భవిష్య మహా పురాణము
71. బ్రహ్మ ప్రోక్తమగు సూర్యనామ వర్ణనము
మూ॥ బ్రహ్మోవాచ :
నామభిః సంస్తుతో దేవో యైరర్కః పరితుష్యతి తాని తే కీర్తయామ్యేష యథావదను పూర్వశః
నమః సూర్యాయ నిత్యాయ రవయే కార్యభానవే భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మిమాలినే దివాకరాయ దీప్తాయ అగ్నియే మిహిరాయచ
ప్రభాకరాయ మిత్రాయ నమస్తే ఽదితి సంభవ! నమో గోపతయే నిత్యం దిశాంచ పతయేనమః
నమోధాత్రే విధాత్రేచ అర్యమ్ణే వరుణాయచ పూష్ణే భగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః
నమో హిత కృతే నిత్యం ధర్మాయ తపనాయచ హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయేనమః
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే నమస్తే సప్తలోకేశ! నమస్తే సప్తసప్తయే
ఏక స్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయచ జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణభృతే నమః
హితాయ సర్వభూతానాం శివాయార్తి హరాయచ నమః పద్మ ప్రబోధాయ నమోదేవాది మూర్తయే
కాధిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయచ భీమజాయ నమస్తుభ్యం పాపకాయచ వైనమః
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్యద! నమోస్త్వదితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “సూర్య దేవుడే నామములతో తనను స్తోత్రము చేసిన సంతుష్టినొందునో వానిని మొదటి నుండీ క్రమముగా కీర్తించుచున్నాను. 'ఓం సూర్యాయ నమః, నిత్యాయనమః, రవయే నమః, కార్యభానవేనమః, భాస్కరాయనమః, మతంగాయనమః, మార్తాండాయ నమః, వివస్వతే నమః-2. ఆదిత్యాయ నమః, ఆది దేహాయ నమః, రశ్మిమాలినే నమః, దివాకరాయనమః, దీప్తాయ నమః, అగ్నియే నమః, మిహిరాయ నమః-3. ప్రభాకరాయ నమః, మిత్రాయ నమః, అదితి సంభవాయ నమః, గోపతయే నమః దిశాంపతయే నమః-4.. ధాత్రే నమః, విధాత్రే నమః, అర్యమే నమః, వరుణాయ నమః, పూ షే నమః, భగాయ నమః, మిత్రాయ నమః, పర్జన్యాయ నమః, అంశవే నమః-5. హితకృతే నమః, ధర్మాయ నమః, తపనాయ నమః, హరయే నమః, హరితాశ్వాయ నమః, విశ్వస్య పతయే నమః-6. విష్ణవే నమః, బ్రహ్మణే నమః, త్ర్యంబకాయ నమః, ఆత్మనే నమః , సప్తలోకేశాయ నమః, సప్త సప్తయే నమః-7. ఏక స్మై నమః, తుభ్యం నమః, , ఏకచక్ర రధాయ నమః, జ్యోతిషాంపతయే నమః, సర్వ ప్రాణ భృతే నమః-8. సర్వ భూత హితాయ నమః, శివాయ నమః, ఆర్తి హరాయ నమః, పద్మప్రబోధాయ నమః, వేదాది మూర్తయే నమః-9. కాధిజాయ నమః, తారా సుతాయ నమః, భీమ జాయ నమః, పావకాయ నమః-10, ధిషణాయ నమః, కృష్ణాయ నమః, నిత్యదాయ నమః, ఆదిత్య పుత్రాయ నమః, లక్ష్యాయ నమః.
మూ॥ ఏతాన్యాదిత్య నామాని మయా ప్రోక్తాని వైపురా ఆరాధనాయదేవస్య సర్వకామేన సువ్రత!
సాయంప్రాతః శుచిర్భూత్వా యః పఠేత్సు సమాహితః సప్రాప్నోత్యఖిలాన్కామాన్యథాహం ప్రాప్తవాన్పురా
ప్రసాదాత్తస్య దేవస్య భాస్కరస్య మహాత్మనః శ్రీ కామః శ్రియ మాప్నోతి ధర్మార్థీ ధర్మమాప్నుయాత్
ఆతురో ముచ్యతే రోగాద్భద్ధో ముచేత బంధనాత్ రాజ్యార్థీ రాజ్యమాప్నోతి కామార్థీ కామమాప్నుయాత్
ఏతజ్ఞప్యం రహస్యంచ సంధ్యోపాసన మేవచ ఏతేన జప మాత్రేణ నరః పాపాత్ప్రముచ్యతే
ఇతి శ్రీ భవి ష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి సప్తమి కల్పే బ్రహ్మ ప్రోక్త సూర్యనామ వర్ణనం నామైక సప్తతి తమోఽధ్యాయః
తా॥ఈ సూర్య నామములను సర్వ కాముడనైన నేను సూర్య దేవుని ఆరాధనము కొఱకు పూర్వము చెప్పియుంటిని-12. ఈ నామములను ప్రాతస్సోయం సమయములందు శుచియై ఏకాగ్ర మనస్కుడై పఠించువాడు, నేను పూర్వము నా కోరికలన్నింటిని బడసినట్లు సఫలమనో రధుడగును-13. మహాత్ముడైన భాస్కర దేవుని ప్రసాదమువలన ధనమును కోరువాడు ధనమును పొందును. ధర్మము కావలసినవాడుధర్మమును పొందును-14. వ్యాధితో బాధపడువాడు ఆరోగ్యవంతుడగును. బదుడు బంధ ముక్తుడగును. రాజ్యము కోరువాడు రాజ్యమును పొందును. కామార్థి కామమును పొందును-15. ఈ సొమావళిని రహస్యముగ జపింపవలెను. ఇది సంధ్యో పొసనమే యగుచున్నది. దీనిని జపించిన మాత్రమున మనుష్యుడు పాపము నుండి ముక్తుడగును-16.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పము నందు బ్రహ్మ ప్రోక్తమగు సూర్య నామ వర్ణనమను డెబ్బది యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 71 of the Bhavishya Mahā Purana is as follows:
Brahma proclaims the one thousand and eight names of Sūrya Bhagavān — the Sūrya Sahasranāma — and the specific powers of each name. The chapter is structured around twelve groups of names, each group corresponding to one of the twelve months and one of the twelve Āditya-forms. Key names and their meanings are explained: Āditya (son of Aditi, the infinite), Sūrya (self-luminous), Bhāskara (maker of light), Ravi (praised by all), Arka (deserving worship), Mārtāṇḍa (born from a dead egg, reviving creation). The chapter declares that the devotee who recites these names daily — especially at dawn while facing the rising sun — obtains the cumulative benefits of all the individual saptamī vratas described in this kalpa.