56. సప్తమి కల్పమున ఆదిత్య మహిమ వర్ణనము వర్ణనము

శ్రీ రుద్ర ఉవాచ :

మూ! “కథం ప్రచాలయేద్భ్రహ్మనథస్థం తమ నాశనమ్ అనుగాశ్చ కథం చాస్య కేచతే అనుగాః క్రమాత్

భూయోభూయః సురశ్రేష్ఠ! విస్తరాన్మమ శ్రేయసే వద సర్వం జగన్నాథ! పరం కౌతూహలంహిమే”

 బ్రహ్మోవాచ :

శనైర్నయేద్రథం రుద్ర! వర్త్మనాధుసమేసతు యథా పర్యటనం తుస్యాద్విషమే పథిగచ్ఛతః

ప్రతీహార రథం పూర్వం నయేన్మార్గ విశుద్దయే తస్మాదనంతరం రుద్ర! దండనాయకమాదరాత్

పింగలంచ తతస్తస్య పృష్ఠగం చాదరాన్నయేత్ రక్షకో ద్వారకో యస్మాద్రథారూఢౌతు పృష్ఠతః

రథారూఢస్తథా దిండీ దేవస్య పురతః స్థితః తస్మాదపీ తథా రుద్ర! లేఖకో భాస్కర ప్రియః

శనైః శనైర్నయేద్రుద్ర! రథం దేవస్య యత్నతః యుగాక్షచక్ర భంగోవా యథావస్యాత్త్రిలోచన!

ఈషాభంగే ద్విజభయం భగ్నేఽక్షే క్షత్రియక్షయ: తులాభంగేతు వైశ్యానాం శయ్యాశూద్రక్షయో భవేత్

యుగభంగేత్వనావృష్టిః పీఠభంగే ప్రజాభయమ్ పరచక్రాగమం విద్యాచ్చక్రభంగే రథస్యతు

ధ్వజస్య పతనే చాపి నృపభంగం వినిర్దిశేత్ వ్యంగిత ప్రతిమాయాంతు రాజ్ఞోమరణమాదిత్

ఛత్రభంగాద్భయం రుద్ర! యువరాజ్ఞో వినిర్దిశేత్ ఉత్పన్నే ష్వేవ మాద్యేషు ఉత్పాతేష్వశుభేషుచ

తా॥ శ్రీ రుద్ర భగవానుడిట్లనెను. “బ్రహ్మదేవా! తమో వినాశకుడగు సూర్యదేవుని రథమునెట్లు నడిపింపవలెను? సూర్యుని వెంట నుండువారు క్రమముగా నెవరెవరు? వారి నెచ్చట నియోగింపవలెను?. సురశ్రేష్ఠా! మలమఱల నీ విషయములు వినుటకు నాకు మిక్కిలి కుతూహలమగుచున్నది. కావున సవిస్తరముగఁ దెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లనెను. “రథము విషమ మార్గమునఁబోవలసివచ్చినప్పుడు మెల్లగా, మిక్కిలి జాగరూకతతో, సమముగనున్న మార్గమును వెదకికొనుచు పోవలయును. మార్గమును పరిశుభ్రముగ జేయుట కొఱకు రథయానముకన్న ముందే ప్రతీహారిని బంపి సరిచేయింపవలేను. వాని యనంతరము. దండ నాయకుని బంపవలెను. వాని వెనుక పింగలుని బంపవలెను. రక్షకుడు, ద్వారకుడు అను నిరువురు రథము నెక్కి వెనుక భాగమున నుండవలెను. దిండీయనువాడు రథారూఢుడై ముందు భాగమున నుండవలెను. వానిముందు భాస్కరున కిష్టుడైన లేఖకుడుండవలయును. రథమును మెల్లమెల్లగా జాగ్రత్తగా నడుపవలెను. కాడి, అక్షము, చక్రము మున్నగునవి భంగము కాకుండునట్లు నడుపుచుండవలెను. ఏఁడికోల భంగమైనచో బ్రాహ్మణులకు భయము, అక్షము భంగమైనచో క్షత్రీయులకును, తులా భంగమైన వైశ్యులకు, శయ్యా భంగమైన శూద్రులకు వినాశము కలుగును. కాడి విరిగిన అనావృష్టి, పీఠము విరిగిన ప్రజలకు భయము, చక్రము విరిగిన యెడల శత్రు రథముల ఆగమనమును ఊహింపవలెను. ధ్వజము పతనమైనచో రాజున కరిష్టమని తెలియవలెను. ప్రతిమ భిన్నమైన యెడల. రాజునకు మరణముకలుగునని చెప్పవలెను. ఛత్రము భంగమైన యువరాజు మరణించునని సూచింపవలెను. ఇట్టి ఉత్పాతములు సంభవించిన యెడల చెప్పబోవు విధమున శాంతి జరిపింపవలెను.

 మూ॥ బలికర్మ పునః కుర్యాచ్ఛాంతి హోమం తథైవచ బ్రాహ్మణాన్వాచయేద్భూయో దద్యాద్దానాని చైవహి

పూర్వోత్తరేచ దిగ్భాగే రథస్యాగ్నిం ప్రకల్పయేత్ సమిదిస్తు ఘృతాక్తాభిర్హోమయేజ్ఞాత వేదసమ్

స్వాహాకారా న్వదన్సమ్య గ్ధేవతే భ్యస్త్వనుక్రమాత్ గ్రహేభ్యశ్చ ప్రజాభ్యశ్చ నామాన్యుద్దిశ్య హోమయేత్

ప్రథమం చాగ్నయేస్వాహా స్వాహాధోమాయచైవ స్వాహా ప్రజాపతయేచ దేయా ఆహుతయః క్రమాత్

స్వస్త్యస్త్విహచ విప్రేభ్యః స్వస్తిరాజ్ఞేతదైవచ గోభ్యఃస్వస్తి ప్రజాభ్యశ్చ జగతః శాంతిరస్తువై

శంనోఽ స్తు ద్విపదే నిత్యం శాంతిరస్తు చతుష్పదే శం ప్రజాభ్యస్త ధైవాస్తు శం సదాత్మని చాస్తువై

 భూః శాంతిరస్తు దేవేశ! భువః శాంతిస్తథైవచ స్వశ్చైవాస్తు తథాశాంతిః సర్వత్రాస్తుతథారవేః

 త్వం దేవ! జగతః స్రష్టా పోష్టాచైవ త్వమేవహి ప్రజా పాల గ్రహేశాన! శాంతింకురు దివస్పతే!

ఇద మన్యచ్చ వక్ష్యామి శాంత్యాః పరమ కారణమ్ యాత్రాకారణ భూతస్య పురుషస్య స్వజన్మనః

తా॥ బలి కర్మను మఱల చేయవలెను. అటులే శాంతి హోమమును చేయవలెను. బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము చేయించి, తిరిగి దానములీయవలెను. రథమున కీశాన్య భాగమున కుండము నిర్మించి అగ్ని ప్రతిష్ఠ చేయవలెను. నేతితో తడీపీన సమిధలతో హోమము చేయవలెను. క్రమముననుసరించి ఆయా దేవతలకు, గ్రహములకు, ప్రజా పతులకు, వారి వారి నామములతో చక్కగా స్వాహాకారములు చెప్పుచు హవనము చేయవలెను. మొదట ‘అగ్నయస్వాహా', 'సోమాయస్వాహా', ప్రజా పతయేస్వాహా' అని మువ్వురికి క్రమముగా ఆహుతులీయవలెను. “బ్రాహ్మణులకు స్వస్తియగుగాక! రాజులకు స్వస్తియగుగాక! గోవులకు, ప్రజలకు శుభము కలుగుగాక! జగత్తునందు శాంతి నెలకోనుగాక!. మనుష్యులమైన మాకు సుఖముకలుగుగాక! చతుష్పాత్తులకు శాంతియగుగాక! ప్రజలకు సుఖము కల్గిడిని గాక! ఆత్మకేల్లప్పుడు సుఖము కల్గుగాక!. భూర్భువస్స్వర్లోకములకు, రవికి సర్వత్ర శాంతి కలుగుగాక!. ఓ దేవా! నీవు జగత్తును సృష్టించువాడవు. నీవే పోషించువాడవు. ప్రజలను పాలించువాడవు, గ్రహములకు ప్రభువువైన ఓ సూర్యదేవా! శాంతిని కలిగింపుము”. అని ప్రార్థింపవలెను. రథయాత్రకు కారణభూతుడైన పురుషుని జన్మమునకు సంబంధించియేర్పడు శాంతి కారణమును గుఱించి కూడ నీకు తెలియఁజేప్పెదను.

మూ॥ దుఃస్థాన్గృహాంశ్చ విజ్ఞాయ గ్రహశాంతిం సమాచరేత్ ప్రాదేశమాత్రాః కర్తవ్యాః సమిథోఽథ ప్రమాణతః

అర్కమయ్యో రవేః కార్యాః పాలాశ్య: శశినః స్మృతాః ఖాదీర్యశ్చైవ భౌమాయ అపామార్గ్యోఽబ్జ సూనవే

 అశ్వత్థ్యశ్చాథ జీవాయ ఔదుంబరః సితాయచ అసితాయ శమామయ్యో దూర్వా కార్యాస్తురాహవే

కేతవేతు కుశాః కార్యాః దక్షిణాశ్చాప్యతః శృణు సూర్యాయశోభనాం ధేనుం శంఖం దద్యాదధేందవే

రక్తమనడ్వాహం భౌమాయ కాంచనం సోమసూనవే జీవాయ వాససీ దేయే శుక్రాయాశ్వం సితం హర!

 శనైశ్చరాయ గాం నీలాం రాహవే భాండపాయసమ్ ఛాగంతు కేతవే దద్యాచ్ఛృణ్వేషాం భోజనాన్యపి

గుడౌదనంతు సూర్యాయ సోమాయ ఘృత పాయసమ్ హవిష్యమన్నం భౌమాయ క్షీరాన్నం సోమసూనవే

దధ్యోదనంతు జీవాయ శుక్రాయాథ ఘృతాశసమ్ తిల పిష్టాంశ్చమాషాంశ్చ సూర్య పుత్రాయ దాపయేత్

రాహవే దాపయేన్మాంసం కేతవే చిత్రమోదనమ్ సౌవీర మారనాలంచ స్విన్న బీజం చ రంజికమ్

యథా బాణ ప్రహారాణాం వారణం కవచం స్మృతమ్ తథా దైవోపఘాతానాం శాంతిర్భవతి వారణమ్

తా॥ రథయాత్రా నిర్వాహకుని జన్మకుండలిననుసరించి (గోచారముననుసరించియు) దుష్ట స్థానములందున్న గ్రహములను తెలిసికొని వానికి శాంతి జరిపింపవలెను. సమిధలను ప్రాదేశ మాత్రముగ (చూపుడు వ్రేలిని బొట్టన వ్రేలిని చాఁచి పట్టిన కొలత) సిద్ధము చేసికొనవలెను. సూర్యునకు జిల్లేడు, చంద్రునకు మోదుగు, అంగారకునకు చండ్ర, బుధునకు ఉత్తరేను. గురువునకు రావి, శుక్రునకు మేడి, శనైశ్చరునకు జమ్మి, రాహువునకు గణిక. కేతువునకు దర్భ సమిధలుపయోగింపవలెను. ఇక ఆయా గ్రహముల కీయవలసిన దానములను గూర్చి చెప్పెదను వినుము. సూర్యుని ప్రీత్యర్థము సుందరమైన గోవును, చంద్రుని కొఱకు శంఖమును. అంగారకునకు ఎఱ్ఱని వృషభమును, బుధునికి బంగారము, బృహస్పతి కొఱకు బట్టలజత, శుక్రుని ప్రీతి కొఱకు తెల్లని గుట్టము. శనైశ్చరునకు నల్లని యావును, రాహువు కొఱకు పాయస భాండమును, కేతువు కొఱకు మేక పోతును దానము చేయవలెను. ఇఁక నీ గ్రహములకు సమర్పింపవలసిన నైవేద్యములను గూర్చి వినుము. సూర్యునకు గుడాన్నము, చంద్రునకు నేతితో వండిన పాయసము, కుజునకు హవిష్యాన్నము, బుధునకు క్షీరాన్నము,. బృహస్పతికి పెరుగన్నము, శుక్రునకు ఘృతాన్నము, శనైశ్చరునకు నూవుల పిండి, మినుములు. రాహువునకు మాంసము, కేతువునకు చిత్రాన్నము, రేగుపండ్లు, కలి (పులియబెట్టిన కడుగునీరు) పచ్చితామర గింజలు) నైవేద్యము పెట్టవలెను. బాణపు దెబ్బలను కవచమెట్లు నివారించునో విధివశాత్తుగ నేర్పడిన యాపదలను శాంతి కర్మలట్లు నివారించును.

మూ॥ అహింసకస్య దాంతస్య ధర్మార్జిత ధనస్యచ నిత్యంచ నియమస్థస్య సదాసాను గ్రహా గ్రహాః  

గ్రహాః పూజ్యాః సదారుద్ర! ఇచ్ఛతా విపులం యశః శ్రీ కామః శాంతి కామోవా గ్రహ యజ్ఞం సమాచరేత్

వృష్ట్యాయుః పుష్టి కామోవా తథైవాభిచరన్పునః యానపత్యా భవేన్నారీ దుష్ర్పజాశ్చాపి యాభవేత్

బాలా యస్యాః ప్రమ్రీయంతే యాచకన్య ప్రజాభవేత్ రాజ్య భృష్టానృపోయస్తు దీర్ఘ రోగీచ యోభవేత్

గ్రహయజ్ఞః స్మృత స్తేషాం మానవానాం మనీషిభిః తస్మాదసౌసదా కార్యః శ్రేయోఽర్థం జానతా హర!

 దత్త పుష్ప: క్రూర దృక్చ పుష్పజో ధిషణస్తథా సీతా సితౌ తథా రుద్ర! ఉపరాగః శిఖీ తథా

ఏతే గ్రహా మహాబాహో! విద్వద్భిః పూజితాః సదా తామ్రకాత్స్ఫటికాద్రక్త చందనోత్స్వర్ణ కాదపి

రాజతాదాయసాత్సీసాద్గ్ర్హహాః కార్యాః ప్రయత్నతః స్వర్ణేవాథ పటే లేఖ్యా యథాశాస్త్రం మహేశ్వర!

 యథావర్ణం ప్రదేయాని వాసాంసి కుసుమానిచ గంధాశ్చ బలయశ్చైప ధూపోదేయశ్చ గుగ్గుల:

కర్త వ్యా మంత్ర వంతశ్చ చరవః ప్రతి దైవతమ్ ఆ కృష్ణేన ఇమందేవా అగ్నిర్మూర్థాదివః కకుత్

ఉద్బుథ్యస్వ యథా సంఖ్య మృచ ఏతాః ప్రకీర్తితాః బృహస్పతే అతియదర్యస్తథైనాన్నాత్పరి సుతః

శంనోదేవీ తథా కాండాత్కేతుం కృణ్వన్నిమాః క్రమాత్ పూర్వోక్తాః సమిధస్త్యత్ర యథాశాస్త్రం ప్రహోమయేత్  

తా॥ హింసచేయని వానియెడ, తపః క్లేశాదుల నోర్చువానియెడ, ధర్మబద్ధముగ సంపాదించిన ధనముననుభవించు వానియెడ, ఎల్లప్పుడు నియమమునకు కట్టుబడి యుండువాని యెడను గ్రహము లనుగ్రహము చూపుచుండును. విపులమైన కీర్తిని కోరువాడు, ధనమును, శాంతిని కోరువాడు గ్రహ యజ్ఞము చేయుచుండవలెను. వర్షము, ఆయువు, బలము కావలసినను, చేతబడులు మున్నగునవి చేయబడినను, సంతానమును గోరు స్త్రీయును, దుష్ట సంతానము గలదియును. పుట్టిన బిడ్డలు మరణించుచున్నను, స్త్రీ సంతానము మాత్రమే కలుగుచున్నను, గ్రహశాంతి చేయవలెను. రాజ్య భ్రష్టుడైన రాజు, రాజ్య ప్రాప్తి కొఱకు, వ్యాధి గ్రస్తుడారోగ్యము కొఱకును. గ్రహ యజ్ఞము చేయవలెనని, గ్రహానుగ్రహ సంపాదనము బాధానివారకమని విజ్ఞులు తెలిపిరి. అందువలన శ్రేయస్సు కొఱకా విషయములు తెలిసికొని ఆయా గ్రహములను ప్రసన్నులను చేసి కొనవలేను. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు. ఈ గ్రహములే విద్వాంనుల చేత పూజింపబడుచుండును. ఈ గ్రహముల విగ్రహములను రాగి, స్పటికము, రక్త చందనము, బంగారము. వెండి, ఇనుము, సీసము మొదలగువానీతో చేయింపదగును. లేక బంగారపు రేకు మీదగాని, వస్త్రము మీదగాని ఆయా గ్రహముల చిత్రములు యథా శాస్త్రముగ వ్రాసి పూజింపవచ్చును. ఆయా గ్రహముల వర్ణములను బట్టి ఆయా వర్ణముల వస్త్రములు, పుష్పములు, గంథములు, నైవేద్యములు, గుగులు ధూపము సమర్పింపవలెను-39. ప్రతి గ్రహమునకును ఆయా గ్రహమంత్రములతో హవ్యములను సిద్ధముచేసికొనవలెను. “ఆ కృష్ణన రజసా', 'ఇమందేవా', 'అగ్ని ర్మూర్థాదివఃకకుత్". 'ఉద్బుధ్యస్వ', 'బ్రహస్పతే అత్యదర్యః', 'అన్నాత్పరిస్రుతః'. 'శంనోదేవీ', 'కాండాతో, కేతుం కృణ్వన్', ఆదిగా గలవి క్రమముగా నవగ్రహ మంత్రములు. ఈ మంత్రములతో పూర్వోత్తములైన సమిధలతో యధాశాస్త్రముగ నొక్కొక్క గ్రహ దేవత కాహుతులీయవలెను.

మూ. ఏకైక స్యాష్ట శతకమష్టా వింశతి రేవచ హోతవ్యా మధుసర్పిభ్యాం దధ్నాచైవ సమన్వితాః

పూర్వోక్త భోజనం యద్ధి బ్రాహ్మణేభ్యోనివేదయేత్ శక్తితో వాయథాలాభం దక్షిణాతు విధానతః

యశ్చయస్య యదా దుఃస్థః సతం యత్నేన పూజయేత్ మయేషాంహి వరోదత్తః పూజితాః పూజయిష్యథ

గ్రహాధీనా నరేంద్రాణా ముచ్చృయాః పతనానిచ భావా భావౌచ జగతస్త స్మాత్పూజ్యతమా గ్రహాః

 గ్రహాగావో నరేంద్రాశ్చ గురవో బ్రాహ్మణాస్తధా పూజితాః పూజయంత్యేతే నిర్దహంత్యమానితాః

 యథా సముత్థితం యంత్ర యంత్రేణైవ ప్రహన్యతే తథా సముత్థితాం పీడాం గ్రహశాంత్యాప్రశామయేత్

యజ్వనాం సత్య వాక్యానాం తథా నిత్యోపవాసినామ్ జప హోమ పరాణాంచ సర్వం దుష్టం ప్రశామ్యతి

ఏవం కృత్యా ప్రజాశాంతిం కృత్వాచ స్వస్తివాచనమ్ పునః సజ్జం రథం కృత్యా కుర్యాత్ప్రక్రమణం హర!

 మార్గం శేషం నయిత్వాతు నయేద్దేవాలయం రవిమ్ పూజయిత్వా తతః పూర్వా యాఃప్రోక్తా రథదేవతాః

యథా పూజ్యా గ్రహాః సర్వే ఉత్పాతేషు త్రిలోచన! రథ దేవాస్తథా పూజ్యా యా స్థితారథమాశ్రితాః

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మే పర్వణీ

సప్తమి కల్పే ఆదిత్య మహిమా వర్ణనం నామ షట్పంచాశత్తమోఽధ్యాయః

            తా॥ పూర్వోదాహృత మంత్రములతో ఒక్కొక్క గ్రహమునకు నూటయెనిమిది, లేక ఇరువది యెనిమిది పర్యాయములు సమిధలు, ఆజ్యము, తేనె, పెరుగులతో ఆహుతులీయవలెను. పూర్వోక్త విధిచేత బ్రాహ్మణులకు భోజనము నివేదింపవలెను. వారికి యథాశక్తిగ, యథాలాభముగ దక్షిణలీయవలెను. ఏ గ్రహము, ఎవనికి ఎప్పుడు దుష్ట స్థానమునందుండునో ఆ గ్రహము నాతడప్పుడు పూజింపవలెను. పూజింపబడిఅను గ్రహింపుడని నేనే వీరికి వరమొసంగితిని. రాజుల ఔన్నత్యముగాని పతనముగానీ గ్రహముల కథనమై యున్నవి. జగత్తునందలి కలిమిలేములు కూడా గ్రహములపై ఆధారపడియున్నవి. అందుచేత నా దేవతలు పూజ్యతములు. గ్రహములు, ఆవులు, రాజులు, గురువులు, బ్రాహ్మణులు పూజింపబడుచునే అనుగ్రహించుచుందురు. అవమానింపబడిన యెడల దహించివేయుదురు. యంత్రము చేతనే యంత్రము పైకెత్తబడుటయు, కొట్టబడుటయు జరిగినట్లు, గ్రహముల వలన కలిగిన పీడ గ్రహ శాంతి వలననే శమించును. యజ్ఞములు చేయువారికి, సత్య వాక్పరిపాలకులకు, నిత్యోపవాసులకు, జపహోమ తత్పరులకు ఎట్టి పీడయైనను తొలగిపోవును. కావున నిట్లు శాంతి ప్రక్రియ జరుపుటద్వారా ప్రజాశాంతిని చేసి, స్వస్తివాచనముచేసి, రథమును మఱల నలంకరించి యాత్ర సాగింపవలెను. మిగిలిన మార్గమున రథయాత్ర పూర్తిగావించి, పూర్వోక్త రథ దేవతలను పూజించి సూర్య ప్రతిమను దేవాలయమునకు చేర్పవలెను. ఉత్పాత సమయములందు గ్రహములను పూజించునట్లు సూర్య రథము నాశ్రయించి యుండు రథ దేవతలను పూజింపవలెను.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమున ఆదిత్య మహిమ వర్ణనమను ఏబదియాఱవ అధ్యాయము సమాప్తము.