68. సిద్ధార్థ సప్తమి వ్రత వర్ణనము

బ్రహ్మోవాచ :

వచ్మితే పరమం దేవం సర్వదేవైశ్చపూజితమ్ ఆరాధయంతి యందేవం బ్రహ్మ విష్ణు మహేశ్వరా

 పద్మాకృతిం సదా బ్రహ్మ నలినైర్గుగ్గులేనతు వ్యోమ రూపం సదా దేవం మహాదేవోర్చతే రవిమ్

 జాతి పుష్పై ర్ద్విజశ్రేష్ఠ! ధూ పేన విజయేనతు వృషణం సిహ్లకం విప్ర శ్రీఖండ మగరుస్తథా

కర్పూరంచ తథాముస్తా శర్కరా సత్వచా ద్విజ! ఇత్యేష విజయోధూపః స్వయం దేవేన నిర్మితః

కేశవశ్చక్ర రూపంతు సదా సంపూజయద్రవిమ్ నీలోత్పల దలశ్యామో నీలోత్పల కదంబకైః

ధూ పేనాగురు సంజ్ఞేన భక్తి శ్రద్ధా సమన్వితః మయాసపృష్టో దేవేశస్తస్యై వారాధనాయవై

కాని పుష్పాణి చేష్టాని సదా భాస్కర పూజనే తేన చోక్తాని పుష్పాణి స్వయం తాని నిబోధమే

 మల్లికాయాస్తు కుసుమైర్భోగవాన్ జాయతే నరః సౌభాగ్యం పుండరీకైశ్చ భజత్యేవచ శాశ్వతమ్

 గంధ కుటజకైః పుష్పైః పరమైశ్యర్య మశ్నుతే భవత్యక్షయ మత్యంతం నిత్యమర్చయతో రవిమ్

 మందార పుష్పైః పూజాతు సర్వ కుష్ఠ వినాశినీ బిల్వపత్రైశ్చ కుసుమై ర్మహతీం శ్రియ మశ్నుతే

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేతను, ఇతర దేవతలందతిచేతను పూజింపబడు సూర్యదేవుని గుణించి నీకు చెప్పెదను-1. బ్రహ్మదేవుడు (నేను) పద్మాకారముననున్న సూర్యుని తామరలచేత గుగ్గులుచేత పూజించును. (తను) వ్యోమ రూపుడైన సూర్యుని మహాదేవుడు పూజించును-2. ఇతడు జాజిపూలు, విజయధూపమును తన సూర్య పూజలో వినియోగించును. మొక్కపు చెట్టు, చిల్లమడ్డి, చందనము, అగరు-3. శర్కర, కర్పూరము, నిడుముస్తే వీని మిశ్రమమే స్వయముగ మహాదేవుడు సిద్ధపఱచిన విజయధూపము-4. విష్ణుదేవుడు చక్రరూపమున సూర్యునారాధించును. నీలోత్పలశ్యాముడగు విష్ణువు సూర్యుని, నల్ల గలువల గుత్తులచే-5. అగరు ధూపముచేతను భక్తి శ్రద్ధలతో పూజించును. సూర్యుని పూజయందే పుష్పములు, ఏ క్రియలు వినియోగింపవలెనో నేనొక పర్యాయమతని నడిగితిని. స్వయముగ అతడే సూర్య పూజా పుష్పములను గుఱించి చెప్పెను. వాని వివరములు నీవు తెలిసికొనుము. చెప్పుచూన్నాను-6,7. సూర్యదేవుని మల్లెలతో పూజించువాడు భాగ్యవంతుడగును. తెల్లదామరలతో పూజించువాడు శాశ్వతమైన సౌభాగ్యమును పొందును-8. పరిమళ భరితములైన కొండ మల్లెలతో చర్చించువాడు గొప్ప ఐశ్వర్యమును పొందును, నిత్యమి పూలతో చర్చించిన మిక్కుటమగు సంపద అక్షయమైయుండును-9. దాసాని పూలతో పూజించుట సర్వ కుష్టు వ్యాధులను నశింపజేయును. మారేడు దళములు, పూలతో చర్చించిన గొప్ప ధన సంపదను పొందును.

అర్క స్రజా భవత్యర్థం సర్వకామ ఫలప్రదః ప్రదద్యాద్రూపిణీంకన్యామర్చితో వకుల స్రజా

కింశుకైరర్చితో దేవో నపీడయతి భాస్కరః పూజితోఽగస్త్య కుసుమై రాను కూల్యం ప్రయచ్ఛతి

కరవీరస్తు విప్రేంద్ర! సూర్యస్యానుచరో భవేత్ తథా ముద్గర పుష్పైశ్చ సమభ్యర్చ్య దివాకరమ్

హంసయుక్తేన యానేన రవేః సాలోక్యతాం వ్రజేత్ బక పుష్పైర్ద్విజ శ్రేష్ఠ! యాతి భాను సలోకతామ్

 చతుః సమేన గంధేన సమభ్యర్చ్య దివాకరమ్ పంచభూతాలయ స్థాన మాప్ను యాన్నాత్రసంశయః

దేవా గారంతు సంమార్జ్య భక్త్యా యస్తు ప్రలేపయేత్ సరోగాన్ముచ్యతే క్షిప్రం ద్రవ్య లాభంచ విందతి

 తస్య చాయతనం భక్త్యా గైరికేనోపలేపయేత్ ప్రాప్నుయాన్మహతీం లక్ష్మీం రోగైశ్చాపిప్రముచ్యతే

 అష్టాదశేహ కుష్ఠాని యేచాన్యే వ్యాధయో నృణామ్ ప్రలయం యాంతి తే సర్వే మృదాయద్యుపలేపయేత్

 విలేపనానాం సర్వేషాం రక్తచందన ముత్తమమ్ పుష్పాణాం కరవీరాణి ప్రశస్తాని ప్రచక్షతే

నాతః పరతరం కించిద్భాస్వతస్తుష్టి కారణమ్ కింతస్య నభవేల్లోకే య స్త్వేభిః స్త్వర్చయేద్రవిమ్  

తా॥ జిల్లేడు పూల దండతో పూజించినచో ధనము కలుగును. సూర్య దేవుడు కోరికలన్నింటిని ఫలింపజేయును. పొగడ పూవుల దండతో నర్పించిన సౌందర్యవతియైన కన్యను భార్యగా నిచ్చును-11. మోదుగుపూల పూజ వలన సూర్యుడు జాతకరీత్యా దుఃస్థానమునందున్నను పీడింపడు. అగి సె పూలతో పూజించినచో సర్వ కార్యములందానుకూల్యమునిచ్చును-12. గన్నేరు పువ్వులతో నర్చించినచో సూర్యునకనుచరుడగును. ముద్గర పుష్పములతో సూర్యార్చన చేసినచో-13. హంసయుక్తమైన విమానము మీద సూర్య లోకమును జేరును. వేయి సదాప లేక తామర పుష్పములతో పూజచేసిన వానికి సూర్య లోకప్రాప్తి కలుగును. బక పుష్పములతో పూజించినను అట్టి ఫలమే కలుగును-14. కస్తూరీ, చందనము, కుంకుమము, కర్పూరము, వీనిని సమ భాగములుగ కలిపి చేసి యక్షకర్దమ గంధముతో సూర్య పూజ చేసినవానికి సూర్య లోక ప్రాప్తి కలుగును. సంశయములేదు-15. సూర్య దేవాలయమునందు భక్తితో నూడ్చియలుకు వాడు సత్వరమే రోగముల నుండి ముక్తుడై ద్రవ్య లాభమును పొందును-16. సూర్యభగవానుని ఆలయమును గైరికాదిధాతువులచే నలికి శుభ్రము చేయువాడు గొప్ప సంపదను పొందుటయేగాక సర్వరోగముల నుండి విముక్తుడగును-17. పదునెనిమిది విధములైన కుష్ఠ వ్యాధులు, ఇంకను ఇతర రోగములేవియైనను, సూర్యాలయము నలికి శుభ్రము చేయుటచేత నశించిపోవును-18. విలేపన వస్తువులన్నింటిలో రక్త చందనము శ్రేష్టమైనది. పుష్పములలోకెల్ల సూర్య పూజా విషయమున గన్నేరు పువ్వులు ప్రశస్తములని చెప్పుదురు-19. సూర్య దేవుని తృప్తి పఱచుట కొంతకన్న వేడైన వేవియులేవు. వీనితో నాతని పూజించుటచే నాతని లోకమే ప్రాప్తించునుగదా!.

 మూII కరవీరైః పూజయేద్యో భాస్కరం శ్రద్ధ యాన్వితః సర్వకామ సమృద్ధోఽ సౌ సూర్య కామమవాప్నుయాత్

విలేప్యాయతనం యస్తు కుర్యాన్మండలకం శుభమ్ స సూర్య లోక మాసాద్య మోదతే శాశ్వతీ: సమా:

 ఏకేనాస్య భవే దర్ధో ద్వాభ్యా మారోగ్య మశ్నుతే త్రిభిః సంతత్య విచ్ఛిన్నా చతుర్భిర్భార్గవీం లభేత్

 పంచభిర్విపులం ధాన్యం షడ్భిరాయుర్బలం యశః సప్త మండల కారీ స్యాన్మండలాధిపతిర్నరః

ఆయుర్ధన సుతైర్యుక్తః సూర్యలోకే మహీయతే ఘృత ప్రదీప దానేన చక్షుష్మా న్జా యతే నరః

కటుతైల ప్రదానేన సశత్రూన్జయతే నరః తిలతైల ప్రదానేన సూర్యలోకేమహీయతే

మధూక తైల దానేన సౌభాగ్యం పరమం వ్రజేత్ సంపూజ్య విధివద్దేవం పుష్పధూపాదిభిర్బుధః

యథాశక్త్యా తతః పశ్చా న్నైవేద్యం భక్తితో న్యసేత్ పుష్పాణాం ప్రవరా జాతీ ధూపానాం విజయఃపరః

గంధానాం కుంకుమం శ్రేష్టం లేపానాం రక్త చందనమ్ దీపదానే ఘృతం శ్రేష్ఠం నైవేద్యే మోదకఃపరః

ఏతైస్తుష్యతి దేవేశః సాన్నిధ్యం చాధి గచ్ఛతి ఏవం సంపూజ్య విధివత్కృత్యా చాపి ప్రదక్షిణమ్

ప్రణమ్య శిరసాదేవం దేవ దేవం దివాకరమ్ సుఖాసీనస్తతః పశ్యేద్రవేరభిముఖే స్థి తః

తా॥ భాస్కర దేవుని గన్నేరు పూలతో శ్రద్దా భక్తి సమన్వితుడై పూజించువాడు తన కోరికలన్నీంటిని సఫలము చేసి కొనగలుగును. ఆ పైన సూర్య సాలోక్యమునందును-21. సూర్యమందిరమున లేపనముచేసి మండలముచేసినవాడు సూర్య లోకమును పొంది అచట పెక్కు సంవత్సరములు సుఖ సంతోషములతో నుండును-22. ఒక మండలము చేసిన ధన ప్రాప్తి, రెండు మండలములు చేసిన ఆరోగ్య ప్రాప్తి, మూడు చేసిన అవిచ్చిన్నమైన సంతతి, నాలుగు చేసిన లక్ష్మీ-23. ఐదు మండలములు రచించిన విపులమైన ధాన్య సంపద, ఆంటీని చేసిన ఆయువు, బలము, కీర్తి, ఏడు మండలములు చేసిన మండలాధిపతిత్వము కలుగును-24. ఆయువు, ధనము, సంతానములతో సౌఖ్యముననుభవించి సూర్య లోకమున వెలుగొందును. నేతి దీపమును సూర్య సమక్షమున వెలిగించువానికి చక్కని చూపు కలుగును-25. నల్లావనూనె సమర్పించువాడు శత్రువులను జయించును. నువ్వుల నూనె నిచ్చువాడు సూర్యలోకమునొందును-26. ఇప్పనూనెనిచ్చువాడు మిక్కిలి సౌభాగ్యమును పొందును. పుష్ప ధూపాదులచేత సూర్య దేవుని యథావిధిగా పూజించి-27. శక్తిననుసరించి అటుపిదప నైవేద్యము పెట్టవలెను. పుష్పములలో జాజి శ్రేష్టము. ధూపములలో పూర్వము చెప్పబడిన విజయధూపము ప్రశస్తము.-28. గంధములలో కుంకుమము, లేపములలో రక్తచందనము, దీపమునకు నేయి, నైవేద్యమునకు లడ్డువములు శ్రేష్ఠములైనవి-29. ఈ వస్తువులతో సూర్య భగవానుడు తుష్టిచెంది సన్నధిలోనికి వచ్చును. ఇట్లు పూజించి ప్రదక్షిణము చేసి-30 శిరమువంచి నమస్కరించి ఆ దేవదేవుడైన భాస్కరదేవునకభిముఖముగా కూర్చుండి ఆయన వైపు చూడవలెను.

మూ!! ఏకం సిద్ధార్థకం కృత్వా హస్తే పానీయ సంయుతమ్ కామం యథేష్టం హృదయే కృత్వాతం వాంఛితం సరః

పిబేత్సతోయం తం విప్ర! అస్పృష్టం దశనైః స్మృతమ్ ద్వితీయాయాంతు సప్తమ్యాం ద్వౌగృహీత్వాతు సువ్రత!

 తృతీయాయాంతు సప్తమ్యాం గ్రహీతవ్యా స్త్ర యోఽ పిచ జ్ఞే యాశ్చతుర్ధ్యాం చత్వారః పంచమ్యాం పంచ ఏవహి

 షట్ పిబేచ్చాపి షష్ఠ్యాంతు ఇతీయం వైదికి శ్రుతిః సప్తమ్యాం సప్తమాయాంతు సప్తచైవ పిబేన్నరః

ఆదౌ ప్రభృతి విజ్ఞేయో మంత్రోఽ యమభిమంత్రణే సిద్ధార్థకస్త్వం హిలోకే సర్వత్ర శ్రూయ సే యథా

 తథా మామపి సిద్ధార్ధమర్థతః కురుతాం రవిః

 తతో హవిరుపస్పృశ్య జపం కుర్యాద్య థేప్సితమ్ హుతాశనంచ జుహుయాద్విధి దృష్టేన కర్మణా

 ఏవ మేవ పరాఃకార్యాః సప్తమ్యః సప్త సర్వదా ఏకాత్ర్పభృతి కార్యాసా సర్వదోదక సప్తమి

 ఏకం తో యేన సహితం ద్వౌచాపి ఘృత సంయుతౌ త్రీంస్తథామధునా సార్ధం దధ్నా చతురఏవచ

 యుక్తాన్న పయసా పంచ, షట్ చ గోమయ సంయుతాన్ పంచగవ్యేనవై సప్త పిబేత్సిద్ధార్థ కాన్ ద్విజ!

 అనేన వీధినా యస్తు కుర్యాత్సర్షప సప్తమీమ్ బహుపుత్రో బహుధనః సిద్ధార్ధ శ్చాపి సర్వదా

ఇహలోకే నరో విప్ర! ప్రేత్య యాతి విభావసుమ్ తస్మాత్సం పూజయేద్దేవం విధినానేన భాస్కరమ్

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

సప్తమి కల్పే సిద్ధార్ధ సప్తమి వ్రత వర్ణనం నామాష్ట షష్టితమోఽధ్యాయః

 తా॥ నీటితో సహా ఒక తెల్ల ఆవగింజను చేతగొని మనసులోని ఇష్టమైన కోరికను ధ్యానింపవలెను-32. పిమ్మట ఆ నీటిని దంతముల కంటకుండునట్లుగా ఒకసారి త్రాగవలెను. రెండవ సప్తమినాడు రెండావగింజలు తీసికొని ఇటులే చేయవలెను-33. మూడవ సప్తమినాడు మూడు, నాల్గవ సప్తమినాడు నాలుగు, ఐదవ సప్తమినాడైదు-34. ఆవ సప్తమినాడాలు, నీటితో కలిపి దంత స్పర్శ కలుగకుండునట్లు త్రావవలెను. ఈ విధానమంతయు వైదిక శ్రుతి చెప్పుచున్నది. ఏడవసప్తమినాడు ఏడు గింజలతో త్రాగవలెను-35. పుచ్చుకొన బోవు జలమును మొదటి సప్తమి నుండియు ఈ మంత్రముతో నభిమంత్రించి స్వీకరింపవలెను. “ఓ సూర్యదేవా! లోకమునందంతటను ప్రచారముననున్నట్లు నీవు సిద్ధించిన ప్రయోజనము గలవాడవు. నన్ను కూడ అటులే సిద్ధార్థునిగ జేయుము”-36. అప్పుడు హవిస్సు పై జలము ప్రోక్షించి కోరినట్లుగ జపము చేయవలెను. విధి పూర్వకముగ అగ్ని హోత్రునకు ఆహుతులీయవలెను-37. ఏడు సప్తముల కార్యక్రమములీ విధముగనే నిర్వహింపవలెను 'సర్వ దోదక సప్తమి' ఒక ఆవగింజ నీటితో తీసికొనెడు నాటి నుండి ప్రారంభింపవలెను. ఒక గింజను నీటితో, రెంటిని నేయితో, మూటిని తేనెతో, నాల్గింటిని పెరుగుతో-39. ఐదింటిని క్షీరాన్నముతో, ఆంటీని గోమయముతో, ఏడింటిని పంచగవ్యముతో జలసహితముగ నిట్లు ఏడు పర్యాయములు సిద్దార్ధకములను సేవింపవలెను-40. ఈ విధానముతో సర్షపసప్తమి వ్రత మాచరించు వాడు అనేకులను పుత్రులను బడసి, మిక్కిలి ధనవంతుడై, సిద్ధార్థుడై విలసిల్లును-41. ఇహ లోకమున కోరికలన్ని తీరినవాడై పరమున సూర్య లోక ప్రాప్తినందును. అందుచేత నీ పద్దతిగ సూర్య భగవానుని పూజింపవలయును.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందలి సిద్ధార్ధ సప్తమి వ్రత వర్ణనమను పేరుగల అణువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.