24. చతుర్ధి కల్పమునందు పురుష లక్షణ వర్ణనము

మూ. శతానీక ఉవాచ :

నరాణాం యోషితాంచైవ లక్షణాని మహామతే ప్రోక్తాని యాని విప్రేంద్ర! వ్యోమ కేశస్యసూనునా

క్రుద్ధేన యాని క్షిప్తాని ఈశ్వరేణ మహోదధౌ కృష్ణస్య వచనా ద్భూయః సముద్రోణార్పితానివై

అర్పితాని తతస్తస్య తేన ప్రాప్తాని వై కథమ్ బాహులేయేన విప్రేంద్ర! తాని మేవద సువ్రత"

సుమంతురువాచ :

యథా గుహేన రాజేంద్ర! స్త్రీ పుంసాంలక్షణానివై ప్రోక్తాని కురుశార్దూల ! తథాతేకథయామి వై

శక్తిపాతాద్ధతే క్రౌంచే వ్యోమ కేశస్యసూనునా బ్రహ్మతుష్టోఽ బ్రవీ దేనం ‘వరం వరయ మేఽ నఘ!

అసావపి మహాతేజాః ప్రణమ్యశిరసావిభుమ్ పితామహం బభా షేదం లక్షణం బ్రూహిమే విభో

నరాణాం యువతీనాంచ కౌతుకంపరమం మమ యన్మయోక్తం పురా దేవ! ప్రక్షిప్తం లవణార్ణవే

మత్పిత్రా దేవదేవేశ! సక్రోధేన పురా తథా ప్రాప్తంచ విస్మృతం భూయస్తన్మే బ్రూహి హ్యశేషతః”

బ్రహ్మోవాచ :

సాధు పృష్టోస్మిదేవేశ! భీమస్యానంద వర్ధన లక్షణాని నిబోధత్వం పురుషాణా మశేషతః అధమోత్తమ మధ్యాని యానిప్రాప పయోనిధిః

శివేహని సునక్షత్ర గ్రహే సౌమ్యే శుభేరవౌ పూర్వాహ్ణే మంగలైర్యుక్తే పరీక్షేతవిచక్షణః

తా॥ శతానీకుడిట్లనెను.

“కార్తికేయుని చేత చెప్పబడిన స్త్రీ పురుషుల లక్షణములు-1, క్రోధముతో శివుడు సముద్రములో పడవేయగా, విష్ణుదేవుని వాక్యము వలన తిరిగి, సముద్రుడు వానిని అప్పగించేను కదా!-2. వానిని సముద్రుడు కార్తికేయున కప్పగించిన విధము, అతడు వానిని తిరిగి పొందిన విధము నాకు తెలియజెప్పుము”-3. సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “గుహుడు స్త్రీ పురుషుల లక్షణములేట్లు చెప్పెనో ఆవివరములు చెప్పెదను-4. శివ కుమారుడైన కార్తికేయుడు ఒకప్పుడు తన శక్తిపాతము చేత క్రౌంచ పర్వతమును ప్రయ్యలు చేసెను. దానిచే బ్రహ్మమిక్కిలి సంతోషించి కుమార స్వామిని వరము కోరుకొనుమనెను-5. తేజస్వియైన కుమార స్వామి తలవంచి బ్రహ్మకు నమస్కరించి "దేవా! నాకు స్త్రీపురుష లక్షణములను ఉపదేశింపుమ” ని అర్థించెను. “నాకీ లక్షణ శాస్త్రము నందాసక్తి మిక్కుటమై యున్నది. నేను గతమున రచించిన లక్షణ గ్రంధము ఉప్పు సముద్రమున వేయబడినది-7. నా తండ్రియగు నీశ్వరుడు నాపై కినుక వహించి ఇట్లు ఈ పనిచేసెను. మఱల లభించినను విషయమును మఱచిపోయితిని. దానిని సాకల్యముగ నాకుజెప్పుడు.” అనెను-8. బ్రహ్మ ఇట్లనెను. “కుమారా! లెస్సగా ప్రశ్నించితివి. శివున కానందము కలిగించువాడవు. మొదట పురుష లక్షణములను సాంతముగా చెప్పెదను తెలిసికొనుము. సముద్రుడు పొందిన నీగ్రంథమునందలి పురుషుల ఉత్తమ మధ్యమాధమ లక్షణములు వినుము. (9) విచక్షణుడైన వాడు శుభనక్షత్రమున, రవ్యాదిగ్రహములు (రవి బుధులు) శుభస్థితి యందుండు మంగళ కరమైన దినమున, పూర్వాహ్లామున లక్షణములను పరీక్షింపవలెను-10.

మూ. ప్రమాణం సంహతిం ఛాయాం గతిం సర్వాంగ లక్షణమ్ దంతకేశ నఖశ్మశ్రు ఏ తత్సర్వం విచక్షణః

పూర్వమాయుః పరీక్షేత పశ్చాల్లక్షణ మాదిశేత్ క్షీణే హ్యాయుషి మర్త్యానాం లక్షణేః కింప్రయోజనమ్

జఘన్యోనవతిః ప్రోక్తో మధ్యమస్తు శతాంగుల: అష్టోత్తర శతం యస్య ఉత్తమం తస్యలక్షణమ్

ప్రమాణ లక్షణం ప్రోక్తం సముద్రేణ శుభాశుభమ్ యన్మేపురా దేవవర! మయావై కధితం తవ అతః పరం ప్రవక్ష్యామి దేహావయవలక్షణమ్

పాదైః సమాంసకైః స్నిగ్దై రక్తైః సౌమ్యైః సుశోభనైః ఉన్నతైః స్వేద రహితైః శిరాహీనైశ్చపార్ధివః

యస్యపాద తలేరేఖా సాంకుశేవ ప్రకాశతే సతతంహి సుఖం తస్య పురుషస్యన సంశయః

అస్వేదనే మృదు తలౌ కమలోదర సన్నిభౌ శ్లిష్టాంగులీ తామ్ర నఖౌ సుపార్ష్ణీవ్యోమకేశజ!

ఉష్ణౌ శిరా విరహితౌ గూఢ గుల్ఫౌచ భీమజ కూర్మోన్నతౌ చ చరణా ప్రఖ్యాతౌ పార్థివస్యతు

శూర్పాకృతీ మహాబాహో! రూక్షాశ్వేతనఖౌ తధా వక్రౌ శిరాసంతతౌచ ష్కౌవిరలాంగులీ

దారిద్ర్యదుఃఖదౌ జ్ఞేయౌ చరణౌ భీమనందన! బ్రహ్మఘ్నౌ దేవ శార్దూల! పక్వమృత్సదృశౌ పదౌ

తా॥ బుద్ధిమంతుడు అవయవముల ప్రమాణము, వాని పొందిక, వర్ణము, వానిస్థితి (కదలిక) ఇట్లు అన్ని అంగముల లక్షణము, దంతములు, వెంట్రుకలు, గోళ్ళు, మాసములు గడ్డములు వీనినన్నింటినీ పరిశీలింపవలయును-11. మొదట ఆయువును పరీక్షించి పిమ్మట లక్షణములు వాని ఫలము చెప్పవలెను. మానవులకు ఆయుర్దాయము క్షీణించినచో వారి లక్షణములతో ప్రయోజనమేమి?-12. నూటయెనిమిది అంగుళముల పొడవున్నవాడు ఉత్తముడు. నూరంగుళములున్నవాడు మధ్యముడు. తొంబదీ యంగుళములవాడు అధమ లక్షణములుగలవాడు-13. పూర్వము సముద్రుడు నాకు శుభాశుభ ప్రమాణ లక్షణములు చెప్పియుండెను. వానినే నీకు చెప్పుచున్నాను -14. అటు పైన శరీరావయవముల లక్షణము చెప్పెదను. మాంసముతో కూడినవి, నును పైనవి, ఎఱుపుచేయలోనుండునవి, మృదువుగా అందముగా నుండునవి, ఎత్తైనవి,చెమట లేనివీ, నరములు కన్పట్టనివి అయిన పాదముల గలవాడు రాజగును-15. ఎవని పాదతలమందు అంకుశము వంటి రేఖ ప్రకాశించుచుండునోవానికి జీవితమంతయు సుఖముగా గడచుననుటకు సందేహము లేదు-16. చెమట పట్టనివి కోమలములు, తామరపువ్వుల వంటివి, వ్రేళ్లు ఒకదానికొకటి తగిలియుండునవి, రాగివలె ఎఱుపురంగు గోళ్ళుగలవి, చక్కని మడమలుగలవియైన పాదములు గలవాడు రాజగును-17. గూఢమైన చీలమండలు గలిగి, రక్తనాడులు కనపడకుండనుండి వెచ్చని, తాబేలువలే ఎత్తైన పాదములు గలవాడు రాజనుట ప్రసిద్దము-18. చేటలవలె ఆకృతి గల్గి గబుకై, తెల్లని గోళ్లు కలిగి, వంకరగా, నరములతోనిండియుండి, ఎండిపోయినట్లుండి, వంకరలు గల ప్రేళ్లతోనున్న పాదములు గలవాడు-19. దరిద్రుడు, దుఃఖము గలవాడుఅగును. వండిన మట్టి వంటి వర్ణము గల పాదములు గలుగువాడు బ్రహ్మహత్య వంటి పాపములు చేయును-20.

మూ. పీతావగమ్య నిరతౌ కృష్ణౌపానరతౌసదా అభక్ష్య భక్షణే శ్వేతౌ జ్ఞేయౌసేనాధిపోత్తమ!

అంగుష్ఠౌపృధులౌ యేషాం తే నరా భాగ్యవర్జితాః క్లిశ్యంతే వికృతాంగుష్టాస్తేనరాః పాదగామినః

చిపిటైర్వికృతైర్భగ్నైరంగుష్ఠే రతి నిందితాః వక్రైర్భగ్నైస్థథాహ్రస్వైరంగుష్ఠైః క్లేశభాగినః

శూర్పాకారైశ్చ వికృతైర్భగ్నెర్వక్రై: శిరాతతైః స స్వేదైః పాండు రూకైశ్చచరణే రతినిందితాః

యస్య ప్రదేశినీ దీర్ఘా అంగుష్ఠం యా అతిక్రమేత్ స్త్రీ భోగం లభతే నిత్యం పురుషో నాత్రసంశయః కనిష్ఠాయాంతు దీర్ఘాయాం సువర్ణస్యతుభాగినః

చిపిటా విరలాః శుష్కాయస్యాంగుల్యో భవన్తి వై సభవేద్దుఃఖితోనిత్యం ధనహీనశ్చవై గుహ!

శ్వేతైర్నఖైర్విరూక్షైశ్చ పురుషా దుఃఖజీవనః కుశీలాః కునఖైర్జ్ఞేయాః కామ భోగ వివర్జితాః వికృతైః స్ఫుటితై రూక్షైరఖైర్దారిద్ర్య భాగినః

బ్రహ్మ హత్యాంచ కుర్వంతి పురుషాహరితైర్శఖైః బంధుభిశ్చ వియుజ్యంతే కులక్షయకరాశ్చతే

ఇంద్ర గోపక సంకాశైర్న ఖైర్నృపతయః స్మృతాః శంఖావర్త ప్రతీకాశైర్నఖైర్భవతి పార్థివః

తామ్రైర్నఖైస్తథైశ్వర్యం ధన్యాః పద్మనఖా నరాః రక్తైర్నఖైస్తథైశ్వర్యం పుష్పితైః సుభగో భవేత్ సూక్ష్మైరుప చితైస్తామ్రైర్నఖైర్నృపతయః స్మృతాః

తా॥ పసుపు వన్నె పాదములవాడు అగమ్యగమన దోషమునకు పాల్పడును. నల్లని పాదములవాడు మద్యపానరతుడగును. తెల్లని పాదములవాడు తినగూడని పదార్థములు తినువాడగును-21. బొట్టన వ్రేళ్ళు పెద్దవిగను పొడవుగను ఉన్నవారు భాగ్యహీనులగుదురు. వికృతమైన బొటన వ్రేళ్లవారు కష్టములనుభవింతురు. వాహన యోగము లేనివారై కాలినడక ప్రయాణము గలవారైయుందురు-22. పెద్దవియై అణగియున్నట్లుండునవి, వికారమైనవి, పగిలినట్లుండినవియైన బొట్టనవ్రేళ్లు గలవారు మిక్కిలి నిందితులగుదురు. వంకరగను, పగుళ్లు గలిగి పొట్టివిగను ఉండువారు కష్టములనుభవింతురు-23. పాదములు చేటలవలె వీకారముగ, పగుళ్లు గలిగి వంకరగా, నరములు తేలి చెమట గలిగి, పేలవమైన వర్ణము కలిగి గబుకుగా నుండువారు మిక్కిలి నిందితులగుదురు-24. చూపుడు వ్రేలు, బొట్టన వ్రేలికంటె నిడివిగనున్నవాడు నిత్యము స్త్రీభోగమునుభవించును. సంశమములేదు. చిటికెన వ్రేలు నిడివిగనున్నవాడు బంగారము కలిగి యుండును-25. అడుకులవలె చట్టపడి, వంకరటింకరగా నుండి, ఎండిపోయినట్లుండు వ్రేళ్లు గలవాడు దుఃఖితుడును, ధనహీనుడును అగును-26. గోళ్లు తెల్లగను, కఱుకుగను ఉన్నవాడు దుఖః జీవియగును. చెడు గోళ్లు కలవారు శీలహీనులు, కామ సుఖములు లేని వారగుదురని గ్రహింపవలెను. వికృతములు, పగుళ్లుగలవి, కఱుకైనవి అయిన గోళ్లుగలవారు దరిద్రులగుదురు-27. ఆకుపచ్చ వన్నెగల గోళ్లుగలవారు బ్రహ్మహత్య చేయుదురు. బంధువులచేత విడువబడినవారు, కులనాశకులును అగుదురు-28. ఆరుద్రపురుగువలె ఎఱ్ఱగా ప్రకాశించెడు నఖములు గలవారు భూపాలురయ్యేదరు. శంఖపుసుడి వలె మెటీ సెడి గోళ్లుగలవారు రాజులగుదురు-29. రాగివన్నె గోళ్లవారు ఐశ్వర్యవంతులును, తామరవన్నె గోళ్లవారు ధన్యులును అయ్యెదరు. ఎఱ్ఱని గోళ్లవారు ఐశ్వర్యమును, వికసించిన గోళ్లవారు సౌభాగ్యమును పొందుదురు. సన్నగను, పొడవుగను, ఎఱుపుగను గోళ్లుగలిగినవారు రాజులగుదురు-30.

మూ. రోమశాభ్యాంచ జంఘాభ్యాందుఃఖదారిద్ర్యభాగినః బంధనం హ్రస్వజంఘానమైశ్వర్యం చైవ నిర్దిశేత్

మృగ జంఘాశ్చ రాజానో జాయంతేనాత్రసంశయః దీర్ఘజంఘాః స్థూల జంఘాః నిత్యం భాగ్య వివర్జితాః

శృగాల జంఘాః పురుషా నిత్యం భాగ్య వివర్జితాః కాక జంఘా నరాయేతు భవేయుర్దుఃఖభాగినః

పీన జంఘాస్తధైశ్వర్యం ప్రాప్నువంతి న సంశయః సింహ వ్యాఘసమా జంఘా ధనినః పరికీర్తితాః

పార్థివానాం భవేద్రోమ చైకైకం రోమకూపకే పండిత శ్రోతియాణాంచ ద్వేద్వే జ్ఞేయే మహామతే!

త్రిభిస్త్రి భిస్తథానిఃస్వా మానవా దుఃఖ భాగినః కేశాశ్చైవ మహాబాహో! నిందితా పూజితాస్తథా నిర్మాంస జానుర్ర్మీయతే ప్రవాసే శివనందన!

సౌభాగ్యమల్పైః కథితం దారిద్ర్యం వికటైస్తథా నిమ్నై: స్వస్త్రీజితా జేయాః సమాం సై రాజ్య భాగినః

హంసభాస శుకానాంచతుల్యాయస్యగతిర్భవేత్ సభవేత్పార్థివః పూజ్య: సముద్రవచనం యథా

అన్యేషామపి శస్తానాం పక్షిణాంచశుభాగతి: వృష సింహ గజేంద్రాణాం గతిరోగ వివర్థినీ

జలోర్మిసదృశీ యాచ కాకోలూక సమాచయా గతిర్ద్రవ్య విహీనానాం దుఃఖశోక భయంకరా శ్వానోష్ట మహిషాణాంచ ఖరసూకరయోస్తథా గతిర్మేష సమాయేషాం తే నరాభాగ్య వర్జితాః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మే పర్వణి

చతుర్థీ కల్సే పురుష లక్షణ వర్ణనం నామ చతుర్వింశోఽధ్యాయః

తా ॥ రోమములతో కూడిన పిక్కలుగలవారు దుఃఖము, దారిద్ర్యమును అనుభవింతురు. పిక్కలు పొట్టిగానున్న ఐశ్వర్యము, బంధనము చెప్పవలెను-31. జింక పిక్కలవంటి పిక్కలు కలిగియుండెనేని రాజగును. సంశయములేదు. లావుగను, పొడవుగను ఉన్నవారు భాగ్యహీనులగుదురు-32, నక్కపిక్కల వంటి పిక్కలు గల పురుషులు భాగ్యహీనులగుదురు. కాకిదొండ వంటి పిక్కలు గలవారు దుఃఖముననుభవింతురు-33. బలిష్టములైన జంఘలుగలవారు ఐశ్వర్యవంతులగుదురు. సింహము, పులి పీక్కలవంటి పిక్కలుగలవారు ధనవంతులగుదురు-34. ఒక్కొక్క రోమకూపమున నొక్కొక్క రోమమే యుండిన వారు రాజులగుదురు. శ్రోత్రియులు, పండితులునైన వారికి ఒక్కొక్క రోమకూపమున రెండేసి రోమములుండును-35. మూడేసి మూడేసి రోమములున్నవారికీ నిఃస్వయోగము కలిగి దుఃఖితులగుదురు. వెంట్రుకల తీరును బట్టియే మానవుడు పూజ్యుడో నింద్యుడో అగును-36. మాంసములేని మోకాళ్లు గలవాడు దూరదేశమున మరణించును-37. అల్పములైన మోకాళ్లవలన సౌభాగ్యము, వికటమైన వాని వలన దారిద్ర్యము చెప్పబడినది. లోతైన మోకాళ్లవలన భార్యచే జయింపబడువాడు, మాంసలములైనవానివలన రాచఱికము పొందువాడును అగునని తెలియవలెను -38. హంస, కోడి, చిలుకల నడకల వంటి నడకలు గలవాడు రాజు, పూజ్యుడు అగునని సముద్రుని వాక్యము-39. ఇతర శ్రేష్ఠములైన పక్షుల నడకవంటి నడక కూడా శుభప్రదమైనదే. ఎదు, సింహము, ఏనుగు నడకవంటి నడక భోగములను పెంచును -40. నీటి తరంగములవంటిది, కాకి, గ్రుడ్లగూబనడక వంటిది అయిన నడక దరిద్రులకుండును. అది భయంకరమగు దుఃఖము కలిగించును-41. కుక్క, ఒంటె, దున్న, గాడిద, పంది, మేక నడకలు గలవారు భాగ్యహీనులగుదురు-42.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహా పురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధి కల్పము నందు పురుషలక్షణ వర్ణనమను ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.