భవిష్య మహా పురాణము
28. చతుర్థీ కల్పమున స్త్రీ లక్షణ వర్ణనము
మూ. బ్రహ్మోవాచ :
శృణ్విదానీం మహాబాహో! స్త్రీ లక్షణమనుత్తమమ్ యన్మయోక్తం పురావీర! నారదస్య మహాత్మనః
తత్త్వం విజ్ఞాయతే యేన శుభాశుభమవ స్థితమ్ నిందితంచ ప్రశస్తంచ స్త్రీణాం వక్ష్యామి లక్షణమ్
మాతరం పితరంచైవ భ్రాతరం మాతులం తథా ద్వౌతుబింబౌ పరీక్షేత సముద్రస్యవచో యథా
ముహూర్తే తిథి సంపన్నే నక్షత్రే చాభిపూజితే ద్విజైస్తు సహవాగమ్య కన్యాం వీక్షేత శాస్త్రవిత్
హస్తౌ పాదౌ పరీక్షేత అంగులీర్నఖ మేవచ పాణిమేవచ జంఘేచ కటినాసోరూ ఏవచ
జఘనోదర పృష్ఠంచ స్తనౌ కర్ణౌ భుజౌ తథా జిహ్వాం చోష్ఠౌచ దంతాశ్చ కపోలం గలకం తథా
చక్షుర్నా లలాటంచ శిరః కేశాంస్తథైవచ రోమ రాజిం స్వరం వర్ణమావర్తాని తువాపునః
యస్యాస్తు రేఖాగ్రీవాయాం యాచరక్తాంతలోచనా యస్యసాగృహ మాగచ్ఛేత్తద్గృహం సుఖమేధతే
లలాటే దృశ్యతే యస్యాస్త్రిశూలం దేవ నిర్మితమ్ బహూనాం స్త్రీ సహస్రాణాం స్వామినీం తాం వినిర్దిశేత్
రాజహంస గతిర్యస్యా మృగాక్షీ మృగ వర్ణికా సమశుక్లాగ్ర దంతాచ కన్యాం తాముత్తమాం విదుః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. మహాబాహూ! శ్రేష్టమైన స్త్రీ లక్షణము నిప్పుడు వినుము. మహాత్ముడైన నారదునకు పూర్వము దీనిని చెప్పియుంటిని-1. దీనిని తెలియుటచేత స్త్రీల శుభాశుభ లక్షణములతత్త్వము తెలియగలదు. స్త్రీ లక్షణములలో నిందితము లెవ్వియో ప్రశస్తము లెవ్వియో చెప్పుచున్నాను-2. తల్లిని, తండ్రిని, సోదరుని, మేనమామను రెండు పక్షముల వంశములను సముద్రుని వాక్యానుసారము పరీక్షింపవలేను-3. శాస్త్రము తెలిసినవాడు శుభ నక్షత్రమున శుభతిథియందు మంచి ముహూర్తమున బ్రాహ్మణులతో కూడి వచ్చి కన్యను పరీక్షింపవలెను-4. చేతులు, పాదములు, వ్రేళ్ళు, గోళ్లు, అరచేతులు, పిక్కలు, నడుము, ముక్కు, తొడలు-5. మొల, కడుపు, వీపు, స్తనములు, చెవులు, భుజములు, నాలుక, పెదవులు, దంతములు, చెక్కిళ్లు, మెడ-6. కనులు, ముక్కు నొసలు, తల, వెంట్రుకలు, రోమ సమూహము, కంఠస్వరము, శరీరవర్ణము, సుడులు-7. ఇవి యన్నియును చూడవలెను. మెడమీద రేఖలు, కనుగొనలయందేఱుపుజీరలున్న స్త్రీ ఏ యింటికి వచ్చునో ఆ యిల్లు సుఖముగానుండును-8. దైవికముగనే, ఏ స్త్రీ నుదుట త్రిశూల చిహ్నము కన్పట్టునో అట్టి స్త్రీ అనేక స్త్రీ సమూహములకు యజమానురాలగునని నిర్దేశింపవలెను-9. రాజహంస నడక వంటి నడక, లేడి కన్నుల వంటి కన్నులు, మృగమువలే బంగారుబొయ, సమానముగను, తెల్లగను ఉన్న పై పలువరస, గల కన్య ఉత్తమురాలుగ నెన్నుదురు.
మూ. మండూక కుక్షీ యాకన్యా న్యగ్రోధ పరిమండలా ఏకం జనయతే పుత్రం సోపి రాజాభవిష్యతి
హంస స్వరామృదు వచా యాకన్యా మధుపింగలా అష్టోజనయతే పుత్రాన్ధన ధాన్య వివర్ధినీ
ఆయతౌ శ్రవణౌ యస్యాః సురూపాచాపి నాసికా భ్రువౌ చంద్రాయుధాకరౌ సాత్యంతం సుఖభాగినీ
తన్వీ శ్యామా తథా కృష్ణా స్నిగ్ధాంగీ మృదుభాషిణీ శంఖకుందేందు దశనా భవేదైశ్వర్య భగినీ
విస్తీర్ణం జఘనం యస్యా వేది మధ్యాలు యాభవేత్ ఆయతే విపులే నేత్రే రాజపత్నీతు సా భవేత్
యస్యాః పయోధరే వామే హస్తే కర్ణే గలేపివా మశకం తిలకం వాపి సాపూర్వం జనయేత్సుతమ్
గూఢగుల్ఫాం గులిశిరా అల్పపార్ష్ణిః సుమధ్యమా రక్తాక్షీ రక్త చరణా సాత్యంతం సుఖభాగినీ
కూర్మపృష్టాయత నఖౌ స్నిగ్ధ భావ వివర్జితౌ వజ్రాంగులి తలౌ పాదౌ కన్యాం తాం పరివర్జయేత్
యేన కేన చిదంశేన మాంసం యస్యా వివర్ధతే రాసభీం తాదృశీం విద్యాన్నసా కల్యాణమర్హతి
పాదే ప్రదేశినీ యస్యా అంగుష్ఠం సమతి క్రమేత్ దుఃశీలా దుర్భగా జ్ఞేయా కన్యాంతాం పరివర్జయేత్
తా॥ మఱిచెట్టువలెనంతటను గుండ్రముగ నుండి కప్పకడుపువంటి కడుపుగల స్త్రీ ఒక్క కొడుకును కనును. అతడు కూడ రాజగును-11. హంసధ్వని వంటి కంఠస్వరము, మృదువైన మాటతీరు, తేనెవన్నె వంటి శరీర వర్ణము, గల కన్య ధనధాన్యసమృద్ధిని కలిగించుచు ఎనమండుగురు పుత్రులను కనుగు-12. నీడు పైన చెవులు, సొంపగు ముక్కు, ఇంద్రధనుస్సు వంటి కనుబొమలు గల స్త్రీ మిక్కిలి సుఖముననుభవించును-13. బక్కపలుచని శరీరరము గలది, చామన చాయ లేక నలుపుగనున్నది. చిక్కని నును పైన అంగములు గలది, మృదువుగ మాట్లాడునది, శంఖమువలె, మొల్లపువ్వులవలె, చంద్రునివలె తెల్లగా మెఱసెడు పలువరుస గలది అయిన స్త్రీ ఐశ్వర్యవంతురాలగును-14. విశాలమైన మొల (కాంచీ పదము) గలది, వేదికవంటి నడుముగలది, పొడవుగను విశాలముగను తీర్చబడిన కన్నులు గలది అయిన స్త్రీ రాజు భార్యయగును-15. ఎడమ చంటి పై, చేతి పై, చెవి పైన, మెడ పైన గాని, మచ్చ, పుట్టుమచ్చ ఉన్న స్త్రీ, మొదట పుత్రునికి జన్మమిచ్చును-16. బలిసిన చీలమండలు, వ్రేలికొనలుగలది, చిన్నమడమలు గలది, అందమైన నడుముగలది, ఎఱ్ఱని కనులు, పాదములు గలది మిక్కిలి సుఖముననుభవించును-17. తాబేలు వంటి వీఁ పు, పొడవైన కణుకు గోళ్లు, వంకర వ్రేళ్లు, పాదములుగల కన్యను వదలవలెను-18. శరీరములో ఏ భాగముననేని, ఏ మాత్రమేని మాంసము పెరిగియున్నచో అది గాడిదవంటీ యాడదియగును. అట్టిస్తీ వివాహము కరతలేని దగును-19. పాదమున, బొట్టనవ్రేలి ప్రక్కవేలు, బొట్టన వ్రేలి కంటే మించి యున్నచో అట్టి కన్య దుఃశీల, దుర్భగయని తెలియవలెను. అట్టి కన్యను వదలి పెట్టవలెను.
మూ. పాదేమధ్యమికా యస్యాః క్షితింనస్పృశతే యది రమతే సానకౌమారే స్వచ్చందా కామచారిణీ
పాదే అనామికా యస్యాః క్షితిం నస్పృశతేయది ద్వితీయం పురుషం హత్వా తృతీయే సా ప్రతిష్ఠితా
పాదే కనిష్ఠాయస్యాస్తు క్షితినప్పృశతేయది ద్వితీయం పురుషంహత్వా తృతీయే సా ప్రతిష్ఠితా
న దేవికా, నధనికా, న ధాన్యప్రతినామికా గుల్మవృక్ష సనామ్నిచ కన్యాంతాం పరివర్జయేత్
ఇంద్రచంద్రాది పురుష సనామ్నీచ యదాభవేత్ నైతాః పతిషు రజ్యంతే యాశ్చ నక్షత్ర నామీకాః
ఆవర్తః పృష్ఠతో యస్యా నాభింసమనువిందతి తదపత్యం భవేద్ధ్రస్వం హ్రస్వాయుశ్చ వినిర్దిశేత్
పృష్ఠావర్తా పతింహంతి నాభ్యావర్తా పతివ్రతా కట్యావర్తాతు స్వచ్ఛందా నకదాచిద్విరజ్యతే
యస్యాస్తు హసమానాయా గండే జాయేత కూపకమ్ రమతే సానకౌమారే స్వచ్ఛంద కార్యకారిణీ
యస్యాస్తు గచ్ఛమానాయాప్టిట్టికాయతి జంఘికా పుత్రం వ్యవస్యేత్సా కర్తుం పతిత్వేనాత్ర సంశయః
స్థూల పాద చ యా కన్యా సర్వాంగేషుచ లోమశా స్థూల హస్తాచ యస్యాద్వై దాసీంతాం నిర్దిశేద్భుధః
తా॥ పాదమునందలి నడిమివేలు నేలను తాకకున్ననట్టి స్త్రీ కౌమారమున క్రీడింపదు. స్వైరిణి, స్వేచ్ఛాప్రియయగును-21. పాదమునందలి 'అనామిక బొట్టనవ్రేలినుండి నాల్గవ వ్రేలు నేలను తాకకున్నయెడల అస్త్రీ రెండవ భర్తను చంపి మూడవ భర్తతో కాపురముండును-22. పాదమునందలి చిటికెనవ్రేలు నేలను తాకని యెడల అట్టి స్త్రీ రెండవ భర్తను చంపి మూడవ భర్తతో కాపురీము చేయును-23. పట్టపురాణులు (దేవి) పేళ్లుగలది, ఉత్తమ స్త్రీల పేళ్లుగలది ధాన్యాదుల పేరులుగలది, పొదలు, చెట్లు మొదలైన వాని నామములు గలదియైన కన్యను విడిచి పెట్టవలెను-24. ఇంద్రుడు, చంద్రుడు మొదలైన పురుషదేవతల పేళ్లు గలది, అశ్విన్యాది నక్షత్రముల పేళ్లుగల స్త్రీలును తమ పతులయందనురాగము కలిగియుండరు-25. ఏ స్త్రీకి వీపు నుండి నాభివరకు చేరు సుడియుండునో ఆమె అల్పసంతానము గలదిగను, అల్పాయుష్కురాలును అగును-26. వీపున సుడి గలదీ భర్తను చంపును. నాభియందు సుడి గలది పతివ్రతయగును. నడుమున సుడిగలది స్వేచ్చగా ప్రవర్తించును. ఎప్పుడును సంతోషింపదు-27. నవ్వుచున్నప్పుడు చెక్కిళ్ల పై సొట్టలు (గుంతలు) పడినచో అట్టి స్త్రీ కౌమారావస్థలో క్రీడింపదు. స్వతంత్రముగ పనులు చేయుచుండును-28. నడచుచున్నప్పుడు కాలివేనుక భాగమున టిక్ టిక్ అను ధ్వని వినవచ్చెనేనీ అట్టి స్త్రీ భర్తృత్వముచే పనిచేయుటకు పుత్రుని పురికొల్పును. సంశయములేదు-29. పాదములు స్థూలములై, అంగములన్నింటియందు రోమములుండి, చేతులు కూడా స్థూలములైయున్న కన్యను గూర్చి దాసియగునని పండితుడు చెప్పవలెను.
మూ. యస్యాశ్చత్కటకౌ పాదౌ ముఖంచ వికృతంభవేత్ ఉత్తరోష్ఠేచ రోమాణి సాక్షిప్రంభక్షయేత్పతిమ్
త్రీణియస్యాః ప్రలంబంతే లలాటముదరం స్ఫిచౌ త్రీణి భక్షయతే సాతు దేవరం శ్వశురం పతిమ్
సముద్భూషిత చారిత్రా గురుభక్తా పతివ్రతా దేవబ్రాహ్మణ భక్తాచ మానుషీంతాం వినిర్దిశేత్
నిత్యం స్నాతా సుగంధాచ నిత్యం చ ప్రియవాదినీ అల్పాశిన్యల్ప రోషాచ దేవతాం తాం వినిర్దిశేత్
ప్రచ్ఛన్నం కురుతే పాపమపవాదంచ రక్షతి హృదయం స్యాచ్చ దుర్గ్రాహ్యం మార్జరీంతాంవినిర్దివేత్
హసతే క్రీడతేచైవ క్రుద్ధాచైవ ప్రసీదతి నీచేషు రమతే నిత్యం రాసభీం తాం వినిర్ధికేత్
ప్రతికూల కరీ నిత్యం బంధూనాం భర్తురేవచ స్వచ్ఛందే లలితాంచైవ ఆసురీంనాం వినిర్దిశేత్
బహ్వాశీ బహు వాక్యాచ నిత్యం చాప్రియవాదినీ హినస్తి స్వపతిం యాస్తు రాక్షసీం తాం వినిర్దిశేత్
శౌచాచార పరిభ్రష్టా రూపభ్రష్టా భయంకరా ప్రస్వేదమలపంకాచ పిశాచీం తాం వినిర్దిశేత్
నిత్యం స్నాతాం సుగంధాంచ మాంసమద్యప్రియాదినీమ్ వృక్షోద్యాన ప్రసక్తాంచ గాంధర్వంతాం వినిర్దిశేత్
చపలా చంచలాచైవ నిత్యం పశ్యేద్దిశస్తథా చల స్వభావ లబ్ధాచ వానరీం తాం వినిర్దిశేత్
చంద్రాననాం శుభాంగీం తు మత్తవారణ గామినీమ్ ఆరక్త నఖ హస్తాంతు విద్యాద్విద్యాధరీం బుధః
వీణా వాదిత్ర శబ్దేన వంశ గీత రవేణచ పుష్పధూప ప్రసక్తాంచ గాంధర్వంతాం వినిర్దిశేత్
సుమంతురువాచ :
ఇత్యేవముక్త్వా సమహానుభావో జగామవేధానిజమందిరంపై
స్త్రీణాం తథా పుంస్తవతాం చ వీర! యల్లక్షణంపార్ధివలోకపూజ్యమ్
ఇతి శ్రీభవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణిచతుర్ధికలే. స్త్రీ లక్షణ వర్ణనం నామాష్టావింశోఽధ్యాయః
తా॥ నితంబములు, పాదములు, ముఖము వికారముగనుండినను, పై పెదవి పై రోమమలుండినను అట్టిన్రీ శీఘ్రముగనే భర్తను మ్రింగివేయును -31. నొసలు, కడుపు పిరుదుల ఈ మూడును వ్రేలాడుచున్నట్లుండిన యట్టి స్త్రీ, మతిదిని, మామను, భర్తను ఈ ముగ్గురిని మ్రింగివేయును-32. ప్రశంసనీయమైన చరిత్రగలది, గురువులయందు భక్తి గలది, పతివ్రత, దేవ బ్రాహ్మణులయందు భక్తి గలదియైన స్త్రీని ‘మానుషి'యని చెప్పవలెను-33. నిత్యము స్నానము చేయునది, పరిమళము గలది, ఎప్పుడును ప్రియముగ మాట్లాడునది, తక్కువగా భుజించునది, తక్కువ కోపముగలది యైన స్త్రీని 'దేవత' యని చెప్పవలెను. స్త్రీని 'మార్టారి' (పిల్లి)యని నిర్దేశింపవలెను-35. నవ్వుచుండునది, క్రీడించుచుండునది, అప్పుడే కోపించి, అప్పుడే ప్రసన్నురాలగునది, ఎప్పుడును నీచులతో రమించుచుండునది 'రాసభి' (గాడిద) అని చెప్పవలెను-36. భర్తకును, బంధువులకును ప్రతికూలకార్యములు చేయునది. స్వేచ్ఛగనున్నప్పుడు' అంగవిన్యాసరూప శృంగార చేష్టలుచేయునది యగు స్త్రీని 'ఆసురి'యని చెప్పనగును-37. ఎక్కువగ తినుట, అతిగ మాట్లాడుట, ఎప్పుడును అప్రియభాషణము చేయుట, తన భర్తను హింసించుచుండుట- ఈ లక్షణములుగల స్త్రీని రాక్షసి' యని చెప్పవలెను-38. శుచి, ఆచారము లేనిది, భయంకరము వికృతమునైన రూపముగలది, చెమట, మాలిన్యములతో కూడియుండు స్త్రీని 'పిశాచి'యని చెప్పవలెను-39. నిత్యస్నాతమై, సువాసనతోగూడిన మేను గలదియై, మద్యమాంసములను ఇష్టముతో సేవించునదై, చెట్లు, ఉద్యానవనములలో విహరించు నిష్టము గల స్త్రీని 'గాంధర్వి'గా నిర్దేశింపవలెను-40. చాపల్యము గలది, చంచలమైన స్వభావము గలది, ఎప్పుడును దిక్కులు చూచుచుండునది, తిరుగాడు గుణముగలది, పిసినారియునైన స్త్రీని 'వానరి' (కోతి) యని చెప్పవలెను-41. చంద్రబింబము వంటి ముఖము పొందికగానున్న అవయవములు, మదించిన ఏనుగు నడకవంటి నడక, ఎఱుపు వన్నెతో మెఱయు గోళ్లు, చేతులు, గలస్తీని పండితుడు 'విద్యాధరి'యని తెలిసికొనవలెను-42. వీణ మొదలగు సంగీత వాద్యధ్వనుల చేతను, వేణుగానము, పాటలు మొదలగువాని చేతను, పుష్పములు, సుగంధధూపద్రవ్యములతోను. ప్రసక్తిగల స్త్రీని 'గాంధర్వ'యని చెప్పవలెను-43. సుమంతుముని యిట్లనెను. ఈ విషయములను చెప్పి మహానుభావుడైన బ్రహ్మదేవుడు తన మందిరమునకు వెడలిపోయెను. ఈ స్త్రీ పురుష లక్షణ విశేషము రాజలోకమునకు పూజ్యమైనది.
శతార్ధ సాహస్ర్య సంహిత యగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పమునందు స్త్రీలక్షణ వర్ణనమను ఇరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 28 of the Bhavishya Mahā Purana is as follows:
A refined typology of women is given, classifying women into seven types — from the Mānuṣī (human woman of highest dharma) through intermediate categories to the Gāndharvī (celestial woman of exceptional beauty and artistic gifts). Each type is identified by a cluster of physical marks and character qualities. The chapter functions as a supplement to the opening strī sāmudrika of Chapter 5, providing a more synthetic classification system alongside the detailed enumeration of individual marks. The purpose of this classification is practical: it assists families in evaluating potential brides and grooms in ensuring that the woman entering their lineage carries marks that will enhance rather than diminish the family's dharmic standing and prosperity.