38. పంచమి కల్ప సమాప్తి కథనము

మూ. సుమంతురువాచ : -

తథాచాశ్వయుజేమాసి పంచమ్యాం కురునందన! కృత్వా కుశమయాన్నాగాన్గంధాద్యైః సంప్రపూజయేత్

 ఘృతోదకాభ్యాం పయసా స్నపయిత్వా విశాంపతే గోధూమైః పయసాస్విన్నైర్భగ్యైశ్చ వివిధైస్తథా

యస్త్వస్యాం విధివన్నాగాన్ శుచిర్భక్త్యా సమన్వితః పూజయేత్కురు శార్దూల! తస్య శేషాదయో నృప!

 నాగాః ప్రీతా భవంతీహ శాంతి మాప్నోతివా విభో! సశాంతి లోక మాసాద్య మోదతే శాశ్వతీః సమా:

 ఇత్యేష కథతో వీర! పంచమీ కల్ప ఉత్తమః యత్రాయ ముచ్యతే మంత్రః సర్వసర్పని షేధకః (ఓం కురుకుల్లే ఫట్ స్వాహా)

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రహ్మే పర్వణి పంచమీ కల్పే సమాప్తి కథనం నామాష్టత్రింశోఽధ్యాయః

 తా॥ సుమంతుముని యిట్లనెను. “అటులే ఆశ్వయుజ మాసమునందలి పంచమీ తిథియందు దర్బలతో నాగా కృతులను చేసి గంధాదులచే పూజింపవలేను, నేయి, నీరు, పాలు అభి షేకమునందు వినియోగింపవలెను. గోధమలను (పిండిని) పాలతో తడిపి చేసిన వివిధములైన భక్ష్యములను నివేదింపవలేను. ఈ దినమున యథావిధిగ శుచియై భక్తి యుక్తుడై నాగులను పూజించువానికి శేషుగడు మొదలగు. సర్పములు సంప్రీతులైనందున శాంతి కలుగును. అనేక సంవత్సరముల వఱకు నతడు శాంతి లోకమున సుఖసంతోషములనులనుభవించును. ఇట్లు పంచమీకల్పముత్తమమైనదిగా వివరింపబడినది. ఈ దిగువ మంత్రము ఎచట ఉచ్చరింపబడునో అచట సర్పములు నిషేధింపబడును. “ఓం కురు కుల్లే ఫట్ స్వాహా".

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున, పంచమీకల్పమునందు సమాప్తికథనమును ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.