భవిష్య మహా పురాణము
53. రధ సప్తమి కల్పమున సూర్యగతి వర్ణనము
మూ.బ్రహ్మోవాచ :
తత్రారుణో మయాపూర్వం సారధ్యేసన్నియోజితః ఇంద్రేణ మాఠరోనామ వాయునా కల్మషేణతు
వైన తేయేన తారోపరి విమలో నఖ తుండప్రహరణః పురోగామీ నియుక్త ఇతి.
కాలేన దండో మహాదండాయుధో భవతా శేషా గణాధిపాః
వైశాఖేన రాజ్ఞా వసుభదాయుధాంగారి ద్వౌ అగ్నినాపింగలః
సంయంతా మహాదండాయుధో భవతో శేషో మహా గణాధిపః
హస్తోయమేన పాశహస్తోంబుపతినా సమంధనః, అలకాధిపతిగా విష్ణుః
అశ్విభ్యాం కాలోపకాలౌ వాక్షప్రధానకౌ, నరనారాయణాభ్యాం క్షారౌ ధారౌ ధిషణ కృష్ణా
వైరాజ శంఖపాల పర్జన్య రజసాం దిశాసు విదిశాసు దిశాం పాలనం విశ్వేదేవా దదుః
సప్తైతా లోకమాతరః సర్వమరుతోఽ దదన్, ఓంకారో వషట్కారో వేద నిస్వనః పినాకీ
వినాయకః శేషోఽనంతో వాసుకిశ్చ నాగసహస్రేణాత్మతుల్యేనా దిత్యస్య రథమను యాంతి
గాయత్రీ సావిత్రీ రథే స్థితే ఉభే సంధ్యే సదా సా దేవతా యా రవి మండలం నా పైతి; భగవంతం సహస్రకిరణమవలంబితుమ్
ఏతద్వై సర్వదైవత్యం మండలం బ్రహ్మవాదినాం బ్రహ్మయజ్ఞ వాదినాం యజ్ఞః భగవద్భక్తానాం పరమాదిత్యోయం విష్ణుర్మా హేశ్వరాణాం మహేశ్వరః
స్థానాభిమానినో హ్యేతే సదావై వృషభద్వజ
సూర్యమాప్యాయయంత్యేతే తేజసాం తేజ ఉత్తమమ్
తా॥ అరుణుడు సూర్యురథ సారథ్యమునకై పూర్వము నాచే నియుక్తుడయ్యెను. ఇంద్రుని చేత మాఠరుడు, వాయు యములచే తమ ప్రతినిధులు. గరుత్మంతునిచే ననూరుని పై ముందు పయనించుటకై నఖములచే, తుండముచే దెబ్బకొట్టగల విమలుడు నియమింపబడిరి. మహాదండమే ఆయుధముగా గల దండుడు, మిగిలిన మహాగణముల కధిపతులు కాలస్వరూపుడవైన నీచేత సూర్య పార్శ్వ వర్తులుగ నియమింపబడిరి. కార్తికేయ ప్రభువుచేత వసుభిత్తు, ఆయుధాంగారికుడు; అగ్నిచేత పింగళుడు, నీ చేతనే చక్కగా కట్టడిచేయగల మహాదండాయుధుడు, మహాగణాధిపుడు నియుక్తులైరీ. యముడు హస్తుని, వరుణుడు పాశహస్తుని సమిధనుని, కుబేరుడు విష్ణువును. అశ్వినీ కుమారులు కాలోషకాలురను శక్తి ప్రధానులను, నరనారాయణులు క్షారులు, ధారులు, ధిషణ కృష్ణులను వారిని నియమించిరి. దిక్కులయందు, వీదిక్కులయందు దిక్పాలనమను వైరాజ, శంఖపాల, పర్జన్య, రజస్సులకు విశ్వేదేవతలిచ్చిరి-6. బ్రాహ్మ్యది సప్తమాతృకలు మరుద్గణములకిచ్చిరి. ఓంకారము, వషట్కారము, వేదఘోష, శివుడు, వినాయకుడు, ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, తమతో సమానులైన వేయి సాగులతో కూడి సూర్యరథమునను గమింతురు. ప్రాతసాయం సంధ్యలతో కూడ గాయత్రియైన సావిత్రీదేవి భగవానుడైన సహస్రకరణు నాశ్రయించి యుండుట కొఱకు సూర్యమండలమును విడువకుండును. ఇదియే సర్వదేవతాకమైన సూర్యమండలము. ఇదియే బ్రహ్మవాదులకు, బ్రహ్మయజ్ఞవాదులకును పూజాస్థానము. భగవద్భక్తులకు శ్రేష్ఠమగు దేవత. హరిహరులకు మహేశ్వరుడు. ఈ స్థానాభిమాన దేవత లెల్లప్పుడు తమ తేజస్సులతో సూర్యుతేజస్సును పుష్టమొనర్చుచుందురు.
మూ॥ గ్రధితైః స్వైర్వచోభిస్తు స్తువంతే ఋషయోరవిమ్ గంధర్వాప్సరసశ్చైవ గీత నృత్యైరుపాసతే
వియద్భ్రమణతో రక్షాం కుర్వతిస్మ ఇషుగ్రహమ్ సర్వావహంతివైసూర్యం యాతుధానాస్తు యాంతిచ
వాలఖిల్య నమంత్యేతం పరిచార్యోదయాద్రవిమ్ దివస్పతిః స్వభూశ్చోభౌ అగ్రగౌయోజనస్యలు
భర్గోఽథ దక్షిణే పార్శ్వే కంజజో వామతః స్థితః సర్వేతే పృష్ఠగా జ్ఞేయా గ్రహా లోకేషు పూజితాః
ఉపరాగ శిఖీ చోభావగ్రతో నాత్ర సంశయః మనుష్యధర్మా దక్షిణత ఉత్తరేణ ప్రచేతసః
సంభవంతి తధాకృష్ణ! ఉభావేతౌ సదాగ్రగౌ వామేన వీతి హోత్రస్తు పృష్ఠతస్తు హరిః సదా
రథపీఠే క్షమా జ్ఞేయా అంతరాలే నభస్తథా ఆశ్రిత్య రథజాం కాంతిం ఖం దివః సమయః స్థితః
ధ్వజే దండశ్చ విజ్ఞేయో ధ్వజాగ్రే వృష ఏవచ బుద్ధిర్వృద్ధిస్తథా శ్రీశ్చ పతాకా పార్వతీప్రియ!
ధ్వజదండాగ్రే గర్యుడస్తదగ్రే వరుణాలయః మైనాకాశ్ఛత్ర దండస్తు హిమవాంశ్ఛత్రముచ్యతే
కేచిదేవం వదంతీహ లోకేచాన్యే మహామతే! ఛత్రదండస్తధా క్లేశః క్లేశం ఛత్రం విదుర్భుధాః
తా॥ ఋషులు తమ మాటల కూర్పుల నేర్పులతో సూర్యదేవుని స్తోత్రము చేయుచుందురు. గంధర్వులు తమగానముతో, అప్సరలు తమ నృత్యముతో నాదేవుని యుపాసింతురు. ఇషు (బుధ) గ్రహమాకాశమునఁదిరుగుచు రక్షించుచుండును. సర్పములు, రాక్షసులును సూర్యుననుసరించియుండి రక్షణ చేయుచుండును. అరువదివేల మంది వాలఖిల్య ఋషులు సూర్యునకు పరిచర్యలు చేయుచు సమస్కరించుచుందురు. దీవస్పతి, స్వభువు ఇద్దఱును సూర్యరధమునకు ముందు ఒక యోజన మాత్రదూరమున నడచుచందుగు. భర్గుడు రథమునకు కుడిప్రక్కన, బ్రహ్మదేవుడెడమ ప్రక్కన వెంటనంటియందురు. లోకముచే పూజింపబడు గ్రహములన్నియు రథము వెనుక నడచుచుందురు. రాహుకేతువులిద్దఱు ముందేయుందురు. కుబేరుడు దక్షిణభాగమున, వరుణుడుత్తరభాగముననుందురు. ఐనను వీరు తఱచుగ ముందునకగుచుందురు. ఎడమ ప్రక్క వీతిహోత్రుడు, వెనుక ప్రక్క హరియునుందురు. రథపీఠమునందు పృథివి, అంతరాళమున నాకాశముండునని తెలియవలెను. రథము నుండి వెలువడు, కాంతి నాశ్రయించి ఆకాశము, స్వర్గము, కాలము ఉండును. టెక్కెము దండముగను, ఆటెక్కము పైన వృషరూప ధర్మముతో, పతాక బుద్ది, వృద్ధి, శ్రీ యుక్తమైయుండును. ధ్వజ దండాగ్రమునందు గరుడుడు, దానిపై వరుణాలయముండును. హిమవంతుడు ఛత్రముగను మైనాకుడు ఛత్రదండముగను ఉందురు. కొందతిట్లు చెప్పుదురు. మణి కొందఱు క్లేశమే ఛత్రదండమని, క్లేశమే ఛత్రమనియుననుకొందురు.
మూ. ఏతేషామేవ దేవానాం యథావీర్యం తథాతపః యథాయోగం తథాసత్త్వం యథాసత్త్వం తథాబలమ్
తథా తపత్యసౌ సూర్యస్తేషాం సిద్ధః స్వతేజసా ఏతే తపంతి వర్షంతి యాంతి విశ్వం సృజంతిచ
భూతానా మశుభం కర్మ వ్యపోహంతి చకీర్తితాః ఏతే సహైవ సూర్యేణ భ్రమంతే సానుగా దివి
తపంతశ్చ జపంతశ్చ హ్లాదయంతశ్చ వైద్విజాః గోపాయంతి స్మభూతాని ఇహతే హ్యను కంపయా
ప్రీణాతి దేవా నమృతేన సూర్యః సోమేన సూక్తేన వివర్ధయిత్వా శుక్లేన పూర్ణా దివస క్రమేణ తంకృష్ణపక్షే విబుధాః పిబంతి
పీతం హి సోమం ద్వికలావశేషం కృష్ణేతు పక్షే రుచిభిర్జ్వలంతమ్
సుధామృతం తత్పతరః పిబంతి ఊర్జాశ్చ సౌమ్యాశ్చ తథైవ కల్పా
సూర్యేణ గోభిశ్చ సమృద్ధితాభిరద్భిః పునశ్చైవ సముజ్ఘితాభిః
తథౌషధీభిః సతతం పిబంతి అత్యంత పానేన క్షుధా జయంతి
మాసార్థ తృప్తిస్తుమతాభిరద్భిర్మాసేన తృప్తి: స్వధయా పితృణామ్ అన్నేన శశ్వద్విదధాతి మర్త్యం త్వయం జగచ్చైవ బిభర్తి గోభిః
అహోరాత్రం రథేనాసావేక చక్రేణ వైభ్రమన్ సప్తద్వీప సముద్రాంతం సప్తభిశ్చ హయైః సహ
ఛందోభిర్వాజి రూపైః స్తైర్యతశ్చక్రం తతఃస్థితైః కామరూపై సకృద్యుక్తై రంతర స్థైర్మనోజవైః
హరిభిరవ్యయెర్వశ్యైః క్షుధాశ్రమ వివర్జితైః ద్వ్యశీతి మండల శత మిహంత్యబ్ధేన వైహయాః
తా॥ ఈ దేవతల సామర్థ్యము, తపము, యోగము, సత్త్వము, బలములనుబట్టి. సూర్యభగవానుడు తన తేజస్సుచే సిద్దుడై తపించుచుండును. ఈ దేవతలు కూడ సూర్యప్రతాపముచే తపింతురు. వర్షింతురు. విశ్వమును సృష్టింతురు. పోషింతురు. జీవుల చేత కీర్తింపబడి వారి యశుభ కర్మలను నివృత్తి చేయుదురు. వీరలే ఆకాశమునందు సూర్యదేవుననుసరించుచు తిరుగుచుందురు. బ్రాహ్మణులు వీరినే జపించుచు, వీరిని గుణించియే తపస్సులు చేయుచు జగత్తున కానందమునిచ్చుచుందురు. వీరు తమ కరుణా దృష్టిచే ప్రాణులను రక్షింపుచుందురు. సూర్యుడు తన కిరణములను ప్రసరింపజేయుట ద్వారా చంద్రునితో అమృతమును వృద్ధి చేసి దానితో దేవతలను సంతోషపరచుచుండును. దీనక్రమమున శుక్లపక్షమున వృద్ధియయిన అమృతమును కృష్ణపక్షమున దేవతలు త్రాగుచుందురు-25. కృష్ణపక్షమున దేవతలు త్రాగగా రెండు కళల మాత్రముగా శేషించి, రుచులతో ప్రకాశించు చుండు నమృతమును పితృదేవతలు-ఉత్సాహవంతులు, సౌమ్యులు, యోగ్యులు త్రోవుచుందురు. సూర్యభగవానునిచే వృద్ధిచేయబడిన నీటిచేత, ఆవులచేత, వివిధములైన ఓషదుల చేత పితరులు, మానవ ప్రాణులు వారి అన్నపానములను పొంది తృప్తులగుచున్నారు. వానిని తృప్తిగా సేవించుటచే ఆకలిని జయించుచున్నారు. పితృదేవతలకు మాసార్థము జలముచేతను, ఒక మాసము హవిర్దానము చేతను, ఎల్లప్పుడన్నముచేతను తృప్తినిచ్చును. మర్త్యమైన ఈ జగత్తును ఆవులచే పోషించును. సూర్యభగవానుడేక చక్రరథారూఢుడై రాత్రింబవలు సప్తద్వీపయుక్త పృథ్వీమండలముతో కూడిన సముద్రపర్యంతము తన ఏడు గుఱ్ఱములతో తిరుగుచుండును. ఆ రథాశ్వములు ఛందః స్వరూపములు, వేగవంతములు (తెక్కలుగల గుట్టములవంటివి) రథానుకూలగమనము గలవి. కోరిన రూపమును ధరిపగలవి, ఒకేసారి పూన్చబడినవి, వెలుపలనుండునని, మనోవేగముగలవి. వ్యయముకానివి, వశమైయుండునని, ఆకలిదప్పులు, అలసటలేనివి; అట్టియాగుఱ్ఱములు ఒక సంవత్సరమున ఎనుబది రెండు వందల ఆవృత్తములు పూర్తిచేయును.
మూ. బాహ్యతోభ్యంతరం చైవ మండలం దివసక్రమాత్ కల్పాదౌ సంప్రయుక్తాస్తే వహంత్యాభూతసంప్లవమ్
ఆవృతా వాలఖిల్యైస్తైర్భ్రమంతి తాన్యహానితు గ్రథితైః స్వైర్వచోభిస్తు స్తూయమానో మహర్షిభిః
సేవ్యతే నృత్యగీతైశ్చ గంధర్వైరపురోగణైః పతంగః పతగైరశ్వైర్వసతే భ్రమయన్దివి
వీధ్యాగ్ర్యయా విచరతే నక్షత్రాణి యథాశశీ మధ్యగశ్చామరావత్యాం యథాభవతి భాస్కరః
వైవస్వతే సంయమనే ఉత్తిష్ఠన్దృశ్యతే తదా సుఖాయామర్థరాత్రంతు విభాయామస్తమేతిచ వైవస్వతే సంయమనే మధ్యమస్తు రవీర్యదా సుఖాయా మధ వారుణ్యాముత్తిష్ఠన్దృశ్యతే తదా
రాత్ర్యర్థం చామరావ త్యామస్తమేతి యమస్యపై సోమ పుర్యాం విభాయాంతు మధ్యగశ్చార్యమా యదా
మహేంద్రస్యామరావత్యా ముత్తిష్ఠతి దివాకరః అర్ధరాత్రం సంయమనే వారుణ్యామస్తమేతిచ
ఏవం చతుర్షుపార్శ్వేషు మేరోః కుర్వన్ప్రదక్షిణమ్ ఉదయాస్తమనే చాసావుత్తిష్ఠతి పునః పునః
తా॥ దినక్రమముగ సాగుచుండు నీ బాహ్మభ్యంతరా వృత్తములు కల్పాదియందు ప్రారంభింపబడినవి. ప్రళయము వఱకును యిలు సాగించుచుండును. వాలఖిల్యుల చేతను. మహారులు తమ వాకు) లతో కూడిన పోతపాఠము చేతను ఆవరింపబడి యహో రాత్రములు తిరుగుచుండును. గంధర్వులు, అప్పగలు తమ ఆటపాటలతో సేవింపుచుండగా సూర్యనారాయణుడు ఆ టెక్కల గుఱ్ఱముల రథముతో నాకాశమున తిరుగుచుండును. చంద్రుడు నక్షత్ర మార్గమున విహరించునట్లు, ఆకాశమునందలి ప్రముఖమైన వీధిలో పయనించుచు సూర్యుడింద్రుని పట్టణమైన అమరావతి మధ్య భాగమును చేరుకొనిన సమయమున. యుముని పట్టణమైన సంయమనిలో నుదయించుచు కన్పట్టును. వరుణుని రాజధాని యగు సుఖా పట్టణమున నపుడర్థరాత్రియగును. అదే సమయమున చంద్రుని రాజధానియగు విభాపట్టణమున అస్తమయమగును. యముని పట్టణమైన సంయమనమున మధ్యభాగమును చేరుకొనినప్పుడు వరుణుని సుఖాపట్టణమున నుదయించుచు కన్పించును. అప్పుడమరావతిలో నర్ధరాత్రియగును. యమ పట్టణమున నస్తమయమగును. సూర్యుడు చంద్రపట్టణమైన ‘విభలో మధ్యభాగమునకు చేరుకున్నప్పుడు. అమరావతిలో నుదయకాలమగును. సంయమనమున నర్థరాత్రమగును. వరుణుని సుఖాపట్టణమున నస్తమయకాలమగును. ఇట్లు మేరు పర్వతము నలుప్రక్కల ప్రదక్షిణము చేయుచు సూర్యుడు మల మఱల నుదయించుచు నస్తమించుచు అస్తమించుచు నుదయించుచు నుండును.
మూ॥ పూర్వాహ్ణేచాపరా హ్ణేచ ద్వౌద్వౌదేవాలయా పునః తపత్యేకంతు మధ్యా హ్నే తాభిరేవ గభస్తిభిః
ఉదితో వర్ధమానాభిరామధ్యాహ్నాత్త పేద్రవిః తతః పరం హ్రసం తీభిర్గోభి రస్తం నియచ్ఛతి
యత్రోద్యన్దృశ్యతే సూర్యః సతేషాముదయః స్మృతః ప్రణాశం గచ్ఛతే యత్ర సతేషామస్తముచ్యతే
ఏవం పుష్కర మధ్యేన తదా సర్పతి భాస్కరః త్రింశద్భాగంతు మేదిన్యా ముహూర్తేన సగచ్ఛతి
యోజనాగ్రేణ సంఖ్యాంతు ముహూర్తస్య నిబోధమే పూర్ణం శత సహస్రాణాం సహస్రంతు త్రిలోచన
పంచాశచ్చ తథాల్పాని సహస్రాణ్యధి కానితు మౌ పూర్తికీ గతిర్హ్యేషా సూర్యస్యతు విధీయతే
యోజనానాం సహస్రేద్వే శతేద్వేచ యోజనే నిమేషాంతరమాత్రేణ దివి సూర్య: ప్రసర్పతి
స శీఘ్రమేవ పర్యేతి భాస్కరోఽలాత చక్రవత్ భ్రమన్వై భ్రమమాణేషు ఋక్షేషు విచరత్యసౌ
ఇంద్రః పూజయతే సూర్య ముత్తిష్ఠంతం దినే దినే మధ్యాహ్నేచ యమః పశ్చాదస్తం యాంతమపాంపతిః
సోమస్తధార్థ రాత్రేతు సదా పూజయతే రవిమ్ విష్ణుర్భవానహం రుద్రః పూజయామ నిశాక్షయే
ఏవమగ్నిర్నిరృతిశ్చ వాయురీశాన ఏవచ పూజయంతి క్రమేణైవ భ్రమమాణం దివాకరమ్ శ్రేయోర్థం దేవశార్దూల! సర్వేబ్రహ్మాదయః సురాః!
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్యాం సంహితాయాం బ్రహ్మేపర్వణి
రథ సప్తమి కల్పే సూర్యగతి వర్ణనంనామ త్రిపంచాశత్తమోఽధ్యాయః
తా॥ పూర్వాష్ఠమునందు, అపరాష్ట్రమునందును సూర్యదేవునకు రెండేసి స్థితులుండును. మధ్యాహ్నకాల స్థితియందు మాత్రమాతడు తన కిరణములతో తీక్షముగ వెలుగుచుండును, ఉదయించినది మొదలుకొని మధ్యాహ్నము వఱకు వృద్దిచెందుచున్న కిరణములతో తపించుచుండును. ఆ పిదప క్రమముగా హ్రస్వమగుచున్న కిరణములతో నస్తమించును. ఎచట సూర్యుడుదయించుచున్నట్లు కనపడునో అది అచటవారికి ఉదయకాలమగను. ఎచట నస్తమించినట్లగుపడునో అది ఆచటీ వారికస్తమయ సమయమని చెప్పబడును. ఇట్లాకాశమధ్యమున సూర్యుడు సంచరించుచుండును. ఒక ముహూర్తకాలమునందు భూమి ఉపరితలము పైని ఆకాశమును ముప్పది భాగములు తిరుగును. ఒక ముహూర్తమునకాతడు భూమ్యుపరి భాగమున తిరుగుచు తన తాపమును ప్రసరింపజేయు భూభాగమును యోజనముల సంఖ్యలో తెలిసికొనుము. త్రిలోచనా! ఆ సంఖ్యనూజులక్షలు!. సూర్యగతి కనిష్టముగా నేబదియోజనములు, గరిష్టముగ వేయి యోజనములోక ముహూర్తకాలముననుండును. ఒక నిమిషములో, వేయి యోజనముల ప్రయాణమునందు రెండేసి వందలు గరిష్ఠముగను. రెండు యోజనములు కనిష్ఠముగను సూర్యుడు సంచరించును. (అనగా నొక ముహూర్తమున తొంబదియాఱు యోజనములకు తగ్గకుండ, తొమ్మిది వేలయాటువందల యోజనములు మించకుండ సూర్యగమనముండును). భాస్కరుడు అలాత చక్రమువలె (దుందుమ త్రిప్పినట్లు) వేగముగ కదలి పోవుచుండును. తిరుగుచున్న నక్షత్రములలో విహరించుచుండును. ప్రతిదినము ఉదయించుచున్న సూర్యుని ఇంద్రుడు పూజించుచుండును. యముడు మధ్యాహ్న సమయమున, వరుణుడస్తమయ కాలమున. చంద్రుడర్ధరాత్రి సమయమున విడువక పూజించుచుందురు. ఓ శివా! నీవు, నేను, విష్ణువు, రుద్రుడు రాత్ర్యంతమున (ఉదయాత్పూర్వ సమయమున) ఆ సూర్యభగవానుని పూజించుచుందుము కదా!. ఇటులే అగ్ని, నిరృతి, వాయువు, ఈశానుడు మొదలైన వారు కూడ-ఇంకను బ్రహ్మాది దేవతలందఱును శ్రేయః కాములై గమనశీలుడైన ఆ దేవదేవుని పూజించుచుందురు.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, రథసప్తమి కల్పమునందు సూర్యగతి వర్ణనమను ఏబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 53 of the Bhavishya Mahā Purana is as follows:
The Ratha-saptamī — one of the most important solar festivals, observed on the seventh tithi of the bright fortnight of Māgha — is introduced by a description of Sūrya's chariot (ratha). The chariot has a single wheel representing the year, twelve spokes representing the twelve months, six seasons as the nave, and the three worlds as the axle. The seven horses — named Gāyatrī, Bṛhatī, Uṣṇik, Jagatī, Triṣṭup, Anuṣṭup, and Paṅkti — represent the seven Vedic metres. Aruṇa, Kaśyapa's son by Vinatā (Garuḍa's elder brother), serves as Sūrya's charioteer. The chapter presents this mythic chariot as simultaneously a cosmic mechanism — the actual vehicle by which solar energy is distributed through the universe — and a ritual object that can be ceremonially replicated in the Ratha-saptamī festival.