37. పంచమీ కల్పాంతర్గత భాద్రపదిక నాగపంచమీ వ్రత వర్ణనము

మూ. సుమంతురువాచ : -

తధా భాద్రపదేమాసి పంచమ్యాం శ్రద్ధయాన్వితః అథాలేఖ్య నరోనాగాన్ కృష్ణవర్ణాది వర్ణకై:

పూజయేర్గంధ పుష్పైశ్చ సరిః పాయస గుగ్గులైః తస్య తుష్టిం సమాయాంతి పన్నగాస్తక్షకాదయః

 ఆ సప్తమాత్కులాత్తస్య నభయంనాగతో భవేత్ తస్మాత్సర్వ ప్రయత్నేన నాగాన్సంపూజయద్బుధః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధసాహస్ర్యం సంహితాయాం బ్రహ్మే పర్వణి

పంచమీ కల్పే భాద్రపదిక నాగ పంచమీ వ్రత వర్ణనం నామ సప్తత్రింశోఽధ్యాయః

తా॥  సుమంతు ముని యిట్లనెను. “అబులే భాద్రపదమాసమున శుక్లపక్ష పంచమినాడు, భక్తి శ్రద్ధలతో నలుపు, లేక తత్తుల్య వర్ణములతో ద్వారమున కిరువైపుల నాగులను చిత్రించి, గంధ పుష్పములతోను, నేయి, పాయసము, గుగ్గలుతోను పూజింపవలెను. అట్లు పూజించు వానికి తక్షకుడు మొదలగు సర్పములు సంతోషమును కలిగించును. అతనికి ఏడు తరముల వఱకును సర్పభయము కలుగకుండును. అందుచే బుద్ధిమంతుడు సర్వప్రయత్నములతో నాగపూజ నాచరించవలెను.

శతార్ధ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కలాంతర్గత భాద్రపదిక నొగపంచమీ వ్రత వర్ణనమను పేరు గల ముప్పది యేడవ అధ్యాయము సమాప్తము.