66. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము

సుమంతురువాచ :

మూ॥ ఇత్యుక్త్వా భగవాన్భ్రహ్మ జగామాదర్శనం విభోః సూర్యమారాధయద్దిండీ సూర్యస్యానుచరోఽ భవత్

శతానీక ఉవాచ :

భూయః కథయ విప్రేంద్ర! మాహాత్మ్యం భాస్కరస్యమే శృణ్వతో నాస్తిమే తృప్తి రమృత స్యేవ సువ్రత!

 సుమంతురువాచ :

శృణుష్వావిహితో రాజన్నంవాదం ద్విజ శంఖయోః యంత్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవోనృప!

 ఆసీన మాశ్రమే శంఖం ద్విజో ద్రష్టుం జగామహ ఫలభార నతచ్ఛాయే వృక్ష బృంద సమాకులే

 పరస్పర మృగ శృంగ కండూయిత మృగావృతే బర్హిర్వనాంబరా నీత తీర్థ కందోప భోగినీ

ప్రభూత కుసుమామోద షట్పదోద్గీత శాలిని సిద్ధ దేవర్షి గంధర్వ తీర్థ సేవిత వారిణి

ముండైశ్చ జటిలైశ్చైవ తాప సైరుపశోభితే ఆశ్రమే తంముని శ్రేష్ఠం శంఖాహ్వం సుఖమాస్థితమ్

స్తోతైః స్తోతుం సహస్రాంశుం తద్భక్తం తత్పరాయణమ్ తతః సంహత్య సహసా తం భోజక కుమారకాః

వినీతా ఉపసంగమ్య యథావదభివాద్యచ ఆసనేషూపవిష్టాస్త ఉపవిష్టమథాబ్రువన్

తా॥ సుమంతుముని యిట్లనెను. “ఈ విధముగ చెప్పి బ్రహ్మదేవుడు తన లోకమునకు వెడలిపోయెను. దిండి సూర్యభగవాను నారాధించి సూర్యున కనుచరుడయ్యెను”-1. శతానీకుడిట్లనెను. “బ్రాహ్మణోత్తమా! అమృతుడగు భాస్కరుని మాహత్మ్యము నింకను చేప్పుడు. అతని గూర్చి యెంత వినినను తృప్తి కలుగుటలేదు."-2. సుమంతుడిట్లనెను. “రాజా! ద్విజశంఖ సంవాదమును వినుము. దానిని వినుటచే మానవుడు తన పాపములన్నింటి నుండియు ముక్తుడగును-3. ఒకప్పుడు శంఖముని తన యాశ్రమమున సుఖాసీనుడైయున్నవేళ నాతని దర్శించుటకొక ద్విజుడేతెంచెను. శంఖముని ఆశ్రమప్రాంతము పండ్ల బరువుచే వంగిన కొమ్మలుగల చెట్లతో నిండియుండెను-4. లేళ్ళు తమ కొమ్ములతో పరస్పరము గోకికొనుచుండెను. నెమిళ్ళు, ఆకాశమున నుండి కొని రాబడిన నీళ్లను గ్రోలుచు, తామర దుంపలను దీనుచుండెను-5. పువ్వులు వెదజల్లు పరిమళముల వలన మూగిన తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటగల పవిత్ర జలాశయములలో సిద్దులు, దేవతలు, ఋషులు, గంధర్వులు స్నానాదులనొనర్చుచుండిరి-6. ఆయా ప్రాంతములందు యతులు, వానప్రస్థులు, తపస్వులు ఆ ఆశ్రమారణ్యమును శోభింపజేయుచుండిరి. అట్టి సుందరమైన పరిసరములతో నొప్పుచున్న ఆశ్రమమందు ముని శ్రేష్ఠుడైన శంఖుడు సుఖముగా-సూర్యభగవానుని స్తుతులతోస్తోత్రము చేయుటకు, తదేక చిత్తుడై కూర్చుండి యుండెను. అట్టి తజి భోజక కుమారులాయనచెంత కేతెంచిరి-7,8. వారలు వినీతులై మునిని సమీపించి యధావిధిగ నమస్కరించి ముని యనుజ్ఞతో నాసనములందుపవిష్టులై ఆయనతో నిట్లనిరి.

 మూII భగవన్త్సర్వవేదేషు చ్చింధి నః సంశయే మహాన్ వినయేనోపన్నానాం కుమారాణాం తతో మునిః

అనాదీంశ్చతురో వేదానువాచ ప్రీతిమానసః తేషాంతు పఠతామేవ ఆశ్రమంతు యదృచ్ఛయా

 ముని శ్రేష్ఠోఽథ తందేశ మాజగామ ద్విజో నృప! యథా వదర్చితస్తేన శంఖేనామిత తేజసా

వందితశ్చకుమారై స్తై రభవత్ప్రీ తిమానసః అథైతానబ్రవీచ్ఛంఖస్తాన్ భోజక కుమారకాన్

“శిష్టాగమాదనధ్యాయః సచజాతో విరమ్యతామ్' 'యథాజ్ఞాపయసీత్యాహుః కుమారాస్తే ఋషింతతః

పప్రచ్ఛ సిద్ధిద శ్చైతాన్కే హ్యేతే? కింపఠంతిచ? శంఖోవాచ మహారాజ! కుమారా భోజకాత్మజాః

ససూత్ర కల్పాంశ్చతురో విప్ర! వేదానధీయతే తథైవ సప్తమీకల్పే పరిచర్యాచ భాస్వతః

అగ్ని కార్య విధానంచ ప్రతిష్ఠా కల్పమాహితః అధ్యంగ లక్షణం బ్రహ్మన్నథ యాత్రా విధింతథా

 ద్విజ ఉవాచ :

కథం క్రియేత సప్తమ్యాం కశ్చార్చన విధిక్రమః గంథ పుష్పప్రదీపానాం కింఫలం రవీమందిరే?

 కేన తుష్యతి దానేన ప్రతేన నియమేనచ ధూప పుప్పోప హారాది కించదేయం వివస్వతే?

ఏత దిచ్ఛామ్యహంశ్రోతుం తస్మేబ్రూహి తపోధన! విశేషతస్తు మాహాత్మ్యం బ్రూహిమాం భాస్కరస్యహి

తా II "భగవన్! వేదములన్నింటి విషయమున మాకుగల సందేహములను నివారింపుడు” అవి వినమ్రులై యడిగిన ఆ కుమారులయెడ శంఖముని-10. ప్రీత మానసుడై అనాదులైన నాలుగు వేదములను చెప్పెను. ఆశ్రమమునందు వారి వేదపాఠము జరుగుచుండగా నొకనాడు యాదృచ్చికముగ-11 మునిశ్రేష్ఠుడగు ద్విజుడచటికే తెంచెను. అమిత తేజస్వియైన శంఖముని యాద్విజుని యథోచితముగ సత్కరించెను 12. కుమారులు కూడ అతనికి నమస్కరించిరి. అతడు సంప్రీతుడయ్యెను. అప్పుడు శంఖముని తన శిష్యులైన భోజకుమారులతో నిట్లనెను-13. “శిష్టులగు వారేతెంచినపుడు అధ్యయనము చేయకూడదని శాస్త్రము. నేడు మన చెంతకట్టి మహాత్ముడు వచ్చెను.కావున మీరు పాఠములు చదువుట విరమింపుడు.” కుమారులు “మీ యాజ్ఞప్రకారమటులే చేయుదుమని” బదులు పలికిరి-14. ఆగంతకుడైన ద్విజుడు విద్యార్థులను గూర్చి “ఎవరు వీరు? ఏమి చదువుచున్నారు.? “అని అడిగెను, శంఖముని, సమా ధానముగా " మహాత్మా! వీరు భోజకుని పుత్రులు -15. సూత్రములతో సహా కల్పములను, వేదములను అధ్యయనము చేయుచున్నారు. అటులే సప్తమీ కల్పము, సూర్యభగవానుని పూజా విధానము-16. అగ్నికార్యపద్దతి, ప్రతిష్టాకల్పము మొదలుకొని ఆయాదేవతల అంగలక్షణములను గూర్చి, సూర్యరథయాత్ర గుణించియు నేర్చుకొనుచున్నారు'-17. ద్విజుడిట్లనెను. “సప్తమినాడు చేయవలసిన విధానమేమి? సూర్యదేవుని పూజించు పద్ధతి ఏమి? సూర్యమందిరమున నాదేవుని గంథపుష్పాదులచేత, ధూపదీపనైవేద్యాదులచేత పూజించినచో నెట్టి ఫలము కలుగును?-18. ఆదేవుడే దానముతో తృప్తినందును? ఏ వ్రతముచే, ఏ నియమముచే నాదేవేశుడు సంతోషించును? సూర్య పూజకొఱకెట్టి ధూప, పుష్ప, నైవేద్యములుపయోగింపవలెను?-19. ఓ తపోధనా ఈవిషయములు వినుట కిచ్ఛకలదు. కావున, వినిపింపుడు. ముఖ్యముగా సూర్యుని మాహాత్మ్యమును గూర్చినాకు తెలుపుడు”.

మూ॥ శంఖ ఉవాచ :

ఇమమర్థం విశిష్టేన పృష్టః సాంబో యథాపురా సచోవాచ వశిష్ఠాయ తదహంకథయామితే

 అత్రాశ్రమే పుణ్యతమే తీర్ధానా ముత్తమే ప్రభుః వవందే నియతాత్మానం వశిష్ఠం ముని సత్తమమ్

 వినయేనోపసంగమ్య వవందే చరణౌ మునేః కృతప్రణామం సాంబంతు భక్తి ప్రహ్వీకృతాననమ్

 విలోక్య పరమప్రీతో మునిః పప్రచ్ఛ తంతదా సర్వతః స్పుటీతమ్ గోత్రం కు ష్ఠేన మహాతా తవ

 ఘోర రూపేణ తీవ్రేణ, కథం తద్విగతం తవ? కథంచ లక్ష్మీరధికా రూపంచాతి మనోహరమ్?

తేజస్వి తాత మహతీ తథైవ సుకుమారతా

సాంబ ఉవాచ :

స్తుతో నామ సహస్రేణ లోకనాథో దివాకరః దర్శనంచ గతః సాక్షాద్దత్తవాంశ్చ వరాన్మమ

వశిష్ఠ ఉవాచ :

కథమారాధితః సూర్యస్త్వయా యాదవనందన! కైశ్చవ్రత తపోదానైర్దర్శనం భగవాన్గతః

సాంబఉవాచ :

శృణుష్వావహితో బ్రహ్మన్సర్వ మేవ మయాయథా తోషితో భగవాన్సూర్యో విధినా యేన సువ్రత!

తా॥శంఖముని యిట్లనెను. “ఇదే విషయమును పూర్వమొకప్పుడు వసిష్ఠ మహర్షి యాదవ నందనుడైన సాంబునడిగెను. సాంబుడు వసిష్ఠునకు చెప్పిన అంశమును మీకు చెప్పెదను వినుడు-21. తీర్థములలో నుత్తమమైనది, పుణ్యతమమైనదియునైన వసిష్టాశ్రమమున కేతెంచి సాంబుడు నియతాత్ముడైన ఆ ముని సత్తమునకు నమస్కరించెను-22. సాంబుడు మిక్కిలి వినయముతో వసిష్ఠ మహర్షిని సమీపించి ఆయన పాదములకు నమస్కరించేను. భక్తితో వినమ్రమైన ముఖము గలవాడై ప్రణమిల్లిన సాంబుని చూచి-23. వసిష్ఠుడు మిక్కిలి సంప్రీతుడై అతని నిట్లు ప్రశ్నించెను. “నీశరీర మంతయు కుష్ఠవ్యాధిచేత తీవ్రముగా, భయంకరముగ 'పగుళ్ళువారి యుండెను గదా! ఆ వ్యాధి ఎట్లు పోయినది? మిక్కిలి మనోహరమైన రూప సౌభాగ్యముతో, సౌకుమార్యముతోను ప్రకాశించుచున్నావు. ఇదెట్లు సంభవించినది?'-25,26. సాంబుడిట్లనెను. “లోకనాథుడైన దివాకరుని సహస్రనామములతో స్తుతించితిని. స్వామీ! ఆదేవదేవుడు నాకు సాక్షాత్తుగ దర్శనమిచ్చెను”-27. వసిష్ఠుడిట్లడిగెను. “సాంబా! సూర్యదేవునెట్లో రాధించితివి? ఏ వ్రతము చేత, ఎట్టి తపస్సు చేత, ఏఏ దానములచేత నాభగవానుడు నీకు దర్శన మొసంగియను గ్రహించెను?” సాంబుడిట్లు సమాధానము చెప్పెను. “హే బ్రహ్మన్! ఏ విధిచేత ఉపాసింపబడుటచేత సూర్యభగవానుడు సంతుష్టుడై నాయెడ ప్రసన్నుడయ్యెనో సాకల్యముగ చెప్పుచున్నాను. అవధానముతో వినుడు.

 మూII మోహన్మయోప వాసితో దుర్వాసాః కోపనోమునిః తత్కోహం తస్యశాపేన మహాకుష్ఠమవాప్నుయాత్

తతోఽహం పితరం గత్వా కుష్ఠ యోగాభి పీడితః లజ్జమానోఽతి గర్వేణ. ఇదం వాక్యమధాబ్రువమ్

 తాత! సీదతి మేగాత్రం స్వరశ్చ పరిహీయతే ఘోర రూపో మహావ్యాధర్వపు రేష జిఘాంసతి

అశేష వ్యాధి రాజ్ఞాహం పీడితః క్రూర కర్మణా వైద్యైరోషధిభిన్చైవ న శాంతిర్మమ విద్యతే

సోఽహం త్వయా హ్యనుజ్ఞాతస్త్యక్తుమిచ్ఛామి జీవితమ్ యది వాహమను గ్రాహ్యస్తతోఽను జ్ఞాతు మర్హసి

ఇత్యుక్తవాక్య: సపితా పుత్రశోకాభి పీడితః పితాక్షణం తతోధ్యాత్వా మామేవం వాక్యముక్తవాన్

ధైర్య మా శ్రయతాం పుత్ర! మాశోకేచ మనః కృథాః హంతి శోకార్దితం వ్యాధిః శుష్కంతృణ మీవానలః

దేవతారాధన పరోభవ పుత్రక! మాశుచః ఇత్యుక్తేచ మహాప్రోక్తో దేవ మారాధయామి కమ్?

కమారాధ్య విముచ్యేఽ హం తాత! రోగైః సమంతతః ఇత్యేవముక్తో భగవాన్మమువాచ పితా మమ

ఇమమర్థం పురాపృష్టః పద్మయోనిః సనాతనః యాజ్ఞ వల్యేన ఋషిణా యోగీశేన మహాత్మనా

 యదువాచ మహాతేజాస్త స్మైస యదునందన! తచ్ఛృణుష్వ శుచిర్భూత్వా ఆత్మనః శ్రేయసే సుత!

తా॥ నేనొక పర్యాయము కోపస్వభావుడైన దుర్వాస మహామునిని అజ్ఞానముచే పరిహసించితిని. ఆతడు నన్ను శపించెను. ఫలితముగా నాకు కుష్టువ్యాధి సోకెను-30. అప్పుడు కుష్ఠవ్యాధి పీడితుడనగునేను నాతండ్రి వద్దకు బోయి సిగ్గుపడుచు, మిక్కిలి గర్వముతో నిట్లంటీని-31. 'తండ్రీ! నా శరీరము వ్యాధిచే గళితమగుచున్నది. కంఠస్వరము కూడా క్షీణించి పోవుచున్నది. భయంకరమగు నీవ్యాధిచే ఈ శరీరము నశించుచున్నది-32. క్రూరకర్ముడైన ఈ రోగరాజు సన్ను శిక్షింపుచున్నాడు. వైద్యుల వలన ఔషధములవలన నాకు శాంతి కలుగుటలేదు-33. అందువలన మీ అనుజ్ఞతో ఈ జీవితము చాలింపవలెనని కోరుచున్నాను. నన్ననుగ్రహింపదలచినచో నాకనుజ్ఞనిండు-34. ఆ మాటలు విని, తండ్రి, పుత్రశోక పీడితుడై, ఒక్కక్షణమాలోచించి నాతో నిట్లనెను-35. “కుమారా! ధైర్యము వహించియుండుము. చింతింపకుము, ఎండుగడ్డిని అగ్ని దహించివేయునట్లు, శోకముతో కుమిలిపోవు వానిని వ్యాధి నశింపజేయును-36. వత్సా! దుఃఖింపవలదు, దేవతారాధన పరుడవు కమ్ము! అదియే నీకు శాంతి నొసంగును.” అని నన్నోదార్చెను. 'ఏ దేవుని పూజింతును?' అను ప్రశ్ననానుండి వెలువడేను-37. 'తండ్రీ! ఏ దేవత నారాధించినచో నేనీ వ్యాధుల నుండి ముక్తుడనగుదును? నా ఈ ప్రశ్నవిని నా తండ్రి యిట్లనెను. “ఇట్టి ప్రశ్ననే పూర్వము యోగీశుడైన యాజ్ఞవల్క్యఋషి సనాతనుడైన బ్రహ్మదేవునడిగెను-39. బ్రహ్మదేవుడా ఋషికి చెప్పిన విషయమునే నేను నీకు చెప్పుచున్నాను. నీ శ్రేయస్సు కొఱకు చెప్పబడు నిట్టి విషయమును శుచియై వినుము.

 మూ॥ సురజ్యేష్ఠం సుఖాసీనం పద్మయోనిం ప్రజాపతిమ్ యాజ్ఞవల్క్యో మహాతేజాః పర్యపృచ్ఛత్పితామహమ్

భగవన్చ్రోతుమిచ్ఛామి కించిదాత్మ మనోగతమ్ సమారాధ్య విభేదేవం నోముచ్యేతపై భవాత్

గృహస్థో బ్రహ్మచారీవా వానప్రస్థోఽధ భిక్షుకః య ఇచ్ఛేన్మోక్ష మాస్థాతుం దేవతాంకాం యజేత సః?

 కుతోహ్యస్య ధ్రువః స్వర్గః కుతోనైః శ్రేయసం సుఖమ్ స్వర్గతశ్చైవ కింకుర్యాద్యేన నచ్యవతే పునః

దేవతానాంతు కోదేవః పితృణాంచైవ కః పితా? తస్మాత్పర తరం యచ్చ తన్మేబ్రూహి పితామహ!

కేనసృష్ట మిదం విశ్వం బ్రహ్మన్దావర జంగమమ్ ప్రలయేచ కమబ్యేతి తన్మేత్వం వక్తుమర్హసి

 బ్రహ్మోవాచ :

సాధు పృష్టోఽ స్మిభవతా తుష్టశ్చాస్మిమహామతే ప్రణమ్యశిరసాదేవం పుణ్యోత్తర మనుత్తమమ్

కథయి ష్యే ద్విజశ్రేష్ఠ! శృణు ష్వైకమనాధునా ఆత్మనః శ్రేయసే విప్ర! శుచిర్భూత్వా సమాహితః

ఉద్యన్య ఏనకురుతే జగద్వితిమిరం కరైః నాతః పరతరో దేవః కిమన్యత్కథయామితే

అనాది నిధనో హ్యేష పురుషః శాశ్వతో ఽ వ్యయః దీపయత్యేవ లోకాంగ్రవీ రశ్మిభిరుల్బణైః

తా॥ సురజ్యేష్ఠుడు, పద్మసంభవుడు, ప్రజాపతియునైన బ్రహ్మదేవుడు సుఖముగా కూర్చుండియుండగా మహాతేజస్వియైన యాజ్ఞ వల్క్యుడా తనినిట్లు ప్రశ్నించెను-41. “ఓ బ్రహ్మదేవా! నా మనస్సునందుగల ఒక సందేహమునకు మీ నుండి సమాధానము వినదలచితిని. దేవతారాధనము చేతనే మానవుడు సంసారబంధమునుండి ముక్తుడగును. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వీరిలో నెవరేనియు మోక్షమును పొందుటకిచ్చయించినచో నేదేవతను పూజింపవలెను?-43. స్వర్గము పొందుటకే దేవతనుపాసింపవలెను? మోక్షప్రాప్తి కొఱకెవరిని ఆశ్రయింపవలెను? స్వర్గమును పొందిన వాడు కూడ శాశ్వతానందరూపముక్తి నందుటకు-జననమరణ రూప సంసారములోనికి తిరిగిపడిపోకుండుటకేమి చేయవలెను?-44. దేవతలందలోను ప్రధాన దేవత ఎవరు? పితృదేవతలలో ప్రధాన పితృదేవత ఎవరు? పరాత్పరుడెవరు? నా యీ సందేహములను దీర్పుడు -45. స్థావర జంగమాత్మకమగు నీ విశ్వసృష్టికి కర్త ఎవరు? ప్రళయమునందీది ఎవనిలోలయమొందును? దయతో నాకుఁ దెలుపుడు.” యాజ్ఞవల్క్యుని ఈ సందేహములపై బ్రహ్మదేవుడిట్లనెను. “మంచి ప్రశ్నలడిగితివి. సంతోషించితిని. పుణ్యతముడు, ఉత్తమోత్తముడైన ఆ దేవదేవునకు శిరస్సు వంచి నమస్కరించి-47. చెప్పుచున్నాను. సావధానుడవై వినుము. నీ శ్రేయస్సు కొఱకు చెప్పబోయేడు ఈ విషయమును శుచిర్భూతుడవై ఏకాగ్రచిత్తుడవై వినుము-48. ఉదయించుచునే జగత్తులోని చీఁకట్లను పారద్రోలి తన సహస్ర కిరణములతో వెలుగులు ప్రసరింపజేయు సూర్యభగవానుని కంటే శ్రేష్ఠతరుడైన దేవుడు మజిలేడు. ఇంతకంటే వేజేమి చెప్పవలయును?-49. ఈ పురుషుడనాదినిధనుడు. శాశ్వతుడు. అవ్యయుడు. తన దేదీప్యమానమైన కిరణములతో ముల్లోకములను ప్రకాశింపఁజేయువాడు.

 మూII సర్వదేవాత్మకో హ్యేష తపసాచాంశుతాపనః సర్వస్య జగతో నాథః కర్మసాక్షీ శుభాశుభే

క్షపయత్యేవ భూతాని తథా విసృజతే పునః ఏషభాతి తపత్యేష వర్థతేచ గభస్తిభిః

ఏషధాతా విధాతాచ పూషా ప్రకృతి భావనః న హ్యేష క్షయమాయాతి నిత్యమక్షయ మండలః

పితృణాం పితా హ్యేష దేవతానాంచదేవతా ధ్రువం స్థానం స్మృతం హ్యేష ఆధారో జగతస్తథా

 సర్వకాలే జగత్కృత్స్న మాదిత్యాత్సంప్రసూయతే ప్రలయేచ తమభ్యేతి ఆదిత్యం దీప్తతేజసమ్

యోగినశ్చాత్ర సంలీనాస్త్యక్త్వా గృహకలేబరమ్ వాయుభూతా విశంత్యస్మి స్తేజో రాశౌ దివాకరే

 తస్య రశ్మిసహస్రాణి శాఖాఇవ విహంగమాః వసంత్యాశ్రిత్యమునయః సంసిద్ధాదేవతైః సహ

జనకాదయో గృహస్థాస్తు రాజానోయోగ ధర్మిణః వాలఖిల్యదయశ్చైవ మునయోబ్రహ్మచారిణః

వ్యాసాదయోవనస్థాశ్చ భిక్షుః పంచశిఖస్తథా సర్వేతే యోగమాస్థాయ ప్రవిష్టాః సూర్యమండలమ్

 శుకో వ్యాసాత్మజః శ్రీమాన్యోగధర్మమవాస్యప్యతు ఆదిత్య కిరణాన్పీత్వా నపునర్భవమాప్తవాన్

తా॥ ఇతడు సర్వదేవాత్మకుడు. తాను వెలుగుచు జగత్తులను వెలిగించువాడు. సర్వజగత్తులకు నాథుడు. శుభాశుభ కర్మలన్నింటికి సాక్షి-51. సర్వభూతములను లయమొనరించును. మఱల సృష్టించును. అతడు ప్రకాశించును. తపించును. రశ్ములతో వృద్ధియగును-52. అతడే ధాత. విధాత. పూష. ప్రకృతి భావనుడు. ఎప్పుడును క్షయమందక అక్షయమగు మండలము గలవాడై వెలుగుచుండును-53. పితరులకు విత. దేవతలకు దేవత. అతని స్థానము శాశ్వతమైనది. జగదాధారుడతడు-54. సర్వకాలములయందును ఈ చరాచర సృష్టి ఆ ఆదిత్యుని నుండీయే ప్రభవించును. ప్రళయమునను ఆ దీప్తతేజుని చేరును-55. యోగి పుంగవులు తమ కళేబరములను వదలి అతనిలోననే లీనతఁజేందిరి. తేజోరాశియైన దివాకరునిలోనిట్టివారు వాయుభూతులై ప్రవేశింతురు-56. కొమ్మలనాశ్రయించి పక్షులుండినట్లు అతని కిరణముల నాశ్రయించియుండు దేవతలతో కూడ మునులు, సిద్దులును ఉందురు-57. జనకరాజు మొదలగు గృహస్థులు, రాజులు, యోగులు, వాలఖిల్యాది మునులు, బ్రహ్మచారులు, వ్యాసాది వానప్రస్థులు, భిక్షువులు, పంచశిఖులు-వీరందఱును యోగముననుండి సూర్యమండలమున ప్రవేశించిరి-59. వ్యాసుని కుమారుడైన శ్రీశుకుడు యోగధర్మమును పొంది, సూర్యకిరణములను త్రాగి పునర్జన్మలేని వాడయ్యెను.

 మూII శబ్దమాత్రాః శ్రుతి సుఖా బ్రహ్మవిష్ణు శివాదయః ప్రత్యక్షోఽయం స్మృతోదేవః సూర్యస్తిమిరనాశకః

తస్మాదన్యేవ్రతే భక్తిర్న కార్యా శుభమిచ్ఛతా దృష్టేన సాధ్యతే యస్మాదదృష్టం నిత్యమేవహి

త్వయాతః సతతం విప్ర! అర్చనీయోదివాకరః

 యజ్ఞవల్క్య ఉవాచ :

అహో య ఏషకథతో భవతా భాస్కరోమమ దేవతా సర్వదేవానాం నైతన్మిథ్యాప్రజాయతే

తస్యదేవస్య మాహాత్మ్యం శ్రుతం సు బహుశోమయా దేవర్షి సిద్ధమనుజైః స్తుత స్యేహమహాత్మనః

 కః స్తౌతి దైవతమజం యస్యై తత్సచరాచరమ్ అక్షయస్యాప్రమేయస్య కిరణోద్గమనాద్భవేత్

దక్షిణా తిరణాద్యస్య సంభూతో భగవాన్హరి: వామాద్భవాంస్తధా జాతః కిరణాత్కిల కంజజ!

లలాటాద్యస్యరుద్రస్తు కోతుల్యా తేనదేవతా తస్యదేవస్య కః శక్తః ప్రవక్తుం గుణవిస్తరమ్

సోఽహ మిచ్ఛామి, దేవస్య తస్య సర్వాత్మనః ప్రభోః శ్రోతు మారాధనం యేన నిస్తరేయం భవార్ణవమ్

 కేనోపాయేన మంత్రైర్వా రహస్యైః పరిచర్యయా దానైర్వ్రతోపవా సైర్వా ర్జప్యైరథాపివా

 ఆరాధితః సమస్తానాం క్లేశానాం హానిదో రవిః శక్యః సమారాధయితుం కథం శంస ప్రజాపతే!

తా॥ బ్రహ్మ, విష్ణు, రుద్రులు శబ్దమాత్రులు. వినికిడికి సుఖమునిచ్చువారు. కానీ ఈ తిమిరనాశకుడగు సూర్యభగవానుడనినచో ప్రత్యక్షదైవమని చెప్పబడెను-61. కావున శుభమును కోరువాడు సూర్యవ్రతముల యందు తప్పనితర వ్రతములయందు భక్తి కలిగియుండ నక్కఱలేదు. ఏలయన నెల్లప్పుడు అదృష్టమనునది ప్రత్యక్షము చేతనే సాధింపబడగలుగును. అందువలన నీవు కూడా సూర్యభగవానునారాధింపుము-62. యాజ్ఞవల్క్యుడిట్లనెను. “ఆహో! మీరు చెప్పిన ఈ సూర్యదేవుడు సర్వదేవతలకును దేవతయే.అందసత్యమేమియులేదు-63. అతని గొప్పతనమును గూర్చి దేవతలు, ఋషులు, సిద్ధులు, మనుష్యులు స్తోత్రము చేయుటనేననేక విధములుగా వినియుంటిని-64. ఎవని వలన ఈ చరాచర జగత్తెవిర్భవించినదో అట్టి అజుడు, అక్షయుడు అప్రమేయుడునైన దైవతము నెవరు స్తుతింపగలరు?-65. అతని కుడిప్రక్క రశ్మినుండి భగవానుడగు విష్ణువు పుట్టెను. ఎడమ ప్రక్క కిరణము నుండి బ్రహ్మవగు నీవు పుట్టితివి-66. ఫాలభాగమునుండి శివుడు జన్మించెను. అతనితో సమానమగు దేవత ఎవరు? అతని గుణవిశేషములను విస్తరించి చెప్పుటకెవరు సమర్థులు?-67. భవసాగరమును దాటింపగల ఆ సర్వాత్ముడగు సూర్యదేవుని పూజావిధానమును నేను వినగోరుచున్నాను-68. ఏ ఉపాయము చేత, ఏ రహస్యమంత్రముల చేత, ఎట్టి సేవ చేత, ఎట్టి దానముల చేత, ఏ వ్రతములచేత, ఏ ఉపవాసములచేత, ఎట్టి హోమములచేత, ఎట్టిజపములచేత-69. ఆ సూర్యభగవాను డారాధింపబడి క్లేశనాశకుడగును? ఓ బ్రహ్మదేవా! ఆ రవిని ఎట్లు పూజించుటకు సాధ్యపడునో ప్రస్తుతింపుడు.

 మూII ధర్మార్థ కామ సంప్రాప్తౌ పురుషాణాం విచేష్టతామ్ జన్మన్య వితధా సైకాక్రియా యార్కం సమాశ్రితా

దుర్గ సంసార కాంతార మపార మభిధావతామ్ ఏకః సూర్య నమస్కారో ముక్తి మార్గస్య దేశకః

 సోఽహమిచ్ఛామి తం దేవం సప్తలోక పరాయణమ్ .కాలాయన మశేషస్య జగతో హృద్యవస్థితమ్

గారయితుం గోపాలం దనయుని జననీ శంకరం గతో సుశకునాలుకకక .

తమనాద్యం సురశ్రేష్ఠం ప్రసాదయితు మిచ్ఛతః ఉపదేశ ప్రదానేన ప్రసాదం కుర్తుమర్హసి”

తస్యైతద్వచనం శ్రుత్వా భక్తి ముద్వహతోరవౌ జగామ పరితోషంస పద్మయోనిర్మహాతపాః

బ్రహ్మోవాచ :

యత్పృచ్ఛసి ద్విజశ్రేష్ఠ! సూర్యస్యారాధనంప్రతి వ్రతోపవాస జప్యాది తది హైక మనాః శృణు

అనాది యత్పరం బ్రహ్మ సర్వ హేయవివర్జితమ్ వ్యాప్య యత్సర్వభూతేషు స్థితం సదసతఃపరమ్

 ప్రధాన పుంసోరన యోగ్యతః క్షోభః ప్రవర్తతే నిత్యయోర్వ్యాపినోశ్చైవ జగదాదౌ మహాత్మనోః

తత్ క్షోభకత్వాద్భ్రాహ్మాండం సృష్టేర్హే తుర్నిరంజనః అహేతురపి సర్వాత్మా జాయతే పమేశ్వరః

ప్రధాన పురుషత్వంచ తథైవేశ్వర లీలయా సము పైతి తతశ్చైవం బ్రహ్మత్వం ఛందతః ప్రభుః

తతః స్థితౌ పాలయితా విష్ణుత్వం జగతః క్షయే రుద్రత్వంచ జగన్నాథః స్వేచ్ఛయా కురుతే రవి:

 తమేక మక్షరం ధామ సర్వదేవ నమస్కృతమ్ భేదాభేద స్వరూపం తం ప్రణిపత్య దివాకరమ్

వర్ణయిష్యేఽ ఖిలం విప్ర! తస్యైవారాధనం రవేః

గుహ్యం చాపి తథా తస్య భాస్కరస్య శృణుష్వవై తుష్టేన హిపురా మహ్యం కథితం భాస్కరేణ తు.

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి యాజ్ఞ వల్క్య బ్రహ్మసంవాదే సప్తమికల్పే ఆదిత్య మాహాత్మ్య వర్ణనం నామ షట్ షష్టి తమోఽధ్యాయః

తా॥ ధర్మార్థ కామములు పొందుటయందు తత్పరులైన పురుషులకు జన్మలో ఎప్పుడును వ్యర్థము కానిది సూర్య భగవాను నాశ్రయించి చేయబడు కర్మ మాత్రమే-71. చొరరాని సంసారమనెడు అరణ్యమునఁబడి పర్వులెత్తుచున్న వారికి సూర్య నమస్కార మొక్కటియే ముక్తి మార్గమును నిర్దేశింపగలది-72. ఏడు లోకములకును సంబంధించి యుండువాడు, అశేష కాలమునందంతట పయనించువాడు, విశ్వ హృదయముననుండువాడు-73. దిక్కులనన్నింటిని పాలించువాడు, గ్రహములకు ప్రభువు, అమిత తేజస్వి, జగత్తునకు సుఖమును వెలుగునుపంచువాడు, స్మరించిన మాత్రముననే పాపములను పటాపంచలు చేయువాడునైన ఆ సూర్యదేవు నారాధింప గోరుచున్నాను-74. అనాద్యుడగు నా దేవతాశ్రేష్ఠుని ప్రసన్నుని చేసికొనగోరు నాకు ఆ మార్గమునుపదేశించి నన్నను. గ్రహింపుడు-75". సూర్య భగవానునియందు భక్తిని ప్రేరేపించు యాజ్ఞవల్క్యుని యీ మాటలు విని మహాతపస్వియైన బ్రహ్మదేవుడమితానందమునొందెను-76. ఆనందముతో బ్రహ్మదేవుడిట్లనెను “ఓ బ్రాహ్మణోత్తమా! నీ వడుగుచున్న సూర్యారాధనము, ప్రతోపవాస జపాదికముల గుఱించి చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము-77. “హేయ వివర్జితము, అనాది, సదసత్తులకతీతమునైన పరబ్రహ్మ వస్తువు సర్వ భూతములయందు పరివ్యాప్తమై యున్నది-78. నిత్యులు, సర్వ వ్యాపకులు, జగత్సృష్టికి మొదటివారు, మహాత్ములునైన ప్రకృతి పురుషులలో సంక్షోభము కలిగినప్పుడు-79. బ్రహ్మాండము సృష్టింపబడుచున్నది. ఈ సృష్టికి కారణము పరమాత్మ, తనకు అన్యకారణమేదియులేని పరమేశ్వరుడిట్లు సృష్టి రూపమున ఆవిర్భవించుచున్నాడు.-80. అతడే తన లీలతో ప్రకృతిత్వ పురుషత్వములనుపొంది విస్తృతమైన ఈ జగద్రూపమును తనయూహగా రచింపుచున్నాడు-81. ఆ పరమాత్మయగు సూర్య భగవానుడే జగత్పరిపాలనావసరమున విష్ణువుగను, క్షయ కాలమున రుద్రుడుగను స్వేచ్ఛచే రూపొందుచున్నాడు-82. అక్షరుడు, తేజోరూపుడు దేవతలందతిచేత నమస్కరింపబడువాడు, భేదాభేద స్వరూపుడునైన ఆ సూర్య దేవునకు నమస్కరించి, అతని ఆరాధన పద్ధతిని అంతయును వర్ణింతును-83. ఇది రహస్యమేమైనను నీకు చెప్పుచున్నాను. నా యెడ ప్రసన్నుడై సూర్యుడే పూర్వము నాకిది చెప్పియుండెను.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున యాజ్ఞ వల్క్య బ్రహ్మసంవాదమున, సప్తమి కల్పమునందు ఆదిత్య మహిమ వర్ణనమను అటువది యాఱవ అధ్యాయము సమాప్తము.