భవిష్య మహా పురాణము
70. సర్షప సప్తమి వర్ణనము
బ్రహ్మోవాచ :
మూ॥ తతో మధ్యాహ్నసమయే స్నాతః ప్రయతమానసః తథైవ దేవాన్విధివ త్పూజయిత్వా యథాసుఖమ్
సమ్యకృత జపో మౌనీ నరో హుత హుతాశనః నిష్ర్కమ్యదేవాయతనాద్భోజనోజయేత్తత
తథా పురాణ విదుష ఇతిహాస విదో ద్విజాన్ తథా వేద విదశ్చైవ దివ్యాన్భౌమాంశ్చ సువ్రత!
రక్తాని వస్త్రాణి తథాచగావః సుగంధమాల్యాది హ విష్యమన్నమ్
పయస్వినీ చోప్యథభోజకాయ దెయాతధాన్యత్ప్రియమాత్మనోయత్
భవేదలాభోయది భోజకానాం విప్రాస్తదార్హంతి జయోపజీవినః
యేమంత్ర విద్బ్రాహ్మణ పాఠకాశ్చ యేయేఽపి సామాధ్యయనేషు యుక్తా:
ప్రథమం భోజకాభోజ్యాః పురాణ వీదు షైః సహ తేషామృతే మంత్ర విదస్తథా వేదవిదో ద్విజాః
కృత్వైవం సప్తమీ సప్త నరోభక్త్యా సమన్వితః శ్రద్దధానోఽనసూయశ్చ అనంతం ప్రాప్నుయాత్సుఖమ్
దశానా మశ్వమేధానం కృతానాం యత్ఫలం లభేత్ తత్ఫలం సప్తమీ సప్తకృత్వా ప్రాప్నోత్ని మానవః
దుష్ప్రాపం నాస్తి తల్లోకే అనయా యన్న లభ్యతే న చ రోగోస్త్యసౌ లోకే ఏనయా యో న శామ్యతి
కుషాని చాపి సర్వాణి దురుచ్ఛేద్యాన్యపిధ్రువమ్ అపయాంతి యథానాగా గరుడస్యభయార్దితాః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “అప్పుడు మధ్యాహ్న సమయమున స్నానమాచరించి, పరిశుద్దమనస్కుడై యథావిధిగ దేవతలను పూజించి, సుఖాసీనుడై-1. చక్కగా, మౌనముగా జపముచేసి, అగ్నిహోత్రునకాహుతులిచ్చి, దేవాలయమునుండి వెడలి భోజకులకు భోజనము లేర్పాటుచేయవలెను-2. పౌరాణికులు, ఇతిహాస విదులు, వేదవిత్తములైన బ్రాహ్మణులనందజీని భుజింపజేయవలేను-3. ఎఱ్ఱని వస్త్రములు, ఆవులు, సుగంధపుష్పాదులు, నేయితో గూడిన అన్నము, పాడియావు, ఇంకను తనకు ప్రియమైన వస్తువు భోజకునకు ఈయవలెను-4. భోజకులు దొరకని పక్షమున పౌరాణికులకు, వారును లభింపని యెడల బ్రాహ్మణ వేదమంత్ర పాఠకులకు లేక సామవేద పాఠకులకు పూర్వము సూచింపబడిన వస్తువుల నీయవలెను-5. భోజన విషయమునను మొదట భోజకులు, పౌరాణికులు, వారుకాక మంత్ర విదులు, వేదవేత్తలు అనుక్రమమున వారిని భుజింపజేయవలెను-6. భక్తి సమన్వితుడై మానవుడిట్లు ఏడు సప్తమీవ్రతములను శ్రద్దాయుక్తుడు, అనసూయుడునై నిర్వర్తించిన యెడల అనంత సుఖమును పొందును-7. పది అశ్వమేధ యాగములు చేసిన ఫలమును ఏడు సప్తమీ వ్రతములను చేసిన మానవుడు పొందును-8. ఈ లోకమున నీవ్రతాచరణమున లభింపజాలని దుప్రాప్యమైన ఫలమేదియును లేదు. ఈ వ్రతముచే శాంతింపని రోగములీలోకమున నేవియులేవు-9. అన్ని విధములైన కుష్టు వ్యాధులు, తగ్గవనుకొనబడు మొండి వ్యాధులుకూడ, గరుడుని భయముతో సర్పములు పారిపోయినట్లు నిశ్చయముగ రోగిని విడిచి పారిపోవును-10. మూ॥ ప్రతనియమతపోభిః సప్తమీ సప్త ఏవం విధివదేహహి కృత్వా మానవో ధర్మశీలః
శ్రుతధన సుత భాగ్యారోగ్య పుణ్యైరు పేతో వ్రజతి తదనులోకం శాశ్వతం తిగ్మరశ్మేః
ఇయం వీధిం ద్విజశ్రేష్ఠ! శ్రుత్వాకృత్వాచమానవః సహస్ర రశ్మిం సవిశేన్నాత్ర కార్యావిచారణా
సురైర్వా మునిభిర్వాకీ పురాణజ్ఞైరిదంశ్రుతమ్ సర్వేతే పరమాత్మానం పూజయంతి దివాకరమ్
ఇద మాఖ్యాన మార్షేయం యన్మయాభిహితం తవ సూర్యభక్తాయ దాతవ్యం నేతరాయ కదాచన
యశ్చైతచ్చ్రా వయేన్నిత్యం యశ్చైతచ్ఛృణుయాన్నరః స సహస్రార్చిషం దేవం ప్రవిశేన్నాత్ర సంశయః
ముచ్యేదార్తస్తథారోగాచ్చ్రుత్వే మామాదితః కథామ్ జిజ్ఞాసుర్లభతే కామాన్భక్తః సూర్యగతంలభేత్
క్షేమేణ గచ్ఛతే ఽధ్వానం యస్విదం పఠతే ధ్వని యోయం ప్రార్థయతే కామం సతంప్రాప్నోతిచ ధ్రువమ్
ఏకాంత భావోపగత ఏకాంతే సుసమాహితః ప్రాప్యైతత్పరమం గుహ్యం భూత్వా సూర్యవ్రతోనరః
ప్రాప్నోతి పరమం స్థానం భాస్కరస్య మహాత్మనః లగ్నగర్భాప్రముచ్యత గర్భిణీ జనయేత్సుతమ్
వంధ్యా ప్రసవమాప్నోతి పుత్ర పౌత్ర సమన్వితమ్ ఏవమేతన్మమాఖ్యాతం భాస్కరేణామి తౌజసా
మయాపి తన ఆఖ్యాతం భక్త్యా భానోదం ద్విజ!
పూజనీయ యా భానుః సర్వ పాపోహ శాంతయే సహిధాతా విధాతాచ సర్వస్య జగతో గురుః
ఉద్యన్యః కురుతే నిత్యం జగద్వితిమిరం కరైః ద్వాదశాత్మాసదేవేశః ప్రీయతాం తేఽదితేః సుతః
ఇతి శ్రీ భవి ష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మే పర్వణి
సప్తమి కల్పే ఆదిత్య మాహాత్మ్యే సర్షపసప్తమి వర్ణనం నామ సప్తతితమోఽధ్యాయః
తా॥ మానవుడు ధర్మ శీలుడై వ్రతముల చేత, నియమములచేత, తపస్సుల చేతను, ఏడు సప్తమి వ్రతములను విధి పూర్వకముగ నాచరించి, జ్ఞానము, ధనము, సంతానము, భాగ్యము, ఆరోగ్యము, పుణ్యములతో కూడి సుఖించి శాశ్వతమైన సూర్య లోకమును పొందును-11. ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! ఈ వీధిని గూర్చి వినినను, చేసినను, మనుష్యుడు సహస్ర కిరణుడైన సూర్యుని చేరును. సందేహములేదు-12. దేవతలు, మునుల, పురాణజులు ఎవరైనను ఈ సూర్య సప్తమి గూర్చి చెప్పుచున్నారు. వీరందఱును పరమాత్ముడైన సూర్యుని పూజించుచున్నారు-13. నేను నీకు చెప్పిన ఈ సూర్యవ్రత విధానము ఋషులకు సంబంధించినది. (ఋషులాచరించి ఫలములను పొందియుండినది) ఇది సూర్యుని యందు భక్తి గలవానికి మాత్రమే ఉపదేశింపవలెను. ఇతరులకెప్పుడును చెప్పరాదు-14. ఇది నిత్యము వినిపించువాడు, వినువాడును సూర్యదేవునిలో చేరిపోవుదురనుటలో సందేహములేదు-15. ఈ కథను మొదటి నుండియు వినినవాడు రోగార్తుడైన యెడల రోగముల నుండి ముక్తుడగును. జిజ్ఞాసువు సఫల మనోరథుడై సూర్యలోకమునకేగును-16. మార్గమునందు ప్రయాణము చేయుచున్నప్పుడిది పఠింపు చుండినచో క్షేమముగా గమ్యము చేరును. ఎవడేది కోరునో వానికది నిశ్చయముగ లభించును-17. తదేక భావముతో ఏకాంతమునందు నిష్ఠగలవాడై ఈ శ్రేష్ఠమైన, ఉపాసన రహస్యమైన రీతిగా చేసిన యెడల-18. మహాత్ముడైన భాస్కరదేవుని పరమస్థానమును పొందును. గర్భధారణ పొందిన స్త్రీ ఈ కథను శ్రద్ధగా వినినచో సుఖ ప్రసవమై పుత్రుని కనును-19. గొడ్రాలు గర్భము ధరించి పుత్ర పౌత్రాదులతో విలసిల్లును. అమిత తేజుడైన భానుదేవుడే నా కిదంతయు చెప్పియుండెను. దానినే నేను నీకు సభక్తికముగ చెప్పితిని-20. సర్వ పాపములను శమించుట కొఱకు నీవును సూర్య భగవానునర్చింపుము. అతడే ధాత. విధాత.
జగత్తు కంతటికిని గురువు-21. నిత్యమును తాను ఉదయించుచునే తన కిరణములతో జగత్తునందలి చీకట్లను పారద్రోలి వెలుగులను నింపును. ఆ ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు ప్రసన్నుడగుగాక-22.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు ఆదిత్య మాహాత్మ్యమున సర్షప సప్తమి వర్ణనమను దెబ్బదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 70 of the Bhavishya Mahā Purana is as follows:
Mustard seeds — sarṣapa — have a specific sacred significance in Sūrya worship that this chapter elaborates. Mustard seeds are offered to Sūrya on specific saptamī tithis as a remedy for skin diseases, particularly the white-patch disease (śvitra) associated with pitta-imbalance and solar affliction. The bright yellow colour of the flowers and seeds connects them symbolically to solar energy. The procedure involves making an image of Sūrya from a paste of mustard seeds, worshipping it, and then immersing it in flowing water after the pūjā. The chapter traces this practice to the narrative of a king whose skin disease was miraculously healed after he offered mustard to Sūrya at the instruction of a solar devotee-sage.