65. ఆదిత్యమహాత్మ్య వర్ణనమున రహస్యా సప్తమి వర్ణనము

 మూ॥ బ్రహ్మోవాచ :

అతః పరం ప్రవక్ష్యామి రహస్యాం నామ సప్తమిమ్ సప్తమి కృత మాత్రేయం నరాంస్తారయతే భవాత్

 సప్తాపరాన్సప్త పూర్వానితరాంశ్చాపి నసంశయః రోగాంశ్ఛినత్తి దుశ్ఛేద్యాన్దుర్జయాన్ జయతే హ్యరీన్

 అర్థాన్ప్రాప్నోతి దుష్ప్రాప్యాన్యః కుర్యాన్నామ సప్తమిమ్ కన్యార్థీ లభతే కన్యాం ధనార్థీ లభతే థనమ్

పుత్రార్థీ లభతే పుత్రా న్దర్మార్థీ ధర్మమాప్నుయాత్ సమయాన్పాలయన్సర్వాన్కురానిచ్చేమాం విచక్షణః

సమయాన్ శ్రుణు భూతేశ శ్రేయసే గదతోమమ ఆదిత్య భక్తః పురుషః సప్తమ్యాం గణనాయక!

మైత్రీం సర్వత్రవైకుర్యాద్భాస్కరం వాపీచింతయేత్ సప్తమ్యాంన స్పృశేత్తైలం నీలం వస్త్రం నధారయేత్ నచాప్యామలకైః స్నానం నకుర్యాత్కలహం క్వచిత్

 దిండిరువాచ :

కిమర్థంనస్పృశేత్తైలం సప్తమ్యాం పద్మ సంభవ!

కశ్చదోషో భవేద్దేవ! నీల వస్త్రస్యధారణాత్

 బ్రహ్మోవాచ :

శృణుదిండే మహాబాహో! నీల వస్త్ర స్యధారణే

 దూషణం గణ శార్దూల! గదతో మమ కృత్స్నశః పాలనం విక్రయశ్చైవ సద్వృత్తి రుపజీవనమ్

 పతితస్తు భవేద్విప్ర స్త్రిభిః కృచ్చై ర్విశుధ్వతి నీలీ రక్తన వస్త్రేణ యత్కర్మ కురుతే ద్విజః

 తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. ఇక పైన 'రహస్యాసప్తమి' గూర్చి చెప్పెదను. ఈ వ్రతానుష్టానము వలన గడచిన ఏడు తరముల వారు, రాబోవు ఏడు తరములవారును జనన మరణ రూప సంసారము నుండి ముక్తులగుదురనుటలో సంశయములేదు. అంతేకాక దారుణములైన రోగములు నశించిపోవును. దుర్జయులైన శత్రువులు జయింపబడుదురు-1, 2. దుస్సాధ్యములగు ప్రయోజనములు నెరవేరును. వివాహము కానీ వానికి వివాహమగును. ధనము కావలసినవాడు ధనవంతుడగును-3. కొడుకులు కావలసిన వారికి కొడుకులు కలుగుదురు. ధర్మము కోరెడు వానికి ధర్మము లభించును. విచక్షణుడు సమయమును పాలించుచు దీనిని చేయవలెను-4. శ్రేయస్సు కొఱకు ఈ సమయములను (ఆచార నియమములు) చెప్పెదను. వినుము. సూర్యుని భక్తుడైన మనుష్యుడు సప్తమినాడు-5, అందజీయెడ స్నేహభావమున నుండవలెను. సూర్య దేవుని చింతన చేయుచుండవలెన. ఆ దినమున నూనెను ముట్టకూడదు. నీలపు రంగు వస్త్రమును ధరింపకూడదు-6. ఉసిరికలతో స్నానము చేయకూడదు. ఎవరి తోడను జగడమాడరాదు. “దిండి ఇట్లనెను” ఓ బ్రహ్మదేవా! సప్తమినాడు తైలము నెందులకు స్పృశింపరాదు-7. నీల వస్త్రమును ధరించుటచే నెట్టి దోషము కలుగును?” ఈ ప్రశ్నలు విని బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. "దిండీ! నీల వస్త్ర ధారణము వలన-8. ఏమి దోషము కలదో విశదముగ చెప్పెదను వినుము-8. పశ్వాదులను పాలించుట, అమ్ముట, సద్వృత్తి పై ఆధారపడి జీవించుట (జీవిక కొఱకు యతి వృత్తి నవలంబించుట)-వీనిచేత బ్రాహ్మణుడు పతనమగును. మూడు కృచ్చ వ్రతములచేత శుద్దుడగును. (మూడు దినములు పగలు మాత్రము, మూడు దినములు రాత్రి మాత్రము, బోజనము, మూడు దినములయాచిత భోజనము, మూడు దినములు కేవలము ఉపవాసము కృచ్ఛమనబడును. నీలవస్త్రము ధరించి చేసిన కర్మవ్యర్థమగును.

 మూ॥ స్నానం దానం జపో హోమః స్వాధ్యాయః పితృతర్పణమ్ వృథా తస్యమహాయజ్ఞా: నీలసూత్రస్య ధారణాత్

నీలి రక్తం యదా వస్త్రం విప్రస్త్వం గేషు ధారయేత్ అహో రాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుద్ధ్యతి

 రోమ కూపే యధా గచ్ఛేద్రక్తం నీలస్య కస్యచిత్ పతితస్తు భవే ద్విప్రస్తిభిః కృచ్ఛై ర్విశుధ్యతి

నీలీ మధ్యం యధా గచ్ఛేత్ప్రమా దాద్భ్రాహ్మణః క్వచిత్ అహోరాత్రోషితో భూత్వాపంచ గవ్యేన శుద్ధ్యతి

 నీలీ దారు యథా భింద్యాద్భ్రాహ్మణానాం శరీరకే శోణితం దృశ్యతే యత్ర ద్విజశ్చాంద్రాయణం చరేత్

 కుర్యాదజ్ఞానతో యస్తు నీలేరా దంతధావనమ్ కృత్వా కృచ్చ్రద్వయం పిండే! విశుద్ధః స్యాన్నసంశయః

వాపయేద్యత్రనీలీతు భవేత్తత్రాశుచిర్మహీ ప్రమాణ ద్వాదశాబ్దాని తత ఊర్థ్వ శుచిర్భవేత్

సప్తమ్యాం స్పృశత స్తైల మిష్టాభార్యా వినశ్యతి ఇత్యేష నీలీ తైలస్య దోషస్తే కఠితో మయా

నచైవ ఖాదేన్మాంసాని మద్యాని నపిభేద్బుధః నదోహం కస్యచితుర్యాన్నపారుష్యం సమాచరేత్

 నావ భాషేత చండాలం స్త్రియం నైవ రజస్వలామ్ నవాపి సంస్పృశేధ్ధీనం మృతకం నావలోకయేత్

తా॥ నీల సూత్రముతో చేయబడిన వస్త్రమును ధరించి చేసిన స్నానము, దానము, జపము, హోమము, వేదాధ్యయనము, పితృతర్పణము, మహాయజ్ఞము లేవియైనను వ్యర్థములగును-11. బ్రాహ్మణుడు నీలిరంజన గల వస్త్రము నొకమారు ధరించిన యెడల దాని వలన కలుగు దోషము ఒక పగలు ఒకరాత్రి ఉపవాసము చేసి పంచగవ్యప్రాశన చేసిన యెడల శుద్ధి యగును.-12. నీలవర్ణమేదేని రోమకూపములందు ప్రవేశించిన యెడల అట్టివాడు పతితుడగును. మూడు సాంతపనములు (కృచ్చములు) ఆచరించినచో శుద్దుడగును-13. బ్రాహ్మణుడెప్పుడేని పొరపాటున ద్రోణి వృక్షముల మధ్యకు పోయినచో అహోరాత్రములుపవసించి పంచగవ్యప్రాశన చేసినచో నాదోషము పోయి పరిశుద్దుడగును-14. నీలికట్టి బ్రాహ్మణుల శరీరమునందు తగిలి రక్తము కనబడినచో చాంద్రాయణ వ్రతము నాచరింపవలెను -15. ఎవడేని అజ్ఞాన వశమున నీలి పుల్లతో దంతధావనము చేసికొనిన యెడల రెండు కృచ్ఛ వ్రతములతో శుద్ధియగును. సంశయములేదు-16. నీలి చెట్లను నాటిననేల అపవిత్రమగును. పన్నెండు సంవత్సరములు దాటిన తరువాతనే ఆభూమి తిరిగి శుచియగును-17. ఇక సప్తమినాడు తైల స్పర్శచేసిన యెడల ప్రియమైన భార్య నశించిపోవును. ఈ విధముగ నీలి-తైలముల దోషములను చెప్పితిని-18. సప్తమీవ్రతమునాచరించువాడు మాంసభక్షణ చేయరాదు. మద్యము త్రాగరాదు. ఎవరికిని ద్రోహము చేయరాదు. కఠినముగా ప్రవర్తింపరాదు -19. చండాలుని పలుకరింపరాదు. స్త్రీతో, రజస్వలతో మాటాడరాదు. హీనుని తాకరాదు. మృతాశౌచము గలవానిని చూడరాదు.

మూ॥ నాస్ఫోటయేన్నాతిహనేద్గాయేచ్చాపి న గీతకమ్ న నృత్యేదతి రాగేణ నచ వాద్యాని వాదయేత్

నశయాత స్త్రీయాసార్థం నసేవేత దురోదరమ్ నరుద్యాదశ్రుపాతేన నచ వాచ్యంచ శౌకికమ్

ఆకృషేన్నశిరోయూకా నవృథావాచమాచరేత్ పరస్యానిష్టకథన మతి శోకంచ వర్జయేత్

నకఞ్చిత్తాడయేజంతుం న కుర్యాదతి భోజనమ్ నచైవ హి దివా స్వప్నం దంభం శాఠ్యంచ వర్జయేత్

రథ్యాయామటనం వాపి యత్నతః పరివర్జయేత్ అధాపరే వీధిశ్చాత్ర శ్రూయతాం త్రిపురాంతక!

 చైత్రాభృతి కర్తవ్యా సర్వదానామ సప్తమీ ధాతేతి చైత్రమా సేతు పూజనీయో దివాకరః

అర్యమేతిచ వైశాఖే జ్యేష్ఠ మిత్రః ప్రకీర్తితః ఆషాఢ వరుణో జ్ఞేయ ఇంద్రోనభసి కథ్యతే

వివస్వాంశ్చ నభస్యేఽ థ పర్జన్యోశ్వయజిస్మృతః పూషాకార్తిక మాసేతు మార్గ శీర్షషురుచ్యతే

భగః పౌషే భవేత్పూజ్యస్త్వష్టా మాఘేతు శస్యతే విష్ణుశ్చ ఫాలునే మాసి పూజ్యో వంద్యశ్చ భాస్కరః

సప్తమ్యాం చైవ సప్తమ్యాం భోజయేద్భోజకాన్బుధః సఘృతం భోజనం దేయం భోజయిత్వావిధానతః

భోజకాయైవ విప్రాయ దక్షిణాం స్వర్ణమాషకమ్ సఘృతం భోజనం దేయం రక్తవస్త్రాణి చైవహి

అభావే భోజకానాంతు దక్షిణీయా ద్విజోత్తమాః తథైవ భోజనీయాశ్చ శ్రద్ధయా పరయా విభో!

విశేషతో వాచకశ్చ బ్రాహ్మణః కల్పవిత్సదా ఇత్యేషా కధితా తుభ్యం సప్తమీ గణనాయక!

శ్రుతా సతీ పాపహరా సూర్యలోక ప్రదాయినీ

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి బ్రహ్మదిండి సంవాదే సప్తమీకల్పే ఆదిత్య మాహాత్మ్యవర్ణనే సప్తమీ వర్ణనం నామ పంచషష్టితమోఽధ్యాయః

తా॥పొడచుట, చీల్చుట, చచుట కూడదు. అతిమాత్రమైన నవ్వుకూడదు. పాటలు పాడకూడదు. మిక్కిలి వ్యామోహపడుచు నాట్యము చేయరాదు. వాద్యములు వాయించుట ని షేధము-21. స్త్రీతో కూడి పరుండరాదు. జూదమాడరాదు. కన్నీటి పర్యంతముగ నేడ్వరాదు. శోకాకులమైన వాక్యములు మాట్లాడకూడదు-22. తల పేలు తీయరాదు. వ్యర్థతర్కములు చేయరాదు. ఇతరులకు సంబంధించిన అనీష్ణకథనము, మిక్కిలిగా శోకించుటవదల వలెను-23. జంతువులను కొట్టుట, మితి మీరి భుజించుట, పగలు నిద్రించుట డంబము, శఠము-24. పౌరులవెంటతీరుగుట- వీనినీ ప్రయత్నపూర్వకముగ విడువవలెను. ఇక తరువాత వీధులను వినుము-25. చైత్రమాసము మొదలుకొని ఈ 'సర్వదాసప్తమి'ని అనుష్టింపుచుండవలెను. సూర్యభగవానుని చైత్రమున “థాత' యని,-26 వైశాఖమున ఆర్యముడుగ, జ్యేష్ఠమున మిత్రుడుగ, అషాఢమున వరుణుడుగ, శ్రావణమున నింద్రుడుగ-27. భాద్రపదమున వివస్వంతుడుగ, ఆశ్వయజమున పర్జన్యుడుగ, కార్తీకమున పూషగా, మార్గశీర్షమున ఇషుడుగ, పుష్యమున భగుడుగ, మాఘమున త్వష్టగ, ఫాల్గునమునందు విష్ణువుగ పూజింపుచుండవలెను-29. ప్రతి సప్తమి దినమున తినువారందఱికి నేతితో కూడిన భోజనము పెట్టించవలేను. సలక్షణముగ భోజన సంతర్పణము ముగించి-30. భుజించిన విప్రులకు ఐదు గురిజల ప్రమాణముగ బంగారము దక్షిణలీయవలెను. సఘృత భోజనమునే ఏర్పాటు చేయవలెను. ఎఱ్ఱని (లేక వివిధ వర్ణముల) వస్త్రములనీయవలెను-31. భోజక బ్రాహ్మణులు లేని యెడల ద్విజోత్తములందకి దక్షిణలీయవలెను. ఉన్నచో వారికి మిక్కిలి శ్రద్ధగా అన్నదానము చేయవలెను-32. ముఖ్యముగా సప్తమీ కల్పమును తెలిసిన ప్రవచకునకు భక్తి శ్రద్దలతో భోజన తాంబూల దక్షిణలు సమర్పింపవలెను. ఇట్లు నీకు సప్తమీ వ్రత విధానమును వివరించి చెప్పితిని-33. ఇది వినినవారికి పాపములు హరించిపోయి సూర్యలోక ప్రాప్తి కలుగును.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మదిండి సంవాదమున సప్తమీ కల్పము నందలి ఆదిత్య మాహాత్యవర్ణనమను అటువది యైదవ అధ్యాయము సమాప్తము.