51. సప్తమి కల్పమున మహా సప్తమీ వర్ణనము

వాసుదేవ ఉవాచ :

మూ॥ మాఘస్య శుక్ల పక్షేతు పంచమ్యాంమత్కులోద్వహ! ఏక భుక్తం సదాఖ్యాతం షష్ఠ్యాం నక్తముదాహృతమ్

సప్తమ్యాముపనాసంతు కేచిదిచ్ఛంతి సువ్రత! షష్ఠ్యాంకేచిద్వదంతీహ సప్తమ్యాం పారణం కిల

కృతో పవాసః షష్ఠ్యాంతు పూజయే ద్భాస్కరం బుధః రక్త చందన మిశ్రైస్తు కరవీరైశ్చసువ్రత !

 గగ్గులేన మహాబాహో! సంయావేనచ సువ్రత! పూజయేద్దేవ దేవేశం శంకరం భాస్కరం రవిమ్

 ఏవం హి చతురో మాసాన్ మాఘాదీన్పూజ యేద్రవిమ్ ఆత్మనశ్చాపి శుద్ధ్యర్థం ప్రాశనం గోమయస్యచ

 స్నానంచ గోమయేనేహ కర్తవ్యం చాత్మశుద్ధయే బ్రాహ్మణాoదివ్య భౌమాంశ్చ భోజయే చ్చాపి శక్తితః

జ్యేష్ఠాదిష్వధ మాసేషు శ్వేతచందన ముచ్యతే శ్వేతాని చాపి పుష్పాణి శుభగంధాన్వితానివై

 కృష్ణా గరుస్తథా ధూపో నైవేద్యం పాయసం స్మృతమ్ తేనైవ బ్రాహ్మణాంస్తు ష్టాంభొజ యేచ్ఛమహామతే

ప్రాశయేత్పంచ గవ్యంతు స్నానం తేనైవ పుత్రక! కార్తికాదిషు మాసేషు అగస్తీ కుసుమైః స్మృతమ్ ।

తా॥ వాసుదేవుడిట్లనెను. “మాఘమాస శుక్లపక్ష పంచమినాడు ఒకే పూట భోజనము చేయుట, షష్ఠినాడు రాత్రికి మాత్రమే భుజించుట చెప్పబడినవి. సప్తమి నాడే యుపవసించుట కొందఱి యభిమతము. షష్టినాడుపవసించి సప్తమినాడు పారణ చేయవలయునని కొందఱి యభిప్రాయము. షష్ఠినాడు ఉపవాసము చేసి, రక్తచందన మిశ్రమములతోను, గన్నేరు పూలతోను విజుడు సూర్యుని పూజింపవలెను. సుఖకరుడు, భాస్కరుడైన రవిని, గుగ్గులు, సారెసత్తులనబడు భక్ష్యవిశేషములతోను దేవ దేవుడైన సూర్యుని పూజింపవలెను ఇట్లే ఈ పూజ మాఘము మొదలుకొని నాలుగు మాసములు చేయవలెను. ఆత్మశుద్ది కొఱకు గోమయమును ప్రాశనము చేయవలెను. గోమయము తోనే స్నానము చేయవలెను. శక్తికొలదిగ భూదేవతలగు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. జ్యేష్ఠాది మాసములయందు శ్వేతచందనము, పరిమళభరితములైన తెల్లనిపూలు సూర్యపూజకు శ్రేష్టములు. నల్లని అగరు, ధూపము, పాయసనైవేద్యము, యోగ్యమైనవి. వీనితోడనే బ్రాహ్మణులను తృప్తిపఱచుచు వారిని భుజింపజేయవలెను. కార్తికాది మాసములందు, పంచగవ్యప్రాశనము, దానితోనే స్నానము, అగిసెపూలు శ్రేష్ఠములని చెప్పబడినవి.

మూ॥ పూజయేన్నరశార్దూల! ధూపైశ్చైవాపరాజతైః నైవేద్యం గుడపూపాస్తు తథా చేక్షురసం స్మృతమ్

తేనైవ బ్రాహ్మణాంస్తాత! భోజయస్వస్వశక్తితః కుశోదకం ప్రాశయేథాః స్నానంచ కురుశుద్ధయే

తృతీయే పారణస్యాంతే మాఘేమాసి మహామతే! భోజనం తత్రదానంచ ద్విగుణం సముదాహృతమ్

 దేవ దేవస్య పూజాచ కర్తవ్యా శక్తితో బుధైః రథస్య చాపి దానంతు రథయాత్రాతు సువ్రత!

వ్రతస్య ప్రాప్తి హేతోర్వై కర్తవ్యా విభవే సతి దానం స్వర్ణ రథస్యేహ యథోక్తం విభవేసతి

 ఇత్యేషా కథితా పుత్ర రథాహ్వాసప్తమి శుభా

 మహా సప్తమి విఖ్యాతా మహాపుణ్యామహోదయా యాముపోష్య ధనం పుత్రాన్కీర్తిం విద్యామవాప్నుయాత్

 తథాఖిలం కువలయం చంద్రేణ చ సమోర్చిషా

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

సప్తమీ కల్పే మహా సప్తమీ వర్ణనం నామైక పంచాశత్తమోZధ్యాయః

తా॥ విష్ణుక్రాంత ధూపములతో పూజింపవలెను. బెల్లపు భక్ష్యములు, చెఱుకురసము నైవేద్యము పెట్టవలెను. యథాశక్తిగ పోనీతో సహా బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. శుద్దికొఱకు స్నానమునకు, పానమునకు కుశోదకమునుపయోగింపవలెను. మాఘమాసమునందు మూడవ పారణము తరువాత బ్రాహ్మణ భోజనము, దానము రెండింతలు చేయవలెనని చెప్పబడినది. శక్తి కొలదిగ దేవదేవుడగు సూర్యభగవానుని పూజ, రథదానము, రథయాత్ర చేయవలెను. సంపదయుండెనేనీ వ్రతఫల ప్రాప్తికొఱకు, చెప్పబడిన రీతిగా బంగారు రథమునే దానము చేయవలెను. ఈ విధముగ 'రథసప్తమి' అను పేరుగల వ్రత విధానము చెప్పబడినది. ఇది మహా సప్తమి యని ప్రఖ్యాతినందినది. మహాపుణ్యప్రదమైనది. అభ్యుదయకరమైనది. దీనియందుపవసించినవారు ధనమును, పుత్రులను, కీర్తిని, విద్యను పొందుదురు. చంద్రునితో సమానమైన కాంతిగలవాడై సర్వభూమండలమును పాలించును.

శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమికల్పమునందు మహాసప్తమి వర్ణనమను ఏబది యొకటవ అధ్యాయము సమాప్తము.