69. సప్తమి కల్పమున స్వప్న దర్శస వర్ణనము

మూ॥ బ్రహ్మోవాచ :

సప్త మ్యాముషితో విప్రః స్వప్న దర్శనముచ్యతే స్వప్నే దృష్టేచ సప్తమ్యాం పురుషోనియతవ్రతః

 సమాప్య విధివత్సర్వం జపహోమాదికం క్రమాత్ పూజయిత్వా దినేశంతు యథావిభవ మాత్మనః

తతః శయీత శయనే దేవ దేవం విచింతయన్ సంప్రసుప్తో యదాపశ్యేదుదయంతం దివాకరమ్

 శక్ర ధ్వజం తథా చంద్రం తస్య సర్వాః సమృద్ధయః దృశ్యం జనం తథా శక్తిం స్రగ్విగోవేణు నిస్వనాః

శ్వేతాబ్జ చామరాదర్శ కనకాసి సుతోద్భవమ్ రుధిరస్య స్రుతిం సేకం పానం చైశ్వర్య కారకమ్

 శ్వేతాయాః పంచపూతాయా దర్శనం వృద్ధికారకమ్ ప్రజాపతేర్ఘృతాక్తస్య దర్శనం పుత్రదం స్మృతమ్

శస్త వృక్షాభిరోహశ్చ క్షిప్రమైశ్వర్య కారకః దోహనం మహిషీసింహీ గోధేనూనాం స్వకే ముఖే

ధనుషాంచ శరాణాంచ నాభౌచ ద్రుతనిర్గతాః అభిహత్యాత్స్వయం ఖాదేత్సింహాన్గా భుజగాంస్తథా

 స్వాంగ శీర్షం హుతవ హే తస్య శ్రీ రగ్రతఃస్థితా రాజతే హైమనే పాత్రే యోభుంక్తీ పాయసం ద్విజః

 పద్మపత్రేయథా విప్రస్తస్య జంతోర్బలం భవేత్ ద్యూతే వాదేథవా యుద్ధే విజయోహి సుఖావహః

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “యాజ్ఞవల్క్య! సప్తమినాడు ఉపవసించి, విధి పూర్వకముగ సూర్యదేవునర్చించి, జహోమాదులు నిర్వర్తించి, రాత్రి సమయమున సూర్యుని ధ్యానింపుచు నిదురించి, ఆ నిద్రలో గాంచు స్వప్నముల ఫలములను చెప్పుచున్నాను-1, 2. తన విభవముననుసరించి నియమవ్రతుడై సూర్యక్రతువు సంపన్నము చేసి అతనిని గుఱించి చింతన చేయుచు రాత్రి సమయమున పడక పై పరుండిన ఉపాసకునకు స్వప్నమందు, ఉదయించుచున్న సూర్యుడు-3. ఇంద్రధ్వజునుడు, చంద్రుడు కాన్పించేనేని సర్వ సమృద్దులు కలుగును. పూలదండ ధరించినవాడు, గోవు, వేణు నాదములు-4. తెల్లని కమలములు, చామరములు, అద్దము, బంగారము, ఖడ్గము, పుత్రోదయము, రక్తస్రావము, రక్తముతో తడయుట, పానము చేయుట - ఇవి కన్పట్టిన ఐశ్వర్యము కలుగును.-5. పంచ పూతమైన వెండి కనబడుట వృద్ధి కారకము. ఘృతాక్ష ప్రజాపతి దర్శనమున పుత్ర ప్రాప్తి కలుగునని చెప్పబడినది-6. స్వప్నమునందు తాను ప్రశస్తమగు వృక్షమునెక్కినట్లు కనబడినచో సత్వరమే ఐశ్వర్యము కలుగును. గేదె, సింహము, ఆవు పాలను తన ముఖమునందే పితికినట్లు కాంచినచో-7. ధనుర్మధ్యముల నుండి వేగవంతములై వెలువడు బాణములు కనబడినను, తాను స్వయముగ సింహములను, ఎద్దులను, పాములను చంపినట్లు తినినట్లు చూచినను-8. తన శరీరము, తల అగ్నిలోబడినట్లు కలగాంచినచో ధనలక్ష్మి ముందున్నట్లు భావింపవలెను. బంగారు పాత్రలో పాయసము తినినట్లు-9. లేక తామరాకులోగాని తినినట్లు స్వప్నమైనచో నతనికి బలము ప్రాప్తించును. జూదమునందుగాని, వాదమునందుగాని యుద్దమునందుగాని విజయము కలిగినట్లు కలగాంచినచో సుఖము లభించును.

 మూ॥ అగ్నేస్తు గ్రసనం విప్ర! ఆగ్నేయం బుద్ధికారకమ్ గాత్రస్య జ్వలనం విప్ర! శిరో వేధశ్చ భూతయే

మాల్యాంబరాణాం శుక్లానాం శస్తానాం శుక్లపక్షిణామ్ సదా లాభం ప్రశంసంతి తధా విష్ఠాను లేపనమ్

సాంగస్యకర్తనేక్షేపే రథయానే ప్రజాగమః నానా శిరో బాహుతాచ హస్తానాం కురుతే శ్రియమ్

అగమ్య గమనం చైవ శోక మధ్యయనం తథా దేవ ద్విజ జనాచార్య గురువృద్ధ తపస్వినః

యద్యద్వదంతి తత్సర్వం సత్యమేవహి నిర్దిశేత్ ప్రశస్త దర్శనం చైవ అభిషేకో నృప శ్రియాః

స్యాద్రాజ్యం శిరశ్ఛేదేన బహుధా స్ఫుటితేనతు రుదితం హర్ష సంప్రాప్యైః రాజ్యం నిగడబంధనే

 తురంగం వృషభం పద్మం రాజానం శ్వేతకుంజరమ్ మహదైశ్వర్య మాప్నోతి యోభీకశ్చాధిరోహతి

 గ్రసమానో గ్రహాంస్తారా మహీంచ పరివర్తయన్ ఉన్మూలయ న్పర్వతాంశ్చ రాజ్యలాభమవాప్నుయాత్

 దేహాన్ని ష్క్రాం తి రంత్రాణాం తైర్వా వృక్షస్యవేష్టనమ్ పాతః సముద్ర సరితామైశ్వర్యాణి సుఖానిచ

 ఉదధిం సరితం వాపి తీర్త్యా పారం ప్రయాతిచ అద్రిం లంఘయతశ్చాపి భవంత్యర్థ జయాయుషః

 ఉజ్జ్వలాస్త్రీ విశేదంక మాశీర్వాద పరాస్త్రియః భవత్యర్థాగమః శీఘ్రం, కృమిభిర్యది భక్ష్యతే

 స్వప్నే స్వప్న ఇతిజ్జాతం దృష్టప్రకథనం తథా మంగలానాంచ సర్వేషాం శుభం దర్శనమేవచ

 సంయోగశ్చైవ మంగల్యై రారోగ్యధనకారకః ఐశ్వర్య రాజ్యలాభాయ యస్మిన్స్వప్న ఉదాహృతః

తైర్దృష్టై రోగిణో రోగాన్ముచ్యతే నాత్ర సంశయః నస్వప్నం శోభనం దృష్ట్వా స్వప్యా త్ప్రాతశ్చ కీర్తయేత్

 రాజభోజక విప్రేభ్యః శుచిభ్యశ్చ శుచిర్నరః

 ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మే పర్వణి

సప్తమి కల్పే స్వప్నదర్శన వర్ణనం నామ ఏకోన సప్తతి తమోఽధ్యాయః

తా॥ అగ్నిని త్రావినట్లు (తినినట్లు) కలగాంచినచో జఠరాగ్ని వృద్ధియగును. శరీరముజ్వలించిపోవుచున్నట్లు స్వప్నమైన అది శిరోబాధకు సూచకమగును-11. తెల్లని పూలు, వస్త్రములు ధరించినట్లు, ప్రశస్తమైన తెల్లని పక్షులు (హంసలు) కనపడినగాని, మలమును ఒంటికి పూసీకోనునట్లుగాని కలలో చూచినచో లాభము కలుగుటకు సూచనయగులు-12. తన శరీరమును కత్తిరించుచున్నట్లు గాని, చిమ్ముచున్నట్లుగాని, రథము పై ప్రయాణము చేయుచున్నట్లు గానీ కలలో దర్శించినచో సంతతి కలుగును. తలలు, భుజములు, హస్తములు తనకనేకములుగనున్నట్లు కలలో కన్నించినచో ధన వృద్ధియగును-13. అగమ్య గమసము చేయుట, శోకించుట, చదువుట కూడ సిరిని బెంచును. కలలో దేవతలు, బ్రాహ్మణులు, ఆచార్య పురుషులు, గురుజనము, వృద్ధులు, తపస్వులు-14. ఏది చేప్పినను అది సత్యమగునని నిర్దేశింపవలెను. ప్రశస్తుల దర్శనము, అభిషేకము, రాజవైభములకు సూచకము-15. తన శిరస్సు ఖండింపబడినట్లు, గాయపఱచబడినట్లు కలగాంచిన రాజ్యలాభము కలుగును. శోకించుట, రాబోవుహర్షమునకు సూచన. తాను నిగళములతో బంధింపడినట్లు కలగాంచిన రాజ్యప్రాప్తికి నిర్దేశము-16. గుఱ్ఱము, ఎద్దు, తామరపువ్వు, రాజు, తెల్లని ఏనుగు కనపడినచో గొప్ప ఐశ్వర్యము కలుగును. నిర్భీకుడై యేనుగునెక్కినట్లు కలగాంచినచో అదేఫలము కలుగును-17. గ్రహములను, తారకలను మ్రింగునట్లు, భూగోళము తలక్రిందులు చేసినట్లు, పర్వతములను పెకిలించినట్లు కలగాంచినచో రాజ్యలాభమును పొందును-18. దేహమునుండి ప్రేవులు వెలువడినట్లు, వానిని చెట్టుకు చుట్టివేసినట్లు, తాను సముద్రములో గాని నదిలో గాని పడినట్లు స్వప్నము కలిగినచో నైశ్వర్యములు, సుఖములు కలుగును-19. సముద్రమును గాని, నదినిగాని దాటి ఆవలితీరము చేరినట్లు, పర్వతము పై నుండి దూకినట్లు స్వప్నమైనచో ధనము, జయము, ఆయుర్వర్ధి కలుగును-20. సుందరమైన స్త్రీ ఒడిలో ప్రవేశించినట్లుగాని, స్త్రీలనేకులశీర్వదించినట్లుగాని, తాను కీటకములతో తినబడినట్లుగాని కన్పట్టినచో ధనలాభము కలుగును-21. స్వప్నమున స్వప్నజ్ఞానము కలిగెనేని, ఇష్టమైన విషయములు చెప్పబడుట, వినబడుట జరిగెనేని, అందజికిని శుభము జరుగును. శుభవస్తు దర్శనమగును-22. శుభవస్తు సంయోగము, ఆరోగ్య, ధనలాభములు చేకూరును. ఐశ్వర్యము, రాజ్యలాభము ప్రాప్తించును-23. అట్టి స్వప్నములు కలిగిన వారు రోగులు రోగ ముక్తులగుదురనుటలో సంశయములేదు. సుస్వప్నమును దర్శించి ఉదయమున మఱల నిద్రింపకూడదు. స్నానాదులతో శుచియై రాత్రి తనకు కలిగిన స్వప్న విశేషములను ప్రాతఃకాలమున రాజు, భోజకుడు, బ్రాహ్మణుడు మొదలగు పవిత్రులకు వినిపింపవలెను.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు స్వప్న దర్శన వర్ణనమను అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.