భవిష్య మహా పురాణము
48. సప్తమీ కల్పమున ఆదిత్య మహాత్మ్య వర్ణనము
శతానీక ఉవాచ :
మూ॥ విస్తారాద్వద విపేంద్ర! సప్తమీ కల్పముత్తమమ్ మహాభాగ్యంచ దేవస్య భాస్కరస్య మహాత్మనః
సుమంతురువాచ :
అతైవా హుర్మహాత్మానః సంవాదం పుణ్యముత్తమమ్ కృష్ణేన సహసత్త్వేన స్వపుత్రేణ మహీపతే
భక్త్యాప్రణమ్య విధివ ద్వాసు దేవం జగద్గురుమ్ ఇహాముత్ర హితం సాంబఃపప్రచ్ఛ జ్ఞాన ముత్తమమ్
జాతో జంతుః కథం దుఃఖైర్జన్మనీహ న బాధ్యతే ప్రాప్నోతి వివిధాన్కామాన్కథం చ మధుసూదన?
పరత్ర స్వర్గమాప్నోతి సుఖాని వివిధాని చ అనుభూయోచితం కాలం కథం ముక్తి మవాప్నుతే?
దృష్ట్వైవం మమ నిర్వేదో జాతో వ్యాధిర్జనార్దన! దృష్ట్వైమం జీవితాశాపి రోచతే నహి మే క్షణమ్
కింత్వేవమకృతార్థోZస్మి యన్మే ప్రాణా న యాంతిహి సంసారే న పతిష్యామి జరావ్యాధి సమన్వితే
యేనోపాయేనతన్మేZద్య ప్రసాదం కురు సువ్రత! ఆధి వ్యాధి వినిర్ముక్తో యథా హం స్యాం తథా వద
వాసుదేవ ఉవాచ :
దేవతాయాః ప్రసాదోZన్యః సర్వస్యపరమోమతః ఉపాయః శాశ్వతో నిత్య ఇతిమే నిశ్చితా మతిః
అనుమానాగమాద్యైశ్చ సమ్యగుత్పాదితా మయా కదా చి దన్యధా కర్తుం ధీయతే కేన చిత్క్వచిత్
తా॥ శతానీకుడిట్లనెను. “మహాత్ముడైన భాస్కర దేవునికి సంబంధించిన మహాభాగ్యము వంటిదైన సప్తమి కల్పమును సవిస్తరముగా చెప్పుడు.” సుమంతుముని ఇట్లు చెప్పదొడంగెను. “రాజా! ఈ సందర్భముననే శ్రీ కృష్ణునకును, ఆయన పుత్రుడైన సాంబునకు మధ్య జరిగిన సూర్యదేవునకు సంబంధించిన సంవాదమును చెప్పుదురు. జగద్గురువైన వాసుదేవునకు యధావిధిగ భక్తితో నమస్కరించి, ఐహిక, పారలౌకికమగు నుత్తమ జ్ఞానమును గూర్చి, యాతని కుమారుడైన శాంబుడు (సాంబుడు) ఇట్లు ప్రశ్నించేను. “ప్రాణి యెట్లు పుట్టెను? పుట్టిన ప్రాణి ఈ లోకమున దుఃఖములచే బాధింపబడకుండు నుపాయమేమి? కోరికలన్నియు సఫలమగుటకు మార్గమేమి? తండ్రీ! నాకు తెలియజెప్పుము. ప్రాణి పరలోకమున స్వర్గమెట్లు పొందగలుగును? వివిధ సుఖములేట్లు పొందనేర్చును? సుఖానుభవము తరువాత పునరావృత్తిరహితమగు మోక్షమెట్లు పొందగలడు?. ఈ లోక శోకమును చూచి నాకు నిర్వేదము కలుగుచున్నది. మనస్సు వ్యాకుల పడుచున్నది. దీనింజూచి ఒక్క క్షణము కూడ, బ్రతుకవలెననెడి యాశ కలుగుట లేదు. ప్రయోజన రహితముగ నిట్టేలయుంటిని? ప్రాణములైనను పోవుగదా! ముసలితనము, వ్యాధులు మున్నగు దురవస్థలతో గూడిన యీ సంసారమున పడను. ఏ ఉపాయముచే నట్లు పతనము కాకుందునో అట్టి దానిని నాకనుగ్రహింపుడు. మానసిక వ్యధలు, శారీరక వ్యాధులు మొదలగు నుపద్రవముల బారి నుండి తప్పుకొనెడి మార్గమును నాకు చెప్పుడు”. సాంబుని యా మాటలు విని శ్రీ కృష్ణుడిట్లనెను. “వత్సా! ఇతరములన్నిటికంటెను ఈ విషయమున దేవతానుగ్రహమే శ్రేష్ఠమగు నుపాయమని చెప్పబడినది. అదియే నిత్యమైనది. శాశ్వతమైనది అది నా దృడ నిశ్చయము. అనుమానము, ఆగమము మొదలగు ప్రమాణములచేత నాచే నావిష్కరింపబడిన ఈ పద్ధతి కంటే భిన్నముగనెవడైనను, ఎప్పడైనను, ఏ కొంచెమైనను ఆచరించేనా?
మూ॥ ప్రసాద్ జాయతే తస్య సమ్యగారాధన క్రియా యథా తాం చ సముద్దిశ్య కృతా తద్వేదినా తథా
విశిష్టాదేవతా సమ్యగ్విశిష్టేనైవ దేహినా ఆరాధితా విశిష్టంచ దదాతి ఫలమిహితమ్
సాంబ ఉవాచ :
'అస్తిత్త్వేత్వన చ సందేహ: కేషించిద్దేవతాం ప్రతి నాస్తితి నిశ్చయొZన్యేషాం విశిష్టాస్త్వం కథాః కురు'
వాసుదేవ ఉవాచ :
సిద్ధంతు దేవతాస్తిత్వమాగమేషు బహుష్వధ ప్రమాణ మాగమోయస్య తస్యాస్తిత్వంచ విద్యతే
అనుమానేన వాప్యద్య తదస్తిత్వం ప్రసాధ్యతే ప్రమాణ మస్తీ య స్యేదం సిద్ధాయ స్యేహ చాస్తితా
ప్రత్యక్షేణాపి చాస్తిత్వం దేవతాయాః ప్రసాధ్యతే తచ్చావశ్యం ప్రమాణంచ దృష్టం సర్వ శరీరిణామ్
యదినామా వివిక్తాస్తు తిర్యగ్యోని గతా అపి నోత్పద్యతే తథా హ్యస్తి వ్యవహారో యథాస్థితః”
సాంబ ఉవాచ :
ప్రత్యక్షేణోపలభ్యంతే సమ్యగ్వైయది దేవతాః అనుమానాగమా భ్యాంచ తదర్ధం న ప్రయోజనమ్
వాసుదేవ ఉవాచ :
ప్రత్యక్షేణోపలభ్యంతే న సర్వాదేవతాః క్వచిత్ అనుమానగమైర్గమ్యాః సంతిచాన్యాః సహస్రశః
సాంబ ఉవాచ :
యాచాక్ష గోచరా కాచిద్విశిష్టేష్ట ఫలప్రదా తామేవాదౌ మమాచక్ష్వ కథయిష్యస్యథా పరామ్
తా॥ విధానము తెలిసిన వాడా దేవతనుద్దేశించి చక్కగా నారాధనము చేసినచో నతనికా దేవతా ప్రసాదము లభించును. విశిష్టమైన వ్యక్తిచేత విశిష్టమైన దేవత విశిష్టముగ పూజింపబడినచో ఆదేవత, కోరిన ఫలమునిచ్చును”. సాంబుడిట్లనెను. “ఏ దేవత గుణించియైనను తదస్తిత్వశంకలేదు. కాని కొందబీ దృష్టిలో “ఆ దేవత' లేదనియే నిశ్చయము. ఆ వివరములను స్పష్టము చేయుడు”. వాసుదేవుడిట్లు సమాధానము చెప్పెను. “అనేకములైన ఆగమముల ప్రమాణములననుసరించి 'దేవత' ఉనికి సిద్దమే కదా! అయినచో నాగమములు ప్రామాణికములని భావించువానికి మాత్రము ఆ 'దేవతాస్తిత్వము' ఉండగలదు. అనుమాన ప్రమాణము చేత కూడ ఇపుడు తదస్తిత్వమును సాధింపవచ్చును. ఏలయన ఎవనికి 'ఉనికి' కలదో వానికి ఆ ప్రమాణము కూడ కలదు. (స్వీయాస్తిత్వమే దేవతాస్తిత్వమునకు ప్రమాణము). అట్లే ప్రత్యక్ష ప్రమాణము చేత కూడ దేవతాస్తిత్వము సాధింపనగును. సకల ప్రాణికోటి కనబడుచుండుటయే దేవతాస్తిత్వమునకు ప్రమాణమై తీరును. ఒక వేళ పశుపక్ష్యాదులు యథాస్థితిగ పూర్వమునుండి ఉన్నవి అనినచో అప్పుడు అస్తి-నాస్తి విచికిత్పయే ఉతృస్నముకాదు. వాసుదేవుని ఈ మాటలు విని సాంబుడిట్లనెను. "తండ్రీ! దేవతలందఱును ప్రత్యక్షముగనే లభ్యమగుచుండ, అనుమానాగమ ప్రమాణముల ప్రయోజనముండదు గదా! వాసుదేవుడిట్లనెను. “ప్రత్యక్షముగ దేవతలందఱును ఎప్పుడును లభింపరు. అనుమానాగమ ప్రమాణములచేత మాత్రమే తెలిసికొనదగు దేవతలు వేలకొలదిగ కలరు,”. సాంబుడిట్లనెను. "దేవా! మొట్టమెదట దృగ్గోచరమగు దేవతల గుంచి నాకు చేప్పుడు. ఆ పిమ్మట నితరమైన దాని గూర్చి చెప్పవచ్చును.
వాసుదేవ ఉవాచ :
మూ॥ ప్రత్యక్షం దేవతా సూర్యోజగచ్చక్షుర్దివాకరః తస్మాదభ్యధికా కాచిద్దేవతా నాస్తిశాశ్వతీ
యస్మాదిదం జగజ్జాతం లయం యాస్యతి యత్రచ కృతాది లక్షణః కాలః స్మృతః సాక్షాద్దివాకరః
గ్రహ నక్షత్ర యోగాశ్చ రాశయః కరణానిచ ఆదిత్యావసవోరుద్రా అశ్వినౌ వాయవోZ నలః
శక్రః ప్రజాపతిః సర్వే భూర్భువఃస్వస్తథైవచ లోకాః సర్వేనగాః నాగాః సరితః సాగారాస్తధా భూతగ్రామస్య సర్వస్య స్వయం పేతుర్దివాకరః
అస్యేచ్ఛయా జగత్సర్వముత్పన్నం సచరాచరమ్ స్థితం ప్రవర్తతేచైవ స్వార్థే చాను ప్రవర్తతే
ప్రసాదాదస్య లోకోZయం చేష్టమానః ప్రదృశ్యతే అస్మిన్నభ్యుదితే సర్వముచే దస్తమితే సతి
అస్తం యాతీత్యదృశ్యన కిమేతత్కధ్యతేమయా
తస్మాదతః పరంనాస్తి న భూతో న భవిష్యతి యోవై వేదేషు సర్వేషు పరమాత్మేతి గీయతే.
ఇతి హాస పురాణేషు అంతరాత్మేతి గీయతే బాహ్యాత్మైతి సుషుమ్ణాస్థః స్వప్నస్థో జాగ్రతః స్థితః
అస్తం యాతీత్య దృష్టిన కిమేతత్కథ్యతే మయా? తస్మాదతః పరం నాస్తి న భూతం న భవిష్యతి
యన్నవాహ ఇతి ఖ్యాతః ప్రేరకః సర్వదేహినామ్ నానేన రహితం కించిత్భూతమస్తి చరాచరమ్
తా॥ వాసుదేవుడిట్లనెను. “జగచ్చక్షువు, దివాకరుడునైన సూర్యుడే ప్రత్యక్ష దేవత. ఆతనికంటెనధికమైనది, శాశ్వతమైనదియునైన దేవత మణియెవరు లేరు. ఆయన నుండియే యీ జగత్తు పుట్టుచున్నది. ఆయన యందే లయమగుచున్నది. కృతయుగాది లక్షణములుగల కాలస్వరూపము సాక్షాత్తుగ నా దివాకరుడే. గ్రహములు, నక్షత్రములు, యోగములు, కరణములు, మేషాదిరాళులు, ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, అశ్వినులు, వాయువులు, అగ్ని. ఇంద్రుడు, బ్రహ్మ, భూలోక భువర్లోక సువర్లోకాది సర్వలోకములు, పర్వతములు, వృక్షములు, నదులు, సముద్రములు, సర్వప్రాణి ప్రపంచము-వీని యన్నింటికిని సూర్యుడే కారణము. అతని యిచ్చచేతనే చరాచర జగత్తు పుట్టినది. అతని యిచ్చ చేతనే స్థితి కలిగియున్నది. అతని యిచ్చచేతనే జగద్వస్తులన్నియు తమతమ కార్యములందు ప్రవర్తించుచున్నవి. అతనియనుగ్రహము వలననే లోకమంతయు చైతన్యమయముగ కన్పట్టుచున్నది. అతని యుదయముతో నుదయించుచున్నది. అతని అస్తమయముతో అస్తమించుచున్నది. దీనినంతయు నేందుకు చెప్పుచుంటినో గ్రహించితివా? కావుననాతని కంటే శ్రేష్ఠుడు లేడు. ఉండలేదు. ఉండబోడు. వేదములన్నింటియందును అతడు పరమాత్మునిగా గానము చేయబడును. (కీర్తింపబడును). ఇతిహాసములందు, పురాణములందతడంతరాత్మగా కీర్తింపబడును. సుషుమ్నానాడియందును, జాగ్రత్స్వప్న సుషుప్తులయందును బాహ్యాత్మగానుండును. కనబడకుండఁబోయి కనబడకుండఁ జేయును. ఇది యంతయు నేనేందుకు చెప్పుచుంటినో తెలిసకొంటివా? ఆయనకన్న శ్రేష్ఠుడు లేదు. ఉండలేడు. ఉండబోడు. సర్వమును వహించువాడని ప్రఖ్యాతి గలవాడు, ప్రాణులన్నింటికి ప్రేరణ నిచ్చువాడు; చరాచర భూతములలో నతడు ప్రసరింపని వస్తువు లేదు.
మూ॥ యో వేదైర్వేద విద్భిశ్చ విస్తరేణేహ శక్యతే వక్తుం వర్ష శతైర్నాసౌశక్యః సంక్షేపతోమయా
తస్మాద్గుణాకరః ఖ్యాతః సర్వత్రాయం దివాకరః సర్వేశః సర్వకర్తారం సర్వభక్తాయమవ్యయః
జాతా మత్స్యాదయః సమ్యగతి మంతో మహేశ్వరాత్ మండల వ్యతిరిక్తంచ జానామి పరమార్థతః
తథాస్య మండలం కృత్వా యోహ్యేన ముపతిష్ఠతే ప్రాతః సాయంచ మధ్యాహ్నే సయాతి పరమాంగతిమ్
కింపునర్మండలస్థం యో జపతే పరమార్థతః వివిధాః సిద్ధయస్తస్య భవంతి న తదద్భుతమ్
మండలే చ స్థితం దేవం దేహే చైనం వ్యవస్థితమ్ స్వబుద్ద్యేవ మసంమూడో యః పశ్యతి స పశ్యతి
ధ్యాత్వైవం పూజయేద్యస్తు జ పేద్యో జుహుయాచ్చయః స సర్వార్వాంప్రాయాత్కామాన్గచ్ఛే ధర్మధ్వజం తథా
తస్మాత్త్వ మిహ దుఃఖానామంతం కర్తుం యదేచ్ఛసి ఇహాముత్రచ భోగానాం భుక్తిం ముక్తించ శాశ్వతీమ్
ఆరాధయార్క మర్కస్థో మంత్రైరిహ తదాత్మని అంగైర్వృతం వృతే చైవస్థానే శాస్త్రీణ శోధితే
కవచేనచసంగుషే సర్వతోZస్త్రేణ రక్షితే ఏవం ప్రాప్స్యసి యత్నేన సర్వదా ఫలమీప్సితమ్
తా॥ ఇతనిని గుజించి వివరించి చెప్పుటకు వేదములకుగాని, వేదవేత్తలకుగాని వందల సంవత్సరములకైనను సాధ్యముకాదు. అట్టిది నేను సంక్షేపముగఁజెప్పితిని. అందువలన నితడు గుణాకరుడని పేరువడసి యున్నాడు. సర్వస్థలములకును నితడు దివాకరుడైయున్నాడు. సర్వేశ్వరుడు, సర్వకర్త, సర్వభర్తయయినట్టి యీ సూర్యదేవుడవ్యయుడు. గతిశీలములై మత్స్యాదులు మహేశ్వరుని వలన నావిర్భవించినవి. ఇవి సూర్యమండలమునుండి వేఱయిపోయినవిగ పరమార్థతః నాకు తెలియును. సూర్యుని మండలా కృతిగఁజేసి త్రికాలములయందు ఉపాసించు వాడు ఉత్తమ గతిని పొందును. ఇక నాకాశమున బింబస్టుడైయున్న నాదేవుని యుపాసించువాని విషయమున చేప్పవలసినదేమి? అతనికి వివిధములైన సిద్దులు లభించుటలో సాశ్చర్యము లేదు. సూర్య మండలాంతర్గతుడైన యా పరమాత్ముడే దేహమునందును వ్యవస్థితుడై యున్నవాడని స్వబుద్దితో దర్శీంపగలవాడే నిజమైన ద్రష్ట. ఆ విధముగ ధ్యానించి పూజించువాడు, జపించుపోడు, యజించువాడు తన కోరికలన్నింటిని సఫలముచేసికొనగలడు. ధర్మధ్వజమును పొందగలడు. కావున నీవీలోకమునందలి దుఃఖములనంతముచేసికొనగోరినచో, ఐహికాముష్మిక భోగములనందగోరినచో, భుక్తిని, శాశ్వతమైన ముక్తిని పొందగోరినచో. ఏకాగ్రచిత్తుడవై నీలో నున్న సూర్యుని మంత్రములచే పూజింపుము. లేక శాస్త్రము చేత శోధింపబడిన వానిలో నీవు వరించిన స్థానమునందలి దేహ విశిష్టుడైన సూర్యమూర్తిని పూజింపుము. అన్ని వైపుల నుండి రాగల శస్త్రాస్త్రములనుండి రక్షింపగల కవచ పఠనముచే పూజింపుము. ఇట్టి ప్రయత్నముతో నెప్పడైనను కోరిన ఫలమును పొందగలవు.
మూ!! దుఃఖ మాధ్యాత్మికం. నేహ తథాచైనాధిభౌతికమ్ ఆధిదైవిక మత్యుగ్రం న భవిష్యతి తే సదా
న భయం విద్యతే తేషాం ప్రపన్నా యే దివాకరమ్ ఇహా ముత్ర సుఖం తేషా మచ్ఛిద్రం జాయతే సుఖమ్
సూర్యేణేదం మమోద్దిష్టం సాక్షాత్ యద్జ్ఞానముత్తమమ్ ఆరాధితేన విధివత్కాలేన బహునా తథా
ప్రాప్యతేపరమం స్థానం యత్రధర్మధ్వజ స్థితః ఏతత్సంక్షిప్తముద్దిష్టం క్షిప్రసిద్ధికరం పరమ్
యథానాన్యదతోZస్తీతి స్వయం సూర్యేణ భాషితమ్
ఉపాయోయం సమాఖ్యాత స్తవ సంక్షేపతస్త్విహ యస్మాత్పర తరోనాస్తి హితోపాయః శరీరిణామ్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి సప్తమికల్పే ఆదిత్యమాహాత్మ్యవర్ణనం నామాష్ట చత్వారింశోZధ్యాయః
తా॥ సూర్యభగవానుని శరణము పొందిన వారికి ఆధ్యాతిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన దుఃఖములెప్పుడును కలుగనేరవు. వారికెట్టి భయమునుండదు. అంతేకాక ఐహికాముష్మిక సుఖములవిచ్చిన్నముగ కలుగును. ఈ ఉత్తమమైన జ్ఞానము సాక్షాత్తుగ సూర్యదేవునిచే నాకు చెప్పబడినది. బహుకాలము యథావిధిగ సూర్యారాధన చేయుటచేత ధర్మధ్వజుడుగల యుత్తమ పదము ప్రాప్తించును. త్వరగా సిద్ధింపగల శ్రేష్ఠమగునీ సూర్యోపాసన గూర్చి సంక్షేపముగఁజెప్పబడినది. దీనికి మించినది మఱియొకటి లేదని స్వయముగా సూర్యుని చేతనే చెప్పబడినది. ఈ ఉపాయమునే నేను నీకు సంక్షిప్తముగ చెప్పితిని. మానవుల కింతకంటే శ్రేయస్కరమగునుపాయము మఱియొకటి లేదు.
శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమికల్పమునందు ఆదిత్యమాహాత్మ్య వర్ణనమను నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 48 of the Bhavishya Mahā Purana is as follows:
Sūrya Bhagavān is presented in his full cosmic significance: not merely as a celestial body or a deity to be propitiated, but as the primary mover of all life on earth and in the cosmos. Every plant grows by his light; every cloud is formed by water drawn up by his heat; every season is a movement of his chariot; every human life from birth to death passes under his witnessing gaze. The chapter quotes the Vedic sūktas in which Sūrya is identified with the eye of Varuṇa, with the self-luminous Ātman, and with the Puruṣa of the Puruṣa-sūkta. The theological claim is that Sūrya is not one deity among many but the most immediate and most universally present face of the divine — the one that no being, at any moment, can fail to encounter.