52. సప్తమీ కల్పమున సూర్యపూజా సృష్టి వర్ణనము

సుమంతురువాచ :

మూ॥ ఇత్యుక్త్వా భగవాన్దేవః శంఖచక్ర గదాధరః అంతర్ధానగతో వీర! సాంబ స్యేహ ప్రపశ్యతః

సాంబోZపి కృత్వా విధివత్సప్తమిం రథసప్తమిమ్ ఆధిభిర్వ్యాధిభిర్ముక్తో జగా మాశు స్వమందిరమ్

శతానీక ఉవాచ :

రథయాత్రా కథం కార్యా రథం కార్యః కథం రవే: కేనేహ మర్త్యలోకేషు రథయాత్రా ప్రవర్తితా

సుమంతురువాచ :

ఇమ మర్థం పురా పృష్టః పద్మయోనిః ప్రజాపతిః రుద్రేణ కురుశార్దూల! ఆసీనఃకాంచనే గిరౌ

పద్మాసనం పద్మయోనిం సుఖాసీనం ప్రజాపతిమ్ ప్రణమ్య శిరసా దేవో రుద్రో వాచముదైరయత్

శ్రీ రుద్ర ఉవాచ :

య ఏష భగవాన్దేవో భాస్కరో లోక భాస్కరః కథమేష భ్రమేద్దేవో రథస్థో విమలః సదా?

బ్రహ్మోవాచ :

యథాదివి భ్రమేత్తాత! రథారూడో రవిః సదా తథా తే వర్తయి ష్యేZ హం రథం చాస్యత్రిలోచన ।

 రథేన హ్యేక చక్రేణ పంచారేణ త్రీణాభినా హిరణ్మయేన కాంతేన అష్టబంధైక నేమినా

చక్రేణ భాస్వతా చైవ దీవి సూర్యః ప్రసర్పతి దశయోజన సాహస్రో విస్తారోప్యస్య కథ్యతే

 త్రిగుణాచ రథోపస్థా దీషా దండప్రమాణతః యుగమస్యతు విస్తీర్ణ మరుణో యత్ర సారధిః

తా॥ సుమంతుముని యిట్లనెను. “శంఖము, చక్రము, గద ధరించియున్న భగవానుడగు శ్రీకృష్ణదేవుడిట్లు చెప్పి సాంబుడు చూచుచుండగనే యంతర్షితుడయ్యెను. సాంబుడు కూడ విధి ప్రకారముగ రథసప్తమి వ్రతము నాచరించి యాధివ్యాధులనుండి ముక్తుడై వెంటనే స్వీయమందిరమున కరిగెను.” శతానీకుడిట్లు పలికెను. “రథయాత్ర యెట్లు చేయవలెను? సూర్యరథమునెట్లు నిర్మింపవలెను? ఈ సూర్య రథయాత్రా విధానమును మానవలోకముననెవరు ప్రవర్తింపజేసిరి?. సుమంతుముని యిట్లు సమాధానము చెప్పెను. “పూర్వము కాంచన సర్వతము పై సుఖాసీనుడైయున్న పద్మసంభవుడగు బ్రహ్మదేవుని రుద్రుడిదే ప్రశ్నయడిగెను. తామర చూలి పద్మాసనమున సుఖముగ కూర్చుండి యుండిన వేళ రుద్రుడాతనికి శిరమువంచి నమస్కరించి యిట్లు పలికెను. "దేవా! లోకమునకంతటికిని వెలుగును ప్రసాదించు నీ సూర్యభగవానుడు ఎల్లప్పుడు స్వచ్చుడే రథము పైనెట్లుసంచరించుచుండును?. ఆప్రశ్న విని బ్రహ్మదేవుడిట్లు ప్రత్యుత్తరము చెప్పెను. “ఓ త్రిలోచనా! భాస్కరుడు రథారూఢుడై యాకాశమున నేట్లు తిరుగుచుండునో ఆతని రథమెట్టిదో వివరించెదను. ఒకే చక్రము, ఐదాకులు, మూడు నాభులు, కలిగి, సువర్ణమయమై, కాంతిమంతమై, అష్టబంధములు, ఒక కమ్మితోడి చక్రముగల. ప్రకాశవంతమైన రథమునందు విరాజమానుడై సూర్యుడంతరిక్షమునఁ దిరుగుచుండును. ఈ రథవైశాల్యము పదివేల యోజనములని చెప్పుదురు రథోపస్థ కంటే నీషాదండము మూడు రెట్లధికమైనది. దీని కాడి మిక్కిలి వెడల్పైనది. దాని పై రథసారధియగు అరుణుడు కూర్చుండును.

మూ॥ ప్రాసంగ కాంచనో దివ్యో యుక్తః పవనగైర్హమైః ఛందోభిర్వాజి రూపైస్తు యతశ్చక్రం తతః స్థితైః

యేనాసౌ పర్యటేద్వ్యోమ్ని భాస్వతాతు దివస్పతి: అథైతానితు సూర్యస్య ప్రత్యంగాని రథస్యతు

సంవత్సరస్యావయవైః కల్పితాని యథాక్రమమ్ నాభ్యస్తిస్రస్తు చక్రస్య త్రయః కాలాః ప్రకీర్తితాః

ఆరాః పంచర్తవస్తస్య నేమ్యః షడృతవః స్మృతాః రధవేదీ స్మృతే తస్య ఆయనే దక్షిణోత్తరే

 ముహూర్తా ఇషవస్తస్య శమ్యాశ్చాస్య కలాః స్మృతాః తస్య కాష్ఠాః స్మృతాః కోణా అక్షదండః క్షణాః స్మృతాః

నిమేషాశ్చాస్య కర్తాః స్యాదీషాదండో లవాః స్మృతాః రాత్రిర్వరూథో ధర్మోZ స్య ధ్వజ ఊర్థ్వం ప్రతిష్ఠితః

యుగాక్షికోటి తే తస్య అర్థకామావు భౌ స్మృతో అశ్వరూపాణిచ్ఛందాంసి వదంతే వామతో ధురమ్

 గాయత్రీచైవ త్రిష్టుప్ చ జగత్యనుషుబేవచ పంక్తిశ్చ బృహతీచైవ ఉష్ణిగేవతు సప్తమి చక్రమక్ష నిబంధంతు ధ్రువేచాక్షః సమర్పితః సహచక్రో భ్రమత్యక్షః సచాక్షో భ్రమతీ ధ్రువే అక్షః సహైవ చక్రేణ భ్రమతేZ సౌధ్రువే స్థితః ఏవ మక్ష వశాత్తస్య సంనివేశో రథస్యతు

తథా సంయోగభావేన సంసిద్ధో భాస్కరో రథః తేన చాసౌ రవిర్దేవో నభః సంసర్పతే సదా

తా॥ రథమునకు గల దివ్యమైన బంగారపు కాడికి వాయువేగమున పరుగెత్తగల గుఱ్ఱములు అమర్చబడియుండును. ఛందస్సులే ఆ గుఱ్ఱముల రూపముననుండి చక్రమును త్రిప్పుచుండును. ప్రకాశవంతమైన ఇట్టి రథముతో సూర్యభగవానుడంతరిక్షమునఁ దిరుగుచుండును. ఇక చెప్పబోవునవి సూర్యరథ ప్రత్యంగములు. సంవత్సమునకుగల అవయవములే, క్రమముగా ఈ రథాంగములుగ కల్పింపబడినవి. చక్రమునకు గల నాభిత్రయమే మూడు కాలములు. బండికంటియాకుదును ఐదు ఋతువులు. నేమితో ఆజు ఋతువులు. తిన్నెలు రెండును దక్షిణోత్తరాయనములు. అమ్ములు ముహూర్తములు, చీలలు కళలు, కోణములు కాష్ఠలు, అక్షదండము క్షణములు. ఒరిపిడులు నిమేషములు, ఈషాదండము లవములు, రథము మీది కప్పురాత్రి, పైన ప్రతిష్ఠింపబడిన విల్లు ధ్వజము. కడియంచులు రెండును అర్థకామములు. అశ్వరూపములగు ఛందస్సులు సవ్యముగ భారము వహించును. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉషైక్ అనునవి యేడు ఛందములు.  చక్రము అక్షమునకు బద్ధమైయుండును. అక్షము ధ్రువమునందమర్పబడియుండును. చక్రముతో కూడి అక్షము కూడ తిరుగుచుండును. ఈ అక్షముతో కూడిన చక్రము ధ్రువము పై తిరుగుచుండును. ధ్రువము నందు పొదగబడి అక్షము, చక్రమును కలుపుకొని తిరుగుచుండును ఇట్లు అక్షవశమున రధ సునివేశమేర్పడును. ఇట్లన్నింటిని కలుపుకొని రవీరథము సిద్ధమగును. అట్టిరథము పై సూర్యదేవుడాకాశమున తిరుగుచుండును.

 యుగాక్షకోటి సంబద్ధే ద్వే రశ్మీ స్యందనస్యలు ధ్రువేతే భ్రమతో రశ్మీ న చక్రయుగ యోస్తువై

 భ్రమతో మండలానస్య రవేరస్య రథస్యతు కులాల చక్రవద్యాతి మండలం సర్వతో దిశమ్

యుగాక్ష కోటీ తే తస్య దక్షిణే స్యందనస్యతు ఋగ్యజుర్భ్యాం గృహీతేన విచక్రా శ్వేన వైధ్రువే

 హ్రసేతే తస్య రశ్మీతు మండలేషూత్తరాయణే దక్షిణేZథ సమృద్ధేతు భ్రమతే మండలానీతు

 యుగాక్ష కోటితే తస్య భ్రమతే స్యందనస్యతు సక్తా సక్తం భ్రమతే మండలం సర్వతో దిశమ్ ఆకృష్యేతే ధ్రువేణేహ సమంతిష్ఠతి సువ్రత! తదా సాభ్యంతరం దేవో భ్రమతే మండలానితు ధ్రువేణ ముచ్యమానేతు పునా రశ్మియుగేనవై తథైవ బాహ్యతః సూర్యో భ్రమతే మండలానితు

అశీతి మండల శతం కాష్ఠయోరుభయోరపి సరధోధిష్ఠితో దేవై ర్విభ్రమేద్దృష్టిభిః సహ

గంధర్వై రప్సరోభిశ్చ సర్పగ్రామణి రాక్షసైః ఏతైర్వసతివై సూర్యో మాసౌద్వౌద్వౌ క్రమేణతు

తా॥ కాడికన్ను అంచులకు కట్టబడిన రెండు పగ్గములు, రథమునకుండును. రెండు చక్రములందు కాక ఆ పగ్గములు రెండు ధ్రువములయందు తిరుగుచుండును. సూర్యరథము వలయములుగ తిరుగుచుండ సూర్యబింబమన్నిదిశలుగా కుమ్మరివాని చక్రమువలె (తనచుట్టుతాను) తిరుగుచుండును. ఉత్తరాయణమున, మండలావృత్తులయందు, రథమునకు గల దక్షిణ ధ్రువమునందలి కాడికన్నంచులకు గల పగ్గములను, ఋగ్వేద యజుర్వేదములచే గ్రహింపబడిన ఛందోరూప విచక్రాశ్వముప్రొస్వీకరించును. దక్షిణాయనమున అవి నిడుపులై వలయములు తిరుగుచుండును. రథము యొక్క యుగాక్ష కోటులురెండును, అంటియునంటనట్లన్ని దిశలుగ మండములుగా పరిభ్రమించుచుండును. ధ్రువముచేత నాకర్షింపబడినప్పుడు సూర్యబింబము సమముగ నుండును. ఆ సమయమున లోలోపలనే వలయములుగ తిరుగుచుండును, ధ్రువాకరణము నుండి విడివడి మఱల పగ్గములనుండియు విడిపోయినప్పుడు సూర్యుడు బాహిరముగనే వలయములు తిరుగుచుండును. రెండు కాష్ఠల కాలమున (పదునెనిమిది జెప్పపొట్లకాలము ఒక కాష్ఠ) రథముతో కూడ సూర్యుడు, దేవతాదృషులచేత నూట యెనుబది వలయములుగ తిరుగును. క్రమముగ నొక్కక్కరితో రెండేసి మాసముల చొప్పున సూర్యుడు, గంధర్వులతో, అప్సరలతో, సర్పములతో, రాక్షసులతోనుండును.

మూ॥ ధాతార్యమా పులస్త్యశ్చ పులహశ్చ ప్రజాపతిః ఖండకో వాసుకిశ్చైవ సకర్ణో రశ్మిరేవచ

తుంబురుర్నారదశ్చైవ గంధర్వౌ గాయతాంవరౌ క్రతుస్థలాప్సరశ్చైవ యాచసాపుంజికస్థలా

 గ్రామణీ రథ కృత్స్నశ్చ రథోజాశ్వ తరావుభౌ రక్షో హేతి: ప్రహేతిశ్చ యాతుధానౌ

 చ తావుభౌ

 మధుమాధవ యోరేష గణో వసతి భాస్కరే తథా గ్రీష్మాతు ద్వౌమాసౌ మిత్రశ్చ వరుణశ్చహ

 ఋషి రత్రిర్వశిష్ఠశ్చ తక్షకోZనంత ఏవచ మేనకా సహజన్యాచ గంధర్వౌచ హహా హుహూః

 రథ స్వనశ్చ గ్రామణ్యౌ రధచిత్రశ్చ తావుభౌ పౌరుషేయో వధశ్చైవ యాతుధానౌ మహాబలౌ

 శుచిశుక్రౌతు ద్వౌమాసౌ వసంత్యేతే దివాకరే ఇంద్రశైవ వివస్వాంశ్చ అంగిరా భృగురేవచ

ఏలా పర్ణః తధా సర్పః శంఖపాలశ్చ పన్నగాః ప్రహ్లిచా దుందుకాశ్చైవ గంధర్వౌ భానుదర్దురా

యాతుధానౌ తథా సర్ప స్తథా బ్రాహ్మశ్చ తావుభౌ ఏతేనభో నభస్యౌచ నివసంతి దివాకరే

 శరద్యేతే పునః శుభ్రా నివసంతిస్మ దేవతాః పర్జన్యశ్చైవ పూషాచ భరద్వాజః స గౌతమః

తా॥ ధాత, అర్యముడు అను ఆదిత్యులు; పులస్త్యుడు, పులహుడు అను బ్రహ్మమానస పుత్రులు; ఖండకుడు, వాసుకి యనేడు నాగులు; సకుడు, రశ్మి. తుంబురుడు, నారదుడు అను గాయక శ్రేష్ఠలగు గంధర్వులు; క్రతుస్థల, పుంజికస్థల యనునప్సరసలు. గ్రామణి (గంధర్వుడు) రధకృత్సుడు, రజుడు అనుయక్షులు, అశ్వతరుడు (నాగుడు) హేతి, ప్రతి యను పేళ్లుగల రాక్షసులు. వీరు చైత్రవైశాఖ మాసములలో సూర్యునియందుందురు. అటులే జ్యేష్ఠ, ఆషాడ మాసములలో మిత్రుడు వరుణుడు. అత్రి, వసిష్ఠుడు, అనుఋషులు తక్షకుడు, అనంతుడు; అనుసర్పవరులు, మేనక, సహజన్య, అను అప్సరసలు హాహాహూహూ అను గంధర్వులు. రథస్వనుడు, రథచిత్రుడను యక్షులు; పౌరుషేయుడు, వధుడు అను బలవంతులైన రాక్షసులు. సూర్యునితోనుందురు. ఇక శ్రావణ భాద్రపదములలో ఇంద్ర వివస్వతులను ఆదిత్యులు, అంగిరుడు, భృగుడు అనుఋషులు. ఏలాపర్ణుడు, శంఖపాలుడను సర్పములు, ప్రహ్లిచ, దుందుక అను పేర్లు గల అప్సరసలు, భాను, దుర్గురుడు అనుగంధర్వులు సర్పుడు, బ్రహ్మఅను రాక్షసులు, సూర్యునిలోనుందురు. ఆశ్వయుజ కార్తికమాసములలో పర్జన్యుడు, పూషుడు అను ఆదిత్యులు, భరద్వాజ గౌతమ ఋషులు.

మూ॥ చిత్ర సేనశ్చ గంథర్వస్తథా వసురుచిశ్చయః విశ్వాచీ చ ఘృతాచీ చ తే ఉభే పుణ్యలక్షణే

నాగ స్వైరావతశ్చైవ విశ్రుతశ్చ ధనంజయః సేనజిచ్చ సుషేణశ్చ సేనానీ గ్రామణీస్తథా ఆపోవాతశ్చ ద్వావేతా యాతుధానౌ ప్రకీర్తితౌ వసంత్యేతే తు వైసూర్యే ఇషోర్జౌ కాలపర్యయాత్

హైమంతికా తు ద్వౌ మాసౌ వసంత్యేతే దివాకరే అంశో భగశ్చ ద్వావేతో కశ్యపశ్చ క్రతుస్తధా

 భుజంగశ్చ మహాపద్మః సర్పః కర్కోటక స్తధా ఆపోవాతశ్చ ద్వావేతౌ యాతుధానౌ ప్రకీర్తితౌ చిత్రాంగదశ్చ గంధర్వారుణాయుశ్చైవ తావుభౌ సహేచైవ సహ స్యేచ వసంత్యేతే దివాకరే

 పూషా జిష్ణుర్జమదగ్నిర్విశ్వామిత్రస్తథైవచ కాద్రవేయౌ మహానాగౌ కంబలాశ్వతరావుభౌ

 గంధర్వో ధృతరాష్ట్రశ్చ సూర్యనార్చాశ్చతావుభౌ తిలోత్తమాచ రంభాచ సర్వలోకేచ విశ్రుతే

 గ్రామణీ: సేనజిచ్చైవ సత్యజిచ్చ మహాతపాః బ్రహ్మోపేతశ్చ వైరక్షో యజ్ఙో యజ్ఞస్తథైవచ ఏతే తపస్తపస్యైచ నివసంతి దివాకరే

అన్యేపి యే మందేహా రాక్షసాధి పతయో దేహం దేవ గుహ్య తమస్య

 రక్షార్థం సకల దేవైరస్మదాదిభిః సంనియుక్తా స్తాన్భవతే కథయామి.

తా॥ చిత్రసేనుడు, వరరుచియను గంధర్వులు, పుణ్యలక్షణములుగల విశ్వాచి, ఘృతాచి యనునప్సరసలు. ఐరావతుడు, ప్రసిద్ధుడైన ధనంజయుడు అను నిద్దజు నాగులు; సేనజిత్తు, సుషేణుడు అను యక్షులు. ఆపుడు, వాతుడు అను నిరువురు రాక్షసులు సూర్యునిలోనుందురు. ఇక మార్గశీర్ష, పుష్యమాసములలో అంశువు, భగుడు అనునాదిత్యులు; కశ్యపుడు, క్రతువు అను ఋషులు. మహాపద్ముడు, కర్కోటకుడు అను సర్పశ్రేషులు, ఆపుడు వాతుడునను రాక్షసులు. చిత్రాంగదుడు, అరుణాయువు అనుగంధర్వులు, సహా, సహస్యా అను పేరుగల యప్సరసలు. తార్య అరిష్టనేమియను యక్షులు, సూర్యునందుందురు. ఇంకను మందేహులను రాక్షసులు, సూర్యదేవుని, దేవ రహస్యమును కాపాడుటకు, నేను మొదలుకొని యందు దేవతలచే నియమింపబడిన వారు సూర్యునియందుందురు. మాఘ పాలున మాసములలో పూష, జిష్ణు అను నాదిత్యులు, జమదగ్ని విశ్వామిత్ర ఋషులు, కంబలుడు, అశ్వతరువు అను మహానాగులు. ధృతరాష్ట్రుడు, సూర్యవర్చయను గంధర్వులు, సర్వలోక ప్రసిద్ధలగు తిలోత్తమ, రంభయనునప్సరసలు. సేనజిత్తు, సత్యజిత్తు అనుయక్షులు, బ్రహ్మోపేతుడు, యజ్ఞో పేతుడునను రాక్షసులు సూర్యునాశ్రయించియుందురు. వారిని గూర్చి నీకు చెప్పెదను.

రుద్ర ఉవాచ :

మూ॥ వద బ్రహ్మన్కథాందివ్యాం యామహం ప్రష్టుమాగతః తామేవ విస్తరేణైవ కథయాశు మమప్రభో !

దివిష్టం భాస్కరందృష్ట్వా నమేత్కేన విధానతః కింఫలం తస్యవా దేవ సమాప్తే భవతి కర్మణి

 బ్రహ్మోవాచ :

శృణురుద్ర! సమా సేన భాస్కరస్యనతిక్రియామ్ యాం కృత్వా రోగదుఃఖార్తా ముచ్యంతే పాపసంచయాత్

స్థండిలే మండలం కృత్వా ద్వాదశాంగుల మానతః సద్యో గోమయ లిప్తేచ తత్రైవావాహయేద్రవిమ్

 పూజయిత్వా గణేశాదీన్వాసుదేవంచ సాత్యకిమ్ సత్యభామాం తథా లక్ష్మీముమాం దేవీంచశంకరమ్

 మండలస్య సమాపస్థా న్పూర్వోక్తాన్వేదమంత్రవిత్ తతః ప్రదక్షిణీ కృత్య దండవత్ర్పణమేత్సకృత్

 శతం సహస్రమయుతం లక్షవా నిజపాపత: దృష్ట్వా శక్తిం ప్రణమ్యాధ సదా సంయత మానసః

విప్రాయ దక్షిణాం దద్యాన్నిరుచ్ఛ్వాసః సమాహితః రక్తికే చ హిరణ్యస్య శతమాత్రే సహస్రకే

మాషకాణాం చతుష్కంచాయుతం దశగుణం దిశేత్ దక్షే దశ గుణం ప్రోక్తం దద్యాత్ రోగ విముక్తయే

 ఏవం కృతే విరూపాక్ష సర్వరోగాద్విముచ్యతే ఇదం రహస్యం పరమం శృణుయాద్యోహి మానవః

తస్యరోగా వినశ్యంతి మార్తాండస్య ప్రసాదతః అన్యచ్యతే ప్రవక్ష్యామి యచ్చపృష్టముమాపతే

 తచ్ఛృణుష్వమయాప్రోక్తం రథయంతృనియామకమ్

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి సప్తమి కల్పే సూర్యపూజావర్ణనం నామ ద్వీపంచా శత్తమోZధ్యాయః

తా॥ రుద్రుడిట్లనెను. “ఓ బ్రహ్మదేవా! నేను ఏ దివ్యకథను గుఱించి మిమ్ముఅడుగుటకు వచ్చితినో యద్దానిని నాకు త్వరగా చెప్పుడు. ఆకాశము నందున్న సూర్యదేవునిఁజూచి, యే విధానముగా నమస్కరింపవలెను ఆకర్మ పరిసమాప్తిలో నెట్టి ఫలము కలుగును. దానికి బ్రహ్మయిట్లు సమాధానము చెప్పెను. “రుద్రదేవా సూర్య నమస్కారమును గుఱించి సాకల్యముగఁ జెప్పెదను వినుము. సూర్యనమస్ర్కియచేయు రోగదుఃఖార్తులు తమ రోగరూప పాపకోశమునుండి ముక్తులగుదురు. అప్పుడే వేసిన ఆవు పేడతో అలికిన నేల పై స్థండిలము వేసి, దానిపై మండలము చేసి, దానిమీదనే సూర్యదేవునివాహనము చేయవలెను. శ్రీ గణేశ్వరునాదిగ, వాసుదేవుడు, సాత్యకి, సత్యభామ, లక్ష్మి, ఉమ, శంకరుడు. మండలస్థులైన పూర్వోక్తదేవతలు మున్నగువారిని వేదమంత్రవేత్తయే పూజింపవలెను.అప్పుడు ప్రదక్షిణము చేసి ఒక పర్యాయము సాష్టాంగ నమస్కారము చేయవలెను ఏకాగ్రచిత్తుడై, తనశక్తిని చూచుకొని, తనపాపరాశిననుసరించి, వంద, వేయి, పదివేలు, లక్షపర్యాయములు సూర్యునకు నమస్కారములు చేయవలెను. ఉచ్చ్వాస తీసికొనకుండ, సమాహితుడై బ్రాహ్మణునకు నూఱు బంగారు నాణెములు, వేయి రాగి నాణెములు దక్షిణనీయవలెను. సోలుగు మాషలు (మాష=ఐదుగురి గింజలయెత్తు) లేక పదివేలు లేక దానికి పదిరెట్లు శక్తికొలదిగనీయవలెను. రోగవిముక్తి కొఱకు సమర్థుడైన వాడు పదిరెట్లు ఈయవలెనని చెప్పబడినది. ఓ విరూపాక్షా! ఇట్లుచేసినచో సర్వరోగముల నుండి ముక్తులగుదురు. ఈ విధానము శ్రేష్ఠమైనది. రహస్యమైనది. దీనిని శ్రద్దగా వినెడి మానవునకును. సూర్యభగవానుని యనుగ్రహమువలన రోగములన్నియు నశించిపోవును. సూర్యరధరక్షణము చేయువారి నియామకమును గణించియు, ఇంకను నీవడిగిన ఇతర విషయముల గుణించియు చెప్పెదను వినుము.

శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యపూజావర్ణనమను ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.