25. చతుర్థీ కల్పమునందు పురుష లక్షణ వర్ణనము

మూ. బ్రహ్మోవాచ :

దక్షిణావర్తలింగశ్చ నరోవై పుత్రయాన్ భవేత్ వామావర్తే తథాలింగే నరః కన్యాం ప్రసూయతే

స్థూలైః శిరాలైర్విషమైర్లింగైర్దారిద్ర్యమాదిశేత్ ఋజుభిర్వుర్తులాకారై పురుషాః పుత్రభాగినః

నిమ్నపాదోప విష్టస్య భూమింస్పృశతిమేహనః దుఃఖితంతం విజానీయాత్పురుషం నాత్రసంశయః

భూమౌపాదోపవిష్టస్య గుల్ఫౌ స్పృశతి మేహనః ఈశ్వరం తంవైజానీయా త్ర్పమదానాంచవల్లభమ్

సింహవ్యాఘ్ర సమోయస్య హ్రస్వోభవతిమేహనః భోగవాన్సతు విజ్ఞయోఽశేష భోగ సమన్వితః

రేఖాకృతిర్మణిర్యస్య మేహనేహి విరాజతే పార్థివః సతు విజ్ఞేయః సముద్రవచనం యథా

సువర్ణ రజత ప్రఖ్యైర్మణి ముక్తా సమప్రభైః ప్రవాల సదృశ్తెః స్నిగ్ధైర్మణిభిః పార్థివోభవేత్

పాండురైర్మలినై రూక్షైర్దీర్ఘ  వ్యాసైర్దిశోవ్రజేత్ సమైస్తథోన్నతైశ్చాపి సుస్నిగ్ధైర్మణి భిర్గృహీ

ధన రక్షాస్తధా స్త్రీణాం భోక్తారస్తే భవంతిహి మణిభిర్మధ్యనిమ్మైస్తు పితరస్తే

భవంతి హి

యువతీనాం మహాబాహో! నిఃస్వాశ్చాపి భవంతితే నోల్బణైశ్చాపి ధనినో నరావీర! భవంతిహి

తా॥ బ్రహ్మ ఇట్లనెను.

“కుడివైపునకు తిరిగియున్న లింగముగల మనుష్యుడు పుత్రవంతుడగును. ఎడమవైపునకు తిరిగియున్నవాడు స్త్రీ సంతానమును పొందును-1. స్థూలముగ, నరములతో కూడి, అసమముగానున్న లింగములు గలవారికి దారిద్ర్యము కలుగునని చెప్పవలెను. చక్కగను, గుండ్రముగను, మగ గుఱులున్న పురుషులు పుత్రవంతులగుదురు-2. కాళ్లునేల పై నుంచి కూర్చున్నవాని 'యంగము' నేలను తాకుచున్నచో అట్టిపురుషుడు దుఃఖితుడగునని తెలిసికొనవలెను. సంశయములేదు-3. నేల పై పాదములుంచి కూర్చున్న వాని ‘అంగము' చీలమండలను తాకినచో అట్టివాడు రాజని యెఱుంగవలేను. స్త్రీలకు ప్రేమపాత్రుడని తెలియవలెను-4. సింహము పులి మొదలగువాని అంగములవలె కుచయైన అంగము గలవాడు భోగియగును. అశేష భోగములనుభవింపగలడని తెలియవలెను-5. అంగము చివరి భాగము (మణి) రేఖాకృతిగా నున్నవాడు, సముద్రుని వాక్యముననుసరించి, రాజని యెఱుంగవలెను-6. 'మణులు', బంగారముతో, వెండితో సమానవర్ణముగలవియైయున్నను, మణులు, ముత్యములు మొదలైనవానితో సమానమైన కాంతి గల్గియుండినను పగడములవలె మెఱయుచున్నను, మిక్కిలి నునుపుగనున్నను అట్టివాడు రాజగును-7. తెల్లని వర్ణముతో పేలవముగను కఱకుగను, పొడవైన చుట్టుకొలత కలిగియున్నను అట్టివాడు దేశద్రిమ్మరి లేక ప్రవాసి యగును. సమముగను, ఉబ్బెత్తుగను, నునుపుగను ఉన్నచోడు గృహస్థగును-8. అట్టివారు ధనమును కూడబెట్టువారు, స్త్రీలననుభవించువారును అగుదురు. మధ్య భాగమున నొక్కబడినట్లుండెనేని సంతానవంతులయ్యేదరు-9. అయినను వారు యువతులకు పట్టని వారయ్యేదరు. పొంగినట్లు అతిశయముగలేని ‘మణులు' గలవారు ధనవంతులగుదురు-10.

మూ. మూత్రాధారా పతేదేకా వలితా దక్షిణాయది స భవేత్పార్థివః పృథ్యాః సముద్రవచనం యథా

ద్వేధారే చ తథా స్నిగ్ధే ధనవాన్భోగ వాన్స్కృతః బహుధారాస్తధా రూక్షాః సశబ్దాః పురుషాధమాః

మిన గంధీ భవేద్రేతో ధనవాన్పుత్రవాన్భవేత్ హవిర్గంధి భవేద్యస్య ధనాఢ్యః శ్రోత్రియస్మృతః

మూష గంధిర్భవేత్పుత్రీ పద్మగంధిర్నృపః స్మృతః లాక్షా గంధిర్భవే ద్యశ్చ బహుకన్యః ప్రజాయతే మద్య గంధిర్భవేద్యోద్ధా క్షారగంధిర్దరిద్రకః

శీఘ్ర మైధునగామియః సదీర్ఘాయురతోన్యథా అల్పాయుర్దేవ శార్డుల! విజ్ఞేయోనాత్రసంశయః

తను శుక్రః స్త్రీజనకో మాంస గంథీచభోగవాన్ పద్మవర్ణం భవేద్రక్తం స నరో ధనవాన్భవేత్

కించిద్రక్తం తధాకృష్ణం భవేద్యస్యతుశోణితమ్ అధమఃసతు విజ్ఞేయః సదాదుఃఖైక భాజనమ్

ప్రవాల సదృశం స్నిగ్ధం భవేద్యస్యచశోణితమ్ రాజానం తం విజానీయా త్సప్తద్వీపాధిపం గుహ!

విస్తీర్ణామాంసలాస్నిగ్ధ బస్తిః పుంసాం ప్రశస్యతే నిర్మాంసా వికటా రూక్షా బస్తీర్యేషాంనతేశుభాః

గోమాయు సదృశీ యస్య శ్వానోష్ట్రమహిషస్యచ సభవేద్దుఃఖితో నిత్యం పురుషోనాత్ర సంశయః

తా॥ మూత్రాధార కడివైపుకు చుట్టుకొని ఒకే ధారగా పడినచో, సముద్రుని వాక్యముననుసరించి, అట్టివాడు భూపాలకుడగును-11. అట్లు స్నిగ్ధమైన రెండు ధారలు పడినచోనట్టివాడు ధనవంతుడు, భోగియగును. శబ్దముతో కూడి అనేకధారలు రూక్షముగ పడినచోనట్టివారు అధమజాతి పురుషులు-12. రేతస్సు చేప వాసన కలిగియున్నచో  ధనవంతుడు, పుత్రవంతుడును అగును. హవిస్సుపోసన గల రేతస్సు గలవాడు ధనాఢ్యుడు, శ్రోత్రియుడును అగును-13. ఎలుక వాసన కలిగినచో స్త్రీ సంతానము కలుగును. తామరపువ్వు సుగంధము కలిగినచో రాజగును. రేతస్సు లక్కవాసన కల్గియున్నవాడు అనేక పుత్రికలు కలవాడగును. కల్లు వాసన కల్గినచో యోధుడగును. ఘాటువాసన యున్నచో దరిద్రుడగును-14. శ్రీఘ్ర మైధునము గల వాడు దీర్ఘాయుష్మంతుడు కానేరడు. అల్పాయుష్కుడే యగుననుటలో సందియము లేదు-15. పలుచని (తక్కువ) శుక్రము గలవాడు ఆడసంతానమును కనును. మాంసపు వాసన గల శుక్రము గలవాడు భోగియగును. రక్తము తామర పువ్వు వర్ణమున నుండిన మనుష్యుడు ధనవంతుడగును-16. కొంచెము రక్తము, నలుపు (నీల) వర్ణముననున్న రక్తము గలవాడు, ఎల్లప్పుడు దుఃఖిక భాజనుడై అధముడగును-17. రక్తము పగడపు వన్నెకలిగి చిక్కగ నున్నవాడు సప్తద్వీపములనేల గల రాజగునని తెలియవలెను-18. పురుషులకు విశాలమై, మాంసలమై నునుపుగనున్న పొత్తి కడుపు ప్రశస్తమైనది. మాంసము లేనిది, వంకరగనున్నది, గబుకైనది అయిన పొత్తి కడుపు శుభప్రదము కాదు-19. నక్క, కుక్క, ఒంటె, గేదె కడుపువంటి కడుపుగలవాడు నిత్య దుఃఖితుడగుటలో సందేహములేదు-20.

మూ. యశ్చైక వృషణస్తాత! జలేప్రాణాన్విముంచతి స్త్రీ చంచలస్తు విషమైః సమై రాజ్యం ప్రచక్షతే

ఊర్ధ్వగైశ్చాపి హ్రస్వాయుః శతం జీవీ ప్రలంబ ధృక్ మానవాశ్చాపి రక్తైస్తు ధనవంతో భవంతివై

స్థూల స్ఫిగ్భవతి క్షేమి ద్రవ్యయుక్తః సమాంసధృక్ వ్యాఘ్ర స్ఫిజ్మండలో రాజా మండూక స్ఫిజ్నరాధిపః ద్విమండలో మహాబాహో! సింహస్ఫిక్సార్వభౌమతా

ఉష్ట్ర వానర యోర్యస్తు ధారయే త్స్ఫిజ్మహామతే ధన ధాన్యవిహీనోఽసౌ విజ్ఞేయో భీమనందన!

పుమాన్మృగోదరో ధన్యో మయూరోదర ఏవచ వ్యాఘ్రోదరో నరపతీ రాజా సింహోదరో భవేత్

మండూక సదృశం యస్య పురుషసోదరంభవేత్ స భవేత్పార్థివః పృథ్వ్యాం సముద్ర వచనం యథా

మాంసలై ఋజుభిర్వృతైః పార్శ్వైర్నృ పతయః స్మృతాః ఈశ్వరో వ్యాఘ్రపృష్ఠస్తు సేనాయాశ్చైవ నాయకః

సింహపృష్ఠోనరో యస్తు బంధనం తస్య నిర్దిశేత్ కూర్మపృష్ఠాస్తు రాజానో ఘన సౌభాగ్య భాగినః

విస్తీర్ణం హృదయం యేషాం మాంసలోమ చితం సమమ్ శతాయుషో విజానీయాద్భోగ భాజోమహాధనాన్

విరలాః శుష్కాస్తథా రూక్షా దృశ్యంతేంఽగులయః కరే స భవేద్దు:ఖితో నిత్యం నరో దారిద్ర్యభాజనమ్

తా॥ ఒకే వృషణము గలవాడు నీటిలో ప్రాణములు వదలును. ఎగుడు దిగుడుగా వృషణములుండువాడు స్త్రీచాంచల్యము గలవాడగును. సమముగనుండువాడు రాజ్యమును పొందును-21. పైకి అంటుకొని యుండినట్లున్నవాడు అల్పాయువగును. వ్రేలాడుతున్నట్లుండిన వాడు నూఱుసంవత్సరములు జీవించును. ఎఱుపు వన్నె వృషణములు గలవాడు ధనవంతుడగును-22. స్థూలమైన పిరుదులు గలవాడు క్షేమముగానుండును. మాంసయుక్తములగు పిరుదులుండేనేని ద్రవ్యవంతుడగును. పులి పిరుదుల వంటి పిరుదులు గలిగెనేని రాజగును. కప్పపిరుదులున్నను రాజే యగును. నితంబమండలము సింహము వంటిదైయున్న సార్వభౌమత సిద్దించును-23. ఒంటే, కోతి నితంబముల బోలియుండెనేని ధనధాన్య విహీనుడగునని యెఱుంగవలెను-24. జింక, నెమలి కడుపు వంటి కడుపు కలవాడు ధన్యుడు, పులి కడుపు గలవాడు రాజు, సింహపు కడుపుకలవాడు కూడా రాజేయగును-25. కప్పకడుపు గలవాడు కూడ పార్దివుడగునని సముద్రుడు చెప్పెను-26. మాంసముతో కూడి చక్కగను, గుండ్రముగను ఉన్న ప్రక్కభాగములు కలవారు నరపాలురగుదురు. పులివీపు గలవాడు .రాజో, సేనానాయకుడో అగును-27. సింహము వీపువంటి వీపు గలవాడు చెఱసాల పాలపడునని చెప్పదగును. తాబేలు వీపు గలవారు ధనసౌభాగ్యములతో రాజులగుదురు-28. హృదయ ప్రదేశము విశాలమై, మాంసలమై, కుదురుగనుండెనేని అట్టివాడు ధనవంతుడై, భోగభాగ్యములనుభవించుచు నూజెండ్లు జీవించును-29. చేతివేళ్లు వంకరై, ఎండిపోయినట్లు కణుకుగ కనబడుచో నట్టివాడు ధనహీనుడై దుఃఖముననుభవించును-30.

మూ. యస్యమీన సమారేఖా కర్మసిద్ధిశ్చ తస్యతు ధనవాన్సతు విజ్ఞేయో బహుపుత్రశ్చమానవః

తులాయస్యతు వేదీవా కరమధ్యే తు దృశ్యతే తస్యసిద్ధ్యతి వాణిజ్యం పురుషస్యన సంశయః

సౌమ్యే పాణి తలే యస్య ద్విజస్యతు విశేషతః యజ్ఞయాజీ భవేన్నిత్యం బహువిత్తశ్చమానవః

 శైలం వాప్యథవా వృక్షః కరమధ్యేతు దృశ్యతే అచలాం శ్రియ మాప్నోతి బహుభృత్యసమన్వితః

 శక్తితోమర బాణాసి రేఖా చాపోపమా తథా యస్యహస్తే మహాబాహో! సజయేద్విగ్రహేరిపుమ్

 ధ్వజశ్చాప్యధవా శంఖః కరమధ్యేతుదృశ్యతే సముద్రయాయీ సభవేద్ధనీచ సతతంగుహ

శ్రీవత్సమథవా పద్మం వజ్రం వాచక్రమేవచ రథోవాప్యథవా కుంభోయస్య హస్తే ప్రకాశతే రాజానం తం విజానీయా త్పర సైన్య విదారణమ్

 దక్షిణేతు కరాంగుష్ఠే యవోయస్యతు దృశ్యతే సర్వవిద్యా ప్రవర్తాచ భవేద్వైనాత్ర సంశయః

యస్య పాణి తలే రేఖా కనిష్టామూలముత్థితా గతామథ్యం ప్రదేశిన్యాః సజీవేచ్ఛరదః శతమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి చతుర్థి కల్పే పురుషలక్షణ వర్ణనం సొమ పంచవింశోఽధ్యాయః

 తా॥ ఎవనికి మినరేఖ ఉండునో వానికి కార్యసిద్ధియగును. అట్టివాడు ధనవంతుడు, బహుపుత్రవంతుడని తెలియవలెను-31. అరచేతిలో త్రాసు, వేదిక గుర్తులు కనబడినచో అట్టివానికి వాణిజ్యము సిద్ధించుటలో సంశయములేదు-32. అచేతులు మృదువుగనున్న వాడు, విశేషించి బ్రాహ్మణుడు, తఱచుగ యజ్ఞములు చేయువాడు, ధనవంతుడై యుండును-33. చేతిలో కొండ, చెట్టు వంటి రేఖలున్నచో దాసదాసీ జనముతో కూడి స్థిర సంపదలతో తులతూగును-34. చిల్లకోల, తోమరము, భాణములు, ధనుస్సు వంటి రేఖలు చేతనున్నవాడు యుద్ధమున శత్రువును జయించును-35. పతాకము, శంఖము వంటి రేఖలు గలవాడు సముద్రయానము చేయువాడు, ధనవంతుడును అగును-36. శ్రీవత్సము, తామర, వజ్రము, చక్రము, రథము, కుండ వంటి ఆకారము గల రేఖలు చేతియందున్నవాడు, శత్రు సైన్యమును దునుమాడురాజని గుర్తింపవలెను-37. కుడిచేతి బొట్టన వ్రేలియందు యవధాన్య చిహ్నము గలదేని అట్టివాడు సర్వ విద్యావిశారదుడై వక్తయగును. సందేహములేదు-38. చిటికెన వేలి మూలమునుండి చూపుడు వ్రేలు మధ్యభాగము వఱకు రేఖ గలిగినవాడు నూజెండ్లు జీవించును.

శతార్ధ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్థీకల్పము నందు పురుష లక్షణ వర్ణనమను ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.