భవిష్య మహా పురాణము
22. చతుర్థీ కల్ప వర్ణనము
మూ. సుమంతురువాచ -
చతుర్థ్యాం తు సదా రాజన్ని రాహార వ్రతాన్వితః దత్వా తిలాన్నం విప్రస్య స్వయం భుంక్తే తిలౌదనమ్
వర్షద్వయే సమాప్తిర్హి వ్రతస్యతు యధాభవేత్ వినాయక స్తస్యతుష్టో దదాతి ఫలమిహితమ్
యాతి భాగ్యనివాసంహి క్రీడతే విభవైః సహ ఇహచాగత్య పుణ్యాంతే దివ్యోదివ్యవపుర్యశాః
మతి మాస్థృతి మాన్వాగ్మీ భాగ్యవాన్కామకారవాన్ అసాధ్యాన్యపి సాధ్యేహ క్షణాదేవ మహాంత్యపి
హస్త్యశ్వరథ సంపన్నః పుత్నీపుత్ర సహాయవాన్ రాజా భవతి దీర్ఘాయుః సప్తజన్మాన్యసౌ నృప! ఏతద్దదాతి సంతుష్టో విఘ్నహంతా వినాయకః
శతానీక ఉవాచ
“విఘ్నః కస్యకృత స్తేన యేన విఘ్న వినాయకః ఏతద్వదస్వ విఘ్నేశో విఘ్న కారణ మద్యమే”
సుమంతురువాచ
“కౌమారే లక్షణే పుంసాం స్త్రీణాంచ సుకృతే కృతే విఘ్నం చకార విఘ్నేశో గాంగేయస్య వినాయకః
తంతు విఘ్నం విదిత్వాసౌ కార్తికేయో రుషాన్వితః ఉత్కృష్య దంతం తస్యాస్యాద్ధంతుం తంచ సముద్యతః
నివార్యాపృచ్ఛద్దేవేశో రోషః కార్యః కుతస్త్వయా తందాచఖ్యౌ స పిత్రేవై కృతం పురుష లక్షణమ్ తత్ర విఘ్నకృతే మహ్యం యోషితా నచ లక్షణమ్
అథోవాచ మహాదేవః ప్రహసన్స్వసుతం కిల మమ కిం లక్షణం పుత్ర! పశ్య సే త్వం వదస్వమే
తా॥ సుమంతుముని యిట్లనెను.
“చవితినాడు నిరాహార వ్రతమును బూని బ్రాహ్మణునకు తిలాన్నము సమర్పించి ప్రతియైన వాడు తాను కూడా తిలాన్నమునే భుజింపవలెను-1. ఇట్లు రెండు సంవత్సరములాచరించి వ్రాత సమాప్తి చేసిన వాని యెడ వినాయకుడు సంతుష్టుడై కోరిన ఫలము నిచ్చును-2. అతడు అదృష్టలోకములకు పోయి అచట వివిధ బోగములనుభవించును. పుణ్యము సమాప్తమైన పిదప ఈ లోకమునకు వచ్చి దివ్య శరీరుడై గొప్ప కీర్తి సంపాదించును-3. బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, వక్త, భాగ్యవంతుడు, స్వేఛ్చాజీవియై అసాధ్యములైన గొప్ప కార్యములను కూడ క్షణములో పూర్తి చేయగలిగి తత్పల సిద్ధిని పొందును-4. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు గలవాడై, భార్యాపుత్రుల సేవలందుచు ఏడు జన్మల వఱకును దీర్ఘాయుష్మంతుడగు రాజగును. ఈ ఫలమును విఘ్ననాశకుడైన వినాయకుడిచ్చును”-5. శతానీకుడిట్లనెను. “అతనికి విఘ్ననాయకుడని పేరు వచ్చుటకు కారణమేమి? అతడెవరికి విఘ్నమును కలిగించేను? చెప్పుడు”-6. సుమంతుడిట్లనెను. “కుమారస్వామి స్త్రీ పురుషుల లక్షణములను గుఱించి రచన సాగింపుచుండగా వినాయకుడు అతనికి విఘ్నము కలిగించెను-7. వినాయకుడు కలిగించిన ఆటంకమును తెలిసికొని కుమారస్వామి కోపోద్దీపితుడై అతని ముఖము నుండి దంతము నూడ బెణికి అతనిని చంపుటకుద్యమించెను-8. అంతలో మహేశ్వరుడటకేతెంచి కుమారుని వారించి, “కుమారా! క్రుద్ధుడవై ఈపనికి పూనుకొన కారణమేమి?” అని ప్రశ్నించేను. కుమారస్వామి ఇట్లు బదులు పలికెను. “నేను పురుషలక్షణ రచన సమాప్తి చేసి స్త్రీ లక్షణ రచన ప్రారంభింపకముందే ఈ గణేశుడు నన్నాటంకపరచెను "-9. అప్పుడు మహేశ్వరుడు నవ్వుచు తన కుమారునితో నిట్లనెను. " కుమారా! నాలో ఏ లక్షణములను చూచితివో చెప్పుము”-10.
మూ. సచోవాచ 'కరేతుభ్యం కపాలం ద్విజ లక్షితమ్ అవిచారేణ సంస్థాప్యం కపాలీ తేన చోద్యసే” స తల్లక్షణ మాదాయ సముద్రే ప్రక్షిపద్రుషా
అధ దేవ సమాజేవై ప్రవృత్తే బ్రహ్మరుద్రయోః అహంజ్యాయానహం జ్యాయాన్వివాదోఽ భూత్తయోర్ద్వయోః తవ సంభూత్యభిజ్ణోఽస్తి మాంతు
వేద న కశ్చన
ఏవంశివేఽతి బ్రువతి బ్రహ్మణః పంచమం శిరః ముక్తాట్టహాసం ప్రోవాచ త్వామహం వేదితాభవ
ఏవం బ్రువత్తు రుద్రేణ బ్రాహ్మం హయశిరోమహత్ నఖాగ్రేణ నికృత్తంచ తస్యైవచ కరే స్థితమ్
కరస్థేనైవ తేనాసావా గచ్ఛద్యత్రవైహరిః తపస్తే పే తదామేరౌ తత్రాసౌభగవాన్వశీ
కృత్తే హయశిరే తస్మిన్ స్థానాత్తస్మాత్తు బ్రహ్మణః దోషాద్వినిఃసృతస్వన్యః పురుషః శ్వేత కుండలీ
కవచీ స శిరస్కశ్చ సశరః సశరాసనః అనిర్దేశ్యవపుః స్రగ్వీ కింకరోమి? సచాబ్రవీత్
అథోవాచరుషా బ్రహ్మహన్యతాం స సుదుర్మతిః సతుమార్గేణ రుద్రస్య ఆగచ్చ ద్రోషతో ద్రుతమ్
రుద్రోపి విష్ణుతేజోభిః ప్రవిష్టః సత్వధిష్టితః స ప్రవిశ్య తదా పశ్యత్తపంతం చోత్తమం తపః హరో నారాయణం దేవం వైకుంఠమపరాజితమ్
హరం దృష్ట్వాథ సంప్రాప్తం కార్యంచాస్య విచింత్యచ ఉవాచ శూలినం దేవో భింధ శూలేన మే భుజమ్
తా॥ కార్తికేయుడిట్లు సమాధానము చెప్పెను.
“నీ చేతియందు బ్రహ్మచే చూడబడు పుట్టైయున్నది. అది అవిచారితముగ నుంచబడినది. అందువలన నీవు 'కపాలి'యని పిలువబడుచున్నావు.” ఆమాట విని శివుడు, కార్తికేయుని లక్షణ గ్రంథమును కోపముతో సముద్రమున బడవైచేను-11. ఒకప్పుడు దేవ సమాజము ప్రవృత్తమగుచుండగా బ్రహ్మరుద్రుల మధ్య 'నేను గొప్ప నేను గొప్ప' అనెడి వివాదమేర్పడెను. “నీ పుట్టుక అందజికి తెలియును కాని నన్నుమాత్రమేవరును తెలియలేరు”. అని శివుడనగానే బ్రహ్మ ఐదవతల అట్టహాసమును మాని, “నేను నిన్నెఱుంగుదుననెను”-13. ఇట్లనుచుండగానే రుద్రుడు బ్రహ్మయొక్క ఐదవదగు అశ్వశిరమును గోటీకొనతో త్రుంచివైచేను. ఆ తల చేతికి అంటుకోనియే ఉండిపోయెను-14. చేతిని అంటుకొని యున్న తోడనే శివుడు హరినివాసమునకు వచ్చెను. అటుపై భగవానుడైన శివుడు మేరు పర్వతము పై తపస్సులోనుండెను-15. బ్రహ్మయొక్క కత్తిరింపబడిన గుఱ్ఱపు ముఖపు స్టానమునుండి ఒక పురుషుడు వెలువడెను. అతడు మిక్కిలి కోపముతోనుండెను. వెండి కుండలములు ధరించి యుండెను-16. వానికి కవచము, శిరస్త్రాణము, ధనుర్బాణములుండేను. గొప్ప శరీరము గలిగి పూలదండలు ధరించియుండెను. అట్టి ఆ పురుషుడు " ఏమి చేయవలెనో సెలవిండు” అని బ్రహ్మముందు నిలిచెను-17. "ఆ దుర్మతి సంహరింపబడుగాక” అని బ్రహ్మ కోపముతో ఆజ్ఞాపించెను. ఆ పురుషుడు క్రోధముతో రుద్రుని స్థానమునకు వేగముగా పరుగెత్తెను-18. రుద్రుడు కూడ లోన ప్రవేశించిన విష్ణు తేజములు గలవాడై వానినధిష్టించియుండెను. ఇట్లు ఉత్తమమైన తపస్సు చేయుచున్న శివుని ఆ పురుషుడు చూచెను. హరుడు వైకుంఠవాసుడు, అపరాజితుడు అయిన నారాయణ దేవుని ఆంతర్యమున కలిగియుండెను-19. శివుని చూచిప ఆ పురుషుడు తాను కార్యమును గుఱించి ఆలోచించేను. “నా భుజమును శూలముతో భేదింపుము” అని శివునితోననేను-20.
మూ. సబిభేద మహాతేజా భుజం శూలేన తం హరః
శూల భేదాదసృక్చ్వోర్ధ్వం జగామావృత్యరోదసీ వినివృత్య తతః పశ్చాత్కపాలే నిపపాత హ
అసృక్కపాలేపతితం ప్రదేశిన్యావ్యవస్థయత్ యదాహి వినివృత్తిః స్యాద్దేవస్య రుధిరంప్రతి
తదాతు వ్యసృజత్తోయం సకృత్వావారుణీం తనుమ్ తోయే ప్రవృత్తేఽ సృగ్భూతేకపాలే యత్ర తచ్ఛిరః
కపాలేతు ప్రదేశిన్యా రుద్రోఽసౌరుధిరేఽ సృజత్ ఆముక్త కవచం రక్తం రక్తకుండలినమ్ నరమ్
అధోవాచ భవం దేవం కిం కరోమితి మానద! అసావపి ససర్జాథ శ్వేత కుండలినమ్ నరమ్
తావుభౌ సమయుద్ధ్యేతాం ధనుష్ప్రవరధారిణౌ యథారాజన్బలీయాంసౌ కుజకేతూ యుగాత్యయే
తయోస్తు యుద్ధ్యతో రేవం సంవర్తశ్చాధికో గతః నచాదృశ్యత విజయ ఏకస్యాపి తదితయోః
అధాంతరిక్షే తౌదృష్టావాగువాచాశరీరిణీ అవతారోఽథ భవితా యువయోర్హి మయా సహ
భారాపనోదః కర్తవ్యం పృథివ్యర్థేసురైఃసహ తదాశ్చర్యోహి భవితా దేవ కార్యార్థ సిద్ధయే
తా॥ మహాతేజుడైన హరుడు తన శూలముతో అతని భుజమును నళికి వేసెను-21. శూల భేదనము వలన రక్తము రోదసి నావరించుటనట్లు పైకి చిమ్మెను. అటునుండి క్రిందికి వచ్చి కపాలమునందు పడెను-22. అందు పడిన రక్తము చూపుడు వ్రేలంత పెరిగెను. శివుని దృష్టి రక్తము వైపు మరలగానే తాను పశ్చిమము వైపు తిరిగి జలమును సృష్టించేను. కపాలమందలి రక్తము, నీరు రెండు కలిసిపోగా-24. అతడా కపాలమునందలి వ్రేలెడు రక్తములో నుండి, ఎఱ్ఱనివాడు, ఎఱ్ఱని (రాగి) కుండలములు ధరించిన వాడు, కవచమును ధరించిన వాడునైన ఒక నరుని సృష్టించెను-25. అతడు శివునితో “ఏమి చేయవలెనో సెలవిండనెను. ఇక బ్రహ్మశిరఃస్థానము నుండి పుట్టిన పురుషుడు కూడ, తెల్లని కుండలములు ధరించిన ఒక నరుని సృష్టించేను-26. ధను:శ్రేష్ఠములను ధరించిన ఆ యిరువురును యుద్ధము చేయసాగిరి. యుగాతిక్రమణము నందలి కుజకేతువుల వలె తలపడిరి-27. వారు యుద్ధము చేయుచుండగా ఒక ప్రళయ కాలముకంటే నధికమగు కాలము గడిచేను. వారిరువురిలోను ఏ ఒక్కరికైనను విజయము కలుగునట్టు కన్పట్టుటలేదు-28. అప్పుడు అంతరిక్షమునుండి అశరీరవాణి, వారినిచూచి ఇట్లనెను. “దేవతలతో కూడి భూలోకభారమును తొలగించుట కర్తవ్యము-29. మా యిరువురిది, నాదికూడ అవతారమగును.” దేవ కార్యసిద్ధి కొఱకు అది యొక ఆశ్చర్యకరమగు సంఘటనయయ్యెను-30.
మూ. భూలోక భావం నిర్ధూయ భూయోగంతా సురాలయమ్ ఏవ ముక్త్వాతు, వైకుంఠో దదావేకం రవేస్తదా
శ్వేత కుండలినం దృప్తం తం జగ్రాహరవిర్ముదా ఇంద్రస్యాపి తతః పశ్చాద్రక్త కుండలినం దదౌ
జగ్రాహచ ముదా యుక్త ఇంద్రః స్వంచపురం యయౌ గతౌ రవీంద్రౌ ప్రగృహ్య పురుషౌక్రోధ సంభవౌ
అథోవాచ తదారుద్రం దేవః కమల సంష్ఠితః “గచ్ఛత్వమపి కాపాల కపాల వ్రత చర్యయా అవతారో వ్రతస్యాస్య మర్త్యలోకే భవిష్యతి
యేచవ్రతం త్వదీయంపై ధారయిష్యంతిమానవాః న తేషాం దుర్లభం కించి ద్భవితేహ పరత్రచ
ఏవం సంలప్య బహుశః సుముఖం ప్రతినంద్యచ అహూయచ సముద్రం స ప్రత్యువాచవిచారయన్
కురుష్వాభరణం స్త్రీణాం లక్షణం యద్విలక్షణమ్ కార్తికేయేన యత్ప్రోక్తం తద్వదస్వావిచారయన్
సచాహ మమనామ్నేదం భవేత్పురుష లక్షణమ్ దేవేన తత్ప్రతి జ్ఞాత “మేవమేతద్భవిష్యతి”.
కార్తికేయేన యత్ప్రోక్తం తద్వదస్వావిచారయన్
ప్రయచ్ఛాస్య విషాణంవై నిష్కృష్టుం యత్త్వ యోధునా అవశ్యమేవ తద్భూతం భవితవ్యంతు కస్యచిత్
తా॥ అశరీరవాణి ఇట్లు చెప్పి భూలోక భావమును విడిచి దేవలోకమునకు పోయెను. అప్పుడు విష్ణుదేవుడు ఇద్దటి నరులలో ఒకనిని సూర్యునకిచ్చెను-31. సూర్యుడు సంతోషముతతో, శ్వేతకుండలములు ధరించియున్న గర్వితుడగు నరుని స్వీకరించెను, రక్తకుండలముల వానిని ఆపిదప ఇంద్రునకిచ్చెను-32. ఇంద్రుడు కూడా వానిని సంతోషముతో తీసికొని స్వర్గమునకుఁబోయెను. క్రోధము నుండి పుట్టిన ఆ యిరువురు పురుషులను సూర్యుడు ఇంద్రుడు తీసుకొని వెడలిపోయిరి-33. అప్పుడు బ్రహ్మదేవుడు శివునితో “కపాలముగల పొడవై, కపాలవ్రతము నందు చరించుచు నీవు కూడా వెడలిపొమ్ము, మునుష్యలోకము నందీవ్రతమవ తరింపగలదు-34. ఈ నీ వ్రతముననుష్ఠించు మానవులకు ఇహపరలోకములయందు దుర్లభమైన దేదియునుండదు-35. ఇట్లనేక విధములుగా బ్రహ్మ ప్రీతి పూర్వకముగ మాట్లాడగనే శివుడు సంతోషించి సముద్రుని పిలిచి అతనితో నిర్విచారముగ నిట్లనెను. -36 “విలక్షణమైన రీతిలో స్త్రీ లక్షణమను గ్రంథమును అభరణప్రాయమైన దానిని రచింపుము, కార్తికేయుడు రచించియుండిన పురుష లక్షణమును కూడా సంశయింపక రచింపుము" -37 “పురుష లక్షణమను గ్రంథము నా పేరనే ప్రచురము కావలెనని” సముద్రుడు కోరెను. 'అటులేయగున'ని శివుడు వాగ్దానము చేసెను-38 'కార్తికేయుని చేత చెప్పబడిన పురుష లక్షణము నీవు తిరిగి సందేహింపకుండ చెప్పుమని శివుడు మఱల రెట్టించి చెప్పెను-39 “నీవిప్పుడు ఊడబెరికిన వినాయకుని దంతమును అతనికి ఇచ్చివేయుము” అని కార్తికేయునకు చెప్పెను. ఎవనికైనను కానున్నది కాకమానదు-40.
మూ. ఋతే వినాయకం తద్వై దైవ యోగాన్నకామతః గృహాణ ఏతత్సాముద్రం యత్త్వయాపరికీర్తితమ్
స్త్రీ పుంసోర్లక్షణం శ్రేష్ఠం సాముద్రమితి విశ్రుతమ్ ఇమంచ సవిషాణంపై కురుదేవ వినాయకమ్
అధోవాచచ దేవేశంబాహులేయః సమత్సరమ్ 'విషాణం దద్మిచాస్యాహం తవ వాక్యాన్నసంశయః
యదాత్వయం విషాణంచ ముక్త్వాతు విచరిష్యతి తదా విషాణముక్తః సన్భస్మ ఏతం కరిష్యతి
ఏవ మస్త్వితి తం చోక్త్వా విషాణం తత్కరేదదౌ వినాయకస్తుదేవేశః కార్తికేయమతే స్థితః
స విషాణ కరోద్యాపి దృశ్యతే ప్రతిమా నృప! భీమసూనోర్మహాబాహోర్విఘ్నం కర్తుమహాత్మనః
ఏతద్రహస్యం దేవానాం మయా తేస ముదాహృతమ్ యత్రదేవో నవైవేద దేవానాంభువి దుర్లభమ్
మహాప్రసన్నేన తవ గుహ్యమేతదుదాహృతమ్ కధితం తిథి సంయోగే వినాయక కథామృతమ్
య ఇదం శ్రావయేద్విద్వాన్భ్రహ్మణాన్వేదపారగాన్ క్షత్రియాంశ్చస్వవృత్తిస్థాన్వీట్ శూద్రాంశ్చగుణాన్వితాన్
నతస్య దుర్లభం కించిదిహచాముత్ర విద్యతే నచ దుర్గతి మాప్నోతి నచ యాతి పరాభవమ్
నిర్విఘ్నం సర్వకార్యాణి సాధయేన్నాత్ర సంశయః బుద్ధిం వృద్ధిం శ్రియం చాపి విందేత భరతోత్తమ
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహిత్యం బ్రా హ్మేపర్వణి
చతుర్థీకల్ప వర్ణనం నోమద్వావింశోఽధ్యాయః
తా॥ వినాయకుని గూర్చి ఇట్టిది నిజముగా దైవయోగము వలననేకాని ఎవరి కోరికను బట్టియు జరుగలేదు. కుమారా! సముద్రమున వేయబడియుండిన ఈ నీ పురుషలక్షణ గ్రంథమును తీసికొనుము-41. స్త్రీ పురుష లక్షణములు చెప్పబడిన శ్రేష్ఠమగు గ్రంథము సాముద్రమనియే ప్రసిద్ధినొందును. దేవ వినాయకుని మఱల కొమ్ము (దంతము) గల వానినిగా చేయుము-42. శివుడు చెప్పిన ఈ మాటవిని కార్తికేయుడు మత్సరముతో నిట్లనెను. “తండ్రీ నీ మాట పాటించి ఇతని దంత మిచ్చివేయుదును. సంశయము లేదు-43. కానీ ఈ దంతమునీతడు ఎప్పుడును పట్టుకొనియేయుండవలెను. దంతమును విడిచి తిరిగిన యెడల అదీ అతనిని భస్మము చేయును-44. అటులే కానిమ్మని అతడు తన సమ్మతి తెలుపగా కుమారస్వామి, దంతమును వినాయకుని చేతికిచ్చెను. వినాయక దేవుడు కార్తికేయుని ఇచ్చననుసరించియేయుండెను-45. రాజా! వినాయకుని విగ్రహము నేటికిని చేతిలో దంతము తోడనే కనపడును. విష్ణుకర్త మహాత్ముడైన శివ కుమారుని మూర్తి దంతయుక్తమై యుండును-46. ఈ దేవతల రహస్యమును నీకు చెప్పితిని. దీనిని దేవదేవుడే తెలిసికొనలేకపోయేను. "భూమిపై దీనిని తెలియుట దుర్లభము-47. నేను ప్రసన్నుడనై నీకు చెప్పితిని. చతుర్టీ తిథి సంయోగమున ఈ వినాయక కథామృతము వివరింపబడినది-48. దీనిని వేదపారగులైన బ్రాహ్మణులకు గాని, తమ వృత్తుల యందు జీవించు క్షత్రియులకుగాని, వైశ్యులకుగాని, గుణవంతులైన శూద్రులకు గాని వినిపించిన విద్వాంసునకు-49. ఇహ పరములయందు దుర్లభమైనదేమియు నుండదు. అతనికి ఎట్టి దుఃస్థితిని అవమానము గాని సంభవింపదు-50. అన్ని పనులను ఆటంకములు లేకుండ సాధించుకొనగలుగును. సకల సంపత్సమృద్ధిని, ఐశ్వర్యమును పొందును-51.
శతార్ధ సాహస సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున
చతుర్ధి కల్పవర్ణనమను ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 22 of the Bhavishya Mahā Purana is as follows:
The Caturthī Kalpa opens with the origin story of the caturthī vrata dedicated to Gaṇeśa. The conflict between Skanda and Gaṇeśa for primacy among Śiva's sons is narrated: when the two brothers compete in the circuit of the universe, Gaṇeśa circumambulates his parents Śiva and Pārvatī — who are themselves the universe — and wins. The deeper mythic content of this chapter includes the account of Brahma's transgression against Sarasvatī, which led Śiva to sever Brahma's fifth head. The four-headed Brahma who remains is a humbled creator, and the Caturthī vrata in which this episode is commemorated teaches the worshipper to approach Gaṇeśa with the same humility that is the precondition of all wisdom.