భవిష్య మహా పురాణము
27. చతుర్థి కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
మూ. కార్తికేయ ఉవాచ :
సంక్షేపతోమమ విభో లక్షణాని నృపస్యతు శుభాని చాంగజాతాని బ్రూహిమే వదతాంవర!
బ్రహ్మోవాచ :
శృణు వక్ష్యేంగజాతాని పార్థివస్య శుభానిచ పార్థివో జ్ఞాయతేరైస్తు నరాణాంమధ్య భాగతః
త్రీణియస్య మహాబాహో! విపులాని నరస్యతు ఉన్నతాని తథాషడ్వై గంభీరాణి చ త్రీణివై
చత్వారి చాపి హ్రస్వాని సప్తరక్తానివా విభో! దీర్ఘాణి చాపి సూక్ష్మాణి భవంతి యస్యపంచవా
నాభిః సంధి: స్వనశ్చేతి గంభీరాణిచ త్రీణివై వదనం చ లలాటంచ దంతోత్తమ ఉరస్తథా
విస్తీర్ణమేతత్త్రితయం వీర యస్య నరస్యతు సరాజా నాత్ర సందేహః శ్రుణు ష్వేవోన్నతానిచ
కృకాటికా తథాచాస్యం నఖా వక్షోధ నాసికా కక్షేచాపి మహాబాహో! షడేతాని విదుర్బుధాః
లింగం పృష్టం తథాగ్రీవా జంఘాహ్రస్వాని సువ్రత! నేత్రాంతే హస్తపాదౌతు తాల్వోష్ఠౌచ సురోత్తమ జిహ్వారక్త నఖశ్చైవ సప్తైతాని మహామతే
త్వచః కరరుహా: కేశా దశనా ఋభవోత్తమ! సూక్ష్మాణ్యేతానిచ గుహ! పంచచాపి విదుర్బుధాః
నాసికా లోచనం బాహూ స్తనయోరంతరం హనుః ఇతి దీర్ఘమిదం ప్రోక్తం పంచకం భూభుజాం నృప!
తా॥ కార్తికేయుడిట్లనెను. ప్రభూ! వాగ్మిశ్రేషా! అవయవముల శుభ లక్షణములననుసరించి నాకు సంక్షేపముగ రాజ లక్షణములను గుఱించి చెప్పుడు”-1. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడగెను. నృపాలుని శుభావయవలక్షణములను గూర్చి చెప్పుచున్నాను. వినుము. మనుష్యులమధ్య అట్టి లక్షణములు గలవాడు రాచరికపు జీవితము గలవాడుగ గుర్తింపబడుచున్నాడు-2. అట్టి రాజ జన్మునకు మూడంగములు విపులముగను, ఆఱు అంగములు ఎత్తైనవిగను, మూడులోతుగను ఉండును-3. నాలుగు పొట్టివిగను, ఏడు ఎఱ్ఱని వన్నెగలవిగను, ఐదు దీర్ఘములై సూక్ష్మముగనుండును-4. నాభి, సంధిస్థానము, కంఠస్వరము ఈ మూడు గంభీరముగ నుండవలసినవి, ముఖము, నొసలు, వక్షము-5. ఈ మూడును రాజుకు విశాలముగనుండదగినవి. అటులున్నవాడు రాజగుటకు సందేహములేదు. ఇక ఎత్తుగనుండవలసిన వాని గూర్చి వినుము -6. కృకాటిక (పేడతల) ముఖము గోళ్ళు, వక్షస్థలము, ముక్కు, చంకలు-ఇవి ఆకు ఎత్తుగనుండవలెనని పండితులు చెప్పుదురు-7. లింగము, వీపు, మెడ, పిక్కలు-ఈ నాలుగు కుఱుచగనుండదగినవి. కనుకొనలు, అరచేతులు, అరకాళ్ళు, దౌడలు, పెదవులు, నాలుక, గోళ్ళు, ఈ ఏడును ఎఱ్ఱని వన్నెలో నుండవలసినవి-8. కుమారా! చర్మము, గోళ్ళు, వెంట్రుకలు, దంతములు అంగుళీపర్వములు ఇవి సూక్ష్మముగ నుండవలసినవిగా పండితులు చెప్పుదురు-9. ముక్కు, కన్నులు బాహువులు, స్తనముల మధ్యదూరము, చెక్కిలి మీది భాగము, ఈ ఐదును రోజులకు దీర్ఘముగ నుండవలసినవిగా చెప్పబడినవి.
మూ. క్షుతం రాజ్ఞాం సకృద్ద్విస్త్రిర్నాదితం ప్రోదితం తథా దీర్ఘాయుషాం ప్రయుక్తంతే హసితంచ విదుర్బుధాః
పద్మపత్ర నిభేనేత్రే ధనినాం శివనందన! భార్గవీమాప్నుయాత్సోపి రక్తంతేయస్యలోచనే
మధుపింగైర్మహాత్మానో నరాజ్ఞేయాః సురాధిప భీరవో హి కృశాక్షాస్తు చౌరమండల చక్రకైః
క్రూరాః కేకరనేత్రాస్తు గంభీరైరర్థసంపదః నీలోత్పలాభైర్వేద విదో భృశం కృష్ణైస్తథార్ధితా మంత్రిత్వం స్థూల సుదృశో వదంతి భువి తద్విదః
శ్యామాక్షా సుభగాజ్ఞేయా దీనాక్షైశ్చదరిద్రతా విస్తీర్ణైర్భోగినో జ్ఞేయా విపులైశ్చ తథాగుహ!
అభ్యున్నతిభిర్హ్రస్వాయుర్విశాలాభిః సుఖీభవేత్ దరిద్రోవిషమాభిస్తు తతో జ్ఞేయః సురోత్తమ!
భృవో బాలేందు సదృశా ధనినా మార్భవోత్తమ! దీర్ఘాభిర్నర్థనో జ్ఞేయః సంసక్తాభిస్తు సువ్రత!
దీర్ఘా భిరర్థహీనాః స్యుర్నరా జ్ఞేయాః సురోత్తమ మధ్యే నతభ్రువో యేచ పరదార రతాస్తుతే
విరలైరున్నతైః శంఖైర్ధన్యాః స్యుర్నత్ర సంశయః నిమ్నైః స్తుత్యర్ధ సంసక్తి ఉన్నతైశ్చ జనాధిపాః
విషమ లలాటా విధనాః సదాస్యుర్దేవ సత్తమ! ఆచార్యాః శుక్తి సదృశైర్నరాః స్యురాత్ర సంశయః
తా॥ రాజులకు తుమ్ము, నవ్వు ఒకటి, రెండు, మూడు పర్యాయములు శబ్దించినచో దీర్ఘాయుష్మంతులగుదురు. ఇది పండితులు తెలిసికొందురు-11. శివనందనా! ధనికులైన వారికి తామర రేకుల వంటి కన్నులుండును. కనుకొనలయందు ఎఱుపు జీర లుండెనేని అతడు లక్ష్మిని పొందును -12. కనులు తేనే వంటి వర్ణమున నుండు మనుజులు మహాత్ములని తెలియవలెను. కృశించిన కన్నులు గలవారు పిటికీవారు, వలయాకారముగ గుండ్రముగ కలవారు దొంగలునగుదురు-13. మెల్లకన్నువారు క్రూరులు, లోతైన కన్నులు గలవారు ధనసంపదలు గలవారు, నల్లగలువల వంటి నేత్రములు గలవారు వేదవిదులు, మిక్కిలి నల్లని కనుల వారు బీదవారు, మందముగను అందముగను ఉన్న కన్నుల వారు మంత్రిత్వపదవి నందుదురని తద్జ్ఞులు చెప్పుదురు -14. నల్లని కన్నులు గలవారు సౌభాగ్యవంతులు, దీనమైకన్నులుండెనేని దరిద్రులు, విశాలమైన కన్నులతో భోగులును, అగుదురని తెలియవలెను-15. పైకి యుబికినట్లుండినచో అల్పాయుష్కులు, వెడల్పైన కనులుండెనేని సుఖియనగును. కండ్లు ఎగుడు దిగువుగా నున్నచో దరిద్రుడగునని తెలియవలెను -16. . బాలచంద్రరేఖల వంటి కనుబొమలు ధనికులకుండును. కనుబొమలు పొడవైయుండెనేని, కలిసికొని యుండెనేని నిర్థనుడగునని తెలియవలెను-17. క్షీణమైన కనుబొమలుగలవారు అర్తహీనులుగా నెఱుంగదగును. మధ్యభాగమన క్రిందకు వంగియుండెనేని అట్టివాడు పరదారాసక్తుడగును-18. వంకరదిరీగి యొత్తుగనున్న నొసటీ యెముక గలవారు ధన్యులనుటలో సందేహము లేదు. లోతుగ నున్నవారు స్తుతుల ద్వారా సంపాదించిన ధనముగలవారు, ఎత్తుగనున్నచో రాజులగుదురు-19. విషమమైన లలాటము గలవారు ధనము పోగొట్టుకొనిన వారు, ముత్యపుఁజిప్పవలె నుదురుగలవారు గురుస్థానమునందుదురు. సంశయములేదు.
మూ. ఉన్నత శిరోభిరాఢ్యా నరాజ్ఞేయాః సదాగుహ వధ బంధ భాగినో వీరా నరా నిమ్నలలాటినః భృశమున్నతైశ్చ మూర్ఖశ్చ కృపణాశ్చతథానతైః
శుభావహం మనుష్యాణాం వదనం స్యాద్యథాశృణు ఆదీనమాననం స్నిగ్ధం సస్మితంచ విశేషతః
సాశ్రుదీనం తథారూక్ష మస్నిగ్ధం నిందీతం గుహ! అసంభావ్యం ముఖం జ్ఞేయం నరాణాం నగదారణ!
అకంపం శుభదం జ్ఞేయం నరాణాంహసితంగుహ! నిమిలి తాక్షం పాపస్య హసితం చార్భవోత్తమ!
అమండలం శిరోయస్యసగవాడ్యో నరోభవేత్ ఛత్రాకృతి శిరోయస్య సభవేన్నృపతిర్నరః
చిపిటకారితా శిరా హన్యాద్వై పితరౌనరః ఘంటాకృతి శిరోఽధ్వాన మసకృత్సేవతే నరః నిమ్నం శిరోనర్థదం సాన్నరాణా మార్భవోత్తమ!
గుడైః స్నిగ్ధైస్తథా కృష్ణై రభిన్నా గ్రై స్తథైవ హి కేర్నచాతి
బహులైర్మృదుభిః పార్థివో భవేత్
బహులాః కపిలాః స్థూలా విషమాః స్ఫుటితాస్తథా పరుషా హ్రస్వాతి కుటిలా దరిద్రాణాంకచా ఘనాః
ఇత్యుక్తం లక్షణం నృణాం శుభం వాశుభమేవచ యోషితాం తదిదానీంతే లక్షణం వచ్మిభీమజ!
ఇతి శ్రీ భవి ష్యమహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణీ చతుర్దేకల్పే పురుషలక్షణ వర్ణనంనామ సప్తవింశోఽధ్యాయః
తా॥ ఉన్నతమైన శిరస్సుగలవారు సంపన్నులును, వంగిన (లోతైన, వంకరైన) తలగల వారు వధకు, బంధనమునకు పాత్రులగుదురు. మిక్కిలి ఎత్తైన (దీర్ఘమైన) తల గలవారు మూర్ఖులును, మిక్కిలి వంగియున్న తలగలవారు దీనులును అగుదురు-21. మనుష్యులకు శుభమునిచ్చు ముఖమెట్లుండవలెనో వినుము. దైన్యము లేకుండగను, నునుపుగను ముఖ్యముగా చిఱునవ్వుతో వెలిగేడు ముఖము శుభప్రదమైనది-22. కన్నీటితో దీనముగ, కణుకుగ నునుపులేకుండిన ముఖము నిందితమైనది. మనుష్యుల కిట్టీ ముఖము సాధారణముగ నుండదనియే తెలియవలెను.-23. వణుకు లేని నవ్వును శుభప్రదముగా నెఱుంగవలేను. కన్నులరమూసి నవ్వువాడు పాపియని గమనింపవలెను-24. శిరము వర్తులముగ లేనివాడు గోసంపద గలవాడగును. గొడుగు ఆకారముగనున్నవాడు రాజగును-25. చప్పట తల గలవాడు తలిదండ్రులను చంపును. గంటవలె శిరస్సున్నచో తప్పుదారి నడచువాడు, అనేకులకు సేవ చేయువాడగును. లోతుగ నున్నతల అనర్ధదాయకము-26. వెంట్రుకలు బెల్లపు వన్నెకలిగి, లేక నలుపై, నునుపై, చీల్చబడని కొనలు గలిగి, మిక్కుటముగాక, మెత్తగనున్నచో రాజగును-27. మిక్కిలి యెక్కువగను, కపిలవర్ణము గలిగియును, మందముగ, వంకరగను, చీలినట్లుగను, గజు కుగను, పొట్టిగను, మిక్కిలిగా మెలికలు తిరిగి యున్న వెంట్రుకలు దరిద్రులకుండును-28. ఇట్లు రాజుల శుభాశుభ లక్షణములు చెప్పబడినవి. కుమారా! ఇప్పుడు స్త్రీ లక్షణములను గూర్చి చెప్పెదను.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, చతుర్థీకల్పమునందలి పురుష లక్షణవర్ణనమను నిరువది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 27 of the Bhavishya Mahā Purana is as follows:
The sāmudrika observations are synthesised into the specific body of marks that identify a man as destined for kingship. The summary formula is given: a true king should have three marks that are broad (chest, forehead, space between the eyes), six that are tall (body, neck, nose, arms, back, thighs), and four that are short (neck, genitals, shins, and feet), while seven parts of the body — the eyes, the palms, the soles of the feet, the lips, the tongue, the nails, and the insides of the ears — should be red. A man who carries these marks will become a king regardless of the circumstances of his birth. The chapter emphasises that these marks are the visible traces of accumulated merit from previous births, and that their presence is Bhagavān's seal of sovereign destiny.