భవిష్య మహా పురాణము
26. చతుర్థి కల్పమునందలి పురుష లక్షణ వర్ణనము
మూ. బ్రహ్మోవాచ :
సమకుక్షిర్భవేద్భోగీ నిమ్నకుక్షిర్థనాపహః మాయావీ విషమా కుక్షిస్తథా కుహక కృత్సదా
రాజాస్యాన్నిమ్నకు క్షిస్తు సార్వభౌమోమహాబలః సర్పోదరాదరిద్రాః స్యుర్బహుభక్షాశ్చ సువ్రత!
విస్తీర్ణాభిర్మండలాభిరున్నతాభిశ్చ నాభిభిః భవంతి సుఖినో వీరా ధనధాన్య సమన్వితాః
నిమ్నభిరథ స్వల్పాభిః క్లేశభాజా భవంతిహి వలిర్మధ్యం గతావీర! విషమాచ విశేషతః ధనహానిం తథాశూలం నిత్యం జనయతే విభో
వామావర్తా సదాశాంతిం కరోతీతి విదుర్బుధాః కరోతి మేథాం దక్షిణేన సంప్రవృత్తా దివస్పతే!
పార్శ్వాయతా దీర్థమాయురైశ్వర్య మూర్థ్వతః స్మృతమ్ గవాడ్యతా మథ్యస్తాత్తు కరోతీతి విదుర్బధాః
శతపత్ర కర్ణికాభానాభిర్యస్య మహామతే భూపత్వం కురుతేసాతు పురుషస్యన సంశయః
సమోదరో భవేద్భోగీ నిస్వః స్యాద్విషమోదరః సూక్ష్మీదరో భవేద్వాగ్మీ బహుసంపత్సమన్వితః
శస్త్రేణాంతం ప్రజేద్వీర! స్త్రీ భోగం చాప్నుయాత్తథా ఆచార్యో బహుపుత్రశ్చ యథాసంఖ్యం వినిర్దిశేత్
వలి భిర్దేవ శార్దూల! ఇత్యాహ స పయోనిధి: ఆగమ్య గామినోజ్ఞేయా విషమాభిర్నసంశయః
తా॥ కడుపు సమముగా నున్నవాడు భోగియగును. లోతున్నవాడు ధనమునపహరించును. ఎగుడు దిగుడుగానున్నవాడు మాయావి, వంచకును అగును-1. నిమ్నకుక్షిగలవాడు మహాబలవంతుడైన రాజు లేక చక్రవర్తియగును. పాము కడుపుగలవారు దరిద్రులు, తిండిపోతులునగుదురు-2. విశాలమై, ఎత్తైన నాభిమండలములు గలవారు సుఖజీవులు, వీరులు ధనధాన్యములతో కూడిన వారగుదురు-3. లోతుగను అల్పముగను ఉండువారు కష్టములనుభవించువారు అగుదురు. ముఖ్యముగ కడుపు ముడుతల మధ్య భాగమునగల నాభి, విషమముగ నున్న నాభిగలవారు క్లేశమనుభవింతురు. అట్టివారికి ధనహానీ, వ్యాధి, మృత్యువు కలుగును-4. ఎడమవైపు తిరిగియుండు నాభి ఎప్పుడును శాంతి కలిగించునని బుధులు తెలిసికొందురు. కుడివైపునకు తిరిగియుండునది బుద్దీ శాలిత్వము నిచ్చును-5. ప్రక్కలకు నిడివి గలది దీర్ఘాయువును, పైభాగమునకు నిడు పైనది ఐశ్వర్యమునిచ్చును. క్రింది భాగమునకు పొడవుగనుండునది గోసంపదను కలిగించుననని బుధులు చెప్పుదురు-6. ఏ పురుషుని నాభి తామరబొదువలే నుండునో అది అతనికి రాచకమును కలిగించును. సందేహములేదు-7. కడుపు సమముగ నున్నవాడు భోగియగును. విషమముగనున్నవాడు స్వజనులు లేని వాడగును. ఉదరము సూక్ష్మముగ నున్నవాడు గొప్ప సంపదతో కూడిన వాగ్మియగును-8. లేక శస్త్రముచే హతుడగునని, స్త్రీ భోగముననుభవించునని, ఆచార్యుడగునని, బహుపుత్రులు కలపొడగునని విచారణననుసరించి చెప్పవలెను-9. వంకరైన ముడుతలతో నుండు నాభిగలవాడు “అగమ్యగామి' యగునని సముద్రుడు చెప్పెను.
మూ. ఋజుభిర్వసుభోగీ స్యాత్పరదారవినిందకః మాంసలైర్మృదుభిః పార్శ్వైరాజాస్యాన్నాత్రసంశయః
అనూర్ధ్వ చిబుకా యేతు సుభగా స్తే భవంతి నిర్ధనా విషమైర్దీర్ఘెర్భవన్తీహ సువీరజ!
పీనై శ్చోపచితైర్నిమ్నైః స్కంధైర్భీమాంగసంభవ! రాజానః సుఖినశ్చాపి భవంతీహ న సంశయః
సమోన్నతంచహృదయం సమంచ పృథుచైవహి అవేపనం మాంసలం చ పార్థివానాం న సంశయః
ఖరరోమ చితం వీర! శిరాలంద విశేషతః అధనానాం భవేదేవ హృదయం ఋభవోత్తమ! సమవక్షసోఽర్థయుతాః పీనైః శూరాఃస్మృతా బుదైః
తనుభిర్ద్రవ్యహీనాః స్యురసమైశ్చాష్యకించనాః వధ్యంతేచాపి శస్త్రేణ నాత్రకార్యా విచారణ
హనుభిర్విషమైర్వీర! జన్మహీనోభవేన్నరః యస్యోన్నతో భవేధనుః సభోగీస్యాన్నసంశయః
నిర్మాం సైర్విషమైర్వీర! నిఃస్వోనిమ్నై: ప్రచక్షతే ధనవాంశ్చ భవేతనైః సుఖభోగ సమన్వితః విషమైరర్థహీనః స్యాద్దు:ఖభాగీ సదానరః
చిపిటగ్రీవకో దుష్టామతో లోకే సవైగుహ! శూరః స్యాన్మహిషగ్రీవో మృగగ్రీవో భయాతురః
కంబుగ్రీవో భవేద్రాజా లంబకంఠోగ్ర లక్షణః హ్రస్వగ్రీవస్తు ధనవాన్సు సుఖీ భోగవాంస్తథా
తా॥ ముడుతలు ఋజువుగనుండెనేని భోగి, ఇతరుల భార్యలచే నిందింపబడువాడు లేక వారిని నిందించువాడగును. ప్రక్కలు మాంసముతో గూడి మృదువుగనున్నచో రాజగును. సంశయములేదు-11. గద్దువ, మీదికెత్తబడినట్లుగాని పొడవుగ గాని లేక సమముగనున్నవారు సౌభాగ్యవంతులగుదురు. వంకరగనో పొడవుగనో ఉన్నవారు నిర్దినులగుదురు-12, బలిష్ఠములైన ఎగుభుజములు గలవారు రాజులు, సుఖముగ జీవించువారు నగుదురనుటలో సందేహములేదు-13. హృదయస్థానము, సమముగను, సమానముగ ఎత్తుకలిగి, విశాలమై, వణుకు లేనిదై మాంసలమైయుండెనేని అట్టిది రాజులకు సంబంధించినదనుటలో సందేహము లేదు -14. కుమారా! గాడిద వెంట్రుకల వంటి దట్టమైన వెంట్రుకలుగలదై, ముఖ్యముగా నరములు కలిగినదైయున్న హృదయ ప్రదేశము బీదవారికి సంబంధించినదైయుండును. సమమైన వక్షముగల వారు ధనవంతులును, బలిష్టముగనున్నవారు శూరులు-15. బక్కగనున్నవారు ధనహీనులును, అసమముగనున్నవారు దరిద్రులును అగుదురు. అంతియేకాక అట్టివారు శస్త్రములతో వధింపబడుదురని, అందు సందేహములేదని బుధులు చెప్పుదురు-16. దవడలు ఎగుడు దిగుడుగ నుండెనేని సంతానము లేనివాడు, ఎత్తుగనుండినచో భోగి యగును-17. మాంసరహితముగ, వంకరగ, లోతుగను ఉన్నవాడు నిఃస్వయోగము గలవాడగును. బలిష్ఠములైయుండెనేని ధనికుడు, సుఖములనుభవించువాడుఅగును-18. చట్టపడియున్న మెడగల మనుష్యుడు దుష్టుడుగ భావింపబడుచున్నాడు. గేదేమేడ గలవాడు శూరుడు, జింకమెడగలవాడు పీజీకీవాడు-19. శంఖము వంటి మేడ గలవాడు రాజు, పొడవైన మెడ గలుగువాడు తీవ్రస్వభావము గలవాడు, పొట్టి మెడగలవాడు ధనికుడు, సుఖి, భగవంతుడు అగును.
మూ. నిర్మాంసౌ రోమశౌభగ్నావల్పౌవాపి విశేషత : నిర్ధన స్యేదృశావంసౌ ప్రఖ్యాతౌ వ్యోమకేశజ!
భవేదరోమశంపృష్టం ధనినాంభీమ సంభవ! సలోమశం తథావక్రం నిర్జనానాం బలాధిప!
అస్వేదనావున్నతెచ తథాపీనౌ షడానన సమరోమ సుగంధౌచ కక్షౌజ్ఞేయౌ ధనాన్వితా
అవ్యుచ్ఛిన్నౌ తథాశ్లిష్టౌ విపులౌ చ సురాధిప! శూరాణా మీదృశావంసౌ నగజానంద వర్ధన!
ఉద్వృద్ధ బాహుకో యస్తు వధబంధన మాప్నుయాత్ దీర్ఘ బాహుర్భవేద్రాజా సముద్ర వచనం యథా
ప్రలంబ బాహుర్విజ్ఞేయో నరః సర్వగుణాన్వితః హ్రస్వబాహుర్భవేద్దాసః పరప్రేష్యకరోఽపివా
వామావర్తభుజా యేతు ధీర్ఘాయత భుజాశ్చయే సంపూర్ణ భాహూ రాజాస్యాదిత్యాహ సపయోనిధి:
గ్రీవాచ వర్తులాకారా కంబురేఖా సమావృతా సభవేత్పార్ధివో భూమౌ సర్వదుష్టనిబర్హణః
దీర్ఘగ్రీవా బహుగ్రీవా శుకగ్రీవశ్చయేనరా: ఉష్టగ్రీవాః కరిగ్రీవాః సర్వేతే నిర్ధనాః స్మృతాః
ఇభాంగ సదృశౌ వృత్తౌ సమౌపీనౌచ సువ్రత! ఆజానులంబినౌ బాహూ పార్థివానాం నసంశయః
తా॥ మూఁపులు (భుజశిరస్సులు) రోమములతో, భగ్నమైనట్లుండి, చిన్నవిగానున్నయెడల నిర్ధనుడగుననుట ప్రసిద్దము-21. ధనికులకు వీపున రోమములుండవు. దరిద్రులకుండును-22. చంకలు చెమట పట్టనివియై బలిష్ఠములై, సమమైన రోమములుగలిగి, సువాసనతోకూడి యుండెనేని ధనవంతుడగును-23. చీలియున్నట్లుగాక శరీరముతో సమముగ కలిసియున్నట్లుండి, విపులముగనున్న భుజములు శూరులకుండును-24. పైకి మిక్కుటముగఁబెరిగిన బాహువులున్నవాడు వధ, బంధనములను పొందును. పొడవైన బాహువులవాడు సముద్రుని వాక్యముననుసరించి రాజగును-25. దీర్ఘ బాహువు సర్వసుగుణాన్వితుడై యుండును. పొట్టిగనున్న బాహువులపాడు దాసుడగును. లేక ఇతరులు చెప్పిన పనిచేయు సేవకుడగును-26. అందముగ వడి దిరిగియున్నవి, పొడవై విశాలములైన భుజములు గల సంపూర్ణబాహుడు రాజగునని సముద్రుడు చెప్పెను-27. శంఖము పైవలె రేఖలు గలిగిన గుండ్రని మెడగలవాడు, దుష్టశత్రువులను దునుమాడు రాజుగ ఈ భూమిని పాలించును-28. పొడవుమెడ, కొంగమెడ, చిలుక మెడ, ఒంటిమెడ, ఏనుగుమెడ గలవారందుజును ధనహీనులగుదురని చెప్పబడినది-29. ఏనుగు తొండములవలె గుండ్రనై, సమానములై, బలిష్టములై, మోకాళ్ళ వఱకు వ్రేలాడు బాహువులు రాజులకుండుననుటలో సందియములేదు.
మూ. దరిద్రాణాం లోమశౌహ్రస్వా బాహూజ్ఞేయో సురోత్తమ తస్కరాణాంచ విషమౌ స్థూలౌ సూక్ష్మౌచ సువ్రత!
నిమ్నం కరతలం యస్య పితృవిత్తంన తస్యపై భవేదార్భవ శార్దూల! తధాభీరుశ్చమానవః
సువృత్త తనునిమ్నేన ధనవాస్కరతలేనతు ఉత్తాన కరతలో దాతా భవతీతి న సంశయః
విషమాభవంతి విషమైర్నిమ్నాశ్చాపి విశేషతః కరతలైర్దేవ శార్దూల! లాక్షాభైరీశ్వరా స్మృతాః
అగమ్య గమనం పీతై రూక్షైర్నిర్థనతా స్మృతా అపేయపానం కుర్వంతి నీలకృష్ణైః సదైవహి
నిమ్నః స్నిగ్ధా భవేన్నౄణాం రేఖాకరతలేగుహ! ధనినాం న దరిద్రాణమిత్యాహస పయోనిధి:
విరలాంగులయో యేతు తే దరిద్రాః ప్రచక్షతే ధనినస్తు మహాబాహో! యే ఘనాంగులయోనరాః
వదనం మండలం యస్య ధర్మశీలం తమాదిశేత్ శుండ వక్త్రానరా యేతు దుర్భగాస్తేనసంశయః
హరివక్త్రా జిహ్మవక్త్రా వికృతాస్యాస్తథానరాః భగ్నవక్త్రా: కరాలాస్యాః సర్వేతే తస్కరాః స్మృతాః
సంపూర్ణ వక్త్రా రాజానో గజసింహాన నాస్తథా ఛగవానర వక్త్రాశ్చ ధనినః పరికీర్తితాః
తా॥ దరిద్రులకు రోమములతో కూడిన, పొట్టి వియైన భుజములుండును. దొంగలకు విషమములైన బాహువులు, స్థూలములుగనో సూక్ష్మములుగనో ఉండును-31. అజచేయి లోతుగా నున్నవారికి పైతృకమైన సంపద లభింపదు. అట్టి మనుష్యుడు పిటీకి వాడుగ కూడా అగును-32. గండ్రముగను, పలుచగను, లోతుగను కరతలముండెనేని ధనవంతుడగును. లోతులేని . అరచేయిగలవాడు దాతయగుటలో సంశయములేదు -33. సమముగానుండని లోతైన కరతలములుగలవారు వికట స్వభావులైయుందురు. లక్కవలె ఎఱ్ఱగా ప్రకాశించుచుండెనేని అట్టివారు రాజులని చెప్పదగును-34. కరతలములు పసుపువన్నెలో నున్న అగమ్యగాములు, కజుకుగనున్న నిర్దినులగుదురు. నీలవర్ణమున లేక నలుపుగనుండెనేని అపేయపానము గల వారగుదురు-35. అఱచేతిలోని రేఖలు లోతుగను, నునుపుగను ఉన్నవారు రాజులగుదురు. ఇట్టి రేఖలు ధనికులకేగానీ దరిద్రులకుండవని సముద్రుడు చెప్పెను-36. వంకరవ్రేళ్ళు గలవారు దరిద్రులని చెప్పుదురు. ఘనమైన వేళ్లవారు ధనికులు-37. గుండ్రని ముఖము గల వానిని ధర్మశీలుడని చెప్పవలెను. ఏనుగు తొండమువంటి ముఖములు గలవారు దౌర్బాగ్యులగుటలో సందేహములేదు-38. కోఁతి ముఖములు, వంకముఖములు, వికారమైన ముఖములు, పగిలినట్లున్న ముఖములు, వెఱపు గలిగించు ముఖములు గలవారు దొంగలని చెప్పఁబడుదురు-39. నిండైన ముఖము గలవారు, సింహము, ఏనుగు ముఖములవంటి ముఖములుగలవారు రాజులగుదురు. మేక, కోతి, ముఖములుగలవారు ధనికులని చెప్పబడుదురు.
మూ. యస్యగండౌ సుసంపూర్ణౌ పద్మపత్ర సమప్రభౌ కృషి భాగీ భవేన్నిత్యం బహు విత్తశ్చమానవః
సింహవ్యాఘ్ర గజేంద్రాణాం కపోలః సదృశోయది మహా భోగీ స విజ్ఞేయః సేనాయాశ్చైవ నాయకః
వదనం తు సమం శ్లక్ష్ణం సౌమ్యం సంవృతమేవహి పార్థివానాం మహాబాహో విపరీతం తు దఃఖదమ్
మహా ముఖంతు దేవేశ! దుర్భగత్వం ప్రయచ్ఛతి స్త్రీ ముఖం పుత్ర నాశాయ మండలం సుఖితాంవ్రజేత్
ద్రవ్య నాశాయ వై దీర్ఘం పాపదం భయదం తథా ధూర్తానాం చతురస్రం స్యాత్పుత్రహాని కరం శృణు
నీమ్నవక్త్రం చ దేవేంద్ర! పుత్రహానికరం భవేత్ హ్రస్వం భవతి కీనాశో పూర్ణకాంతంచ భోగినామ్
రక్తాధరో నరపతిర్ధన వాన్కమలాధరః స్థూలోష్ఠా హనుమూలాశ్చ శుష్కైస్తీక్ష్ణైశ్చదుఃఖితాః
అస్ఫోటితాగ్రం స్నిగ్ధంచ నతం మృదుతథా గుహ! సంపూర్ణం చ సదా శస్తం శ్మశ్రు భూమి పతేర్గుహ!
రక్తైశ్చాల్పైస్తథా రూక్షైః శ్మశ్రుభిర్భీమ నందన! నరశ్చోరా భవంత్యేవ పరదార రతాస్తథా
నిర్మాంసౌ యస్యవై కర్ణౌ సంగ్రామాన్నాశ మృచ్ఛతి చిపిటాభ్యాం భవేద్భోగీ హ్రస్వౌచ కృపణస్యచ
తా॥ చెక్కిళ్లు తామర రేకుల వలె మెఱయుచు నిండుగ నున్నవాడు శ్రమజీవి, గొప్ప ధనవంతును అగును.-41. సింహము, పులి, ఏనుగు చెక్కిళుల వంటి చెక్కిళులుండె నేని గొప్ప భోగి, సేనానాయకుడగునని తెలియవలెను-42. ముఖము సమముగను, పలుచగను (ప్రియముగను) సౌమ్యముగను, కుదురుగను ఉన్నచో రాజులగుదురు. ఇందుకు విరుద్ధముగ నున్న ముఖము దుః ఖదాయకము-43. మిక్కిలి పెద్దగ నున్న ముఖము దౌర్భాగ్యమునే కలిగించును. ఆడదాని ముఖము వంటి ముఖము పుత్రనాశకము, గుండ్రముగ నుండిన సుఖిత్వము కలుగును-44. పొడవైన ముఖము ద్రవ్యనాశమొనర్చుటయే గాక పాపములు చేయించును. భయములిగించును. చుతుష్కోణాకృతిగ నున్న వదనము ధూర్తత్వమును, పుత్రనాశకత్వమును కలిగించును-45. లోతుగ నున్న ముఖము కూడ పుత్రులకు హానికరమగును. పొట్టి మొగము క్షుద్రత్వమును కలిగించును. నిండుమొగము భోగులకుండును-46. పెదవులు ఎఱుపు వన్నెలో నున్నవాడు రాజగును. తామరపువ్వు వన్నెలో నున్నవాడు ధనవంతుడగును. దౌడల మూలములవఱకు వ్యాపించియున్న స్టూలమైన పెదవులు, ఎండిపోయినట్లు, తీక్షముగను ఉన్నయెడల దుఃఖితులగుదురు-47. కొనలు పగిలినట్లుగాక నునుపుగను, మెత్తగను వంగియుండిన నిండు మాసములు పురుషులకు ప్రశస్తమైనవి. అట్టివారు రాజులగుదురు-48. ఎఱుపు వన్నెలోను, పలుచగను, కణుకుగను ఉన్న మాసములు గలవారు దొంగలు, వ్యభిచారులును అయ్యేదరు-49. మాంసము లేని చెవులు గలవారు యుద్దము వలన నశింతురు. అణగిన చెవులపోరు భోగులు, పొట్టి చెవులవారు దీనులును అగుదురు.
శంకు కర్ణశ్చ భూనాథః సర్వశత్రుభయంకరః దీర్ఘాయూ రోమశాభ్యాంతు విపులాభ్యాం నరాధిపః భోగీ చస భవేన్నిత్యం దేవ బ్రాహ్మణ పూజకః
శిరావ బద్ధౌ క్రూరస్య వ్యాలంబౌచ విశేషతః మాంసలౌ సుఖ దౌజ్ఞేయౌ శ్రవణౌవ్యోమ కేశజ!
భోగిస్యాన్నిమ్న గండోవై మంత్రీ సంపూర్ణ గండకః శుభ భాక్ఛుక నాసస్తు చిరజీవీ శుష్క నాసికః
కుంద కుట్మల సంకాశైః ప్రకాశైఠశనైరృపః ఋక్ష వానర దంతాశ్చ నిత్యం క్షుత్పరిపీడితాః
హస్తీదంతా ఖరదంతాః స్నిగ్ధదంతా గుణాన్వితాః కరాలైర్విరలై రూక్షైర్దశనైరుఃఖ జీవినః
ద్వాత్రింశద్దంతా రాజాన ఏకత్రింశశ్చ భోగవాన్ త్రింశద్దంతా నరానిత్యం సుఖదు:ఖిత్వ భాగినః ఊన త్రింశచ్చ దశనైః పురుషాదుఃఖభాగినః
కృష్ణ జిహ్వాభవేత్ర్పేష్య: సబలయాలుజిహ్వయా భవేత్కోపస్య కర్తాపై స్థూలరూక్షశ్చ జిహ్వయా
శ్వేత జిహ్వానరాజ్ఞేయాః శౌచాచార సమన్వితాః పద్మపత్ర సమాజిహ్వా సూక్ష్మాదీర్ఘా సుశోభనా స్థూలాచనచ విస్తీర్ణా యేషాంతే మనుజాధిపాః
నిమ్నాస్నిగ్ధాచ హ్రస్వాచరక్తాగ్రా రసనా యది సర్వవిద్యా ప్రవక్తారస్తే భవంతి న సంశయః
కృష్ణతాలుర్నరోయస్తు సభవేత్కుల నాశనః సుఖభాగీ దుఃఖ భాగీ పీత తాలుర్నధిపః
తా॥ శంకువు (బల్లెపు) ఆకారముగనున్న చెవులు గలవాడు, శత్రువులకు భయమును కలిగించు రాజగును. చెవులు విశాలములై రోమములు గలిగియుండెనేని దీర్ఘాయుష్మంతుడగును. బోగి, దేవ బ్రాహ్మణ పూజకుడును నగును-51. నరములుగలిగి విడివడినట్లు, ముఖ్యముగా వ్రేలాడుతున్నట్లు చెవులుండెనేని క్రూరుడగును. మాంసముతో కూడి యున్నచో సుఖదములగును-52. లోతు చెక్కిళ్లవాడు భోగియగును. నిండైన చెక్కిళ్లుండెనేని మంత్రి యగును. చిలుక ముక్కుగలవాడు శుభములు పొందును. ఎండిపోయిన ముక్కగలవాడు దీర్ఘకాలము బ్రతుకును-53. అరవిరిసిన మొల్ల మొగ్గల వలే మెఱయు పలువరస గలవాడు రాజగును. ఎలుగుబంటి, కోతి దంతముల వంటి దంతములు గలవారు నిత్యమును ఆకలితో బాధపడుచుందురు-54. ఏనుగు, గాడిద దంతములు, నును పైన పండ్లుగలవారు గుణవంతులు. పొడవై వేఱుపుబుట్టించునవి, వంకరటింకరగనున్నవి, కఱుకుగనుండునవి అయిన దంతములు గలవారు దుఃఖమునననుభవింతురు-55. ముప్పది రెండు పండ్లు గలవారు రాజులు, ముప్పది యెకటి గలవారు, భోగులు, ముప్పది గలవారు సుఖదుఃఖములను రెంటిని మిశ్రమముగననుభవించువారు, ముప్పదికి తక్కువగానున్న పురుషులు దుఃఖమునే అనుభవించువారగుచున్నారు-56. బలమైన నల్లని నాలుకగలవాడు సేవకుడు, మందముగను, కఱుకుగను ఉన్న లుక గలవాడు కోపగొండీయగును-57.' తెల్లని నాలుక గలవారు పరిశుద్ధత, ఆచారముగల వారగుదురు. తామరరేకువలే సూక్ష్మమై పొడవై, అందముగను, స్థూలముగాక, అంత విశాలమునుగాక యుండునాలుక గలవారు రాజులగుదురు-58. లోతుగను, నునుపుగను, పొట్టిగను, ఎఱుపుగను నాలుక యున్నవారు సకలవిద్యలను బోధించువారగుదురనుటలో సంశయము లేదు-59. నల్లని దౌడలు గలవాడు కులనాశకుడగును. పసుపు వన్నె దౌడలు గలవాడు సుఖ దుఃఖములు రెండును అనుభవించు రాజగును.
మూ. వికృతం స్ఫుటితం రూక్షం తాలుకం నప్రశస్యతే సింహతాలుర్నరపతిర్గజ తాలుస్తథైవచ పద్మతాలుర్భవేద్రాజా శ్వేత తాలుర్ధనేశ్వరః
హంస స్వరా నరా ధన్యా మేఘ గంభీర నిః స్వనాః క్రౌంచ స్వనాశ్చ రాజానో భోగవంతో మహాధనాః
చక్రవాక స్వనాధన్యా రాజానోధర్మవత్సలాః కుంభస్వనో నరపతిర్దుందుభి స్వన ఏవచ రూక్ష దీర్ఘస్వరాః క్రూరాః పశూనాం సదృశం నతు
గుర్గుర స్వర సంయుక్తాః పురుషాఃక్లేశభాగినః చాప స్వనా భాగ్యముతో భిన్న కాంస్య స్వరాశ్చయే క్షీణ భిన్న స్వరా యేసు రధమాస్తేప్రకీర్తితాః
పార్ధివాస్తను నాసాశ్చదీర్ఘనాసాశ్చభోగినః హ్రస్వనాసా నరాయేతు ధర్మశీలాస్తు తేమతా:
హస్త్యశ్వ సింహనాసాశ్చ సూచీనా సాశ్చయేనరాః తేషాం సిద్ధ్యతి వాణిజ్యం హయానాంచైవ విక్రయః
వికృతా నాసికా యస్య స్థూలగ్రా రూప వర్జితా పాప కర్మాస విష్ణోయః సాముద్ర వచనం యథా
దాడిమీ పుష్పసంకాశ భవేతాం యస్యలోచనే భూపతిః సతు విజ్ఞేయః సప్తద్వీపాధిపో గుహ!
వ్యాఘ్రక్షాః కోపనా జ్ఞేయాః కర్కటాక్షాః కలిప్రియాః బిడాలహంసనేత్రాశ్చ భవంతి పురుషాధమా:
మయూర నకులాక్షాశ్చ నరాస్తే మధ్యమాః స్మృతాః న శ్రీస్త్యజతి సర్వజ్ఞ! పురుషం మధుపింగలమ్
తా॥ వికారముగ, కఱకుగ, పగిలినట్లున్న దౌడలు శ్రేష్ఠములు కావు. సింహము ఏనుగు దౌడల వంటి దౌడలు గలిగిన వాడు రాజగును. తామర పువ్వువంటి దౌడలు గలవాడు రాజు, తెల్లని దౌడలు గలవాడు ధనికుడును అగును-61. హంసనాదము వంటి కంఠస్వరము గల పురుషులు ధన్యులు. మేఘ గంభీర ధ్వని గలవారును ధన్యులే. క్రౌంచపక్షి ధ్వని గలవారు రాజులు, భోగులు, గొప్పధనవంతులును అగుదురు-62. జక్కవ పక్షి స్వరము గలవారు రాజులు, ధర్మమును పోషించు ధన్యులగుదురు. దుందుభిధ్వని, కుంభధ్వని యుండువాడు రాజగును. కర్కశధ్వని, దీర్ఘస్వరము గలవారు క్రూరులు లేక పశుతుల్యులు అగుదురు-63. గురుర ధ్వని గలవారు క్లేశముననుభవింతురు. ధనుష్టంకారము వంటి కంఠస్వరము, కంచుమ్రోతవంటి కంఠధ్వని గలవారు భాగ్యవంతులయ్యెదరు. క్షీణధ్వని, పగిలిన స్వరము గలవారధములుగా చెప్పబడిరి-64. సన్నని ముక్కుగలవారు రాజులు, పొడవైన ముక్కుగలవారు భోగులగుదురు. పొట్టిముక్కు వారు ధర్మశీలురుగా తలఁపబడుదురు-65. ఏనుగు, గుఱ్ఱము, సింహము ముక్కులవంటి ముక్కులు గలవారు మొనదేలిన ముక్కుగలవారు వర్తకమున విజయమునందుదురు. గుఱ్ఱముల అమ్మకము లాభించును-66. స్థూలమైన కొన గలిగి చూచుటకు వికారముగనున్న ముక్కుగలవారు సముద్రుని వాక్యముననుసరించి పాపకర్ములని తెలియవలెను-67. దానిమ్మ పువ్వుల వంటి కన్నులుగలవాడు సప్తద్వీపములను పాలించురాజగును-68. పులికన్నులు గలవారు కోపస్వభావము గలవారు. ఎండ్రికన్నులు గలవారు కలహప్రియులగుదురు. పిల్లి హంస కన్నులవంటి కన్నులు గలవారు పురుషులలో అధములుగా తెలియవలెను-69. నెమలి ముంగిస కన్నులు గలవారు మధ్యములని చెప్పబడుదురు. తేనే వలె పింగళ వర్ణముగల కన్నులు గలవారిని సంపద ఎప్పుడును వదలి పెట్టక యుండును.
మూ. అపింగలాక్షా రాజానః సర్వభోగ సమన్వితాః రోచనా హరితాలాక్షా గుంజపింగా ధనేశ్వరా! బలసత్త్వ గుణో పేతాః పృథివీ చక్రవర్తన :
ద్విమాత్రా వీక్షణా నిత్యం జీవంతి పరమాశ్రితాః త్రిమాత్రా స్యందినోజ్ఞేయాః పురుషాః సుఖభాగినః
చతుర్మాత్రా నిమేషాశ్చనయనై రీశ్వరాః స్మృతాః దీర్ఘాయుషో ధర్మరతాః పంచమాత్రానిమేషణ:
హ్రస్వకర్ణామహాభాగా మహా కర్ణాశ్చయేనరాః ఆవర్త కర్ణాధనినః స్నిగ్ధకర్ణాస్తథైవచ
దీర్ఘాయుషః శుక్తి కర్ణాః శంఖ కర్ణా మహాధనా : దీర్ఘాయుషో దీర్ఘకర్ణ లంబకర్ణాస్తపస్వినః
లలాటేనార్ధ చంద్రేణ భవంతి పృధివీశ్వరాః విపులేనలలాటేన మహాధనపతిః స్మృతః స్వల్పేనతు లలాటేన నరోధర్మరతః స్మృతః
రేఖాః పంచలలాటేతు స్త్రీయావా పురుషస్యవా శతం జీవతి వర్షాణా మైశ్వర్యం చాధిగచ్ఛతి
చతూరేఖామశీతింతు త్రిభిః సప్తతిమేవచ ద్వాభ్యాం షష్టింతు రేఖాభ్యాం చత్వారింశత్తథైకయా అరేఖేన లలాటేన విజ్ఞేయా పంచవింశతిః
రేఖాచ్ఛేదైస్తు విజ్ఞేయా హీన మధ్యోత్తమా నరా: అల్పాయుషస్తథా లాభిర్వ్యాధిభిః పరిపీడితాః
త్రిశూలం పట్టిశం వాపి లలాటే యస్యదృశ్యతే ఈశ్వరం తం విజానీయాద్ఫోగినం కీర్తిమాశ్రితమ్
తా॥ పింగళ వర్ణము కాని కన్నులుగలవారు సర్వభోగములతో గూడిన రాచకముననుభవింతురు. గోరోచనవర్ణమున, హరిదళము వన్నెలోను, గురిజగింజ ఎఱుపునను కనులున్నవారు ధనవంతులగుదురు. అంతియేకాక వీరు బలసత్త్వ గుణములతో గూడిన చక్రవర్తులగుదురు-71. రెండు మాత్రల కాలమునకొకసారి కనుతెప్పవేయువారు శ్రేష్ఠులను (ఈశ్వరుని ఆశ్రయించి జీవింతురు. మూడు మాత్రల జెప్పపాటు గల పురుషులు సుఖజీవనులగుదురు-72. నాలుమాత్రలకొక పర్యాయము జెప్పవేయువారు ప్రభువులయ్యెదరు. ఐదు మాత్రల నిమేషముగలవారు దీర్ఘాయుష్మంతులై ధర్మరతులైయుందురు-73. పొట్టి చెవులవారు విశాలమైన చెవులు గలవారు భాగ్యవంతులు, సుడిదిరిగిన చెవులవారు ధనికులు, నును పైన చెవులు గలవారు కూడ ధనికులేయగుదురు-74. ముత్తెపుచిప్ప, శంఖమువంటి చెవులు గలవారు దీర్ఘాయుష్మంతులు, ధనికులు అగుదురు. పొడవు చెవులవారు చిరంజీవులు, వ్రేలాడు చెవులు గలవారు తపస్వులగుదురు-75. అర్ధచంద్రాకృతిగ నున్న నొసలు గలవారు రాజులగుదురు. విశాలమైన నుదురుచే ధనపతులగుదురు. లలాటము స్వల్పమైయున్నచో నట్టిమనుజుడు ధర్మమునందాసక్తిగలవాడగును-76. స్త్రీ పురుషులలో నెవరికైనను నుదుటి పై ఐదు రేఖలుండినచో నట్టివారు ఐశ్వర్యమును పొంది నూఱు సంవత్సరములు జీవింతురు-77. నాలుగు రేఖలున్న ఎనుబదియేండ్లు, మూడురేఖలుండిన డెబ్బదియేండ్లు, రెండు రేఖలున్న అణువదీవత్సరములు, ఒకే రేఖయున్న నలుబది. సంవత్సరములు, లలాటము పై రేఖలే లేనిచో నిరువదియైదు సంవత్సరములు జీవింతురు-78. రేఖాచ్ఛేదముల చేత మనుష్యులలో ఉత్తమ, మధ్యమాధములను, అల్పాయుష్కులను, వ్యాధిపీడితులను తెలియవలెను-79. త్రిశూలచిహ్నముగాని, అడ్డకత్తి గుర్తుగాని కనబడినచో నట్టివాడు ప్రభువు, భోగి, కీర్తిమంతుడని యెఱుంగవలెను.
మూ. ఉత్క్రాంత నిమ్నంతు శిరః స్వల్పోప హతమేవచ చంద్రాకారం నరేంద్రాణాం గవాడ్యం మంగలం స్మృతమ్
విషమంతు దరిద్రాణాం శిరోదీర్ఘంతు దుఃఖినామ్ సాగ కుంభనిభం రాజ్ఞః సమంసర్వత్ర భోగినః
కపిలైః స్ఫుటితై రూక్షైః స్థూలైశ్చ శిఖరేశయై: దుంఖితాఃపురుషాజ్ఞేయా రోమశ్మశ్రుభిరేవచ
రూక్షా వివర్ణానిస్తేజాః ఖరాః స్థూలాశ్చమూర్ధజాః నాతిస్తోకా న బహుశ మూర్ధజా దుఃఖభాగినః
విరలాశ్చ మృదు. స్నిగ్ధా భ్రమరాంజన స ప్రభాః కచాయస్యతు దృశ్యంతే సభవేతృథివీ పతిః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్యాం సంహితాయం బ్రాహ్మే పర్వణి చతుర్థి కల్పే పురుషలక్షణ వర్ణనం నామ షడ్వింశోఽధ్యాయః
తా॥ పైకి పోవుచున్నట్లు పొడవుగను, లోతుగను ఉన్న తలగలవాడు తక్కువ ఉపద్రవములు కలవాడును, గుండ్రమైన తలగలవాడు రాజు, గోవులతో నొప్పువాడు అగును. అట్టి శిరస్సు శుభప్రదమైనది-81. దరిద్రులకు విషమమైన తల, దు: ఖభాగులకు పొడవైన తల యుండును. రాజులకు సర్ప, గజ శిరస్సులు, భోగులకు కుదురైన తలలుండును-82. తల వెంట్రుకలు, రోమములు, మీసములు, గోరోజనము వర్ణములోను, పగిలినట్లుగను, కఱుకుగను, లావుగను ఉండెనేని అట్టి పురుషులు దుః ఖితులని తెలియవలెను-83. కఱుకుగ, పేలవమైన వన్నెతో, నిస్తేజముగ, వాడిగను, మందముగను, అత్యల్పము అతి బహుళమునుగాక వెంట్రుకలున్నవారు దుఃఖభాగులగుదురు-84. వంకలు తిరిగి, మెత్తగను, నునుపుగను, తుమ్మెదలవలె, కాటుకలవలె ప్రకాశించు వెంట్రుకలు గలవాడు రాజగును.
శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మ పర్వమున, చతుర్ధి కల్పమునందలి పురుషలక్షణవర్ణనమను నిరువదియాఱవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 26 of the Bhavishya Mahā Purana is as follows:
The sāmudrika teaching reaches the upper body: the shape and marks of the navel, the configuration of the abdomen, the width and curvature of the neck, the set of the shoulders, the shape of the skull, and the quality of the hair. Certain skull-shapes indicate spiritual attainment; certain hair-textures indicate royal fortune; a particularly symmetric navel indicates extreme prosperity and many children. The chapter also discusses the marks of the face — the eyes, nose, lips, and ears — each with its own system of auspicious and inauspicious configurations. This three-chapter sāmudrika section (Chs. 24–26) constitutes a comprehensive male counterpart to the female sāmudrika given in Chapter 5, forming together a complete sacred science of reading the human form.