భవిష్య మహా పురాణము
67. సూర్యమహిమ వర్ణనము
మూ!! బ్రహ్మోవాచ :
ప్రభాతే సంస్తుతో దేవో మూర్తి హేతోర్మయా పురా యజంతంఛాపరం దేవం భక్తినమ్రం మహామతిః
ప్రత్యక్షత్వమథో గత్వా రహస్యం ప్రోక్తవాన్మమ అహంచకృతవాన్ప్రశ్నం దృష్ట్యా ప్రత్యక్షతో రవిమ్
వేదేషుచ పురాణేషు సాంగోపాంగేషుగీయ సే త్వమజః శాశ్వతోధాతా మహాభూత మనుత్తమమ్
ప్రతిష్ఠితం భూత భవ్యం త్వయి సర్వ మిదం జగత్ చత్వారోహ్యాశ్రమా దేవ! సర్వే గార్హస్థ్య మూలకాః
యజంత త్వామహరహర్నానా మూర్తి సమాశ్రితాః పితామాతా హి సర్వస్య దైవతం త్వంహి శాశ్వతమ్
యజసే చైవ కందేవమేవం చాపి నవిద్మహే కథ్యతాం మమదేవేశ! పరం కౌతూహలం హిమే
ఇత్థం మయోక్తో భగవానిదం వచన మబ్రవీత్ అవాచ్యమేతద్వక్తవ్య మాత్మగుహ్యం సనాతనమ్
తవ భక్తిమతో బ్రహ న్వక్ష్యామిహ యథాతథమ్ యతః సూక్ష్మమవిజ్ఞేయ మవ్యక్తమచలం ధ్రువమ్
ఇంద్రియైరింద్రి యార్థైశ్చ సర్వ భూతైశ్చ వర్జితమ్ సహ్యంతరాత్మాభూతానాం క్షేత్రజ్ఞశ్చేతి కథ్యతే
త్రిగుణ వ్యతిరిక్తో ఽసౌ పురుషశ్చేతి కథ్యతే హిరణ్య గర్భో భగవాన్సైవ బుద్ధిరితి స్మృతః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “నేనొక ప్రాతఃకాల సమయమున సూర్యదేవుని ప్రత్యక్షము చేసికొనుట కొఱకు ఆతనిని స్తోత్రముచేసితిని. ఆతడు భక్తి నమ్రుడై ఏ దేవునినో పూజించు స్థితిలో ప్రత్యక్షమయ్యెను. అటుల ప్రత్యక్షమైన భానుదేవుని చూచి నేను కొంత సందేహముతో ప్రశ్నింపగా నాతడు నాకు రహస్యమును చెప్పెను-1, 2. "ఓ సూర్య భగవానుడా! సాంగోపాంగములగు వేదములందు, పురాణములందు నీవజుడవని, శాశ్వతుడవని, ధాతవని, మహాభూతుడవని, ఉత్తములలో నుత్తముడవనియు కొనియాడబడి యున్నావు-3. మూడు కాలములయందీ సర్వ జగత్తు నీ యందే ప్రతిష్ఠింపబడియుండును. గృహస్థాశ్రమమే మూలముగాగల-4. నాలుగాశ్రమములలో నుండువారును ప్రతి దీనము నీ వివిధ స్వరూపములను పూజించుచున్నారు. అందఱికిని నీవే తల్లివి, తండ్రివి, శాశ్వతమైన దైవతమవు-5. అట్టినీవు ఏదేవు నారాధించుచుంటివో తెలియజాలకున్నాను. తెలిసికొనుటకు నాకు మిక్కిలి కుతూహలముగనున్నది. కావున చెప్పుమని కోరుచున్నాను"-6. నేనిట్లడుగగా నా సూర్యదేవుడిట్లని పలికెను. “ఓ బ్రహ్మదేవా! ఇది నాకు సంబంధించిన సనాతన రహస్య విషయము. ప్రకటము చేయరానిదీ-7. నీవు భక్తిగలవాడవు కావున ఉన్నది యున్నట్లుగ నీకు చెప్పుచున్నాను. సూక్ష్మమైనది, తెలియరానిది, ప్రకటముకానిది, చలింపనిది, శాశ్వతమైనది-8. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, సర్వభూతముల చేతను రహితమైనది, అయిన పరమాత్మ సర్వ భూతముల కంతరాత్మ. అతనిని క్షేత్రజ్ఞుడందురు-9. అతడు త్రిగుణముల కతీతుడు. పురుషుడని కూడా అతడు చెప్పబడును. హిరణ్య గర్భుడని, భగవానుడని బుద్ది యనియును చేప్పబడును.
మూ॥ మహానితిచయోగేషు ప్రధానశ్చేతి కథ్యతే సాంఖ్యేచ పఠ్యతే శాస్త్రే నామభిర్బహుభిః సదా
విశ్వగో విశ్వ భూతశ్చ విశ్వాత్మా విశ్వ సంభవః ధృతం చైవాత్మకం యేన ఇదం త్రైలోక్యమాత్మనా
అశరీరః శరీరేషు లిప్యతే నచకర్మభిః మమాంతరాత్మా తవచ యేచాన్యేదేహ సంజ్ఞకాః
సర్వేషాం సాక్షి భూతో సౌ నకరోతి నలిప్యతే సగుణో నిర్గుణో విష్ణుర్జ్ఞాన గమ్యోహ్యసౌ స్మృతః
సర్వతః పాణిపాదోసౌ సర్వతోక్షిశిరో ముఖః సర్వతః శ్రుతి యుక్తోసౌ సర్వ మావృత్య తిష్ఠతి
విశ్వమూర్ధా విశ్వభుజో విశ్వ పాదాక్షినాసికః ఏకశ్చరతి క్షేత్రేషు స్వైర చారీ యథా సుఖమ్
క్షేత్రాణ్యస్య శరీరాణి బీజం చాపి శుభాశుభమ్ తానివేత్తి సయోగాత్మా అతః క్షేత్రజ్ఞ ఉచ్యతే అవ్యక్తకే పరేశేతే తేనా సౌ పురుషఃస్మృతః
విశ్వం బహువిధం జ్ఞేయం సచ సర్వత్ర విద్యతే తస్మాత్స బహురూప త్వాద్విశ్వరూప ఇతిస్మృతః
మహాపురుష శబ్దంహి బిభర్త్యేష సనాతనః సతుపై విక్రియాపన్నః సృజత్యాత్మానమాత్మనా
ఆకాశోత్పతితంతోయం యాతి స్వాద్యంతరం యథా భూమే రస విశే షేణ తథాగుణవశాత్తు సః
తా॥ యోగశాస్త్రములందు 'మహాన్' అని, ప్రథానమనియు చెప్పబడును. సాంఖ్య శాస్త్రమునందనేక నామములతో పఠింపబడుచున్నాడు-11. అతడు విశ్వమును పొందియుండువాడు. విశ్వభూతాత్ముడు, విశ్వమున కాత్మయైనవాడు. విశ్వసంభవుడు. ఈ త్రైలోక్యమునంతను తనదిగా తాను ధరించుచున్నాడు-12. శరీరములన్నింటియందతడ శరీరిగనున్నాడు. కర్మలచే లిపుడుకాడు, నా లోనను, నీ లోనను, దేహ సంజ్ఞగల అన్నింటియందును అంతరాత్మగా-13. సాక్షీభూతుడుగానున్నాడు. నిష్కియుడుగావున కర్మసంగత లేనివాడగును. (కర్మలచేనంటుకొనబడడు). అతడు సగుణ రూపమునను, నిర్గుణుడగును, సర్వవ్యాపియై, జ్ఞానము చేతనే తెలిసికొనబడదగినవాడని చెప్పబడును-14. అన్నివైపులయందును కాళ్లు, చేతులు, శిరస్సులు, ముఖములు, చెవులు, గలిగి అతడు సర్వము నావరించియుండును-15. విశ్వమే శిరస్సుగను, భుజములుగను, పాదములుగను, కన్నులుగను, ముక్కులుగను కలవాడు. అతడొక్కడే సర్వ క్షేత్రములందును స్వేచ్చగా, సుఖముగను తిరుగుచుండును-16. క్షేత్రములు, శుభాశుభ బీజములు అతని శరీరములే. వాని నన్నింటిని ఆ యోగాత్ముడెలుంగును గావున నాతడు క్షేత్రజ్ఞుడనబడును. అ వ్యక్తమైన పురమునందు ... శయనించును గావున పురుషుడని చెప్పబడును-17. విశ్వమనేక విధములుగ తెలియబడును. అన్నింట ఆతడుండును. అనేక రూపములుగ నతడుండుటచే విశ్వ రూపుడని చెప్పబడును-18. సనాతనుడైన ఆతడు 'మహాపురుషుడ'ను నామమును కూడ ధరించియున్నాడు. అతడు వికారము చెందియే తనతో తాను సృష్టి రచన చేయుచున్నాడు -19. ఆకాశము నుండి పడిన నీరు ఆయా భూములయందలి రస విశేషములచేత వేర్వేరు రుచులను పొందునట్లు - ఆ పరమ పురుషుడు కూడ వేర్వేరు గుణములుగల ఉపాధులను పొంది వేర్వేరు విధములుగ రూపొందుచున్నాడు.
మూ!! ఏక ఏవ యథావాయుర్దే హే తిష్ఠతి పంచధా ఏకత్వంచ పృధక్త్వంచ తథా తస్యన సంశయః
స్థానాంతర విశేషేణ యధాగ్నిర్లభతే పరామ్ సంజ్ఞాం దావాగ్నికార్యేషు తధా దేవోహ్య సౌ స్మృతః
యధాదీప సహస్రాణి దీప ఏకః ప్రసూయతే తథా రూప సహస్రాణి సఏవైకః ప్రసూయతే
సయదా బుధ్యతేఽత్మానం తదా భవతి కేవల: ఏకత్వం ప్రలయేచాస్య బహుత్వం స్యాత్ప్రవర్తనే
నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావర జంగమమ్ ఋతే తమేక మీశానం పురుషం బీజ సంజ్ఞాతమ్
అక్షయశ్చాప్రమేయశ్చ సర్వగశ్చస ఉచ్యతే తస్మాదవ్యక్తముత్పన్నం త్రిగుణం సర్వకారణమ్
అవ్యక్తా వ్యక్త భావస్థా యాసా ప్రకృతి రుచ్యతే తాం యోనిం బ్రహ్మణో విద్ధి యోసౌ సదసదాత్మకః
నాస్తి తస్మాత్పరో హ్యన్యః సపితా సప్రజాపతిః ఆత్మామమ సవిజ్ఞేయస్తతస్తం పూజయామ్యహమ్
స్వర్గతాశ్చాపి యేకేచి త్తం నమస్యంతి దేహినః తేత త్ప్రసాదాద్గచ్ఛంతి తేనాధిష్టాః పరాంగతిమ్
తందేవాశ్చాసురాశ్చైవ నానామత సమాశ్రితాః భక్త్యా సంపూజయం త్యాద్యం గతించైషాం దదాతి సః
సహిసర్వగతశ్చైవ నిర్గుణశ్చాపి కధ్యతే ఏవం జ్ఞాత్వా తమాత్మానం పూజయామి సనాతనమ్
భాస్కరం దేవ దేవేశం సర్వ భూతేశమచ్యుతమ్
బ్రహ్మోవాచ :
ఇత్యుకత్తవాన్పురా పృష్టోమయా దేవోదివాకరః పూజయత్వం మహాత్మానం తపంతం విపులం తపః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి బ్రహ్మ యాజ్ఞవల్క్యసంవాదే సప్తమికల్పే సూర్యమహిమ వర్ణనం నామ సప్త షష్టి తమో ఽధ్యాయః
తా॥ ఒకే వాయువు దేహమునందైదు విధములుగ నుండునట్లు, పరమాత్మకు ఏకత్వము, భిన్నత్వము రెండును గలవు-21. భిన్న భిన్న స్థానములలో నుండేడు ఒకే అగ్నికి, దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని వంటి వేజ్వేలు సంజ్ఞలున్నట్లాతనికి కూడ వేజ్వేజు స్థితులలో వేజ్వేలు నామరూప క్రియాదులు వ్యవహరింపబడును-22. ఒకే దీపమనేక దీపములకు జన్మనిచ్చునట్లాతడొక్కడే యయ్యుననేకములకు సృష్టి హేతువగును-23. అతడు తనను తానెఱుంగు వేళ కేవలుడై యుండును. ప్రళయమునందొక్కడుగను, ప్రవృత్తి సమయమున సృష్టి రూప బహుత్వమునను ఉండును-24. ఈశానుడు, పురుషుడు, బీజ సంజ్ఞకుడైన అతడు తప్ప జగత్తునందలి స్థావర జంగమములలో నిత్యమైనది మణి వేజేదియులేదు-25. అతడక్షయుడని, అప్రమేయుడని, సర్వగతుడని చెప్పబడును. అతనినుండియే సర్వ సృష్టికిని కారణమగు త్రిగుణాత్మకమైన అవ్యక్తము జనించెను-26. అప్రకటిత స్థితిలో నున్న అవ్యక్తమే ప్రకృతి యనబడును. సదసద్రూపమైన ఈ ప్రకృతియే బ్రహ్మమునకు సృష్టి ద్వారముగ నెఱుంగుము-27. అందుచేనతని కంటే నితరుడు మఱియొకడు లేడు. అతడే తండ్రి. అతడే ప్రజాపతి. అతడే నా ఆత్మయని తెలిసికొనవలెను. అతనినే నేను పూజించుచున్నాను-28. దేహధారులెవరైనను స్వర్గమునకుఁబోయినను వారాతనికే నమస్కరింతురు. అతని యనుగ్రహము వలననే, అతనిచే నాదేశింపబడి వారు సద్గతిని పొందుదురు-29. దేవతలు, రాక్షసులు, నానా మతములనాశ్రయించిన వారు కూడ నాద్యుడైన పరమ పురుషునే పూజింతురు. ఈతడే వారికీ సద్గతినిచ్చుచుండును-30. అతడు సర్వగతుడు, నిర్గుణుడనియు చెప్పబడును. ఇట్లు తెలిసికొని నేను సనాతనుడైన ఆ పరమాత్మను పూజించుచున్నాను. అతడు భాస్కరుడు, దేవ దేవేశ్వరుడు, సర్వ భూతేశుడు. అచ్యుతుడు. అతనినే నేను ఉపాసించుచున్నాను-31.” బ్రహ్మదేవుడిట్లనెను. “నేనడిగిన మీదట సూర్య భగవానుడు నాకీ పరతత్త్వమును బోధించెను. విపులమైన తపస్సుతో తపించుచున్న ఆ మహాత్ముని నీవు పూజింపుము.
శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మయాజ్ఞవల్క్య సంవాదమున సప్తమి కల్పమున సూర్య మహిమ వర్ణనమను అణువది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 67 of the Bhavishya Mahā Purana is as follows:
The twelve forms of Sūrya — one presiding over each month of the year — are again described, this time with a focus on the theological significance of the multiplicity within unity. The one Sūrya appears in twelve forms because the one divine consciousness manifests differently in each context — as Mitra in the month of Caitra, as Varuṇa in Vaiśākha — just as the one Brahman appears differently in each individual consciousness. Worship of each of the twelve forms on his specific month, performed with the appropriate mantras, flowers, and intentions, is declared to constitute complete Sūrya worship — the devotee who completes the twelve-month cycle has offered worship to Sūrya in his totality and obtains liberation at the end of life.