72. దూర్వాస మహర్షి సాంబునకు శాపమిచ్చుట వర్ణనము

మూ॥ సుమంతురువాచ :

ఇత్థం బ్రహ్మవచో యోగీ శ్రుత్వా రాజన్! దివాకరమ్ వ్యోమ రూపం సమారాధ్య గతః సూర్య సలోకతామ్

తథా త్వమపి రాజేంద్ర! పూజయిత్వా విభావసుమ్ గమిష్యసి పరం స్థానం దేవానామపి దుర్లభమ్

శతానీక ఉవాచ :

ఆద్యం స్థానం రవేః కుత్ర జంబూద్వీపే మహామునే! యత్ర పూజాం విధానోక్తాం ప్రతి గృహ్ణాత్య సౌ రవిః

సుమంతురువాచ :

స్థానానీ త్రీణి దేవస్య ద్వీపేఽస్మిన్భాస్కరస్యతు పూర్వ మీంద్రవనం నామ తథా ముండీర ముచ్యతే

కాల ప్రియం తృతీయంతు త్రిషులోకేషు విశ్రుతమ్ తధాన్యదపితేవచ్మి యత్పురా బ్రహ్మణోదితమ్

చంద్రభాగాతటే నామ్నా పురం యత్సాంబసంజ్ఞతమ్ ద్వీపేఽస్మిన్ శాశ్వతం స్థానం యత్ర సూర్యస్యనిత్యతా

ప్రీత్యా సాంబస్య తత్రార్కో జనస్యాను గ్రహాయచ తత్ర ద్వా దశ భాగేన మిత్రో మైత్రేణ చక్షుషా

అవలోకన్ జగత్సర్వం శ్రేయోర్థం తిష్ఠతే సదా ప్రయుక్తాం విధివత్పూజాం గృహ్ణాతి భగవాన్వయమ్

శతానీక ఉవాచ :

కోయం సాంబః సుతః కస్య కస్యప్రీతో దివాకరః యస్య చాయం సహస్రాంశు ర్వరదః పుణ్యకర్మణః

 సుమంతురువాచ :

య ఏతే ద్వాదశాదిత్యా విరాజంతే మహాబలాః తేషాం యో విష్ణు సంజ్ఞస్తు సర్వలోకేషు విశ్రుతః

తా॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! ఇట్లు బ్రహ్మదేవుడు చెప్పిన విషయములు విని యాజ్ఞవల్క్యుడు వ్యోమ రూపుడైన దివాకరు నారాధించి సూర్యలోకమునకుఁబోయెను-1. నీవు కూడా ఆ దేవ దేవుని పూజించినచో దేవతలకు కూడా లభ్యముకాని ఉత్తమ స్థానమునకుఁబోయెదవు”-2. అది విని శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! జంబూద్వీపము నందు సూర్య దేవుడుండెడి. మొదటి స్థానమేది? ఈతడు ఎచ్చట నివసించుచు విధి విధానముగ నాచరింపబడు పూజలను స్వీకరించును?”-3. సుమంతుమని యిట్లునుడివెను. “ఈ ద్వీపమున సూర్యదేవునకు మూడు స్థానములు గలవు. మొదటిది ఇంద్రవనము, రెండవది ముండీరము-4. మూడవది కాలప్రియము. ఇది ముల్లోకముల యందును ప్రసిద్ధమైనది. పూర్వము బ్రహ్మదేవుడు చెప్పిన మఱియొక స్థానము కూడ కలదు. దానిని గూర్చి కూడ చెప్పుచున్నాను.-5. చంద్రభాగా నదీ తీరమున సాంబపురమని యొక పురముగలదు. ఇదియే ఈ ద్వీపమునందు సూర్య దేవుని శాశ్వత స్థానము. అతడక్కడ సదావసియించి యుండును-6. జనులననుగ్రహించుట కొఱకు సూర్య భగవానుడీ సాంబుని పట్టణమున పన్నెండు భాగములుగననుగ్రహ దృష్టితో వాసము చేయుచుండును-7. జగచ్చైయస్సు నిమిత్తము, అంతటను అవలోకించుచు నిచట నెల్లప్పుడును నివసించుచుండును. ఆ భగవానుడు స్వయముగనే విధ్యుక్త పూజలను స్వీకరించు చుండును”-8. శతానీకుడిట్లనెను "మునివర్యా! ఈ సాంబుడెవరు? ఎవరి కుమారుడు? సూర్య భగవానుడు ఎవరి యెడ ప్రీతుడై అచట నివసించుచున్నాడు? ఎవరి పుణ్య కర్మలకు తుష్టిఁజెంది వరదుడయ్యెను?”-9. ఆ ప్రశ్నలు విని సుమంతుముని యిట్లు పలికెను. “మహా బలశాలురైన పన్నెండుగురాదిత్యులలో విష్ణువను పేరగల ఆదిత్యుడు సర్వ లోక ప్రసిద్ధుడయ్యెను-10.

మూ॥ ఇహా సౌ వాసుదేవత్వ మవాప భగవాన్వీభుః తస్మాత్సాంబః సుతోజజ్ఞే జాంబవత్యాం మహాబలః

సతుపిత్రా భృశం శక్తః కుష్ఠ రోగ మవాప్తవాన్ తేనియం స్థాపితః సూర్యః స్వనామ్నాచపురం కృతమ్

శతానీక ఉవాచ :

“శప్తః కస్మిన్నిమిత్తేఽసౌ పిత్రాచై వాత్మసంభవః నాల్పం హి కారణం విప్ర! యేనా సౌశప్తవాన్సుతమ్”

 సుమంతురువాచ :

శృణుష్వావహితో రాజంస్తస్య యచ్ఛాపకారణమ్ దుర్వాసానామ భగవానుద్రస్యాంశ సముద్భవః

అటమానః స భగవాం స్త్రీ న్లో కాన్ప్రచచార హ అధప్రాప్తో ద్వారవతీం మధు సంజ్ఞో చితాం పురా

తమాగత మృషిం దృష్ట్వా సాంబో రూపేణ గర్వితః పింగాక్షం క్షుధితం రూక్షం విరూపం సుకృశం తథా

అనుకారాస్పదం చక్రే దర్శనే గమనే తథా దృష్ట్వా తస్య ముఖం సొంబో వక్రం చక్రే తథాత్మనః

ముఖం కురుకులశ్రేష్ఠ! గర్వితో యౌవనేనతు అథక్రుదోమహాతేజా దుర్వాసా ఋషిసత్తమః

సాంబంచో వాచ భగవన్విధువ్వన్ముఖమాత్మనః యస్మాద్విరూపం మాం దృష్ట్వా స్మాత్మరూపేణ గర్వితః

గమనే దర్శనే మహ్యమనుకారం సమాచరః తస్మాత్తు కుష్ఠ రోగిత్వమచిరాత్త్వం గమిష్యసి

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి

సప్తమి కల్పే సాంబాయ దుర్వాససా శాపవిసర్జనం నామ ద్విసప్తతి తమోఽధ్యాయః

తా॥ భగవానుడు, జగత్ర్ప భువునైన యాతడు ఈ లోకమున వాసుదేవ నామమును పొందెను. అతని వలన జాంబవతియందు మహాబలుడైన సాంబుడను కుమారుడు జన్మించెను-11. అతడు తన తండ్రియగు శ్రీ కృష్ణునిచేత శపింపబడీ కుష్ఠరోగ గ్రస్తుడయ్యెను. అతని చేతనే సూర్యమూర్తి స్థాపింపబడెను. తన పేరుతో నతడు పురమును కూడ నిర్మించేను”-12. శతానీకుడిట్లనెను. “తన కుమారుడేయయిన సాంబుని కృష్ణుడే కారణమున శపించెను? కొడుకును శపించినాడనినచో నది అల్పకారణమై యుండదు”-13. సుమంతుముని యిట్లనెను. “రాజా! శాపకారణమును చెప్పుచున్నాను. శ్రద్దగా వినుము. పూర్వము రుద్రాంశ సంభూతుడగు దుర్వాసమహాముని-14. ముల్లోకములు తిరుగుచు మధు సంజ్ఞ గల ద్వారవతికేతెంచెను-15, గోరోజనము వర్ణముగల కన్నులుగలవాడు, ఆకలి గొనియున్నవాడు, తీక్షమైనవాడు, వికృతమైన రూపముగలవాడు, కృశించిన వాడునైన ఆ దుర్వాస మహర్షి వచ్చుచుండుగా రూప గర్వితుడైన సాంబుడు చూచి-16. పరిహాస పూర్వకముగనతని చూపులను నడకను అనుకరింపసాగెను అతనిముఖమును చూచి తన ముఖమును కూడ అతని ముఖమునలే నీకుతేను చేసినడువసాగెను -17 యావన పొంగగంగుతో కంగరించు తనను వెక్కిరించుచున్న సాంబుని మహాతేజస్వి, ఋషిసత్తముడైన దుర్వాసుడు గమనించి క్రుద్ధుడయ్యెను-18. ముఖమును కోపముతో విదలించుచు దూర్వాస భగవానుడు సాంబునుద్దేశించి యిట్లనెను. “సాంబా! నీ సుందర రూపమును చూచుకొని నా వికృత రూపమును-19. పరిహసించుచు నా చూపును, నడకను అనుకరించుచుంటివి కావున నీవతి శ్రీఘ్రముగనే కుష్ఠ రోగ పీడితుడవయ్యెదవు” అని శపించెను-20.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు దూర్వాస మహర్షి సాంబునకు శాపమిచ్చుటయను డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.