భవిష్య మహా పురాణము
77. సూర్య వర్ణనము
మూ॥ నారద ఉవాచ :
విస్తరేణాను పూర్వ్యాచ సూర్యం నిగదతః శృణు తతః శేషాన్ప్రవక్ష్యేఽహం నమస్కృత్య వివస్వతే
అవ్యక్తం కారణం యత్తన్నిత్యం సదసదాత్మకమ్ ప్రధానం ప్రకృతిశ్చేతి యమాహుస్తత్వ చింతకాః
గంధైర్వర్ణై రసైర్హీనం శబ్ద స్పర్శ వివర్జితమ్ జగద్యోనిం మహద్భూతం పరం బ్రహ్మ సనాతనమ్
నిగ్రహం సర్వభూతానామ వ్యక్త మభవత్కిల అనాద్యంతమజం సూక్ష్మం త్రిగుణం ప్రభవాప్యయమ్
అనాకార మవిజ్ఞేయం తమాహుః పురుషం పరమ్ తస్యాత్మనా సర్వమిదం జగద్వ్యాప్తం మహాత్మనః
తస్యేశ్వరస్య ప్రతిమా జ్ఞాన వైరాగ్య లక్షణా ధర్మైశ్వర్య కృతాబుద్ధిర్భ్రాహ్మీ తస్యాభిమానితః
అవ్యక్తా జ్ఞాయతే తస్య మనసాయద్యదిచ్ఛతి చతుర్ముఖస్య బ్రహ్మత్వే కాలత్వే చొంత కృద్భవేత్
సహస్ర మూర్ధా పురుషస్తి స్రోవస్థాః స్వయం భువః సత్త్వం రజశ్చ బ్రహ్మత్వే కాలత్వేచ రజస్తమః
సాత్త్వికం పురుషత్వేచ గుణ వృత్తం స్వయం భువః బ్రహ్మత్వే సృజతేలోకాన్కాలత్వే చాపి సంక్షిపేత్
పురుషత్వ ఉదాసీనస్తిస్రోఽవస్థాః ప్రజాపతేః త్రిధా విభజ్య చాత్మానం త్రికాలం సంప్రవర్తతే
తా॥ నారదుడిట్లనెను. “మొదట సూర్య భగవానుని గూర్చి విపులముగను, క్రమానుసారముగను చేప్పెదను వినుము. ఆ దేవ దేవునికి నమస్కరించి మిగిలిన విషయములను తదుపరి చేప్పెదను-1. అవ్యక్తము, కారణము, నిత్యము, సద సదాత్మకము, ప్రధానము, ప్రకృతి అని తత్త్వచింతకులు దేనిని గూర్చి చెప్పుదురో-2. అట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ రహితమగు సనాతన పరబ్రహ్మమే మహద్భూతమనియు జగద్యోనియనియు చెప్పబడుచున్నది-3. సర్వభూత సృష్టికి అవ్యక్తమే మూలము. ఇది అనాది. అనంతము. అజము. సూక్ష్మము, త్రిగుణాత్మకమై జగత్తునకు హేతువైనది-4. ఆ కృతిలేనివాడు, తెలియరానివాడునైన వానిని పరమ పురుషుడందురు. అట్టి మహాత్ముని చేతనే ఈ సర్వ జగత్తు వ్యాప్తమై యున్నది-5. అట్టి ఈశ్వరుని స్వరూపము జ్ఞాన వైరాగ్య లక్షణముగలది. అతని యభిమానులకు ధర్మప్రాభవముతో గూడిన బ్రాహ్మీ బుద్ధి కలుగును-6. అతడు తన మనస్సుచే నేది సంకల్పించునో అది అతని అవ్యక్తము నుండి ఆవిర్భవించును. అతడే బ్రహ్మగా సృష్టించును. కాలుడై అంతమొందించును-7. స్వయం భువు, సహస్ర శీర్థుడునగు ఆ పురుషునకు మూడవస్థలు గలవు. బ్రహ్మత్వమున సత్వరజస్సులు, కాలత్వమున రజస్తమములును ఉండును-8. ఆ స్వయం భువునకు కేవల పురుషత్వ స్వరూపమున సత్త్వగుణము మాత్రమే ఉండును. బ్రహ్మత్వమున సృష్టించును. కాలత్వమున లయింపజేయును-9. కేవల పురుషుడు ఉదాసీనముగ నుండును. ఇట్లు ప్రజాపతికి మూడవస్థలు గలవు. మూడు కాలములందాతడు తన్ను తాను మూడు భాగములుగా విభజించుకొని ప్రవర్తించుచుండును-10.
మూ॥ సృజతే గ్రసతే చైవ వీక్షతేచ త్రిభిః స్వయమ్ అగ్రేహిరణ్య గర్భస్తు ప్రాదుర్భూతః స్వయం భువః
ఆదిత్య స్యాది దేవతా దజాతత్వాదజః స్మృతః దేవేషు సమహాన్దేవో మహాదేవః స్మృతస్తతః
సర్వేశత్వాచ్చలోకస్య అధీశత్వాచ్చ ఈశ్వరః బృహత్వాచ్చ స్మృతో బ్రహ్మ భవత్వాద్భవ ఉచ్యతే
పాతి యస్మాత్ర్పజాః సర్వాః ప్రజాపతిరతః స్మృతః పురేశేతేచవై యస్మాత్తస్మా త్పురుష ఉచ్యతే
నోత్పాద్యత్వాదపూర్వత్వాత్స్వయం భూరితి విశ్రుతః
హిరణ్యాండగతో యస్మాద్గ్ర హేశో వైదివస్పతిః తస్మాద్ధిరణ్య గర్భోసౌ దేవదేవో దివాకరః
అపో నారా ఇతి ప్రోక్తా ఋషిభిస్తత్వ దర్శిభిః అయనం తస్యతో ఆపసైన నారాయణః స్మృతః
అర ఇత్యేష శీఘ్రార్దో నిపాతః కవిభిఃస్మృతః ఆప ఏవార్ణవ భూత్వాన శీఘ్ర స్తేన తానరా:
ఏకార్ణవే పురా తస్మిన్నష్టే స్థావర జంగమే నారాయణాఖ్యః పురుషః సుష్వాప సలిలేతదా సహస్ర శీర్షా సుమనః సహస్రాక్షః సహస్రపాత్
సహస్ర బాహుః ప్రథమః ప్రజా పతిస్త్ర యీ పథే యః పురుషోనిగద్యతే ఆదిత్య వర్ణో భువనస్య గోప్తా అపూర్వ ఏకః పురుషః పురాణః
హిరణ్య గర్భో పురుషో మహాత్మా సంపద్యతేవై తమసః పరస్తాత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యాం సంహితాయాం బ్రహ్మే పర్వణి సప్తమీ కల్పే సాంబో పాఖ్యానే సూర్య వర్ణనం నామ సప్తసప్తతితమోఽధ్యాయః
తా॥ గుణ సంబంధమగు నీ మూడవస్థలతో నతడు సృష్టి ప్రళయములు చేయుచుండును. రెంటి మధ్యగల స్థితిని చక్కఁ జూచుచుండును. ఈ స్వయం భువగు పరబ్రహ్మమునుండి మొదట సూర్య భగవానుడు ప్రాదుర్భవించేను-11. ఆది యందు దేవతగా నవతరించుటచే నాదిత్యుడని, పుట్టుక లేందువలన అజుడనియు అతడు చెప్పబడును. దేవతలందజీలోను పెద్దపోడగుటచేత మహాదేవుడనబడును-12. సర్వలోకముల కీశ్వరుడగుటవలన ప్రభువులకు ప్రభువగుటచేత ఈశ్వరుడనబడును. బృహత్త వలన బ్రహ్మయనియు, భవత్వమువలన భవుడనియు చెప్పబడును-13. ప్రజలను పాలించుటచేత ప్రజాపతియనియు, పురము (శరీరము) నందుండు వాడయినందున పురుషడనియు పేర్కొనబడును-14. ఉత్పాద్యుడుకానందున, అపూర్వుడయినందునను స్వయంభువుగా ప్రసిద్దినందేను-15. బంగారు గ్రుడ్డునందుండియుండుటచేత నా దివాకరుడు హిరణ్య గర్భుడని పేరు వడ సేను-16. తత్త్వదర్శులైన ఋషులు నీటిని నారములందరు. నారములే అయనముగా (మార్గముగా) కలిగిన వాడగుటచే నాతడు నారాయణుడనబడును-17. ‘అర' అను శబ్దము పండితులచేత శీఘ్ర మను నర్థమున నిపతింపబడెను. నీరే సముద్రమై వానికి శీఘ్ర గమనములేనందుననవీ నారములయ్యెను-18. పూర్వము స్థావర జంగమాత్మకమగు జగత్తునకు ప్రళయమేర్పడగా సముద్రమొక్కటి మాత్రము మిగిలెను. ఆ సముద్ర జలమునందు నారాయణుడను పేరుగల పురుషుడు శయించి యుండెను. అతడు 'వేయి' శిరస్సులు, 'వేయి' కన్నులు, వేయి పాదములు గలవాడు-19. వేయి బాహువులు గల ఈ పురుషుడు మొదటి ప్రజాపతి. వేదములలో నితడు 'పురుషు'డని చెప్పబడును. ఇతడు మొదటి దేవత, ప్రకాశ రూపుడు, జగద్రక్షకుడు, అపూర్వుడు, ఒక్కడు. పురాణ పురుషుడు-20. మహాత్ముడైన ఆ హిరణ్య గర్భ పురుషుడు తమస్సు కంటే భిన్నుడు.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున సూర్య వర్ణనమను డెబ్బదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 77 of the Bhavishya Mahā Purana is as follows:
Nārada's teaching to Sāmba continues with a complete description of Sūrya's divine form as he appears to the inner vision of the meditator: seated on his chariot, golden-complexioned and radiating light in all directions, holding a lotus and a conch, wearing a crown and divine ornaments, flanked by his two wives Saṃjñā and Chāyā, attended by Daṇḍa and Piṅgala as his bodyguards. The seven horses of his chariot, the dimensions of the chariot itself, and the cosmic significance of its parts are repeated and expanded. Sūrya's two paths — the uttarāyaṇa course northward from the winter solstice, and the dakṣiṇāyana course southward from the summer solstice — and their significance for the spiritual welfare of those who die in each period are explained.