భవిష్య మహా పురాణము
46. షష్ఠి కల్పమున కార్తికేయ మహాత్మ్య వర్ణనము
మూ. సుమంతురువాచ :
యేయం భాద్రపదేమాసి షష్ఠీచభరతర్షభ! సుపుణ్యేయం పాపహరా శివాశాంతా గుహప్రియా
స్నాన దానాదికం సర్వం యస్యామక్షయ ముచ్యతే యేZ స్యాం పశ్యంతి గంగేయం దక్షిణా పథమాశ్రితమ్
బ్రహ్మహత్యాదిభిః పాపై ర్ముచ్యంతే నాత్ర సంశయః తస్మాదస్యాం సదా పశ్యేత్కార్తికేయం నృపోత్తమ!
పూజయంతి గుహం యస్యాం నరాభక్తి సమన్వితాః ప్రాప్యేహ తే సుఖాన్కా మాంగచ్ఛంతీంద్రసలోకతామ్
యస్తు కారయతే వేశ్మ సుదృఢం సుప్రతిష్ఠితమ్ దార్వాం శైలమయం చాపి భక్తి శ్రద్ధాసమన్వితః
గాంగేయం యానమారుహ్య గచ్ఛేద్గాంగేయ సద్మవై
సంమార్జనాది యః కర్మకుర్యాద్గుహ గృహేనరః ధ్వజస్యారోపణం రాజన్స గచ్ఛేద్రుద్ర సద్మవై
చందనాగురు కర్పూరైర్యశ్చ పూజయతే గుహమ్ గజాశ్వరథ యానాఢ్యం సైనా పత్యమవాప్నుతే
రాజ్ఞాం పూజ్యః సదాప్రోక్తః కార్తికేయో మహీపతే కార్తికేయమృతే నాన్యం రాజ్ఞాం పూజ్యం ప్రచక్షతే
సంగ్రామం గచ్ఛమానోయః పూజయే త్కృత్తికా సుతమ్ సశత్రుం జయతే వీర! యథేంద్రో దానవాన్రణే
తస్మాత్సర్వ ప్రయత్నేన పూజయేచ్ఛంకరాత్మజమ్ పూజమానస్తు తం భక్త్యాచంపకైర్వివిధైర్నృప ।
ముచ్యతే సర్వపాపేభ్యస్తదా గచ్ఛేచ్ఛివాలయమ్
తైలం షష్ఠ్యాం నభుంజీత న దివాకురునందన! యస్తు షష్ఠ్యాం నరో నక్తం కుర్యాద్ధి భరతరర్షభ ।
సర్వపాపైః సనిర్ముక్తో గాంగేయస్య సదోవ్రజేత్
త్రిఃకృత్వో దక్షిణామాశాం గత్వాయః శ్రద్ధయాన్వితః పూజయేద్దేవ దేవేశం సగచ్ఛేచ్ఛాంతిమందిరమ్
ఇతి శ్రీ భవిష్యేమహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి షష్టీకల్పే కార్తికేయ మాహాత్మ్వ వర్ణనం నామ షట్చత్వారింశోధ్యాయః (ఇతి షష్ఠీ కల్పః సమాప్తః)
తా॥ సుమంతుముని యిట్లనెను. “భాద్రపదమాసమునందలి షష్ఠితిధి పుణ్యప్రదమైనది. పాపమును నశింపజేయునది. శివకరమైనది. శాంతినిచ్చునది. కుమారస్వామికి ప్రియమైనది. ఆనాడు దక్షిణమార్గముననుసరించిన కుమారస్వామిని దర్శించిన వారికి స్నాన పానాదిక భోగము లక్షయమున ప్రాప్తించును. బ్రహ్మహత్య వంటి ఘోర పాపములనుండి ముక్తులగుదురనుటలో సంశయము లేదు. కాబట్టి ఆ దినమున కార్తికేయుని తప్పక దర్శింపవలేను. భక్తితో ఆ దేవుని నాదినమున పూజించువారు ఇహలోకమునందీప్సిత సుఖములనుభవించి ఆ పిమ్మట నింద్రలోకమునకుఁబోవుదురు. భక్తి శ్రద్దలతో గుహునికి కఱ్ఱతో గాని, శిలలతోగాని శాశ్వతముగ నుండు దృఢమైన మందిరము నిర్మింపజేయువారు నెమలి వాహనము పై పయనించి కార్తికేయ లోకమునకు బోవుదురు. ఆ దేవుని మందిరమున, చిమ్ముట మొదలగు పారిశుద్ధ్య కార్యక్రమములు చేయువాడు, టెక్కెమును నాటువాడు రుద్రలోకమునకుఁబోవును-6. చందనము, అగరు, కర్పూరము మున్నగు వానిచే గుహుని పూజించువాడు, గజ, అశ్వవాహనాదులతో కూడిన సేనాధిపతిత్వమును పొందును. కార్తికేయుడు సదోరాజులకు పూజ్యుడు. ఆయనకు మారుగ రాజులకు పూజింపదగినవాడు మజిలేడని చెప్పుదురు. కృత్తికా పుత్రుడైన కుమారస్వామిని యుద్ధమునకు బోవువాడు పూజించినచో, యుద్ధభూమిలో నింద్రుడు రాక్షసులను జయించినట్లు శత్రువులను జయించును. కావున మిక్కిలి పూనికతోనా దేవుని పూజింపవలెను. సంపెంగలు మొదలగు పుష్పములతో పూజించువాడు సర్వపాపముల నుండి ముక్తుడై పిదప కైలాసమునకేగును. షష్ఠినాడు పగటియందుగాని, రాత్రిగాని నూనే భుజింపకూడదు. ఆదినమున పగలంతయు ఉపవసించి రాత్రి భోజనము చేయువాడు సర్వపాపములనుండి ముక్తుడై కార్తికేయ లోకమునకుఁబోవును. శ్రద్ధాయుక్తుడై మూడు పర్యాయములు దక్షిణ దిశవైపుఁబోయి దేవదేవుడైన కృత్తివాసుని పూజింపవలెను. అట్టివాడు శాంతి పదమును బొందును.
శతార్ధసాహస్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్ఠికల్పమునందు కార్తికేయ మాహాత్మ్య వర్ణనమను నలుబదియాఱవ అధ్యాయము సమాప్తము. (షష్ఠీ కల్పము సమాప్తము)
Summary of chapter 46 of the Bhavishya Mahā Purana is as follows:
The Ṣaṣṭhī Kalpa closes with a comprehensive statement of the fruits bestowed by Skanda worship. Children born under Skanda's grace are healthy, courageous, and learned; soldiers who worship him return victorious; students who offer him their pūjā on the ṣaṣṭhī before examinations succeed. The six-faced deity is described as the protector of the six vital points of the body, and his devotees are said to be immune to the six spiritual enemies — kāma, krodha, lobha, moha, mada, and mātsarya. The chapter summarises the twelve ṣaṣṭhī vratas of the year and their cumulative fruit: a devotee who observes every ṣaṣṭhī throughout the year obtains the status of Skanda's own companion in Skanda-loka.