75. శ్రీ కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుట

మూ॥ శతానీక ఉవాచ :

‘కథం సాంబః ప్రపన్నోఽ ర్కం కేనవా ప్రతిపాదితః ఉగ్రం శాపంచ తంప్రాప్య పితరం సకిముక్తవాన్:

సుమంతురువాచ :

ఉక్త మేవ పురావీర! యథాశప్తః సయాదవః పిత్రా సాంబో మహారాజ! హరిణాంబుజ ధారీణా

అథ శాపాభిభూతస్తు సాంబః పితర మబ్రవీత్ వినయావనతో భూత్వా ప్రాంజలిః శిరసొగతః

“కిం మయాపకృతం దేవ! యేన శప్తోస్మ్యహం త్వయా అహం త్వదాజ్ఞయా దేవ! త్వరమాణోత్ర ఆగతః

కస్మాన్ని పాతితః శాపో మయితే ఽనపకారిణీ నవై జానామ్యహం కించి త్ప్రసీద జగతః పతే

శాపం నియచ్ఛమేదేవ! ప్రసాదం కురుమేప్రభో! కశ్మలేనాభిభూతోఽహం యేన ముచ్యయ కిల్బిషాత్

తమువాచ తతః కృష్ణః సొంబంబుద్ధ్వాహ్య నాగసమ్ నాహం పుత్ర! పునఃశక్తో రోగస్యాస్యవ్యపోహనే

అస్యాయం జగతో నాథో ద్వాదశాత్మాదివాకరః సహస్ర రశ్మిరాదిత్యః శక్తః పుత్ర వ్యపోహితుమ్

జ్ఞాతం మయాదునాచైవ యథా త్వం నారదేనతు దోషాద్విసర్జితః పుత్ర! మత్సకాశం మహాత్మనా

తస్మాత్తమేవ పృచ్ఛత్వం ప్రసాద్య ఋషిసత్తమమ్ ఆఖ్యాస్యతి సతే దేవం శాపం యస్తే ఽపనేష్యతి

తా॥ శతానీకుడిట్లనేను “సాంబుడు సూర్యదేవునెట్లు శరణువేడెను. సూర్యు నారాధింపుమని యెవరు సూచించిరి? దారుణమైన ఆ శాపమును పొంది అతడు తన తండ్రితో నేమనెను?”-1. ఆ ప్రశ్నలు విని సుమంతుముని యిట్లు నుడివెను. “సాంబుడెట్లు శపింపబడెనో లోగడ వివరించితిని కదా! శ్వేత పద్మధరుడైన శ్రీ కృష్ణునిచే సాంబుడు శపింపబడిన మీదట-2. శాప తిరస్కృతుడైన ఆతడు తన తండ్రితో నిట్లనెను. వినయముతో వినమ్రుడై, అంజలి ఘటించి, శిరమువంచి నమస్కరించి-3. "తండ్రీ! నేను చేసిన యపరాధమేమి? ఎందులకు నన్ను శపించితిరి? నేను మీ ఆజ్ఞననుసరించియే త్వరపడుచునిటకేతెంచితిని-4. ఏ అపచారమును చేయని నా మీద మి ఉగ్రమైన శాపఘాతమేందుకు పడినది? ఓ జగత్పతీ! నా కేమియు తెలియదు. నన్ననుగ్రహింపుడు-5. దేవా! ప్రభో! నాపై దయజూపి శాపమునుపసంహరింపుడు. నా తప్పిదమేదియో తెలియకుండగనే శపింపబడినాను. ఈ పాపమునుండి నేనెట్లు ముక్తుడనగుదును?”-6. సాంబుని దోషములేని వానిగ గ్రహించి శ్రీ కృష్ణుడతనితో నిట్లనెను. “కుమారా! ఈ నీ రోగమును తొలగించుటకు నేను శక్తుడనుకాను-7, జగన్నాథుడు, ద్వాదశాత్ముడు, దివాకరుడు, సహస్రకిరణుడునైన సూర్య భగవానుడే నీ వ్యాధిని తొలగింపగల సమర్థుడు-8. నాకు వలెనే మహాత్ముడైన నారదునకు కూడ కోపము కలిగించి యతని చేత కూడా తిరస్కృతుడ నైతివని ఇప్పుడే నాకు తెలిసినది-9. కాబట్టి ఋషి సత్తముడైన ఆ నారద భగవానునే ప్రసన్నునిగ జేసికొని యా మహనీయునే అడుగుము. ఏ దేవుని యనుగ్రహము సంపాదించిన నీ శాపము తొలగునో ఆతడు నీకు చెప్పగలడు-10.

మూ॥ అథైతస్య పితుర్వాక్యం శ్రుత్వాజాంబవతీ సుతః దీనః శోక పరీతాత్మా తతః సంతింత్య భారత!

ద్వారవత్యాం స్థితం విష్ణుం కదాచిద్ద్రష్టు మాగతమ్ వినయాదుప సంగమ్య సాంబః పప్రచ్ఛనారదమ్

‘భగవన్వేధసః పుత్ర! సర్వలోకజ్ఞ! సువ్రత! ప్రసాదం కురుమే విప్ర! ప్రాణతస్య మహామతే!

యేనమే నీరుజం కాయం కశ్మలంచ ప్రణశ్యతి తం యోగం బ్రూహిమే విప్ర! ప్రణతస్యాస్య సువ్రత!

నారద ఉవాచ :

యః స్తుత్యః సర్వదేవానాం నమస్యః పూజ్య ఏవచ పూజయిత్వాశు తందేవం తతో వ్యాధిం ప్రహాస్యసి

సాంబ ఉవాచ :

“కం:స్తుత్యః సర్వదేవానాం నమస్యః పూజ్య ఏవచ? కః సర్వగశ్చ సర్వత్ర శరణం యం ప్రజామ్యహమ్?

పితృశాపానలేనాహం దహ్యమానో మహామునే! శాంత్యర్ధమస్య కం దేవం శరణంచ ప్రజామ్యహమ్?”

ఏతచ్చ్రుత్వాతు సాంబస్య వచనం కరుణావహమ్ హిత్వాతు కామజం వీర! నారదో వాక్యమబ్రరీత్

స్తుత్యో వంద్యశ్చ పూజ్యశ్చ నమస్య ఈడ్య ఏవచ భాస్కరో యదుశార్దూల! బ్రహ్మాదీనాం సదానఘ!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి సాంబోపాఖ్యానే సాంబం ప్రతి కృష్ణశా పే సాంబస్య నారదోప సంగమన వర్ణనం నామ పంచ సప్తతితమోఽధ్యాయః

తా॥ జాంబవతీసుతుడైన సాంబుడు తన తండ్రి మాటలు విని శోక మనస్కతతో దీనుడై బాగుగా ఆలోచించి-11. ద్వారకలోనున్న విష్ణుదేవుని దర్శించుటకై ఏనాడో వచ్చియుండిన నారదుని సమీపించి వినయముతో నిట్లు ప్రశ్నించెను–12. “భగవన్! బ్రహ్మ మానస పుత్రా! సర్వలోకజ్ఞా! నాపై దయచూపుడు. భక్తితో ప్రణమిల్లు నీ దీనునియెడ ప్రసన్నులుకండు-13. ఈ నా శరీరమునందలి వ్యాధి, మనస్సునందలి అజ్ఞానము తొలగింపగల యోగమునుపదేశింపుడు. ఆర్తుడనై నమస్కరించుచున్న నన్నను గ్రహింపుడు”-14. సాంబుని దీనాలాపములు విని నారదుడిట్లనెను. “సాంబా! దేవత లందఱికిని పూజ్యుడు, నమస్యుడు, స్తుత్యుడునయిన ఆ దేవుని పూజించినచో నీ రోగమునుండి ముక్తుడవు కాగలవు”-15. సాంబుడిట్లనెను. “ఋషివర్యా! సర్వ దేవతలకును పూజ్యుడు, నమస్యుడు, సుతుండున 6.6 దేవుడెవరు? నేను సగాను నా నగలుషాంగదగిన పరాంతుడెవరు? ఈ అగ్ని చల్లారుటకు నేనే దేవుని శరణు పొందవలెను?. జాలి గొలి పెడి సాంబుని ఈ వ్యాక్యములు విని నారదుడు కోపమును వీడి ఇట్లు పలికెను-18. “యదుశార్దూలా! స్తుతింపదగినవాడు, పూజింపదగినవాడు, వందనమాచరంప దగినవాడు, నమస్కరింపదగినవాడు, ప్రార్థింపదగినవాడు, బ్రహ్మాది దేవతల కందఱికిని ఆరాధ్య దేవత ఎల్లవేళల యందును ఆ సూర్య భగవానుడొక్కడే!”-19.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున, సాంబోపాఖ్యానమున కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుటయను డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.