49. సప్తమీ కల్పమున సూర్య మహాత్మ్య వర్ణనము

వాసుదేవ ఉవాచ :

మూ॥ అథార్చనా విధిం వక్ష్యే ధర్మకేతోరనుత్తమమ్ సర్వకామ ప్రదం పుణ్యం విఘ్నఘ్నం దురితాపహమ్

సూర్యమంత్రైః పురః స్నాతో యజేత్తేనైవ భాస్కరమ్ యతస్తతః ప్రవక్ష్యామి స్నానమాదౌ సమాసతః

 ఆచాంతస్తముపాలభ్య ముద్రయా శుచి శుద్ధయా కృత్వా నీరాజనం పుత్ర! సంశోధ్యచ జలం తతః

స్నానాద్ధృదయ పూతేన మంత్రేణ మత్కులో ద్వహ! ఉత్థాయాచమ్య తేనైవ వాససీ పరిధాయచ

 ద్విరాచమ్యాథ సంప్రోక్ష్యతనుం సప్తాక్షరేణచ ఉత్థాయాచమ్య తేనైవ రవేః కృత్వార్ఘ్య మేవచ

దత్వా తేన జపిత్వా తం స్వకం ధ్యాత్వార్కవద్ధృది గత్వా చాయతనం శుభ్రమార్కమార్కీం తనుంయజేత్

పూరకం కుంభకం కృత్వా రేచకంచ సమాహితః కృత్వంకారేణ దోషాంస్తు హన్యాత్కాయాది సంభవాన్

వాయవ్యాగ్నేయ మాహేంద్ర వారుణీభిర్యధాక్రమమ్ కిల్బిషం వారుణాద్భిశ్చ హన్యాత్సిద్ధ్యర్థమాత్మనః

శోషణం దహనం స్తంభం ప్లావనం చ యధాక్రమాత్ వాయ్వగ్నీంద్ర జనాఖ్యాభిర్థారణాభిః కృతేసతి

ధ్యాత్వా విశుద్ధమాత్మానం ప్రణమే దర్కమాస్థితమ్ దేహం తేనైవ సంచింత్య పంచ భూతమయం పరమ్

తా ॥ వాసుదేవుడిట్లనెను. “ఇక సర్వకామములను సఫలము చేయునది, విఘ్నములను నశింపజేయునది, పాపములను హరించివేయునది, పుణ్యప్రదమైనదియునైన సూర్యభగవానుని పూజించు విధానమును చెప్పెదను. సూర్యమంత్రములచే స్నానము చేసి వానితోడనే ఆతని పూజింపవలెను. స్నానము మొదలుకొని సాకల్యముగ చెప్పదలచిన కారణముననట్లు చెప్పుచుంటిని. ఆచమించి, ఆజలమునటులే పట్టుకొని శుచిశుద్దమైన ముద్రతో నీరాజనము చేసి, అప్పుడు నీటిని శోధించి. హృదయ పావిత్ర్యమును కలిగించు మంత్రముతో స్నానమాచరించి, అదేమంత్రముతో లేచి మఱల ఆచమనముచేసి వస్త్రములను ధరించి. రెండు పర్యాయములు మఱలనొచమనము చేసి సప్తాక్షరమంత్రము (ఓం ఖలాయ స్వాహా)తో శరీరము పై నీరు చల్లుకొని, లేచి ఆచమించి అదే మంత్రముతో సూర్యున కర్ఘ్యమియవలెను. ఇచ్చి అదేమంత్రమును జపించుచు తనను తాను సూర్యునిగా హృదయమునందు ధ్యానింపవలెను. ఆ పిదప మందిరమునకుఁబోయి సూర్యభగవానుని తేజో రూపమును పూజింపవలెను. మొదట సమాహిత చిత్తముతో పూరక, కుంభక, రేచకములతో ప్రాణాయామము చేయవలెను. ఓంకారముతో ప్రాణాయామము చేసి శరీరాదులయందు బుట్టిన దోషములు నశింపజేయవలెను. ఆత్మశుద్ధి, సిద్ధి కొఱకు, వాయువ్య, ఆగ్నేయ, మా హేంద్ర, వారుణాది కిల్బిషములను, నీటిని సంప్రోక్షణ చేయుటద్వారా నిర్మూలింపవలెను. వాయువు, అగ్ని, ఇంద్ర, వరుణ నామకధారణలతో శోషణము, దహనము, స్తంభనము, ప్లావనము చేయగానవి నశించును. అప్పుడు పరిశుద్ధమైన తన యాత్మలో నెలకొనియున్న సూర్యభగవానునకు నమస్కరింపవలెను. పంచభూతమయమైన శరీరమును కూడా నతనిచే వ్యాప్తమైన దానినిగ చింతింపవలేను

మూ॥ సూక్ష్మం స్థూలం తథాక్షాణి స్వస్థానేషు ప్రకల్ప్యచ విన్యస్యాంగాని ఖాదీని హృదాద్యాని హృదా దిషు

ఖ స్వాహా హృదయం భానో: ఖమర్కాయ శిరస్తథా ఉల్కా స్వాహా శిఖార్కస్య యైచ హుం కవచం పరమ్

ఖాం ఫడస్త్రంచ సంహారశ్చాదితః ప్రణవః కృతః

 స పూర్వే ప్రణవస్యాథో మంత్రకర్మ ప్రసిద్ధయే ఏభిర్జలం త్రిధా జప్త్వా స్నాన ద్రవ్యాణి తేనచ

 సంప్రోక్ష్య పూజయేత్సూర్యం గంధపుష్పాదిభిః శుభైః తతో మూర్తిషు సర్వాసు రాత్రావగ్నౌ  ప్రపూజయేత్

ప్రాక్పశ్చిమోదగభ్యగ్రాం ప్రాతః సాయంనిశాసువై సప్తాక్షరేణ సన్మంత్రం ధ్యాత్వాచ పద్మకర్ణికామ్

ఆదిత్య మండలాంతస్థం తత్ర దేహం ప్రకల్పయేత్ ప్రభామండల మధ్యస్థం ధ్యాత్వాదేహం యథాపురా

 సర్వలక్షణ సంపూర్ణం సహస్ర కిరణోజ్జ్వలమ్

రక్తైర్గంధైశ్చపుష్పైశ్చ చరుభిర్బలిభిస్తథా రక్తచందన మిశ్రైర్వా వస్తైరావరణైః శుభైః ఆవాహనాది కర్మాణి రక్షాంతు హృదయేనచ తచ్చిత్తశ్చ సదా కుర్యాత్ జ్ఞాత్వా కర్మక్రమం బుధః

కృత్వా చావాహనం మంత్రైరేకత్ర స్థాపనం తతః యావద్యాగావసానంతు సాన్నిథ్యం తత్ర కల్ప్యచ

దత్వా పాద్యాదికాం పూజాం శక్త్యావార్ఘ్యం నివేద్యచ జపిత్వా విధివద్ధ్యాత్వా తతో దేవీం విసర్జయేత్

తా॥ సూక్ష్మ, స్థూల శరీరములను, ఇంద్రియములని వానివాని స్థానములందు నిశ్చలస్థితిలో నుండునట్లు చేసి 'ఖ' ఆదిగనుండు హృదయాదులను హృదయాదులయందు ‘అంగన్యాసము చేయవలెను. “ఓం ఖః స్వాహా హృదయాయనమః, ఓంఖం స్వాహా శిరసే స్వాహా, ఓం ఉల్కాయస్వాహా శిఖాయైవషట్, ఓం యాయస్వాహా కవచాయ హుం, ఓం ఖాం స్వాహా నేత్రత్రయాయ వౌషట్, ఓం హాం స్వాహా అస్రాయఫట్. ఇట్లంగన్యాసము చేసి, కర్మప్రసిద్ధికొఱకు ఓంకారముతో కూడిన మూలమంత్రము ముమ్మారు జపించి జలమునభిమంత్రించి దానిని పూజాద్రవ్యములపై. సంప్రోక్షించి సూర్యదేవుని, శుభప్రదములైన గంధపుష్పాది ద్రవ్యములతో పూజింపవలెను. ఆవిధముగ పగటియందు మూర్తులన్నింటియందును, రాత్రి సమయమున అగ్నియందును సూర్యభగవానుని పూజింపవలెను. ప్రభాత కాలమున పూర్వాభిముఖముగ, సాయంసమయమున పశ్చిమాభిముఖముగ, రాత్రి సమయమున నుత్తరాభిముఖముగ సూర్యదేవునినారాధింపవలెను. 'ఓం ఖఖోల్కాయ స్వాహా' అనునీ సప్తాక్షరమంత్రముతోనొక పద్మకర్ణికను ధ్యానించి. దానియందు ప్రభామండల మధ్యమున నాదిత్యమండలము, దానిలో సర్వలక్షణ సంపూర్ణుడు, సహస్రకిరణములతో నుజ్జ్వలముగ ప్రకాశించు దివాకరుని స్వరూపమును భావించి. అతనిని ఎఱ్ఱని గంధములతో, పుష్పములతో, రసవత్తరములైన నైవేద్యములతో, రక్తచందనము, కరవీరములు, ఎఱ్ఱని వస్త్రములతోనుత్తరీయములతో. భూషణములతో, ఆవాహనాద్యుపచారము లతో పూజింపవలెను, ఈ కర్మక్రమమును విజుఁడైనవాడు తదేక చిత్తముతో తెలిసి చేయవలెను. మంత్రములచేనావాహన చేసి యొకచోస్థాపించినది మొదలుకొని పూజా పరిసమాప్తి వఱకు దేవతాసాన్నిధ్యముననే ఉండవలయును. పాద్యాద్యుపచారములతో పూజించి, యధాశక్తిగ నర్ఘ్యమునివేదించి, జపముచేసి, యథావిధిగ ధ్యానము చేసి, ఆ తరువాత దేవతను ఉద్వాసన చేయవలెను.

 మూ॥ ఏష కర్మక్రమః ప్రోక్తః సర్వేషాం యజనక్రమాత్ ప్రవక్ష్యామి జపస్థానం పద్మేశావరణే తథా

ఆదిత్యం కర్ణికా సంస్థం దలేష్వంగాని పూర్వశః సోమాదీన్రాహు పర్యంతాంగ్రహాంశ్చైవోదగాదితః

మూర్తిమల్లోక పాలాంశ్చ క్రమాదావరణేష్వధ తదస్రాణీచ రక్షార్థం స్వమంత్రైఃపూజయేత్ర్కమాత్

ప్రణవైశాభిధానైశ్చ చతుర్థ్యా హ్యభియోజితైః సర్వేషాం కధితా మంత్రి ముద్రాశ్చ కథయామ్యత:

 వ్యోమ ముద్రారతి: పద్మా మహాశ్వేతాస్త్రమేవచ పంచముద్రాః సమాఖ్యాతాః సర్వకర్మప్రసిద్ధయే

ఉత్తానౌతు కరౌకృత్వా అంగుల్యో గ్రంథితాఃక్రమాత్ తర్జనీం యాంతి యావత్తాః సమే వాథోముఖే స్థితే

తర్జన్యౌ మధ్యమ స్యైవ జ్యేష్టాగ్రేవానుగోపరి ముద్రీయం సర్వముద్రాణాం వ్యోమ ముద్రేతి కీర్తితా

సర్వ కర్మసు యోగోయం తథాస్థానం ప్రకల్ప్యతే

పద్మవత్ప్ర  సృతాః సర్వా మహాశ్వేతా రవేః స్మృతా జవ సంనిహితో  నిత్యం రథారూఢ రవిః స్మృతః

హస్తావూర్ధ్వ ముఖౌ కృత్వా వామాంగుష్ఠేన యోజితో ద్రవ్యాణాం శోధనే యోజ్యా రక్షార్థం చ విశేషతః

అనయా ముద్రయా సర్వం రక్షితం శోధితం భవేత్ అర్ఘ్యం దత్వా ప్రయోక్తవ్యా పూజాంతేచ విశేషతః

తా॥ ఈ కర్మక్రమమందఱి పూజాక్రమముననుసరించి చెప్పబడినది. ఇక సూర్యదేవుని యావరణమున జపస్థానమును గూర్చిచెప్పెదను. మొదట ప్రధాన దేవతయైన సూర్యభగవానుని పద్మకర్ణిక యందును, దళములయందంగములను, ఉత్తరదిక్కు మొదలుకొని చంద్రుడు మొదలు రాహువు వఱకు గల గ్రహములను. ఆపైయావరణములందు లోకపాలుర మూర్తులను, రక్షణార్థమై వారి ఆయుధములను, వారి వారి ఆయా మంత్రముల చేత క్రమముగా పూజింపవలెను. ఓంకార పూర్వకముగ వారివారి నామములకు చతుర్థి విభక్తిని చేర్చి, చివరన 'నమః' అని చేర్చి అందటి దేవతల మంత్రములును చెప్పబడియున్నవి. ఇప్పుడు ముద్రలను గుఱించి చెప్పుదును. వ్యోమముద్ర, రతిముద్ర, పద్మముద్ర, మహాశ్వేత ముద్ర, అస్త్రముద్ర అనీ సర్వకర్మల ప్రసిద్దికొఱకు ఐదు ముద్రలు చేప్పబడినవి. రెండు చేతులను వెల్లకిల జేసి క్రమముగా వ్రేళ్లను చూపుడు వ్రేలికి యానుకొనునట్లు ముడిచి, రెంటిని సమముగా నథోముఖమగునట్లుంచి. రెండు చూపుడువేళ్లకొనలు మధ్యమాంగుష్ఠములపై నుండునట్లు సరిచేసినచో అది వ్యోమముద్రయని చెప్పబడును. అన్ని కర్మలయందును యోగ్యమైనదిగ దీనికి స్థానము కల్పింపబడును. వేళ్లనన్నింటిని పద్మాకారముగ ప్రసరింపజేసినయెడలనది పద్మముద్రయగును. మహాశ్వేత రవి ముద్రయేయని చెప్పబడినది. సూర్యభగవానుడు నిత్యమును రథము నధిరోహించి వేగమున తిరుగుచుండును. రెండు చేతులనూర్థ్వముఖములుగ జేసి యెడమ బొట్టన వ్రేలితో కలిపి ఆ ముద్రను ద్రవ్యశోధనయందు ముఖ్యముగా రక్షణకొఱకు నుపయోగింపవలెను. ఈ ముద్రచే సర్వమును పరిశుద్ధము చేయబడును. రక్షింపబడును. దీనిని పూజాసమాప్తి తరువాత నర్ఘ్యమిచ్చిన పిదప ప్రయోగింపవలెను.

మూ॥ జపధ్యానావసానేచ యదిచ్ఛేత్సిద్ధిమాత్మనః అనేన విధినా నిత్యం జపేదబ్దమతంద్రితః

స లభేదీప్సితాన్కామానిహాముత్ర న సంశయః రోగార్తో ముచ్యతే రోగార్ధన హీనో ధనం లభేత్

రాజ్యభ్రష్టోలభేద్రాజ్యమపుత్రః పుత్రమాప్నుయాత్ ప్రజ్ఞామేధా సమృద్ధేశ్చ చిరంజీవతి మానవః

సురూపాం లభతే కన్యాం కులీనాం పురుషోధ్రువమ్

 సౌభాగ్యం స్త్రీకులీనాపి కన్యాచ పురుషోత్తమమ్ అవిద్యోలభతే విద్యామిత్యుక్తం భానునా పురా

నిత్యయాగః స్మృతో హ్యేష ధనధాన్య సుఖావహః ప్రజాపశువివృద్ధిశ్చ నిష్కామస్యాపి జాయతే

తదైకః స్తూయతే స్వర్గే శబ్ద్యతేచ నరోత్తమః భక్త్యాతం పూజయేద్యస్తు నరః పుణ్యతరః సదా

ఇహవై కామికం ప్రాప్య తతో గచ్ఛేన్మనోః పదమ్ ద్విజాస్తస్య ప్రసాదేన తేజసా బుధ సన్నిభాః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధసాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి సప్తమి కల్నే సూర్య మాహాత్మ్యవర్ణనం నామైకోన పంచాశత్తమోZధ్యాయః

తా॥ ఆత్మసిద్ధి కోరినచో, జపము, ధ్యానము ముగించిన పిమ్మట నీ ముద్రనుపయోగింపవలెను. ఇట్లు నిత్యమొక సంవత్సరము వఱకు విడువకుండ సూర్యోపాసన చేయవలెను. చేసినవాడు నిస్సంశయముగ నిహలోకమునందును, పరలోకమునందును కోరిన కోరికలను పొందగలడు. రోగముతో బాధపడు వాడారోగ్యవంతుడగును. ధనహీనుడు ధనమును పొందును. రాజ్యమునుండి భ్రష్టుడైనవాడు తిరిగి రాజ్యమును పొందును. పుత్రులు లేనివారికి పుత్రులు కలుగుదురు. ప్రజ్ఞ, మేధాశక్తి, సర్వసంపత్సమృద్ధి, కలిగి మానవుడు చిరకాలము జీవించును. సౌందర్యవతి, ఉత్తమ కుల సంజాతయైన భార్యను పొందును. స్త్రీయైనచో సౌభాగ్యవతి యగును. కన్యయైనచో పురుషశ్రేషుని భర్తగా పొందును. విద్యావిహీనుడు విద్యావంతుడగును. పూర్వమిట్లు సూర్య భగవానుని చేతనే చెప్పబడెను. ఈ సూర్యారాధనము నిత్యము చేయదగినది. ధనధాన్య సుఖముల నిచ్చునది. కోరనివానికి కూడ సంతాన, పశు సమృద్ధిని కలిగించునది. సూర్యోపాసకుని పొగడ్తలు స్వర్గము నందు కూడా మారుమ్రోగుచుండును. అతడెప్పుడును పుణ్యతరుడై ప్రకాశించును. ఈ లోకమునందు సర్వమనోరథ సిద్ధుడై మనుస్థానమును చేరును. బ్రాహ్మణులు సూర్యోపాస్తి చేసిన నాదేవుని యనుగ్రహమున తేజస్వులై దేవతల వలె ప్రకాశింతురు.

శతార్ధ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యమాహాత్మ్య వర్ణనమను నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.