప్రథమస్తత్ర కంజజశ్చతథాపరః

తారేయశ్చాపరస్తత్ర గురుః సుమనసాం తథా ఉగ్రాహ్వః పంచమ స్తేషాం పుత్రోన్యో వన మాలినః

కః శేషః సప్తమ స్తేషా మేతేవై సప్తరశ్మయః

తా॥ ఎల్లప్పుడును పూజింపబడుచు, తేజోరాశియైన సూర్యదేవుడు సర్వలోక పరివ్యాప్తుడై దీపించుచు తపించుచునుండును-31. నలుప్రక్కలలోను, పైభాగమునను, క్రిందుభాగమునను-అంతటను ఇతడు తన వేడిమిని, వెలుగులను ప్రసరింపజేయుచుండును. త్రిమూర్తుల పూజలందుకొనుచు ప్రకాశించుచుండును-32. గంధవాహుడైన వాయువెట్లు సర్వగతుడో సహస్రకిరణుడైన గ్రహరాజు కూడ నటులే సర్వవ్యాపకుడైయుండును-33 అతడు తన కిరణ సహస్రముచే నశేష జగత్తును ప్రకాశింపజేయుచుండును. అందు మూడు వందల కిరణములు మాత్రమే భూలోకమును కాంతిమంతము చేయుచుండును-34. భువర్లోక సువర్లోకములను ఇతరములైన మూడేసి వందల కిరణములు ద్యోతనము చేయుచుండును. నూఱు కిరణములు అధోలోకమగు పాతాళమునకు ప్రసరించుచుండును-35. తెల్లని కాంతులతో ప్రకాశించు నీ సూర్యమండలము “హేలి' యనుసంజ్ఞగలది. నక్షత్ర, గ్రహ, చంద్రమండలములన్నింటియునికికి మూలమైనది. అనగా చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు సూర్యుని నుండి పుట్టినవని గ్రహింపవలెను-36. పూర్వము నాచే చెప్పబడిన సూర్యభగవానుని వేయి కిరణములలో ఏడు 'గ్రహ'సంజ్ఞగల కాంతి పుంజములు శ్రేష్ఠములైనవి-37. అవి సుషుమ్ల హరికేశ, విశ్వకర్మ, సూర్య, రశ్మి, విష్ణు-38. సర్వబంధు నామములు గలవి. అవి జగత్తును చైతన్యవంతమొనచ్చుచుండును. మొదటి రశ్మి సప్తజము, రెండవది కంజజము-39. మూడవది తారేయము, నాల్గవది దేవతల గురువు, ఐదవది ఉగ్రనామముగలది, ఆవది విష్ణుజము, ఏడవ రశ్మి ‘కః' అనుబడునది. ఇవియే సప్తరశ్ములు.

ఆదిత్యమూలమఖిలం త్రైలోక్యం సచరాచరమ్ భవత్యస్మాజ్జగత్సర్వం సదేవాసుర మానుషమ్

రుద్రేంద్రోపేంద్ర చంద్రాణాం విప్రేంద్రత్రిదివౌకసామ్ మహద్యుతి మతః కృత్స్నం తేజో యత్సార్వలౌకికమ్

సర్వాత్మా సర్వలోకేశో దేవ దేవః ప్రజాపతిః సూర్యఏవ త్రిలోకస్య మూలం పరమ దైవతమ్

అగ్నౌప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వప్టేరన్నం తతః ప్రజాః

సూర్యాత్ప్ర సూయతే సర్వం తస్మిన్నేవ ప్రలీయతే భావా భావౌతు లోకానా మాదిత్యాన్నిః సృతౌపురా

ఏతత్తు ధ్యానినాం ధ్యానం మోక్షశ్చా ప్యేవ మోక్షిణామ్ ఆత్ర గచ్ఛంతి నిర్వాణం జాయంతేస్మాత్పునః ప్రజాః

క్షణా ముహూర్తా దివసా నిశాః పక్షాస్తు నిత్యశః మాసాః సంవత్సరాశ్చైవ ఋతవోఽథ యుగానిచ అధాదిత్యమృతే హ్యేషాం కాల సంఖ్యా న విద్యతే

కాలాదృతే న నియమా నాగ్నేర్విహరణక్రియా ఋతూనామ విభాగాచ్చ పుష్పమూలఫలంకుత?

అభావో వ్యవహారాణాం జంతూనాం దీవిచేహచ జగత్ర్పతాపన మృతే భాస్కరం వారి తస్కరమ్

నా వృష్ట్యా తపతే సూర్యో నా వృష్ట్యా పరివేష్యతే ఆదిత్యస్యచ నామాని సామాన్యానీహ ద్వాదశ

తా॥ స్థావర జంగమాత్మమగు లోకత్రయమున కంతటికిని సూర్యుడే మూలము. దేవతలు, రాక్షసులు, మానవులతో గూడిన జగత్తంతయు నతని నుండియే పుట్టినది-41. రుద్రుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు, విప్రేంద్రులు, స్వర్గమునందలి దేవతలు మున్నగువారందఱికిని ఈ సార్వభౌకికమైన తేజ స్సే తేజస్సునిచ్చుచున్నది-42. సూర్యదేవుడే సర్వాత్ముడు, లోకేశ్వరుడు, " దేవదేవుడు, ప్రజాపతి, పరమదైవతము, ముల్లోకములకు మూలకారణము-43. అగ్నియందు వేయబడిన యాహుతులాదిత్యునిఁ జేరును. ఆదిత్యుని నుండి వర్షము, వరము నుండి అన్నము, అన్నము నుండి ప్రజలును పుట్టుదురు-44. అంతయును సూర్యుని నుండీయే పుట్టి అతని యందే లీనమగును. లోకములలోని సదసత్పదార్థ మంతయు పూర్వమతనినుండియే వెలువడినది-45. అతడే ధ్యానము చేయువారికి లక్ష్యము. మోక్షమునందు వారికి గమ్యము. అతని యందే నిర్వాణము పొంది ప్రజలు తిరిగి అతని నుండియే పుట్టుచుందురు-46. క్షణములు, ముహూర్తములు, దినములు, రాత్రులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, ఋతువులు, యగములు సూర్యునివలననే గణింపబడుచున్నవి. సూర్యుడు లేకున్నచో వీనికి కాలసంఖ్యాగణనము లేదు-47. కాలమును విడిచి నియమములేవియునుండవు. అగ్నికి ఆహుతులను స్వీకరించుట ఉండదు. ఋతువుల విభాగము లేనప్పుడిక పూలు పండ్లు ఎక్కడివి?-48. జగత్తునకు వేడి వెలుగులిచ్చు వారితస్కరుడైన భాస్కరుడులేకున్నచో దేవలోకమునందును, మనుష్య లోకమునందును ప్రాణుల కెట్టి వ్యవహారములును ఉండవు-49. వృష్టిలేకున్న సూర్యుడు తపింపడు. కాంతిమండలమునొందడు. సూర్యుని సామాన్యమైన నామములు పన్నెండుగలవు.

మూII ద్వాదశైవ పృథక్త్వేన తాని వక్ష్యామ్యనేకశః ఆదిత్యః సవితా సూర్యోమిహిరోఽ ర్కః ప్రతాపనః

మార్తాండో భాస్కరో భానుశ్చిత్రభాను ర్దివాకరః రవిర్వై ద్వాదశశ్చైవ జ్ఞేయః సామాన్య నామభి:

విష్ణుర్ధాతా భగః పూషా మీత్రేంద్రౌ వరుణోఽర్యమా వివస్వానంశుమాంస్త్వష్టా పర్జన్యో ద్వాదశస్మృతాః

ఇత్యేతే ద్వాదశాదిత్యాః పృథీక్త్వేన ప్రకీర్తితాః ఉత్తిష్ఠంతి సదా హ్యేతే మా సైర్ద్వాదశభిః క్రమాత్

విష్ణు స్తపతి చైత్రేచ వైశాఖే చార్యమా తథా వివస్వాన్ జ్యేష్ఠమాసేతు ఆషాఢేచాంశుమాంస్తథా

పర్జన్యః శ్రావణే మాసి వరుణః ప్రోష్ఠ సంజ్ఞకే ఇంద్రశ్చాశ్వయుజే మాసి ధాతా తపతి కార్తికే

మార్గశీర్షే తథామిత్రః పౌషేపూషా దివాకరః మాఘేభగస్తు విజ్ఞేయస్త్వష్టా తపతి ఫాల్గునే

తైశ్చ ద్వాదశ భిర్విష్ణూ రశ్మీనాం దీప్యతే సదా దీప్యతే గో సహస్రేణ శతైశ్చత్రిభిరర్యమా

ద్విసప్త కైర్వివస్వాంస్తు అంశుమాన్పంచకైస్త్రిభిః వివస్వానీవ పర్జన్యో వరుణశ్చార్యమా ఇవ

ఇంద్రస్తు ద్విగుణైః, షడ్చిరాతేకా దశభిః శతే:  మిత్రవద్భగవత్యషా సహస్రేణ శతేనచ

తా॥ ఈ పన్నెండు నామములే పృథక్యముతో ననేకములైనవి. వాని వివరములు చెప్పెదను. ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, మిహిరుడు, అర్కుడు, ప్రతాపరుడు-51 మార్తాండుడు, భాస్కరుడు, భాను, చిత్రభాను, దివాకరుడు. ఈ పన్నెండు సాధారణమైన నామములచేత రవి పేర్కొన బడుచుండును-52. విష్ణువు, ధాత, భగుడు, పూష, మిత్రుడు, ఇంద్రుడు, వరుణుడు, అర్యముడు, వివస్వంతుడు, అంశుమంతుడు, త్వష్ట, పర్జన్యుడు, ఈ పన్నెండును-53 ద్వాదశాదిత్యుల నామములుగా చెప్పబడినవి. వీరు పన్నెండుమాసములలో క్రమముగానుదయించుచుందురు-54. విష్ణువు, చైత్రమున, అర్యముడు వైశాఖమున, వివస్వంతుడు జ్యేష్ఠమాసము, అంశుమంతుడాషాఢమున-55. పర్జన్యుడు శ్రావణమున, వరుణుడు భాద్రపదమున ఇంద్రుడాశ్వయజమున, ధాత కార్తీకమున-56. మీత్రనాముడు మార్గశీర్షమున, పూషసంజ్ఞుడు పుష్యమున, భగుడు మాఘమున, త్వష్టఫాల్గునమున వేడి వెలుగుల నిచ్చుచుందురు-57. ఈ ద్వాదశాదిత్యులలో విష్ణువను పేరుగల వాడు ఎల్పప్పుడు వేయికిరణములతో ప్రకాశించుచుండును అర్యముడు మూడువందల కిరణములచే వెలుగుచుండును-58. వివస్వంతుడు పదునాలుగు, అంశుమంతుడు పదునైదురశ్ములచే ప్రకాశింతురు. పర్జన్యుడు, వివస్వంతునీవలే పదునాల్గింటిచేత, వరుణుడర్యముని వలె మున్నూజు కిరణములచేత ప్రకాశింతురు-59. ఇంద్రుడు పన్నెండు కిరణములతో, ధాత పదునొకండు వందల కిరణములతో, త్వష్ట, మిత్రభగులవలె వేయి, వందకిరణములతోను ప్రకాశించుచుందురు.

మూ॥ ఉత్తరోపక్రమేర్కస్య వర్థంతే రశ్మయః సదా దక్షిణోపక్రమే భూయో హ్రస్వంతే సూర్యరశ్మయః

ఏవం రశ్మిసహస్రంతుసౌర్యం లోకార్థసాధకమ్ భిద్యతే ఋతుమాసైస్తు సహస్రం బహుధాభృశమ్

ఏవం నామ్నాం చతుర్వింశదేక స్యైషా ప్రకీర్తితా విస్తరేణ సహస్రంతు పునరేవం ప్రకీర్తితమ్

ఆసాం పరమయత్నేన బ్రువతే భిన్నదర్శనాః తామసా బుద్ధి మోహాచ్చ దృష్టాం తాని బ్రువంతిహి

బ్రహ్మణం కారణం కేచిత్కేచిదాహుర్దివాకరమ్ కేచిద్భవం పరత్వేన ఆహుర్విష్ణుం తథాపరే

కారణంతు స్మృతా హ్యేతే నానార్థేషు సురోత్తమాః ఏకఃసతు పృథక్త్వేన స్వయం భూరితి విశ్రుతః

వనమాలిన ముగ్రేశం దివి చక్షురివాంతకమ్ తం స్వయంభూరితిప్రోక్తం స సౌపర్ణిమనౌపమమ్

యథాను రజ్యతే వర్ణైర్వివిధైః స్ఫటికోమణిః తథాగుణ వశాత్తస్య స్వయం భోరనురంజనమ్

ఏకోభూత్వా యథామేఘః పృథక్త్వేన ప్రతిష్ఠితః వర్ణతో రూపతశ్చైవ తథా గుణ వశాత్తు సః

నభసః పతితం తోయం యాతి స్వాదాంతరం యథా భూమే రసవిశేషణ తథా గుణవశాత్తు సః

తా॥ సూర్యుడు ఉత్తరాయణ పరాయణుడైనప్పుడు కిరణములు దీర్ఘములగును. దక్షిణ దిక్కునకు ప్రయాణము ప్రారంభించునప్పుడు హ్రస్వములగును-61. ఇట్లులోక ప్రయోజనములను సాధించునట్టి సూర్యకిరణ సహస్రము ఆయా ఋతువులలో, మాసములలో పెక్కు విధములుగ భేదించుచుండును-62. ఈ ఇరువది నాలుగు నామములితనివేయయియును మఱల వేయి నామములు విస్తరించి చెప్పబడినవి-63. వేయింటిలోను, తామస బుద్ధిగల భిన్న దర్శనులు కొందఱు కొన్నింటిని మాత్రమే జగత్కారణములని మిక్కిలి పూనికతో, దృష్టాంతములతోను చెప్పుచుందురు-64. బ్రహ్మను కారణమని కొందఱు, దివాకరుని కారణమని కొందఱు శివుడు కారణమని కొందఱు, విష్ణువని కొందఱు చెప్పుచుందురు-65. నానా ప్రయోజనముల సందర్భములలో నానా దేవతలు కారణమని చెప్పబడుచుందురు. కాని స్వయంభువుగా ప్రసిద్దినందిన ఒక్క సూర్యదేవుడే వేజ్వేలు నామరూప క్రియాదులతో నెఱుంగదగియుండును-66. వనమాలి, ఉగ్రేశుడు, యుముని వలే దివ్యచక్షువు, సాటిలేనివాడు, సౌపర్ణినాముడైన సూర్యుడే స్వయంభువని చెప్పబడును-67. స్ఫటిక మణి వివిధ వర్ణములతో ప్రకాశించునట్లు ఈ స్వయంభువు తన గుణముల కారణముగ వివిధములుగ ప్రకాశించుచుండును-68. ఒకే మేఘము వేజ్వేజుగ విడిపోయి, వేజ్వేలు రూపములు, వర్ణములు పొందినట్లు సూర్యదేవుడు కూడ తన గుణముల మూలమున వేజ్వేయుగ ప్రకాశించుచుండును-69. ఆకాశమునుండి క్రిందపడిన ఒకే విధమగు నీరు భూమికి సంబంధించిన రస విశేషముల చేత వేజ్వేలు రుచులను పొందినట్లు భాస్కరుడు తన గుణముల వలన వివిధములుగ వెలుగునట్లు తోచుచుండును.

మూ॥ యథేంధన వశాదగ్నిరేకస్తు బహుధాయతే వర్ణతో రూపతశ్చైవ తథా గుణవశాత్తు సః

యథాద్రవ్య విశేషాచ్ఛ వాయురేకః పృథగ్భవేత్ సుగంధిః పూతీ గంథీర్వా తథాగుణవశాత్తు సః

యథావా గార్హపత్యాగ్ని రన్యసంజ్ఞాంతరం వ్రజేత్ దక్షిణా హవనీయాది బ్రహ్మాదిషు తథాహ్యసౌ

ఏకత్వేచ పృథక్త్వేచ ప్రోక్తమేతన్ని దర్శనమ్ తస్మాద్భక్తిః సదాకార్యాదేవేహ్యస్మిన్దివాకరే

ఏషోండజోఽ ధిగశ్చైవ ఏష ఏవ భృగుస్తథా ఏష రజస్తమశ్చైవ ఏష సత్వ గుణస్తథా

ఏష వేదాశ్చయజ్ఞాశ్చ సర్వశ్చైవ న సంశయః సూర్య వ్యాప్తమిదం సర్వం జగత్స్థావర జంగమమ్

ఇజ్యతే పూజ్యతే చాసావత్ర యానాత్మకో రవిః సర్వత్ర సవితా దేవ స్తనుభిరామభిశ్చ సః

వసత్యగ్నౌ తథావాతే వ్యోమ్నితో యే తథా విభో! ఏవం విధేహ్యయం సూర్యః సదా పూజ్యో విజానతా

ఆదిత్యం వేత్తి యస్త్వేవం స తస్మిన్నేవ లీయతే అప్యేకం వేత్తి యోనామ ధాత్వర్థ నిగమై రవేః

సరోగైర్వర్జితః సర్వైః సద్యః పాపాత్ప్రముచ్యతే నహిపాపకృతః సాంబ! భక్తిర్భవతి భాస్కరే

తా॥ ఒకే అగ్ని వేజ్వేలు ఇంధనముల వలన వేజ్వేజు వర్ణములను, రూపములను పొందినట్లు సూర్యభగవానుడొక్కడే తన గుణముల కారణముగ భిన్నభిన్న రూపములను దాల్చు చుండును-71. గాలి యొక్కటియే యైనను అది ప్రసరించు ద్రవ్య విశేషములవలన, సుగంధ, దుర్గంధ వ్యవహారము పొందినట్లు సూర్యదేవుడొక్కడే తన గుణ మహిమచే వివిధ రూపములతో తోచుచుండును-72. ఒకే గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని యను నామాంతరములను పొందునట్లు సూర్యుడు కూడ బ్రహ్మాది భిన్ననామములను పొందుచుండును-73. ఏకత్వ పృథక్య విషయమున నిట్లు నిదర్శనము చెప్పబడినది. కావున దేవతలందఱికిని మూలమైన సూర్యదేవుని భక్తితో సేవింపవలెను-74. మార్తాండుడు మూలదేవత. ఇతడే శివుడు. ఇతడే సత్వరజస్తమోగుణములు-75. ఇతడే వేదములు, ఇతడే యజ్ఞములు. ఇతడే సర్వము. సంశయములేదు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతయు సూర్యునిచే పరి వ్యాప్తమైయున్నది-76. ఇతడే యజింపబడును. ఇతడే పూజింపబడును, నిరంతర ప్రయాణ శీలియైన ఈ రవి సుప్తజగత్ర్పేరకుడు-భిన్న భిన్న శరీరములతో, భిన్న భిన్న నామములతో నీతడంతట ప్రకాశించుచున్నాడు-77. అగ్నియందు, గాలిలోను, ఆకాశమందును, జలమునందును సర్వత్ర ఇతడే వ్యాపించి యున్నాడు. సూర్యదేవుడిట్లు సర్వవ్యాపకుడగు పరమాత్మ జ్ఞానముగల వాడీదేవునెల్లప్పుడు పూజించుచుండవలెను-78. ఇట్లా సూర్యదేవునెఱుంగు వాడతనియందే లీనమగును. ధాత్వర్ధములు, వేదములు ప్రమాణములుగా నాదిత్యునేకైక దేవునిగా తెలియువాడును-79. రోగములులేనివాడై తత్క్షణమే సర్వపాపములనుండి విముక్తుడగును. సాంబా! పాపములు చేయువానికి సూర్యుని పై భక్తి కలుగదు.

మూ॥ తథా త్వంపరయా భక్త్వా ప్రపద్యస్వదివాకరమ్ యేన వ్యాధి వినిర్ముక్తః సర్వాన్కామానవాప్స్యసి

యథా తవపితా సాంబ! యథా వేధా యథా హరః యథా గుణ వశాత్తస్య స్వయంభోరనురంజనమ్

ఏకీభూయ యథామేఘః పృథక్త్వేన ప్రతిష్ఠతే వర్ణతో రూపతశ్చైవ తథా గుణ వశాత్తు సః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యాం సంహితాయాం బ్రా హ్మే పర్వణి సప్తమీ కల్పే సూర్య మహిమా వర్ణనం నామాష్ట్ర సప్తతి తమోఽధ్యాయః

తా॥ కావున నీవు పరాభక్తితో దివాకరభగవానుని శరణుపొందుము. దానివలన నీవు సర్వరోగములనుండి ముక్తుడవై కోరికల నన్నింటిని సఫలము చేసికొందువు-81. నీ తండ్రియగు విష్ణుదేవుడు, బ్రహ్మ శివుడు స్వయంభువగు నా సూర్యదేవుని గుణ మహిమావిలసితులే-82. ఒకే మేఘము వివిధ వర్ణములతో రూపములతో పృథక్వము చెందునట్లు భాస్కరుడును తన గుణ గరిమచే వివిధ దేవతలుగా భాసించుచుండును.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మపపర్వమున సప్తమీ కల్పమునందు సూర్య మహిమా వర్ణనమను డెబ్బది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.