50. సప్తమి కల్పమున సప్తమి మహాత్మ్య వర్ణనము

వాసుదేవ ఉవాచ :

మూ! నైమిత్తికం తతోవక్ష్యే యద్ జ్ఞాత్వాచ సమాసతః సప్తమ్యాం గ్రహణేచైవ సంక్రాంతిషు విశేషతః

శుక్ల పక్షస్య సప్తమ్యాం హవిర్భుక్వె కదా దివా సమ్యగోచమ్య సంధ్యాయాం వారుణం ప్రణిపత్యచ

ఇంద్రియాణిచ సంయమ్య కృతం ధ్యాత్వా స్వపేదథః దర్భశయ్యాగతో రాత్రౌ ప్రాతః స్నాతః సుసంయతః

 తతః సంధ్యాముపాస్యాధ పూర్వోక్తంచ మనుంజ పేత్ జుహుయచ్చ తదా వహ్నిం సూర్యాగ్ని పరికల్ప్యచ

సూర్యాగ్ని కరణం వక్ష్యే తర్పణం చ సమాసతః అర్చనాగార ముల్లిఖ్య ప్రవిశ్యార్చ్య జనైర్జనమ్

ప్రక్షిప్యాస్తీర్య దరైశ్చ పాత్రాద్యాలభ్య చ క్రమాత్ పవిత్రం ద్వికుశం కృత్వా సాగ్రం ప్రాదేశ సంమితమ్

తేన పాత్రాణి సంప్రోక్ష్య సంశోధ్యాథవిలోక్యచ ఉదగగ్రే స్థితే పాత్రే ప్రజ్వాల్యాథోల్ముకేనచ

పర్యగ్ని కరణం కృత్వా తథా జ్యోత్యవసం త్రిథా పరిమృజ్య స్రువాదీంశ్చ దరైః సంప్రోక్షయేత్తతః

జుహుయాత్రోక్ష్య తాన్వహ్నౌ తత్రార్కం పూర్వవద్ర్వజేత్ అభూమౌస్థిత పాత్రేణ విష్టరేణతు పాణినా

దానేన యదుశార్దూల! నాంతరిక్షే స్థలే క్వచిత్

దక్షిణేన స్రువం గృహ్య జుహుయాత్పావకం బుధః హృదయేన క్రియాః సర్వాః కర్తవ్యాః పూర్వచోదితాః

తా॥ వాసుదేవుడిట్లనెను. “సప్తమి, గ్రహణము, సంక్రమణలు మున్నగు పర్వములయందు సూర్యనిమిత్తముగ నేర్పడు తదుపాసనా పూజాదికములను గూర్చి సమగ్రముగ చెప్పెదను దానిని తెలిసికొని మానవులైహికాముష్మిక ఫలములనొందుదురు. శుక్లపక్ష సప్తమికి పూర్వదినమున పగటియందొక్కపూటమాత్రమే హవిరోజనము చేసి, సంధ్యాకాలమున చక్కగా నాచమనము చేసి సూర్యునకు నమస్కరించి. ఇంద్రియములను నిగ్రహించి, సూర్యుని ధ్యానించి రాత్రి, నేల పై పరుండవలెను లేక దర్భశయ్యపై పరుండి ప్రాతఃకాలమున లేచి నియమానుసారముగ స్నానము చేయవలెను. పిమ్మట సంధ్యావందన మాచరించి పూర్వోత్తమైన సప్తాక్షరీమంత్రమును (ఓం ఖమౌలాయ స్వాహా) జపించవలెను. తరువాత సూర్యాగ్నిని కల్పించి అందుహవనము చేయవలెను. సూర్యాగ్నికరణము గుణించి, తర్పణము గుణించియు సవిస్తరముగా చెప్పెదను. పూజాగృహమును శుభ్రపఱచి, రంగవల్లి కలనంకరించి, యాజక గణముతో నందు ప్రవేశించి-5. దర్భలను వేసి వానిని చక్కగా పఱచి క్రమముగా పాత్రాసాదనము చేసి, కొసలతో కూడిన రెండు దర్భలతో ప్రాదేశమాత్రముగ పవిత్రచేసి. దానితో పాత్రలను సంప్రోక్షించుట ద్వారా చక్కగా శోధించి, ఉత్తరపుకొనయందున్న పాత్రయందు అలాతముతో నగ్నిని ప్రజ్వలింపజేసి. పర్యగ్నికరణము చేసి, మూడు పర్యాయములు నేయి చిలకరించి, స్టువాదులను శుభ్రముగా తుడిచి వాని పై దర్భలతో సంప్రోక్షణ చేయవలెను. ప్రోక్షించి పూర్వము చెప్పినట్లగ్నియందర్క భావన చేసి వేల్చవలేను. క్రింద పెట్టబడని పాత్రతో, దర్భపిడికిలిగల చేతితో హవిర్షాన మంత్రముతో అగ్నియందే వ్రేల్చవలేను. అంతరిక్ష స్థలముననెప్పుడును వేల్చకూడదు. కుడిచేత స్రువము తీసికొని, విజుడైనవాడగ్నికే యాహుతులీయవలెను. ఈ క్రియలన్నియు పూర్వము చెప్పినట్లు మనః పూర్వకముగ చేయవలెను.

 మూ॥ ఆర్కాదారభ్య సంజ్ఞార్ధం దద్యాత్తూష్ణీ హుతిం స్థితః వరుణాయ శతైర్మాఘ సప్తమ్యాం, వరుణం యజేత్

యధా శక్త్యాతు విపేభ్యః ప్రదద్యాత్ఖండ వేష్టకాన్ దద్యాచ్చ దక్షిణాం శక్త్యా ప్రాప్నోతి యాచితం ఫలమ్

 ఏవం వై ఫల్గునే సూర్యం చైత్ర వైశాఖ ఏవచ వైశాఖేమాసి ధాతార మింద్రం జ్యేష్ఠయజేద్రవిమ్

ఆషాడే శ్రావణే మాసి నభం భాద్రపదే యమమ్ తథాశ్వయుజి పర్జన్యం త్వష్టారం కార్తికేయజేత్

మార్గశీర్షేచ మిత్రం చ పౌషే విష్ణుం యజేద్యది సంవత్సరేణ యత్రోక్తం ఫలమిష్టం దినే దినే

తత్సర్వ మాప్నుయాత్ క్షిప్రం భక్త్యా శ్రద్ధాన్వితో ప్రతీ

ఏవం సంవత్సరే పూర్ణేకృత్వావై కాంచనం రథమ్ సప్తభిర్వాజిభిర్యుక్తం నానా రత్నోప శోభితమ్

 ఆదిత్య ప్రతిమాం మధ్యే శుద్ధహేమ్నా కృతాం శుభామ్ రత్నైరలం కృతాం కృత్వా హేమ పద్మోపరి స్థితామ్

తస్మిన్రథవరే కృత్వా సారధించాగ్రతః స్థితమ్ వృతం ద్వాదశభిర్వి(పైః క్రమాన్మాసాధిపాత్మభి:

మధ్యే కృత్వా స్వమాచార్యం పూజయిత్వాయథాశ్రుతి సంచింత్యాదిత్య వర్ణం పై వస్త్రరత్నాదినార్హయేత్

 ఏవం మాసాధిపాన్విప్రాన్సం పూజ్యాథ నివేదయేత్ ఆచార్యాయ రథం ఛత్రం గ్రామం గాశ్చ మహీంశుభామ్

తా॥ సూర్యునితో ప్రారంభించి చేసిన యాహుతులయనంతరము సంజ్ఞకొఱకు కూడ మౌనముగ ఆహుతినీయవలయును. మాఘమాస సప్తమియందు వరుణనామక సూర్యుని కొఱకు పది పదులాహుతులనిచ్చి యజింపవలయును. బ్రాహ్మణులకు యథాశక్తిగ తలపాగాలను భక్తిపురస్సరముగ దక్షిణలను సమర్పించినచో కోరికలు ఫలించును. ఇదే విధముగ ఫాలున మాసమున సూర్యుని, చైత్రమున వైశాఖుని, వైశాఖమున ధాతను, జ్యేష్ఠముననీంద్రుని. ఆషాఢమున రవిని, శ్రావణమున నభుని, భాద్రపదమున యముని, ఆశ్వయుజమున పర్జన్యుని, కార్తికమున త్వష్టను. మార్గశీర్షమున మిత్రుని, పుష్యమాసమున విష్ణువును పూజింపవలెను. సూర్యదేవుని ఆయామాసములలో ఆయా నామరూపములతో పూజించుచు నొక సంవత్సరము పూర్తి చేసిన యెడల ప్రతిదినమున నిష్టసిద్ధి కలుగుచుండును. ప్రతి దినమి ద్వాదశ సూర్యులను పూజించుచుండిన సంవత్సరమునకు చెప్పబడిన ఫలము నంతయును భక్తి శ్రద్ధలుగల పూజకుడు సత్వరముగా దినదినము పొందుచుండును. ఇట్లు సంవత్సర వ్రతము పూర్తిచేసి, ఏడు గుఱ్ఱములతో నమర్పబడినది, వివిధ రత్నములతో నలంకరింపబడినది, అయిన బంగారపు రథమును చేయించి. అందు స్వర్ణకమలము పైన రత్నాలంకృత దివ్యాంగుడైన సూర్యభగవానుని శుద్ధ సువర్ణ మూర్తిని మధ్యలోనునిచి. ఆరధశ్రేష్టము ముందు భాగమున రథమును నడుపుతున్నట్లున్న సారధి ప్రతిమము కూడ సిద్ధము చేసి, క్రమముగా నొక్కొక్క మాసమునకొక్కొక్క బ్రాహ్మణుని చొప్పున పన్నెండు మంది తత్తనాసాధిప స్వరూపులగు బ్రాహ్మణులనెన్నుకొని. తన యాచార్యుని వీరి మధ్య నాసీనుజేసి, వీరినందటిని యథా విధిగ పూజింపవలెను. ఆచార్యుని సూర్యతేజస్విగ భావన చేసి వస్త్రములు, రత్నములు మున్నగు వానిచే నాతనిని పూజింపవలెను. ఇట్లే మాసాధిప ప్రతినిధులైన బ్రాహ్మణులను కూడ యథోచితముగ పూజింపవలెను. పిమ్మట కాంచన రథమును, ఛత్రమును, అగ్రహారమును, గోవులను, సారవంతమగు భూమిని ఆచార్యునకు సమర్పింవ వలయును.

మూ॥ అశ్వాన్మాసాధి పేభ్యస్తు ద్వాదశభ్యోనివేదయేత్ ఏవం భక్త్యా యథా శక్త్యా హేమ రత్నాది భూషణమ్

దత్వా తస్య నమస్కృత్య వ్రతం పూర్ణం నివేదయేత్ అత ఊర్థ్వం న దోషోZత్ర వ్రత స్యాకరణేష్వపి

ఏవ మస్స్త్వితి విప్రేందైః సహాచార్యః పునః పునః బహ్వీశ్చైవాశిషో దత్వా ప్రవదే త్ప్రీయతామితి

ఆది త్యో యేన కామేన త్వయా ఆరాధితో వ్రతైః తుభ్యం దదాతు తం కామం సంపూర్ణంభవతు వ్రతమ్

ఆచార్యాన్విప్ర రూ పైస్తు ప్రవిష్ణో భాస్కరః స్వయమ్ దాస్యత్యేవ పరం కర్తుమిత్యుక్తం భానునా స్వయమ్

విప్రేభ్యో గుణవద్భ్యశ్చ నిస్వేభ్యశ్చ విశేషతః దీనాంధ కృపణేభ్యశ్చ భక్త్యాదత్వాచ దక్షిణామ్

బ్రాహ్మణాంభాజయిత్వాచ వ్రతమే తత్సమాపయేత్

 కృత్వైవం సప్తమిమబ్దం రాజాభవతి ధార్మికః పురుషః, స్త్రీ భవేద్రాజ్ఞాం తాదృశా మథ వల్లభా

 శతయోజన విస్తీర్ణం నిః సపత్నమకంటకమ్ నిష్పన్నమండలం భుంక్తే సాగ్రం వర్షశతం సుఖీ

విత్తహీనోపి యోభక్త్యా కృత్వా తామ్రమయం రథమ్ దద్యాద్ర్వతావసానేతు కృత్వాసర్వం యధోదితమ్

 సోZశీతి యోజనం భుంక్తే విస్తీర్ణం మండలం నృపః

 ఏవం పిష్టమయం యోZపి విత్తహీనః కరోతినా ఆషష్టియోజనం భుంక్తే దీర్ఘాయుర్నీరుజః సుఖీ

సూర్యలోకేచ కల్పాంతం యావత్థ్సిత్యేదమాప్నుయాత్

 తా॥ మాసాధిపతులైన పన్నెండుగురు బ్రాహ్మణులకు గుఱ్ఱములను సమర్పింపవలెను. భక్తితో యథాశక్తిగ బంగారము, రత్నములు, ఆభరణములు కూడ నీయవలెను. ఇచ్చి నమస్కరించి, “బ్రాహ్మణదేవతలారా! ఈ వ్రతోద్యాపన యనంతరము మఱల నేదేని కారణముచే నీ సూర్యవ్రతమాచరింపజాలని పక్షమున నేదోషము రాకుండుగాక!” యని వారిని ప్రార్థింపవలెను. ఆచార్యునితో సహా విప్రవర్యులందుటును, “అటులేయగుగాక" యనివారు 'తధాస్తు' పలుకుచుననేక విధములుగ నాశీర్వదించి, “సూర్యభగవానుడు నీవు చేసిన వ్రతముచే ప్రీతుడగుగాక! ఏ కోరికలతో నీ వ్రత మాచరించితివో వాని నాతడు సఫలము చేయుగాక! నీ యీ వ్రతము సంపన్నమగుగాక! అని దీవింపవలెను. ఆచార్యునిలోను బ్రాహ్మణులలోను స్వయముగ నా భాస్కరుడే ప్రవేశించియుండును, అతడు ఉత్తమ ఫలములనీయగల కార్యములను చేయు సంకల్పశక్తులనిచ్చును. గుణవంతులు, ఏమియులేనివారు, దీనులు, అంధులు, హీనస్థితిలోనున్నవారైన బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణ భోజన సంతర్పణలతో వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు సంవత్సర సప్తమి వ్రత మాచరించినవాడు ధర్మప్రభువగును. స్త్రీ యైనచో రాజుకు ప్రేమపాత్రురాలైన రాణి యగును. నూఱు యోజనముల విస్తీర్ణముగల రాజ్యము నెట్టి యాటంకములేకుండునట్లు, శత్రువుల బాధ లేకుండునట్లు సంపూర్ణముగ నూడు సంవత్సరముల వఱకు సుఖియై అనుభవించును. ధనము లేనివాడు భక్తితో రాగి రథమును చేయించి, పూర్వోక్తమైన రీతిలో నాచార్యునకీయవచ్చును. అట్టివాడు రాజై ఎనుబది యోజనముల విస్తీర్ణముగల రాజ్యభాగముననుభవించును. దానికిని సమర్థతచాలని వాడు పిండితో రథమును చేసి ఈయవచ్చును. అట్టివాడు అరువది యోజనముల విస్తీర్ణముగల రాజ్యమును దీర్ఘాయుష్మంతుడు, సుఖియునై యనుభవించును. కల్పాంతము వఱకు సూర్యలోకమున నుండి మఱల నిట్టి రాజ్యముననుభవించును.

మూ॥ మనసాపిచ యోభక్త్యా యజేదర్కమతంద్రిద్తః సర్వావస్థాసు సోZప్యత్ర వ్యాధిభిర్ముచ్యతే భృశమ్

ఆపదో న స్పృశంత్యేనం నీహారా ఇవ భాస్కరమ్ కింపునర్వత సంపన్నం భక్తం మంత్రైశ్చ రక్షితమ్

యత ఏవంతతో జ్ఞాత్వా విధానం కల్పచోదితమ్ సుఖేన ఫల సిద్ధ్యర్థం కుర్యాత్సర్వమశేషతః

ఇత్యేతత్కథితం సాంబ! పురా సూర్యేణ మే శుభమ్ కల్పోయం ప్రథమే కల్పే సర్వదా గోపితోమయా

అనేన విధినా వత్స! విశుద్ధేనాంతరాత్మనా భానుమారాధయేత్ క్షిప్రం యదిచ్ఛేత్ఫలముత్తమమ్

మయాస్యైవ ప్రసాదేన ప్రాప్తః పుత్రాః సహస్రశః అసురా నిర్జితాశ్చైవ సురాః సర్వే వశీకృతాః

 త్వయాప్యయం గోపితవ్యః కల్పః సూర్యస్యసంమతః ప్రసాదాదస్య కల్పస్య సదా సన్నిహితో రవిః

చక్రేZస్మిన్నిర్జితా యేన సురాసురనరోరగాః

యది నాధిష్ఠతం చక్రమిదం సూర్యాంశుభిః స్వయమ్ సతతం స్యాత్ర్పభాయుక్తం కథమధ్యాహతం భవేత్?

ఆహమేతం జపన్నిత్యం యజంధ్యాయంశ్చ శక్తితః జాతోస్మి సర్వకామానాం పూజ్యః శ్రేష్ఠశ్చ తేజసా

త్వమభ్యస్యైవ మనసా వాచావా కర్మణాపివా కురుభక్తి మనేనైవ విధినా ఫలసిద్ధయే శృణుయాద్భక్తి యుక్తోయో నరః శ్రద్ధాసమన్వితః విధాన మాదితః పుత్ర! సప్తమీం కురుతేచయః

సేహ ప్రాప్యాఖిలం కామ మారోగ్యంచ జయం తథా భార్గవ్యా పరయా యుక్తో గచ్ఛేద్వైరోచనం సదః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

సప్తమి కల్పే సప్తమి మాహాత్మ్య వర్ణనం నామ పంచాశత్తమోZధ్యాయః

 తా॥ సర్వావస్థలయందును భక్తిగలవాడై కేవలము మనస్సుతోనైనను శ్రద్ధాళువై సూర్యారాధనము చేయువాడు సర్వరోగ వినిర్ముక్తుడై యారోగ్యవంతుడగును. మంచు, సూర్యుని తాకజాలనట్లు ఇతనిని ఆపదలు స్పృశింపనేరవు. ఇక మంత్ర రక్షితుడు, భక్తుడునైన వ్రత సంపన్నుని గుజించి చెప్పవలసినదేమి?. అందువలన కల్పమందు చెప్పబడిన విధానమును యథాతథముగ తెలసికొని ఫలసిద్దికొఱకు సుఖముగను సాకల్యముగను ప్రతాచరణము చేయవలయును. సాంబా! పూర్వము ప్రథమ కల్పమునందు - శుభప్రదమైన ఈ వ్రతమును గూర్చి సూర్యదేవుడే స్వయముగ నాకు చెప్పెను. దీనిని నేనెల్లప్పుడును రహస్యముగనేయుంచీతినీ. వత్సా! ఉత్తమమైన ఫలమును కోరినచో, శుద్ధమైన మనస్సుతో సత్వరమే యీ విధానముగ సూర్యునారాధింపవలెను. అతని ప్రసాదము చేతనే నేను వేలమంది పుత్రులను బడసితిని. రాక్షసులను జయించితిని. దేవతలందని వశము చేసికొంటిని. ఈ సూర్యకల్పమును నీవుకూడ గోప్యముగ నుంచుటయే మంచిది. దీని యనుగ్రహమున సూర్యభగవానుడు సన్నిహితుడైయుండును. ఈనా చక్రాయుధమునందతడు నిత్యనివాసముండును. దానిచే నేను దేవతలను, రాక్షసులను, మానవులను, నాగములను జియింపగలిగితిని. ఒక వేళ సూర్యుడు స్వయముగ తన సహస్రకిరణములతో నీ చక్రము నధిష్ఠించి యుండని యెడల నిది యింత ప్రభాయుక్తమై ఎంతోమంది కొట్టబడినవారు గలదిగ నేట్లుండగలదు. నేను, కూడా నీ సూర్యదేవుని నిత్యము శక్తి కొలది జపించుచు, పూజించుచు, ధ్యానించుచు, అన్ని కోరికలను తీర్చుకొనుచు, పూజ్యుడనై శ్రేష్ఠుడనై తేజస్సుతో ప్రకాశించుచున్నాను. నీవు కూడ మనస్సు చేత, వాక్కుచేత కర్మచేత నిదే విధిచేత నీతని భక్తితో పూజింపుము. ఫలము సిద్ధించును. శ్రద్ధా భక్తులతో నిది వినువాడును, విధి విధానముగ నీ సప్తమి వ్రతము నాచరించువాడును. సర్వకామములను పొంది, ఆరోగ్యవంతుడై, అన్నింట విజయమునందుచు, శ్రేష్ఠమగు సంపదలననుభవించి, సూర్యలోకమునకుఁబోవును.

శతార్థ సాహాస్ర్య సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సప్తమి మాహాత్య వర్ణనమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.