భవిష్య మహా పురాణము
74. సూర్య ద్వాదశ మూర్తి వర్ణనము
మూ॥ శతానీక ఉవాచ :
స్థాపితో యది సాంబేన సూర్యశ్చంద్ర సరిత్తటే తస్మాన్నాద్య మిదం స్థానం యథేతద్భాషతే భవాన్
సుమంతురువాచ :
ఆద్యం స్థానమిదం భానో: పశ్చాతాంబేన భారత! విస్తరేణాస్య చాదస్య కథ్యమానం నిబోధమే
అత్రాద్యౌలోకనాథోఽ సౌ రశ్మిమాలీ జగత్పతి: మిత్రత్వేచస్థితో దేవస్తపస్తే పే పురానృష!
అనాది నిధనో బ్రహ్మా నిత్యశ్చాక్షయ ఏవచ సృష్ట్వా ప్రజాపతీన్చ్ర హ్మాసృష్టాచ వివిధాః ప్రజాః
ససర్జ ముఖతో దేవం పూర్వ మంబుజ సన్నిభమ్ కంజజస్తం తతోదేవం వక్షస్తో నిర్మమే నృప!
లలాటాత్కురుశార్దూల! నీరజాక్షం దిగంబరమ్ ఋభవః పాదతః సర్వే సృష్టాస్తేన మహాత్మనా
తతః శత సహస్రాంశు రవ్యక్తః పురుషః స్వయమ్ కృత్వాద్వాదశధాత్మానమాదిత్యా ముద పద్యత
ఇంద్రో ధాతాచ పర్జన్యః పూషాత్వష్టార్యమా భగః వివస్వానంశుర్విష్ణుశ్చ వరుణో మిత్ర ఏవచ.
ఏభిర్ద్వా దశభిస్తేన ఆదిత్యేన మహాత్మనా కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తీభిస్తునరాధిప!
తస్య యా ప్రథమా మూర్తి రాదిత్య స్యేంద్ర సంజ్ఞతా స్థితాసాదేవరాజత్వే దానవాసురనాశినీ
తా॥ శతానీకుడిట్లనెను. “చంద్రభాగానదీ తటమున సాంబుడొకవేళ సూర్య భగవానుని స్థాపించియున్నను అది ఆది కాలమునుండి లేదు కదా! కాని మిరది మొదటిస్థానముగా పేర్కొనుచున్నారు” శతానీకుని యీ సందేహము తీర్చుచు సుమంతుముని యిట్లనెను. “అది సూర్య భగవానుని ఆద్య స్థానమే. సాంబుడా స్థానమునందు తరువాతి కాలమున సూర్య మూర్తిని ప్రతిష్ఠించెను. ఆ విషయములు విస్తరించి చెప్పెదను. వినుము-2. ఆద్యుడు, లోకనాథుడు, జగత్పతియైన సూర్యుడిచ్చట పూర్వ కాలమున తన 'మిత్ర' రూపమున నుండి తపస్సు చేసెను-3. ఆనాది నిధనుడు, నిత్యుడు, అక్షయుడు, బ్రహ్మయు, స్రష్టయునైన సూర్యదేవుడు మొదట ప్రజాపతులను, ఆ పిదప వివిధ ప్రాణులను సృష్టించెను -4. అతడు పూర్వము తన ముఖము నుండి అంబుజ సన్నిభుడైన దేవుని సృష్టించేను. 'అతడు బ్రహ్మ, తరువాత వక్షఃస్థలము నుండి ఒక దేవుని సృజించెను. అతడు విష్ణువు-5. ఫాల భాగము నుండి తామరలవంటి కన్నులు గల శివుని సృజించెను. పాదతలము నుండి దేవతలందఱును ఆ మహాత్మునిచే సృష్టింపబడిరి-6. అప్పుడు అనంత సంఖ్యాకములగు తేజః కిరణములతో నొప్పుచున్న ఆ అవ్యక్త పురుషుడు తనను ద్వాదశాదిత్యులుగ నవతరించెను-7. ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు-8. ఆదిత్యుడీ తన పన్నెండు రూపములచేత 'ఈ సర్వ జగత్తునందు వ్యాపించెను-9. అతనీ మొదటి మూర్తియగు నింద్ర సంజ్ఞుడు దేవ రాజ పదవి నంలంకరించి రాక్షస సంహార మొనర్చుచుండెను.
మూ॥ ద్వితీయాచాస్య యామూర్తి ర్నామ్నాధాతేతి కీర్తితా స్థితా ప్రజా పతిత్వేసా విధాత్రీ సృజతే ప్రజాః
తృతీయాత్వస్య యా మూర్తిః పర్జన్య ఇతి విశ్రుతా కరే ష్వేవ స్థితి సాతు వర్షత్యమృత మేవహి
చతుర్ధి తస్యయామూర్తిర్నామ్నా పూషేతి విశ్రుతా మంత్రేష్వవస్థితా సాతు ప్రజాః పుష్ణాతి భారత!
మూర్తిర్యా పంచమి తస్య నామ్నా త్వష్టేతి విశ్రుతా వనస్పతిషు సానిత్య మోషధీషు చ వై స్థితా
షష్ఠీ మూర్తి స్తుయాతస్య అర్యమేతిచ విశ్రుతా ప్రజా సంవరణార్థం సా పురే ష్వేవ స్థితాసదా
భానోర్యా సప్తమి మూర్తిర్నామ్నా భగఇతి స్మృతా భూమౌవ్యవస్థితా సాతు క్ష్మాధరేషుచ భారత!
అష్టమి చాస్య యా మూర్తి ర్వివస్వానితి సంజ్ఞితా అగ్నౌ వ్యవస్థితా సాతు పచతే న్నం శరీరిణామ్
నవమి చిత్రభానోర్యా మూర్తి రంశురితి స్మృతా వీర! చంద్రే స్థితా సాతు ఆప్యాయయతి వై జగత్
మూర్తిర్యాదశమి తస్య విష్ణు రిత్యభిధీయతే ప్రాదుర్భవతి సానిత్యం గీర్వాణారి వినాశినీ
మూర్తి స్త్వేకాదశీ యాతు భానోర్వరుణ సంజ్ఞతా జీవాయయతి సాకృత్నం జగద్ధి సముపాశ్రితా
అపాంస్థానం సముద్రస్తు వరుణ్. త్రప్రతిష్ఠితః తస్మాద్వై ప్రోచ్యతే వీర! సాగరో వరుణాలయః
మూర్తిర్యాద్వాదశీ భానోర్నామతో మిత్ర సంజ్ఞితా లోకానాం సాహితార్థంతు స్థితా చంద్రసరిత్తటే
తా॥ ఆదిత్యుని రెండవ మూర్తియగు ధాత ప్రజాపతిత్వమున నుండి ప్రాణి సృష్టి చేయుచుండెను-11. పర్జన్య నామమున బరుగు నాతని మూడవ స్వరూపము . కిరణములందే యుండి అమృతమును వర్షించుచుండును-12. పూషుడును పేరనుండు నాల్గవ మూర్తి మంత్రము లందుండి ప్రజలను పోషించు చుండును-13. ఆతని ఐదవ రూపమగు త్వష్ట వనస్పతులయందు, ఓషధులయందును సదా నివసించుచుండును-14. అర్యముడుగా ప్రసిద్ధినందిన యాతని యాఱవ మూర్తి ప్రజలనావరించి యుండుటకై పురములందుండును-15. భగుడను ఏడవ మూర్తి భూమి యందు పర్వతములందు నివసింపుచుండును-16. వివస్వంతుడను సంజ్ఞగల ఎనిమిదవ రూపము అగ్నియందు వ్యవస్థితమైయుండి శరీరధారుల ఆహారము వచనము - చేయుచుండును-17. సూర్య భగవానుని తొమ్మిదవ మూర్తియగు అంశుమంతుడు చంద్రుని యందువసించుచు జనులను ఆహ్లాదింప జేయుచు వారికి తృప్తినిచ్చుచుండును-18. విష్ణువనెడు పదవమూర్తి నిత్యమావిర్భవించుచు రాక్షసులను సంహరించుచుండును-19. పదునొకండవ మూర్తియగు వరుణుడు జగత్తునాశ్రయించి సమృద్దిగ జలమునిచ్చుచుండును-20. నీటికి స్థానము సముద్రము. వరుణుడీదటనే నివసించియుండును. కావుననే సముద్రమును వరుణాలయమని చెప్పుదురు-21. మిత్ర సంజ్ఞగల పన్నెండవ మూర్తి లోకహితార్థమై చంద్రభాగా నదీ తటమునందు నివసించుచుండును.
మూ॥ వాయు భక్షా తపస్తే పే యుక్తామైత్రేణ చక్షుషా అనుగృష్ణన్సదా భక్త స్వరైర్నానా విధైః సదా
ఏవ మాద్యమిదం స్థానం పుణ్యం మిత్ర పదం స్మృతమ్ తత్ర మిత్రః స్థితో యస్మాత్తస్మాన్మిత్రపదం స్మృతమ్
తమారాధ్య మహాబాహో! సాంబేనామిత తేజసా తత్ప్రసాదాత్త దారేశా త్ప్రతిష్టా తస్యవై కృతా
ఆభిర్ద్వా దశభిస్తేన భాస్కరేణ మహాత్మనా కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిస్తునరాధిప!
తస్మాద్వంద్యో నమస్యశ్చ ద్వాదశస్వాపి మూర్తిషు యే నమస్యంతి చాదిత్యం నరా భక్తి సమన్వితాః
తే యాస్యంతి పరంస్థానం తిష్ఠేద్య త్రాంబుజేశ్వరః ఇత్యేవం ద్వాదశాత్మాన మాదిత్యం పూజయేత్తుయః
స ముక్తః సర్వ పాపేభ్యో యాతి హేలి సలోకతామ్
ఇతి శ్రీ భవి ష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి
సప్తమి కల్పే సూర్య ద్వాదశ మూర్తి వర్ణనం నామ చతుః సప్తతితమోఽధ్యాయః
తా॥ ఇచట నాదిత్యుడు మిత్ర రూపమున నుండి వాయుభక్షణ మాత్రము చేయుచు తపమాచరించేను. ఆతడు భక్తుల ననుగ్రహించుచు నానా విధములగు వరములిచ్చుచు నెల్లప్పుడీ స్థలమున వసించుచుండును-23. పుణ్య ప్రదమైన ఈ స్థానమిట్లు సూర్యుని కాద్యము. దీనిని మిత్ర పదమని యందురు. ఇచ్చట మిత్ర నామముతో నాదిత్యుడు నివసించుచుండుటచే మిత్ర పదమని చెప్పబడెను-24. సాంబుడీ ప్రదేశముననే సూర్యు నారాధించి యాతని యనుగ్రహమునకు పాత్రుడై ఆతని యాదేశముచేతనే ఇచట సూర్య ప్రతిష్ట చేసేను-25. తన ఈ పన్నండు మూర్తులతో సూర్య భగవానుడు జగత్తునందంతటను వ్యాపించి యుండును-26. అందువలన నీ ద్వాదశాదిత్య మూర్తులును ననుసరింపదగినవి. పూజింపదగినవి. భక్తి సమన్వితులై ఆదిత్య దేవునికి నమస్కరించువారు-27. పరమ స్థానమగు నతని లోకమునే చేరుకొందురు. ఇట్లు ద్వాదశాదిత్యులను పూజించువాడు-28. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్య లోకమునకు బోవును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు సూర్య ద్వాదశమూర్తీ వర్ణనమను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 74 of the Bhavishya Mahā Purana is as follows:
Sūrya, as part of his teaching to Sāmba, reveals the twelve Ādityas — the twelve aspects of his divine form — and their respective functions in the maintenance of the cosmos. Dhātā establishes and sustains the created order; Aryamā oversees ancestral rites and the ancestral world; Mitra governs contracts, friendship, and mutual obligation; Varuṇa presides over the cosmic waters and the moral order; Indra commands the celestial armies; Vivasvān makes all things visible; Pūṣā nourishes all living beings and guides souls on the path after death; Parjanya brings rain; Aṃśu distributes solar energy through rays; Bhaga bestows prosperity and good fortune; Tvaṣṭā is the divine craftsman who shapes forms; and Viṣṇu pervades all with his three strides. Together they constitute the complete expression of Sūrya's divine governance.