భవిష్య మహా పురాణము
58. సప్తమి కల్పమున రథయాత్రా వర్ణనము
బ్రహ్మోవాచ :
మూ. అనేన విధినా యస్తు కుర్యాద్వకారయేత వా యాత్రాం భగవతో భక్త్యా భాస్కరస్యామితౌజసః
స పరార్థంతు వర్షాణాం సూర్యలోకే మహీయతే కులేన జాయతే తస్య దరిద్రో వ్యధితోపివా
అభ్యంగాయ ఘృతం యస్తు భాస్కరాయ ప్రయచ్ఛతి కృతేతు వర్ణతిలకే సగచ్ఛే త్సురభీ పురమ్
తీర్దోదకంతు యోభక్త్యా గంగాయాశ్చ తధోదకమ్ స్నానార్థమానయేద్యస్తు భాస్కరస్యత్రిలోచన!
భక్త్యా వర్ణత్రయం దద్యాద్భాస్కరస్య త్రిలోచన! సమాప్యేహాఖిలాన్కామాన్ప్రాప్నుయాద్వరుణాలయమ్
రక్త వర్ణంతు యోదద్యాద్ధవిష్యాన్నం గుడౌదనమ్ స గచ్ఛేద్దీప్తిమానుద్ర! సూర్యలోకం పురం వరమ్
గచ్ఛేత్పురవలే రుద్ర! యత్రదేవః ప్రజాపతిః స్నాపయేద్యస్తు వా భక్త్యా భాస్కరంపూజయేత్తథా
సగచ్ఛేద్దీప్తి మాన్రుద్ర! సూర్యలోకం న సంశయః రథమారోపయేద్యస్తు రథమార్గం ప్రమార్జతి
సయాతి వాతసాలోక్యం వాతతుల్య పరాక్రమః రథస్య గచ్ఛతో యస్తు మార్గేకుర్యాత్సు మండలమ్
స లోకం ప్రాప్నుయాత్పుణ్యం మారుతం నాత్రసంశయః సూర్యస్య గచ్ఛతో యస్తు మార్గం కుర్యాత్సు మండలమ్
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను “అమిత తేజస్వియైన భాస్కరదేవుని రథయాత్రను భక్తి శ్రద్ధలతో నీ విధానముగ చేయువాడైనను చేయించువాడైనను. నూఱువేల లక్షల కోట్ల సంవత్సరములు సూర్యలోకమున వెలుగొందును. అతని వంశమున దరిద్రుడు గాని, వ్యధితుడు గాని ఉండరు. సూర్యదేవుని అభ్యంజనమునకై ఘృతమునిచ్చువాడు, వర్ణతిలకమిచ్చువాడు స్వర్గమునకుఁ బోవును. అభిషేకము కొఱకు పుణ్యతీరోదకముగాని, గంగాజలముగాని తెచ్చియిచ్చువాడు. పూజకొఱకు మూడు వర్ణముల వస్తువులిచ్చువాడు ఇహలోకమున సకల భోగములనుభవించి వరుణలోకమునకుఁబోవును. ఎఱ్ఱని హవిష్యాన్నము, గూడాన్నమునిచ్చువాడు దీప్తిమంతుడై మిక్కిలి శ్రేష్ఠమగు సూర్యలోకమునకుఁబోవును. సూర్యదేవునకు స్నానము చేయించి పూజించువాడు ప్రజాపతి లోకమునకుఁబోవును. సూర్యభగవానుని, రథమధిరోహింపజేయువాడు, రథమార్గమును శుభ్రము చేయువాడు దీప్తిమంతుడై సూర్యలోకమునకు బోవుననుటలో సందేహములేదు. రథము పయనించు మార్గమున నెత్తుపల్లములు లేకుండునట్లు సమముచేయువాడు వాయుదేవుని పరాక్రమముగలవాడై వాయులోకమునకుబోవును. సూర్యరథమార్గమును సమప్రదేశముగ చేయువాడు పుణ్యప్రదమైన వాయులోకమునకు చేరును. సందేహము లేదు.
మూ॥ స లోకం ప్రాప్నుయాత్పుణ్యం యః కుర్యాన్మార్గమాదరాత్ పుష్పప్రకర శోభాడ్యం శుభతోరణమండితమ్
శంఖ తూర్యనినాదాఢ్యం తథా ప్రేక్షణ కాన్వితమ్ సయాతి పరమం స్థానం యత్రదేవో విభావసుః
దేవేన సహితో యస్తు నృత్యన్గాయంస్తథార్చయన్ కుర్యాన్మహోత్సవం భక్త్యా స యాతి పరమం పదమ్
ప్రజాగరం యస్తుకుర్యాద్దేవే రథ గతే రవౌ స సుఖీ పుణ్య వాన్నిత్యం మోదతే శాశ్వతీః సమాః
భక్త దాసాదికం సర్వం యోదదాతి రవేర్నరః సంప్రాప్యేహాఖిలాన్కా మాన్సూర్యలోక మవాప్నుయాత్
రథారూఢస్య సూర్యస్య భ్రమతో దర్శనం హర! దుర్లభం దేవ శార్దూల! విశేషాత్పురతోవ్రజమ్
ఉత్తరాభిముఖం యాంతం తథావై దక్షిణాముఖమ్ ధన్యః పశ్యతి దేవేశం భాస్కరం భక్తవత్సలమ్
అధ సంవత్సరే ప్రాప్తే భానోర్యాత్రా దినే యది రథ ప్రక్రమణం తత్ర న కథంచీత్కృతం భవేత్
తతోవై ద్వాదశే వర్షే కర్తవ్యం భూతి మిచ్చతా ఇంద్రధ్వజస్య చాప్యేవం యదినోత్థాపనం కృతమ్
తతో వైద్వాదశే వర్షే కర్తవ్యం నాంతరాపునః యాత్రాయాశ్చాపి యేభంగం కుర్వంతి వృషభధ్వజ
మందేపనామ తే జ్ఞేయా రాక్షసానాత్రసంశయః యేకుర్వంతి తథా యాత్రాం నరాధర్మ ధ్వజస్యతు
ఇంద్రాది దేవాస్తే జ్ఞేయా గతాశ్చ పరమం పదమ్ పునర్యాత్రా విధించైనం సమాసాత్కథయామి తే
తా॥ సూర్య రథమార్గమును పూలమాలలతోను, తోరణములతోను శోభాయమానముగ నలంకరించువాడు పుణ్యలోకమునకు బోవును యాత్రామార్గమున శంఖ తూర్యాది నినాదములు, నృత్యగీతాది ప్రేక్షణీయ కార్యక్రమములేర్పాటు చేయువాడు పరమస్థానమైన సూర్యలోకమునకుఁజేరును. సూర్యరథయాత్రతో గూడి నాట్యములు చేయుచు, పాటలుపాడుచు, పూజచేయుచు భక్తితో మహోత్సవము చేయువాడు పరమపదమునందును. రథగతుడైన సూర్యదేవుని సన్నిధిలో జాగరణ చేయువాడు పుణ్యవంతుడై, సుఖజీవనుడై బహువత్సరములు ఆనందముగ నుండును. సూర్యభగవానునకు భక్తులైన భృత్యులను, సేవకులను సమకూర్చువాడు ఇహలోక భోగములన్నింటిని అనుభవించి సూర్యలోకమును పొందును. సూర్యుడు రథారూఢుడై తీరుగునప్పుడు-ముఖ్యముగా ముందునకు పయనించునప్పుడు ఆతని దర్శనము, చేసికొనుట విశేషమైనది. దుర్లభమైనది. భక్తవత్సలుడైన భాస్కరుడు ఉత్తరాభిముఖుడై, లేక దక్షిణాభిముఖుడై పయనించుచున్నప్పుడు దర్శించువాడు ధన్యుడు. సంవత్సరము గడిచిన పిదప సూర్యరథయాత్ర ప్రారంభింపవలసిన దినమున (నేదేని కారణముచే) ప్రారంభింపబడక యుండినచో. శ్రేయస్సును కోరువాడు పన్నెండవ సంవత్సరమున మాత్రమే తిరిగి రథయాత్ర చేయుటకుపక్రమింపవలెను. ఇంద్రధ్వజుని ఉత్సవమునను ఇట్లు విఘ్నము కలిగినచో పన్నెండు సంవత్సరములకే తిరిగి చేయవలెను. పన్నెండువత్సరములు కానిదే మధ్యలో రథయాత్రచేయకూడదు. యాత్రాభంగము చేసిన వారికే ఈ నియమము వర్తించును. అటుల భంగము చేసినవారు మందేహ రాక్షసులనబడుదురనుటలో సందియము లేదు. ధర్మధ్వజుని రథయాత్ర సాగించువారు. ఇంద్రాది దేవతలుగా గుర్తింపబడుదురు. వారు పరమపదమును పొందుదురు. యత్రావిధిని గుఱించి మఱల వివరముగా నీకు చెప్పెదను.
మూ॥ యాంశ్రుత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే నాత్రసంశయః వర్తమానేతువై మాఘే రథే దేవ గణాశ్రితే
స తస్మిన్నేవ మనసా స్థాపనీయో రధోపరి ద్యౌర్మహీచ ద్విమూర్తి స్థే యధాపూర్వంప్రతిష్ఠితే
తథైవ రాజ్జీ ద్యౌర్జ్ఞేయా నిక్షుభా పృథివీ స్మృతా ఏతాభ్యామపి దేవిభ్యాం యథైవ సవితుస్తథా
దిండినః పింగలాదీనాం పృథుః కార్యో రథక్రమః మనసా చింతయేద్యం యథా స్థానేషు దేవతామ్
దిక్పాలాన్లోక పాలాంశ్చ కల్పయేన్మన సైవతు దేవో వేదమయశ్చాయం సర్వదేవ మయస్తథా
మండల మృజ్మయం చైవ ఛందాంసాస్యం ప్రకీర్తితమ్ గాయత్రీచైవ త్రిష్టుప్చ జగత్యనుష్టుబేవచ
పంక్తిశ్చ బృహతీచైవ ఉష్ణిగేవ చ సప్తమీ తతో దేవ మమత్వాచ్చ చ్ఛందసం చైవ కల్పనాత్
తతో వేదమయత్వాచ్చ తరణిర్లోక పూజితః రథప్రక్రమణా త్సూర్యో వోడవ్యో బ్రహ్మవాదిభిః
తా॥ దానిని వినుటచే సర్వపాపముల నుండి విముక్తి కలుగును. సందేహములేదు. మాఘమాసమున, రథము పైన, దేవగణములతో కూడిన సూర్యభగవానుని మనస్సుతో స్థాపించవలెను. స్థాపించినట్లు మనస్సున భావింపవలెను. భూమ్యాకాశముల మధ్య సూర్యుడట్లు ప్రతిష్ఠింపబడగా. ఆకాశమును సంజ్ఞాదేవిగను, భూమీని నిక్షుభాదేవి (ఛాయ)గాను భావింపవలెను. (ఆ విధముగ నిరువురు భార్యల మధ్య సూర్యమూర్తి యథా పూర్వముగ ప్రతిష్ఠించినట్లగును) సూర్యునకు తన యిరువురు భార్యలగు సంజ్ఞాచ్ఛాయలతోనెట్లు సాన్నిధ్యముండునో దిండి, పింగలాదులగు పారిపార్శ్వికుల ఉపస్థితి కూడ రథయాత్రలోనటుల ముఖ్యకార్యమైయుండును. ఇతర రథదేవతలందఱిని వారి వారి స్థానములయందుండినట్లు మనస్సున భావింపవలెను. దిక్పాలురను, లోకపాలురను కూడ మనస్సున భావన చేయవలెను. ఈ సూర్యదేవుడు వేదమయుడు. సర్వదేవమయుడు. సూర్యమండలము కిరణమయము. ఛందస్సులు ముఖమని చెప్పబడినది. గాయత్రి, త్రిష్ణుప్, జగతీ, అనుష్టుప్. పంక్తి, బృహతీ, ఉష్టిక్, అనీ ఏడు ఛందస్సులు. సూర్యభగవానుని -ముఖభాగము. ఆ విధముగ దేవమయత్వ, ఛందోమయత్వకల్పన చేత. సూర్యుడు లోకపూజితుడగును. రథము కదలుటకు ముందు బ్రహ్మవాదులు దానిని లాగుటకుపక్రమింపవలెను.
నూ. ఉపవాస పరై ర్యుక్తైర్వేద వేదాంగ పారగైః రథంతు నారు హేచ్ఛూద్రో భాస్కరస్యత్రిలోచన!
ఆరుహ్య తరణేర్యానం వ్రజేచ్ఛూద్రోహ్యథోగతిమ్ యధోక్తకారణాద్రుద్ర! సదాశాంతిర్భవేన్నృణామ్
నాయకశ్చాపి సర్వేషాం దేవానాం తు దివాకరః విన్యసేత్తు రథానాంతు దేవతాయతనేషుచ
తతో ధూపోపహారైస్తు పూజయేత్ప్రథమం రవీమ్ దిగ్ధేవానుచరాంశ్చైవ పూజయే త్పూజ్యతే శ్రియా
అపూజ్యప్రథమం సూర్యమపరాన్యస్తు పూజయేత్ తత్తద్భూత కృతం పాద్యం న ప్రగృహ్ణంతి దేవతాః
యాత్రా కాలేతు సంప్రాప్తే సవితుర్ధీక్షితాం తనుమ్ యే ద్రక్ష్యంతి నరా భక్త్యా తే భవిష్యంత్య కల్మషాః
పౌర్ణమాస్యామమాయాంచ దర్శనం పుణ్యదంస్మృతమ్ సప్తమ్యాంచ తథా షష్ఠ్యాం దినే తస్యరవేస్తథా
ఆషాడీ కార్తీకీ మాఫీ తిథ్యః పుణ్యతమాః స్మృతాః మహాభాగ్యం తిథేః పుణ్యం యథాశాస్త్రేషు గీయతే
కార్తిక్యాంతు విశేషణ మహాకార్తిక్యుదాహృతా ఏవం కల సమయోగా ద్యాత్రాకాలే విశిష్యతే
దర్శనం చ మహాపుణ్యం సర్వపాపహరంభవేత్ ఉపవాస పరోయస్తు తస్మిన్కాలే యత వ్రతః
పూజయేత్తు రవింభక్త్యా సగచ్ఛేత్పరమాంగతిమ్ దేవోఽయం యజ్ఞపురుషో లోకాను గ్రహకాంక్షయా
ప్రతిమావస్థితో భూత్వా పూజాంగృహ్ణాత్యనుగ్రహత్ స్నానాద్దానాజ్జపాద్ధోమాత్సం యోగాద్దేవ కర్మణః
కూర్చానాం వపనాచ్చైవ దీక్షితః పురుషోభవేత్ కచానాం వపనం కార్యం సూర్యభక్తైః సదానరైః
తా॥ ఉపవసించి యుండినవారు, యోగులు, వేదశాస్త్ర పారంగతులు రథమును మొదట లాగవలెను. శూద్రుడు సూర్యరథముపై నెక్కకూడదు. సూర్యరధారోహనణము చేసిన శూద్రుడధోగతి పాలగును. ఈ చెప్పబడిన కారణము వలన మనుష్యులకెప్పుడును శాంతి కలుగును. సూర్యభగవానుడు దేవతలందఱికీని నాయకుడు. దేవాలయ ప్రాంతములందే రథములను నిలిపియుంచ వలెను. మొదట సూర్యుని ధూప దీప నైవేద్యములతో పూజించి, అటు పైన పరివార దేవతలను, దిక్పాలురను పూజింపవలెను. పూజలందీన దేవతలు పూజించిన వారిని ధన ధాన్యాదులనిచ్చి యనుగ్రహింతురు. మొదట సూర్యదేవుని పూజింపక, ఇతర దేవతలను పూజించినచో వారాపూజలను స్వీకరింపరు. రథయాత్రాకాలము సంప్రాప్తించినప్పుడు సూర్యనారాయణుని యానదీక్షితమైన స్వరూపమును భక్తితో దర్శించువారు పాపరహితులగుదురు. పూర్ణిమ, అమావాస్య, షష్టి, సప్తమి తిథులలో సూర్యదర్శనము పుణ్యప్రదమైనదిగ చెప్పబడినది. ముఖ్యముగా ఆషాఢ, కార్తిక, మాఘమాసములందలి యీ తిథులు పుణ్యతమములని పేర్కొనబడినవి. ఈ తిథులలో సూర్యోపాసన మహాభాగ్యముగను, పుణ్యప్రదముగను శాస్త్రములు కీర్తించినవి. కార్తిక మాసమునం దిట్టి తిథి 'మహాకార్తికి'యని విశ్లేషించి చెప్పబడినది. ఇట్టి తిథులు యాత్రాకాలమున తటస్థించెనేని మణీంత ప్రత్యేకతను సంతరించుకొనును. ఈ సమయములందు సూర్యదర్శనము మహాపుణ్యము, సర్వపాపహరమునగును. ఉపవాసపరుడై ఇట్టివేళలలో నియమవ్రతుడై. భక్తి యుక్తుడై సూర్యార్చన చేయువాడు పరమగతిని పొందును. ఈ దేవదేవుడు యజ్ఞపురుషుడు. లోకమునను గ్రహించుట కొఱకు. ప్రతిమారూపమున నుండి కరుణాళువై భక్తుల పూజలు స్వీకరించుచుండును. స్నానము వలన, దానము వలన, జపము వలన, హోమము వలన, నిరంతరము దేవతా కార్యములందు నిమగ్నుడైయుండుట వలన. పెరిగిన మీసములు, గడ్డములు వపనము చేయించుకొనుట వలన మనుష్యుడు దీక్షితుడగుచున్నాడు. సూర్యదేవుని భక్తులు గడ్డములు మాసములు తలవెంట్రుకలు ముండనము చేయించుకొనవలయును.
మూ॥ సూర్యక్రతౌ శుచి స్త్వేవం దీక్షితః పురుషోభవేత్ చతుర్ణామపి వర్ణానాం భక్త్యా సూర్యస్య నిత్యదా
ఏవం యేఽ త్ర కరిష్యంతి తేనరా నిత్య దీక్షితాః చీర్ణవ్రతా మహాత్మానస్తే యాస్యంతి పరాంగతిమ్
ఇత్యేషా కథితా రుద్ర! రథయాత్రా దివస్పతేః యాం శ్రుత్వా వాచయిత్వాచ సర్వరోగైర్విముచ్యతే
కృత్వాచ విధివద్భక్త్యా యాతి సూర్యసదోనరః రథాహాకథితా రుద్ర! సమాసాత్సప్తమి శుభా భూయోఽపి శ్రూయతాం రుద్ర! సప్తమింగదతోమమ
ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్య సంహితాయాం బ్రాహ్మేపర్వణి
సప్తమి కల్పే రథయాత్రో వర్ణనం నామాష్ట పంచాశత్తమోఽధ్యాయః
తా॥ సూర్యక్రతువునందిట్లు శుచిర్భూతుడై మనుష్యుడు దీక్షితుడగును నాలుగు వర్ణములవారికిని సూర్యభగవానుని యుపాసనము మోక్షప్రదము. అటులుపాసించువారు నిత్యదీక్షితులు. సూర్యవ్రతమాచరించుచుండువారు మహ్మాత్ములు. వారు పరమగతిని పొందుదురు. ఈ విథముగ సూర్యరథయాత్రను గూర్చినీకు చేప్పితిని. దీనిని వినుటచే, చెప్పుటచే, చెప్పించుటచే సర్వరోగములు నశించిపోవును. శాస్త్రమునననుసరించి సూర్యప్రతాచరణము భక్తితో నొనర్చువాడు సూర్యలోకమునకుఁబోవును. శుభప్రదమైన రథసప్తమిని గూర్చి సమగ్రముగఁజేప్పితిని. ఇంకను నీ సప్తమి గుళించి విశేషములు చెప్పెదను. వినుము.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, రథసప్తమి కల్పమున రథయాత్రా వర్ణనమను ఏబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 58 of the Bhavishya Mahā Purana is as follows:
The logistical and ritual details of the Rathayātrā are continued here, with specific guidance on the different procession routes appropriate to different city-sizes and temple-types. The significance of the specific directions and turns taken during the procession — which correspond to Sūrya's movement through the ecliptic at different points in the year — is explained. The chapter then turns to the subject of donations: what is most meritorious to give to whom on the occasion of the Rathayātrā. Sesame seeds, copper vessels, red cloth, red flowers, and cows are among the most auspicious donations, each associated with a specific fruit and a specific dimension of Sūrya's grace.