భవిష్య మహా పురాణము
39. షష్ఠి కల్ప వర్ణనము
మూ, సుమంతురుపోచ : -
“షష్ఠ్యాం ఫలాశనో రాజన్విశేషాత్కార్తికే నృప! రాజ్యచ్యుతో విశే షేణ స్వంరాజ్యం లభతేఽచిరాత్
షష్ఠి తిథర్మహారాజ! సర్వదా సర్వకామదా ఉపోష్యాతు ప్రయత్నేన సర్వకాలం జయర్థినా
కార్తికేయస్య దయితా ఏషా షష్ఠీ మహాతిథిః దేవ సేనాధిపత్యంహి ప్రాప్తం తస్యాంమహాత్మనా
అస్యాం హి శ్రేయసాయుక్తో యస్మాత్స్కందోభవాగ్రణీః తస్మాత్ షష్ట్యాం నక్తభోజీ ప్రాప్నుయాదీప్సితం సదా
దత్వార్ఘ్యం కార్తికేయాయ స్థిత్వావై దక్షిణాముఖః దధ్నాఘృతోదకైః పుష్పైర్మంత్రేణానేన సువ్రత!
“సప్తర్షిదారజ! స్కంద! స్వాహాపతి సముద్భవ! రుద్రార్యమాగ్నిజ! విభో! గంగాగర్భ! నమోఽస్తుతే ప్రీయతాందేవ సేనానీః సంపాదయతు హృద్గతమ్”
దత్వావిప్రాయ చాత్మాన్నం యచ్చాన్యదపి విద్యతే పశ్చాద్భుంకేత్వసౌరాత్రౌ భూమీంకృత్వాతు భాజనమ్
ఏవం షష్ఠ్యాం వ్రతం స్నేహోత్ప్రోక్తం స్కందేన యత్నతః తన్నిబోధ మహారాజ! ప్రోచ్యమాసం మయాఖిలమ్
షష్ఠ్యాం యస్తు ఫలాహారోనక్తాహారో భవిష్యతి శుక్లాకృష్ణాసు నీయతో బ్రహ్మచారీ సమాహితః
తస్య సిద్ధిం ధృతిం తుష్టిం రాజ్యమాయుర్నిరామయమ్ పారత్రికం చైహికంచ దద్యాత్స్కందో న సంశయః
యోహినక్తోప వాసః స్యాత్సనకేన ప్రతీ భవేత్
ఇహవాముత్ర సోత్యంతం లభతే ఖ్యాతిముత్తమామ్ స్వర్గేచ నియతం వాసం లభతే నాత్ర సంశయః
ఇహచాగత్య కాలాంతే యధోక్తఫలభాగ్భవేత్ దేవానామపి వంద్యోఽ సౌ రాజ్ఞాం రాజాభవిష్యతి .
యశ్చాపి శృణుయాత్కల్పం షష్ట్యాః కురుకులోత్తమ! తస్య సిద్ధిస్తథా తుష్టిర్ధృతిః స్యాత్ఖ్యాతి సంభవా
ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే శతార్ధ సాహస్యాం సంహితాయం బ్రాహ్మేపర్వణి షష్ఠి కల్ప వర్ణనం నామ ఏకోన చత్వారింశోఽధ్యాయః
తా॥ సుమంతుముని యిట్లనెను. “షష్ఠినాడు, ముఖ్యముగా కార్తీక మాసమునందలి షష్ఠినాడు, కేవలము ఫలహారముతో నుపవసించి షష్ఠీవ్రతము నాచరించువానికి తాను కోల్పోయిన రాజ్యము తిరిగి లభించును. ఈ షఫీతిథి అన్నింటినీయగలుగునది. అన్ని కోరికలను నెరవేర్పగలుగునది. జయమును వాంఛించు వారలు ఈ తిథినాడు సర్వదా ఉపవాస వ్రతమనుష్ఠింపవలెను. ఇది కుమారస్వామికి ప్రియమైన మహాతిథి. ఆ మహాత్ముడీ దినముననే దేవ సేనకు నాయకత్వమును పొందెను. స్కందుడీ దినమున ప్రఖ్యాతముగ నగ్రణికాగలిగినందున, భక్తుడీ దినమున రాత్రిమాత్రమే భోజనము చేసి ప్రతాచరణము చేసినచో ఆస్వామి అనుగ్రహమున కోరికలన్నియుఁదీరును. దక్షిణముఖముగా నుండి కార్తికేయునకర్ష్యమిచ్చి, ఈ మంత్రములుచదువుచు, పెరుగు, నేయి, నీరు పూలు మొదలైన వానిచే అతనిని పూజింపవలేను. “సప్తఋషుల భార్యల కుమారుడవైన ఓ స్కందా! అగ్నిసముద్భవా! రుద్రార్యమాగ్నిసంభవా! ప్రభో! గంగచేత గర్భమున ధరింపబడినవాడా! నీకు నమస్కారము. దేవ సేనాని యగు కుమారస్వామి మనోరథమును పూర్తిచేయుగాక ఈ ప్రార్థన చేసి, తన ఆహారమును బాహ్మణునకు పెట్టి, మిగిలినదానిని తాను రాత్రికి భుజించి నేలపై పరుండవలెను. ఇట్లు షష్ఠినాడు చేయవలసిన వ్రతము లోకానుగ్రహము కొఱకు స్కందునిచే చెప్పబడినది. ఆవివరమంతయు నేను చెప్పుచున్నాను. వినుము. షష్ఠినాడు పండ్లుమాత్రము తిని రాత్రిపూట భోజనము చేయవలెను. నియమనిష్ఠలతో, బ్రహ్మచర్యము బూని, సమాహితచిత్తుడై శుక్లపక్ష కృష్ణపక్ష షష్ఠీతిథులందు ఈ వ్రతమాచరింపవలెను. అట్లు ఆచరించిన వానికి సకల వాంఛసిద్ధి, ధైర్యము, సంతోషము, రాజ్యము, రోగములు లేని దీర్ఘాయువు, లభించును. స్కందుడైహికాముష్మిక ఫలములిచ్చును. సందేహము లేదు. రాత్రి ఉపవసించినవాడు రాత్రియే ప్రతి యగును. ఈలోకమున, పరలోకమునను అతడు ఉత్తమమైన ఖ్యాతిని పొందును. అతనికి దీర్ఘకాలము స్వర్గవాస సౌఖ్యము లభించును. కాలాంతరమున నీ లోకమునకు వచ్చి దేవతలకు కూడ వంద్యుడై చక్రవర్తి స్థానములంకరించును. కురుకులో ద్వహా! ఈ షష్ఠికల్పమును వినువానికి కూడ వాంఛాసిద్ధి, తుష్టి, ధృతి, కీర్తియు లభించును.
శతార్ధ సాహస్రసంహిత యగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్ప వర్ణనమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 39 of the Bhavishya Mahā Purana is as follows:
The Ṣaṣṭhī Kalpa opens with the narrative of Kārttikeya's installation as commander of the devas' army by Indra, with Devasenā (the divine army's presiding goddess) given to him as his consort. The ṣaṣṭhī tithi — the sixth of each fortnight — is established as sacred to Skanda in commemoration of this appointment. The vrata involves a complete fast from grains and cooked food, with only fruits permitted, throughout the day. The worship of Kārttikeya with specific red flowers, fragrant smoke, and lamp-light forms the ritual core. The fruits of the vrata include victory in all conflicts, protection of children (Ṣaṣṭhī Devī as the protector of newborns is invoked here), and the grace of Kārttikeya for those engaged in military or competitive endeavours.