57. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము

బ్రహ్మోవాచ :

మూ॥ క్షీరం యవాగూర్ర్బహ్మణే స్యాత్పరమాన్నం త్రిలోచన! ఫలాని కార్తికేయస్య దద్యాద్భూతేశ ప్రీతయే

వివస్వతే మధుమాంసం తథా మద్యంచ సువ్రత ।

 పురుహూతాయ భక్ష్యాణి సానుగాయ నివేదయేత్ హవిరన్నమగ్నయే స్యాద గ్రాన్నం విష్ణవే తథా

 రాక్షసేభ్యః సమైరేయం దద్యానాం సౌధనమ్ హర! సంస్కృతం పిశితాన్నంచ రేవతాయ నివేదయేత్

 తిలాన్నం పితృరాజాయ దద్యాత్రి పుర సూదన! ఆశ్వినాభ్యామపూపాంస్తు వసుభ్యోమాంసమోదనమ్

పితృభ్యః పాయసం దద్యాద్ఘృతాక్తం మధునాసహ కాత్యాయన్యై యవాగూంచ శ్రియైదద్యాత్తథాదధి

సరస్వత్యై త్రిమధురం వరుణాయేక్షు రసౌదనమ్ ఖాండవాన్నం ధనపతో వేవం మిత్రేత్రిలోచన!

 సస్నే హేనతు తక్రేణ మరుద్భ్యస్తర్పణం స్మృతమ్ మాంసాన్న భక్త సూపాంశ్చ మాతృభ్యోవైనివేదయేత్

 ఉల్లేపికాశ్చ భూతేభ్యో జలం సూర్యాయవైహర! దద్యాద్గణాధిపతయే మోదకం స్త్రీపురాంతక!

 శష్కుల్యస్తు నైరృతాయ దేయాస్యుర్గణ నాయక! సర్వ భక్ష్యాణీ విశ్వేభ్యో దాతవ్యాని సమంతతః

క్షీరోదన మృషిభ్యస్తు క్షీరం నాగేభ్య ఏవహి సూర్యరథాయ బలిం దద్యాతుర్యాద్వై సార్వ భౌతికమ్

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “బ్రహ్మకు పాలు, జావ శ్రేష్టమగునాహారము. భూతేశ్వరుడగు కార్తికేయునకు ఫలములు నివేదింపవలెను. వివస్వంతునకు తేనె, మాంసము, మద్యము నివేదింపవలెను. సపరివారుడైన ఇంద్రునకు భక్ష్యములు, అగ్నికి హవిష్యాన్నము, విష్ణు దేవునకు శ్రేషాన్నము నర్పింపవలెన. రాక్షసులకు చెఱుకు రసముతోఁజేయబడిన మద్యము, మాంసాన్నము, రేవతునకు సంస్కరింపబడిన మాంసాన్నమును సమర్పింపవలేను. యమునకు తిలాన్నము, అశ్వినీ కుమారులకు భక్ష్యములు, వసువులకు మాంసము నీయవలెను. పితృదేవతలకు తేనె, నేయితో గూడిన పాయసమును, గౌరీ దేవికి జావ, లక్ష్మీదేవికి పెరుగు నైవేద్యము పెట్టవలెను. సరస్వతీ దేవికి త్రిమధురము, వరుణునకు చెఱకు రసముతోడి యన్నము, కుబేరునకు ఖండ శర్కరాన్నము, మిత్రుడను సూర్యునకు నునిదియే నివేదింపవలెను. మరుత్తులకు నూనే, మజ్జిగలతో తర్పణము చేయవలెను. మాతృకలకు మాంసాన్నము, పప్పు నివేదన చేయవలెను. భూత గణమునకు పుష్కలమగు భోజనములు, సూర్యునకు జలము, గణాధిపతికి లడ్డువములు, (ఉండ్రాళ్లు). నీరృతికి చక్కిలములు, విశ్వేదేవతలకు సర్వ విధములగు భక్ష్యములనర్పించి తృప్తిపరుపవలేను. ఋషులకు క్షీరాన్నము, నాగములకు పాలు, సూర్యరథమునకు సర్వభూత బలి చేయవలెను.

మూ॥ ఉద్వర్తనం సురా మాంసం తద్వా హేభ్యశ్చభారత! ఆజ్యంచ బ్రహ్మణేదద్యాత్ర్యం బకాయ తిలాంస్తధా

స్వాహా తనయేవైలాజా దాత వ్యాస్త్రీ పురాంతక! భాస్కరాయ సదా దద్యాత్కో విదారం త్రిలోచన!

 రాజవృక్షం తథేంద్రాయ హవిష్యం పావకాయచ చక్రిణే సప్తధాన్యంచ గరుడే మత్స్య మోదనమ్

యక్షేభ్యో వివిధాన్నాని నిర్యాసం రేపతే త్యజేత్ వైకంకత స్రజోరుద్ర! యమాయ పరికీర్తితాః

దేయం స్యాత్కర్ణికారంతు అశ్విభ్యాం పృషభధ్వజ! శ్రీయై పద్మాని దేయాని చండికాయై సుచందనమ్

నవనీతం సరస్వత్యై వినతాయై తథామిషమ్ పుష్పాణ్య పురసాంరుద్ర! మాలత్యాః పరికీర్తితమ్

వరుణాయాగ్ని మంధంతు ఫలం మూలం నిరృతయే బిల్వందద్యాత్కుభేరాయ, కపిత్థం మరుతాం తథా

గంధర్వేభ్యస్త్వార గ్వధం దద్యాత్రి పురసూదన! వాసవేభ్యస్తు కర్పూరం దద్యాద్దారూ గణాధిపే

పితృభ్యః పిండమూలాని భూతే భ్యశ్చ విభీతకమ్ గోభ్యో యవాన్ప్రదద్యాద్వై మాతృభ్యశ్చక్షతాన్ హర !

 గుగ్గులం విఘ్నపతయే విశ్వేభ్యోదేయమోదనమ్ ఋషిభ్యో బ్రహ్మవృక్షంతు నాగేభ్యో విషముత్తమమ్

తా॥ రథ వాహకులకు నలుఁగు, మద్యము, మాంసము ఈయవలెను. బ్రహ్మకు ఆజ్యము, శివునకు నువ్వులు. కుమారస్వామికీ పేలములు, సూర్య దేవున కెప్పుడును అమ్ల పత్రము. ఇంద్రునకు ఆరగ్వధము (జేల) అగ్నిహోత్రునకు హవిష్యము, చక్రికి సప్తధాన్యములు, గురుడునకు మత్స్యములు. యక్షులకు వివిధములైన అన్నములు, రేవతునకు మ్రాని బంక, యమునకు పుల్లవేలగదండలు, సమర్పింపవలెను. అశ్వినీకుమారులకు కొండగోగు, లక్ష్మీదేవికి తామరలు, చండికా మాతకు మంచి గంథము. సరస్వతీ దేవికీ వెన్న, వినతకు మాంసము, అప్సరలకు జాజిపూలు. వరుణునకు శ్రీ పర్ణము (వెల్లి?) నిరృతికి ముల్లంగి, కుబేరునకు మారేడు, మరుత్తులకు వెలగ. గంధర్వులకు తేల, వాస్తవులకు కర్పూరము, గణాధిపునకు దేవదారు. పితృదేవతలకు దాసనవేళ్లు, భూతములకు తాండ్ర, గోవులకు యవలు, మాతృదేవతల కక్షతలు. విఘ్ననాయకునకు గుగ్గులము, విశ్వేదేవతలకన్నము, ఋషులకు మేడి, నాగులకు పాలు సమర్పింపవలెను.

మూ. భాస్కరస్యేహ దేయాని సకలాని గణాధిప! మధు సర్పిస్తధోక్తాని గౌరికస్య త్రిలోచన!

న్యగ్రోధం తస్యవా హేభ్యో భక్త్యా రుద్ర! నివేదయేత్ సాయం ప్రాతస్తు మధ్యాహ్నే సదైకాగ్రమనాహర !

 సర్వేషాం శక్తితో భక్త్యా దహేద్దూపం విచక్షణ: మంత్రతో దేవశార్దూల! యోయ స్యేహ ప్రకీర్తితః

శాంత్యర్థం బ్రాహ్మణేభ్యస్తు తిలాన్ దద్యాద్విచక్షణః వైశ్వానరేవా జుహుయాద్ఘృతేన సహితాన్ హర!

 దేవానామమృతం హ్యేతే పితృణాంహి స్వథామృతమ్ శరణం బ్రాహ్మణానాంచ సదాహ్యేతాన్విదుర్చుధాః

కస్యపస్యాంగజా హ్యేతే పవిత్రాశ్చ తథాహర! స్నానే దానే తథా హోమే తర్పణే హ్యశనే పరాః

ఇత్థం దేవాస్గ్రంహాంశ్చైవ పూజయిత్వాప్రయత్నతః అవతార్య రథాచ్చైనం మండలే స్థాపయేత్పునః

కృత్వాత్వారార్తీకం యత్నాద్దీపతోయ యవాక్షతైః కారాస బీజ లవణ తు షై ర్దుర్దృష్టిశాంతయే

 వేదీ మార్పయేత్పశ్చాత్పత్నీభ్యాం సహసువ్రత! తత్రస్థం పూజయేద్దేవం దినాని దశ సువ్రత!

దశా హ్నీ కేతి విఖ్యాతా యా పూజా భూతలే హర! తథా సంపూజయేద్దేవం చతుర్దేఽహ్ని తథా హర ।

చతుర్దేఽహని కర్తవ్యం యత్నాద్ధి స్నపనం రవేః అభ్యంగ భోజనాద్యైస్తు పూజా సత్కార మండలైః

అనేన విధినా పూజ్య దశాహాని దివాకరమ్ తతో నయేత్పరం స్థానం యత్తత్పూర్వ మథాలయమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

రథసప్తమి కల్పే ఆదిత్యమహిమ వర్ణనం నామ సప్తపంచాశత్తమోఽధ్యాయః

తా॥ భూత గణనాథా! స్వర్ణవరప్రభా భాసమానుడైన భాస్కరునకు తేనె, నేయి మొదలగు పూర్వోక్త వస్తువులన్నింటిని నివేదింపవలెను. రథాశ్వములకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము భక్తితో, ఏకాగ్రచిత్తముతో మట్టిపండ్లు నివేదింపుచుండువలేను. విచక్షణుడు సర్వదేవతలకును భక్తి శక్తులననుసరించి ధూపము సమర్పింపవలెను. ఏయే దేవతలకేయే ధూపము, మంత్రము చెప్పబడినదో ఆయాదేవతలకాయా ధూపములను సమంత్రకముగనర్పింపవలెను. శాంతి నిమిత్తము బ్రాహ్మణులకు నువ్వులు దానము చేయవలెను. నేతితో గూడిన తిలలను అగ్నిలో వ్రేల్చవలెను. దేవతలకు స్వాహాకారములతో పితృదేవతలకు స్వధాకారములతో నర్పించుట, వారికి అమృత తుల్యములగును. ఇది బ్రాహ్మణులకు రక్షణ కల్పించునవి యనియు విజ్ఞులెఱుంగుదురు. ఇవి కశ్యపుని శరీరము నుండి యుద్భవించినవి. స్నాన, దాన, హోమ, తర్పణ, అశనములందు శ్రేష్ఠములైనవి. ఇట్లు దేవతలను, గ్రహములను శ్రద్ధగా పూజించి, రథము పై నుండి సూర్యదేవుని క్రిందకు దింపి మల మండలమునందు స్థాపింపవలెను. దుర్దృష్టి నివారణార్థమై, దీపములు, నీరు, యవలు, అక్షతలు, ప్రత్తి గింజలు, ఉప్పు, ఊక మున్నగువానిచే ఆరతిచేసి (దిష్టితీసి). సూర్యదేవుని, భార్యలతో సహా వేదికపై ప్రతిష్టింపవలెను. అచట నా దేవ దేవుని పది దినముల వఱకు పూజింపుచుండువలేను. భూతలమందీ పూజ 'దశాహ్నిక' యని ప్రఖ్యాతి పొందినది. అట్లు చేయబడు పది దినముల పూజలో నాలుగవనాడు. దేవునికి స్నానోపచారము చేయవలెను. అభ్యంగన భోజనాదులు, పూజా సత్కారములు ప్రత్యేకముగ జరుపవలెను. ఈ విధానమున దీవాకరునికి పది దినముల పూజచేసి, సమాప్తిని కూడా ప్రత్యేకముగ చేసి, దేవుని ఎప్పటి స్థలమునకుఁజేర్పవలెను.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున రథ సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనమను ఏబది యేడవ అధ్యాయము సమాప్తము.