76. నారద సాంబ సంవాదమునందు సూర్య పరివార వర్ణనము

మూ॥ నారద ఉవాచ :

కదాచిత్పర్యటన్లో కాన్సూర్య లోకమహంగతః తత్రద్రష్టోమయసూర్యః సర్వదేవగణైర్వృతః

గంధర్వైరప్సరోభిశ్చ నాగైర్యక్షైశ్చ రాక్షసైః తత్రగాయంతి గంధర్వా నృత్యస్త్యప్సరసస్తథా

రక్షంత్యుద్గత శస్త్రాస్తం యక్షరాక్షస పన్నగాః ఋచోయజూంషిసామాని మూర్తిమంతీహ సర్వశః తత్కృతైర్వివిధైః స్తోత్రైః స్తువంతి ఋషయో రవిమ్

మూర్తిమత్యః స్థితాస్తత్ర తిస్రః సంధ్యాః శుభాననాః గ్రహీత వజ్ర నారాచాః పరివార్యరవిం స్థితాః

అరుణా వర్ణతః పూర్వా మధ్యమా చేందు సన్నిభా తృతీయాక్ష్మాజ సంకాశా సంధ్యాచైవ ప్రకీర్తితా

ఆదిత్యా వసవోరుద్రా మరుతోథాశ్వినౌ తథా త్రిసంధ్యం పూజయంత్యర్కం తథాన్యేచ దివౌకసః

ఈరయఞ్జయ శబ్దంతు ఇంద్రస్తత్రైవ తిష్ఠతి కవిస్తు త్ర్యంబకో దేవస్త్రి సంధ్యం పూజయంతివై

దినాదావంబుజాకారం పూజయే దంబుజాసనమ్ చక్రరూపంతు మధ్యాహ్నే ఘృతార్చిః పూజయేత్సదా

పూజయేత్సగణం రాత్రౌ విపులాజ్య స్వరూపిణమ్ రవిం భక్త్యా సదాదేవం కంజార్థ కృత శేఖరః

సారధ్యం కురుతే తస్య పతగస్యాగ్రజః సదా వహమానో రథం దివ్యం కాలావయవ నిర్మితమ్ హరితైః సప్తభిర్యుక్తం ఛందోభిర్వాజిరూపిభిః

తా॥ నారదుడిట్లనెను. “ఒకప్పుడు లోకములు పర్యటించుచు నేను సూర్య లోకమును చేరితిని. అచట దేవతలందఱిచే పరి పేష్టింపబడి విరాజమానుడైన సూర్య భగవానుని దర్శించితిని-1. అతడు గంధర్వులు అప్సరలు, నాగులు, యక్షులు, రాక్షసులు మున్నగువారితో చుట్టుముట్టబడియుండెను. గంధర్వులు గానములాలపించుచుండిరి. అప్సర స్త్రీలు నాట్యము చేయుచుండిరి-2. యక్షులు, రాక్షసులు, నాగులు సాయుధులై యాతని రక్షించుచుండిరి. ఋక్కులు, యజుస్సులు, సామములు మూర్తిమంతములై అంతటను విహరించుచుండెను. ఋషులు వేదత్రయ కృతస్తోత్రములతో సూర్య దేవుననేక విధములుగ కీర్తించుచుండిరి-3. ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలు మూడును మనోజ్ఞ వదనములతో నటనుండెను. వజ్రాయుధములు, బాణములు ధరించి సూర్యదేవునుద్వేష్టించి యుండెను-4. ఉదయ సంధ్య అరుణ వర్ణమునను, మధ్యాహ్న సంధ్య చంద్ర వర్ణమునను మూడవదగు సాయం సంధ్య మెట్ట తామర వన్నెగలిగియు లేక కుజ 'వర్ణముతో ప్రకాశించుచుండెను-5. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, ఇంకను ఇతర దేవతలు మూడు సంధ్యలలోను సూర్యుని పూజించుచుందురు-6. 'జయ' శబ్దమును వెలువరించుచు ఇంద్రుడచటనే ఉండును. శుక్రుడు, శివుడు మూడు సంధ్యలలో పూజించుచుందురు-7. దిన ప్రారంభమున సూర్య దేవుని పద్మాకారునిగను, మధ్యాహ్నమున చక్రరూపునిగను, పూజింపవలెను. ప్రకాశ స్వరూపుడగు నా దేవుని ఎల్లవేళల పూజింపవలేను-8. రాత్రి సమయమున విపులమైన కాంతిగలుగు నా దేవుని సపరివారముగ పూజింపవలెను. చంద్ర శేఖరుడాతని నెల్లవేళల భక్తితో పూజించుచుండును-9. గరుడుని యగ్రజుడగు అరుణుడు కాలావయవ నిర్మితమగు దివ్య సూర్య రథమును సారధియై నడిపించుచుండును-10. ఛందోరూపములగు ఏడు హరితాశ్వములు పూన్చబడిన ఆ రథమున కతడు సారధి-11.

మూII ద్వేభార్యే పార్శ్వ యోస్తస్య రాజ్జీ నిక్షుభ సంజ్ఞతా తథాన్యైర్నామభిర్దేవాః పరివార్య రవీం స్థితాః

పింగలో లేఖకస్తత్ర తథాన్యో దండనాయకః రాజాశ్రేషౌచద్వౌద్వారే స్థితా కల్మాష పక్షిణౌ

తతో వ్యోమ చతుఃశృంగం మేరోః సదృశ లక్షణమ్ దిండిస్తథాగ్రతస్తస్య దిక్షు చాన్యే స్థితాః సురాః

ఏవం సర్వగమం దేవం ప్రదీప్తం జగతి ద్విజ! బ్రహ్మాద్యైః సంస్తుతం దేవం గీర్వాణైః ఋషభోత్తమమ్

గ్రహేశం భువనేశాన మాదిత్యం శరణం వ్రజ!

సాంబ ఉవాచ :

తత్వతః శ్రోతుమిచ్ఛామి కథం సర్వగతో రవిః?

కతివా రశ్మయస్తస్య మూర్తయశ్చకతిస్మృతాః? కారాజ్జీ నిక్షుభా కాచ కశ్చాయం దండనాయకః?

పింగలశ్చాపికస్తత్ర? కించాసౌ లిఖతే సదా? రాజాశ్రేషాచ కౌతత్ర? కౌచ కల్మష పక్షిణౌ

కిందైవత్యం చతద్వ్యోమ మేరోః సదృశ లక్షణమ్ కోదిండి రగ్రతస్తత్ర? కోదేవా దిక్షుయే స్థితాః

తత్త్వతో నిగమైశ్చైవ విస్తరేణ వదస్వమామ్ యేనాహం తత్త్వతో జ్ఞాత్వా ప్రజామి శరణం ద్విజ!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే నారద సాంబసంవాదే సూర్యపరివార వర్ణనం నామ షట్ సప్తతి తమోఽధ్యాయః

 తా॥ సూర్యుని యిద్దఱు భార్యలగు రాజై, నిక్షుభ అనువారతనికి ఇరుప్రక్కల విరాజమానలై యుందురు. అటులే వేజ్వేజు నామములు గల దేవతలు అతననిని పరివేష్టించి యుందురు-12. పింగలుడచట లేఖకుడుగా నుండును. ఇంకొకడు దండనాయకుడుండును. రాజా శ్రేషులు అను చిత్రవర్ణ పక్షులు రెండు, రెండు ద్వారములకడ కాపలా కాయుచుండును-13. ఆ మందు మేరు పర్వతముతో సమానములైన నాలుగు కొమ్ములుగల వ్యోమముండును. దానికి ముందు భాగమున దిండి, ఇతర దిక్కులలో దేవతలుందురు-14. ఇట్లు సర్వగతుడు, జగత్రకాశకుడు, బ్రహ్మాదిదేవతలచే స్తుతింపబడువాడు, ఋషభోత్తముడు, గ్రహేశ్వరుడు, సకల భువనములకు ప్రభువు అయిన ఆదిత్యదేవుని శరణువేడుము”-15. సాంబుడిట్లనెను. Jమహరీ! సూర్యుడు సర్వగతుడెట్లు?-16. అతని కెన్ని రశ్ములు? ఎన్ని మూర్తులు గలవు? రాజై, నిక్షుభయనువారెవరు? ఈ దండనాయకుడెవరు?17. పింగలుడెవరు? అతడా సూర్యమండలమున నుండి ఎల్లప్పుడును ఏమి వ్రాయుచుండును? రాజాశ్రోషులెవరు? కల్మాష పక్షులెవరు?-18. మేరు సదృశ లక్షణముగల ఆవ్యోమము ఏ దేవతా స్వరూపము? ముందు భాగమున నుండు దిండి యెవరు? ఆయా దిక్కులలో నుండు దేవతలెవరు?-19. ఈ విషయములనన్నింటిని తత్త్వతః వినగోరుచున్నాను. తత్వ పరముగను, వేద పరముగను నాకీ యంశములను వివరించి చెప్పడు. తత్వము తెలిసికొని నేనా దేవ దేవుని శరణువేడెదను-20.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబో పాఖ్యానమున, నోరధ సాంబ సంవాదమునందు సూర్య పరివార వర్ణనమను డెబ్బది యాఱవ అధ్యాయము సమాప్తము.