భవిష్య మహా పురాణము
21. తృతీయా కల్ప విధి వర్ణనము
సుమంతురువాచ :
పతివ్రతా పతి ప్రాణా పతి శుశ్రూషణేరతా ఏవం విధాపి యాప్రోక్తా శుచిః సంశోభనా సతీ
సోపవాసా తృతీయాంతు లవణం పరివర్జయేత్ సా గృహ్ణాతిచ వైభక్త్యా వ్రతమామరణాంతకమ్
గౌరీ దదాతి సంతుష్టా రూపం సౌభాగ్యమేవచ లావణ్యం లలితం హృద్యం శ్లాఘ్యం పుంసాంమనోరమమ్
పుంసోమనోరమా నారీ భర్తానార్యామనోరమః గౌరీ వ్రతేన భవతి, రాజన్! లవణ వర్జనాత్
ఇదం వ్రతం ప్రతి విభో ధర్మరాజస్య శృణ్వతః ఉమయా చ పురాప్రోక్తం యద్వాక్యం తన్నిబోధమే
“మయావ్రతమిదం సృష్టం సౌభాగ్యకరణం నృణామ్ మర్త్యేతు నియతా నారీ వ్రతమేతచ్చరిష్యతి
సహ భర్త్రా స మోధేత యధాభర్తా హరోమమ
యాచ కన్యాన భర్తారం విందతే శోభనా సతీ సాత్విదం వ్రతముద్దిశ్య భవేదక్షార భోజనా మచ్చిత్తా మన్మనాః కుర్యాన్మద్భక్తా మత్పరిగ్రహా
గౌరీం సంస్థాప్య సౌవర్ణిం గంథాలంకారభూషితామ్ వస్త్రాలంకార సంవీతాం పుష్పమండల మండితామ్
లవణం గుడం ఘృతం తైలం దేవ్యై శక్త్యానివేదయేత్ కటుఖండం జీరకంచ పత్రశాకంచ భారత!
గుడ ఘృష్టాంస్తథా పూపాన్ ఖండ వేష్టాంస్తథానృప బ్రహ్మణే వ్రత సంపన్నే ప్రదద్యాత్సు బహుశ్రుతే
తా॥ సుమంత్రుముని యిట్లనెను. “పతివ్రత, పతినే ప్రాణముగానేంచునది, భర్త శశ్రూషయందే తాత్పర్యముగలది. పరిశుద్ధమైన స్వభావముగలది, సౌందర్యవతియైన స్త్రీ కూడ-1. తృతీయా వ్రతోపవాసముగలదియై ఉప్పును వదిలి పెట్టవలెను. ఆ విధముగ భక్తితో యావజ్జీవము అనుష్ఠింపవలెను-2. అటులనుష్ఠించు వారియెడ గౌరీ దేవి సంతుష్టురాలై లావణ్యమును; మృదులము, మనోహరము, పురుషులకాకర్షణీయము, శ్లాఘ్యమునైన రూపసౌభాగ్యమునిచ్చును-3. రాజా! లవణవర్జితమైన ఈ గౌరీ వ్రతముననుష్ఠించుట చేత పురుషునకు మనస్సునానంద పెట్టగల స్త్రీ; స్త్రీకి ఆమే హృదయంగముడైన భర్త లభింతురు-4. ఈ వ్రతమును గూర్చి పూర్వము గౌరీ దేవి, ధర్మరాజుకు చెప్పగా, అతడు వినిన ప్రకారముగా నేను చెప్పబోవుచున్నాను. దానిని తెలిసికొనుము-5. (గౌరీ దేవి ధర్మరాజుతో నిట్లు చెప్పెను) "మానవులకు సౌభాగ్యమును కలిగించు ఈ వ్రతము నాచే సృష్టింపబడినది మనుష్యలోకమున, స్త్రీ, నియముగలదై ఈ వ్రతము నాచరించెనేని, నేను నా భర్తయగు శివునితో ఆనందముగానున్నట్లు, తన భర్తతో సుఖ జీవనము చేయును-6. ఏ అందమైన కన్య, భర్తను పొందజాలకుండునో, అట్టి కన్య ఈ వ్రతమునుద్దేశించి ఉప్పు (కారము) తినకూడదు. (ఉప్పులేని భోజనము చేయవలెను) నాయందే భక్తి ప్రేమలు కలిగి, మనస్సునందు, చిత్తమునందు నన్నే భావించుచుండవలయును-7. బంగారపు గౌరీ దేవి ప్రతిమను స్థాపించి గంధపుష్పాద్యలంకారములతో, వస్త్రాభరణాదులతో, పూలదండలతోను పూజించి-8. ఉప్పు, బెల్లము, నేయి, నూనె యధాశక్తి నివేదింపవలెను. సువాసనగల పులకండము, జీలకఱ్ఱ, ఆకు కూరలు కూడా నైవేద్యము పెట్టవలెను-9. వ్రతసమాప్తియందు మంచి విద్వాంసుడైన బ్రాహ్మణునకు, అరిసెలు (బెల్లముతో చేసిన ఉండలు), భక్ష్యములు, ఖండశర్కర వస్తువులు, దానమీయవలెను-10.
మూ. శుక్ల పక్షే సదాదేయా యధాశక్త్యా హిరణ్మయీ ధన హీనేతు భక్త్యాచ మధు వృక్షమయీనృప!
అర్చ్యా నిత్యం సంవిధానా తత్రగౌరీన సంశయః అక్షారలవణం రాత్రౌ భుంక్తేచైవ సువాగ్యతా
గౌరీ సన్నిహితా నిత్యం భూమౌ ప్రస్తరశాయినీ ఏవం నియమయుక్తస్య దేవ్యాయత్సముదాహృతమ్
తచ్ఛృణుష్వ మహాబాహో! కథ్యమానంమహాఫలమ్ భర్తారంతు లభేత్కన్యా యం వాంఛతి మనోనుగమ్
సుచిరం సహవై భర్త్రా క్రీడయిత్వాఇ హైవసా సంతతించ ప్రతిష్ఠాప్య సహతేనైవ గచ్ఛతి
హేలిలోకం చంద్రలోకం లోకం చిత్రశిఖండినః గత్వాయాతి సదోరాజస్వామదేవస్య భారత!
విధవాతు యదారాజన్ దేవ్యావ్రత పరాయణా భర్తారం నియతా నిత్యం సదార్చన పరాయణా
ఇహచోత్సృజ్య దేహంస్వం దృష్ట్యాహరిపురేపియమ్ ఆక్ష్యిప్యయమదూతేభ్యః సహభర్త్రా రమేద్దివి
వర్షకోటిం దశగుణం రమిత్వాసా ఇహాగతా భర్త్రాస హైవ పూర్వోక్తం లభతే ఫలమీప్సితమ్
ఇంద్రాణ్యాపి వ్రతమిదం పుత్రార్థిన్యానరాధిప! లబ్ధః పుత్రో ప్రతస్యాంతే జయంతోనామ నామతః
తా॥ స్వర్ణ ప్రతిమారూపముననున్న అమ్మవారికి ఈ వస్తువులను శుక్లపక్షమున నివేదింపవలెను. ధనహీనులైన వారు యధాశక్తిగ మధువృక్ష (ఇప్పచెట్టు) రూపముననున్న గౌరీ మాతకు భక్తితో సమర్పింపవలేను-11. రాత్రి సమయమున ఉప్పు కారములను తినుట మాని మౌన వ్రతమును బూని అమ్మను నిత్యము పూజించుచోనామె, సన్నిధానముననేయుండును. ఇందెంత మాత్రము సందేహములేదు-12. గౌరీ దేవి భూమియందలి చివురు సెజ్జ పై పరుండి నిత్యము సన్నిహితముగా నుండును. ఇంతకు ముందు నుడివిన నియమములననుసరించుచు ననుష్ఠంచు దేవీ ప్రత-13. మహాఫలమును చెప్పుచున్నాను వినుము. కన్య, భర్తను పొందును. అతడు ఆమె మెచ్చువాడు, మనసుకు నచ్చిన వాడగును-14, ఇహలోకమునందే ఆమె భర్తతో చిరకాలము క్రీడించి, సంతానమును కని, అతనితోపాటే వెడలిపోవును-15. మరీచ్యాది సప్తర్షిలోకములకుఁబోయి అటనుండి శివసదనమును చేరును-16. గౌరీ వ్రత పరాయణురాలై విగత భర్శకమైన స్త్రీ పతిభక్తి కలిగియుండెనేని-17. తన దేహము విడిచినయనంతరము యమదూతలనుండి తప్పుకొని ఆనందకరమైన వైకుంఠమును చూచి అటనుండి స్వర్గమునకు బోయి, అచ్చట తన భర్తతో రమించును-18. కోటి సంవత్సరములతనితో పదింతల సుఖమునుభవించి ఆమె ఈ లోకమునకు తన భర్తను కూడి వచ్చి ముందు చెప్పబడిన రీతిగ ఇష్టకామ్యసుఖములను పొందును-19. రాజా! ఇంద్రుని భార్యయగు శచీదేవి కూడ పూర్వయోవ్రతమును పుత్రార్థినియై ఆచరించి ఫలముగా జయంతుడను పేరుగల పుత్రునిబడ సెను-20.
మూ. అరుంధత్యా తథా చీర్ణం వసిష్ఠం ప్రతికామతః దృశ్యతే దివి చాద్యాపి వసిష్ఠస్య సమీపతః
రోహిణ్యా లవణత్యాగాత్సపత్నీ గణమర్దనమ్ లబ్ధం దేవ్యాః ప్రసాదేన సౌభాగ్యమచలం దివి
ఇత్యేషా తిథిరిత్యేవ తృతీయా లోక పూజితా సదా విశేషతః పుణ్యా వైశాఖేమాసియాభవేత్
పుణ్యాభాద్రపదేమాసి మాఘేప్యేవంనసంశయ: మా ఘే భాద్రపదే చాపి స్త్రీణాం ధన్యాప్రచక్షతే
సాధారణీతు వైశాఖే సర్వలోకస్య భారత! మాఘమాసే తృతీయాయాం గుడస్యలవణస్యచ దానం శ్రేయస్కరం రాజన్! స్త్రీణాంచపురుషస్యచ
గుడేన తుష్యతే దత్తో లవణేనతు విశ్వభూః గుడపూపాస్తు దాతవ్యమాసి భాద్రపదే తథా
తృతీయాయాంతు మాఘస్య వామదేవస్య ప్రీతయే వారి దానం ప్రశస్తం స్యాన్మోదకానాంచ భారత!
వైశాఖేమాసి రాజేంద్ర! తృతీయాచందనస్యచ వారణా తుష్యతే వేధా మోదకైర్భీమ ఏవహి
దానాత్తు చందన స్యేహ కంజజోనాత్రసంశయ
యాత్వేషా కురుశార్దుల వైశాఖే మాసి వైతిధిః తృతీయా సొఽక్షయలోకే గీర్వాణైరభినందితా
ఆగతేయం మహాబాహో! భూరిచంద్రం వసువ్రతా కలధౌతం తధాన్నంచ ఘృతం చాపి విశేషతః యద్యద్దత్తం త్వక్షయం స్యాత్తేనేయ మక్షయాస్మృతా
యత్కించిద్దీయతే దానం స్వల్వంవా యదివా బహు తత్సర్వమక్షయం స్యాద్వై తేనేయ మక్షయాస్మృతా
యోఽస్యాం దదాతి కరకౌన్వారిబీజ సమన్వితాన్ స యాతి పురుషో వీర! లోకంపై హేమ మాలినః
ఇత్యేషా కథితా వీర! తృతీయా తిథిరుత్తమా యాముపోష్యనరో రాజన్ ఋద్ధిం వృద్ధిం శ్రియంభజేత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మే పర్వణి
తృతీయా కల్ప విధి వర్ణనం నామైక వింశోఽధ్యాయః
తా॥ వసిష్టుని గూర్చిన కోరికతో అరుంధతి చేత కూడ ఈ వ్రతము చేయబడినది. ఆమె నేడుకూడ ఆకాశమునందు వసిష్టుని సమీపమునే కన్పట్టును-21. రోహిణి లవణమును విడిచి పెట్టి ఈ వ్రతమాచరించుట చేత ఆమె సవతులు మర్దింపబడిరి. ఆమె దేవి ప్రసాదము చేత నాకసమందచలమగు సౌభాగ్యమును పొందెను-22. ఈ విధముగ తృతీయాతిథి లోకపూజితమైనది. ముఖ్యముగా వైశాఖ మాసశుక్ల పక్షమున వచ్చు తిథి మిక్కిలి పుణ్యప్రదమైనది-23. ఇట్లు భాద్రపద, మాఘమాసములలో వచ్చునదికూడ పుణ్యప్రదమైనదే. సంశయములేదు. భాద్రపదమాఘ తృతీయ కూడా స్త్రీలకు ధన్యతనిచ్చునదిగా చెప్పుదురు-24, లోకమంతటికీని వైశాఖ తృతీయయే సాధారణముగ ఆచరింపదగినది. మాఘతృతీయయందు స్త్రీ పురుషులు గుడలవణములు దానమిచ్చుట శ్రేయస్కరము-25. గుడదానముతో దత్తుడు, ఉప్పుదానముతో విశ్వభువు సంతోషింతురు. భాద్రపదమున బెల్లపు భక్ష్యములు దానమీయవలెను-26. మాఘ తృతీయయందు శివప్రీతీ కొఱకు నీరు, లడువములు దానమిచ్చుట ప్రశస్తము-27. వైశాఖమాసమునందలి తదియనాడు చందన జల దానము చేత విష్ణువు, లడ్డువములచే శివుడు చందనదానముచే బ్రహ్మ సంతోషింతురు. ఇందు సందేహము లేదు-28. కురుశార్దూలా! వైశాఖమాసమునందలి యీ తృతీయాతిథి 'అక్షయతృతీయ'గా దేవతల చేత ప్రశంసింపబడినది-29. చంద్రుని వృద్దిననుసరించి “వసువ్రత'గా ఈతిథి వచ్చినదగుటచేత ఈ దినమున బంగారము, వెండి, భోజనము, నేయి మొదలగునవి ఏవి దానము చేసినను చేసిన వారికి అక్షయమైన సంపదలు కలుగును. ఆకారణముననిది. అక్షయ తృతీయ యని చెప్పబడినది-30. ఏ కొంచెము దానము చేసినను, లేక మిక్కిలిగా దానమిచ్చినను అది అంతయు అక్షయమై విలసిల్లును. అందుచేతనే ఇది అక్షయతృతీయయన బడినది -31. ఈ తిథియందు నీటితో నింపబడిన గిండి చెంబులు, లేక పండిన దానిమ్మపండ్లు దానమిచ్చిన వాడు సూర్యలోకమును పొందును-32. ఇట్లు ఉత్తమమైన తృతీయ గుణించి నీకు వివరించి చెప్పితిని. ఈ తిథియందు ఉపవసించిన వాడు సకలసంపత్సమృద్ధిని ఐశ్వర్యమును పొందును-33.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున తృతీయా కల్పవీధి వర్ణనమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 21 of the Bhavishya Mahā Purana is as follows:
The Tṛtīyā Kalpa opens with the Gaurī vrata, in which Goddess Gaurī — the embodiment of auspicious womanhood — is worshipped on the third tithi. The distinctive feature of this vrata is the complete avoidance of salt: the votary fasts from salt as an act of inner simplification, drawing the mind away from the grosser pleasures of taste toward the subtler pleasures of devotion. The stories of Śacī (Indra's consort), Arundhati (the ideal pativratā among the ṛṣi-wives), and Rohiṇī (the moon's most beloved wife) are narrated as archetypes of the faithful woman whose tapas protects her husband and children. The chapter concludes with the mahātmya of Akṣaya-tṛtīyā — the third tithi of Vaiśākha — whose merit, unlike the merit of all other vratas, is never exhausted: every act of giving performed on this day multiplies without limit into eternity.