భవిష్య మహా పురాణము
20. పుష్ప ద్వితీయా వర్ణనము
శతానీక ఉవాచ :
“బ్రూహిమే ద్విజశార్దుల! ద్వితీయాం ఫలసంజ్ఞతామ్ యాముపోష్యనరో యోషిద్వియోగం నేహ గచ్ఛతి.
పత్న్యా నరో మునిశ్రేష్ఠ! భార్యాచ పతినా సహ తామహంశ్రోతుమిచ్ఛామి విధవాస్త్రీన జాయతే ఉపోషితేన యో నార్యః పత్యాచసహితో నరః
తన్మేబ్రూహి ద్విజశ్రేష్ఠ! శ్రేయోఽర్థం నరయోషితామ్ యేన మే కౌతుకం బ్రహ్మన్! శ్రుత్వాపూర్వం ప్రసర్పతి”
సుమంతురువాచ :
“అశూన్యశయనాం నామ ద్వితీయాంశ్రుణుభారత! యాముపోష్యనవైధవ్యం స్త్రీ ప్రయాతి నరాధిప! పత్నీవియుక్తశ్చనరో న కదాచిత్ర్పజాయతే
శేతే జగత్పతిః కృష్ణః శ్రియా సార్థం యదానృప! అశూన్యశయనా నామ తదాగ్రాహ్యాహి సా తిథి:
కృష్ణ పక్షే ద్వితీయాయాం శ్రవణే మాసి భారత! ఇదముచ్చారయత్స్నాతః ప్రణమ్య జగతః పతిమ్ శ్రీ వత్సధారిణం దేవం భక్త్యాభ్యర్చ్య శ్రియా సహ
“శ్రీవత్సధారిన్! శ్రీకాంత! శ్రీవత్స! శ్రీ పతేఽవ్యయ గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థకామదమ్”
“గావశ్చ మా ప్రణశ్యంతు మా ప్రణశ్యంతు మేజనాః
“జామయో మా ప్రణశ్యంతు మత్తో దాంపత్యభేదతః “లక్ష్మ్యా వియుజ్యేహం దేవ న కదాచిద్యథా భవాన్
“తథా కలత్రసంబంధో దేవ మా మే వియుజ్యుతామ్ “లక్ష్యానశూన్యం వరద! యధాతే శయనం సదా
“శయ్యా మమాప్యశూన్యాస్తు తథాతు మధుసూదన!” ఏవం ప్రమాద్య పూజాంచ కృత్వాలక్ష్మ్యాస్తథాహరేః
ఫలాని దద్యాచ్ఛాయాయామభీష్టాని జగత్పతిమ్ నక్తం ప్రణమ్యాయతనే హవిర్బుంజీత వాగ్యతః
తా ॥ శతానీకుడిట్లనెను.
బ్రాహ్మణోత్తమా! ఏ దినమున ఉపవసించి నరుడు సతీ వియోగమును పొందడో అట్టి ఫల సంజ్లిక ద్వితీయాతిథిని గూర్చి నాకు చెప్పుడు-1. ఓ ముని శ్రేష్టా! పురుషుడు భార్యతో గూడి, స్త్రీ పతీతో కూడి దేని వలన చిరకాలముందురో స్త్రీ ఎప్పుడును వైధవ్యము పొందకుండునో, ఏ తిథియందుపవసించుటచేత పురుషుడు ఎల్లకాలము భార్యాసహితుడైయుండునో అట్టి 'ఫలద్వీతీయ' గుణించి వినగోరుచున్నాను-2. స్త్రీ పురుషులకు శ్రేయోదాయకమగు అట్టి వ్రతమును గూర్చి నాకు తెలుపుడు. ... అది వినుటకు పూర్వము నాలో కుతూహలము కదలుచునేయుండును”-3. సుమంతుముని ఇట్లనెను. 'అశూన్యశయన' అను పేరు గల ద్వితీయను గుళించి వినుము. అట్టి ద్వితీయనాడు ఉపవాస విధినాచరించు స్త్రీ, వైధవ్యము పొందదు. పురుషుడాచరించుచో ఎన్నడును పత్నీ వియోగము పొందడు-4. రాజా! జగత్పతి యైన విష్ణుదేవుడు తన భార్యయగు శ్రీ లక్ష్మితో శయనించు దినమే అశూన్యశయన ద్వితీయగా తెలియవలెను-5. శ్రావణ మాస కృష్ణపక్ష ద్వితీయనాడు స్నానమాచరించి, జగత్పతి, శ్రీవత్సలాంఛనుడు అయిన విష్ణుదేవుని భక్తితో పూజించి, అతనికి నమస్కరించుచు ఇట్లు ప్రార్థింపవలెను-6. " హే శ్రీ వత్సధారీ! శ్రీకాంతా! శ్రీవత్సా! శ్రీపతీ! అవ్యయా! ధర్మార్థకామముల నిచ్చు నాగృహస్థాశ్రమము నష్టపడకుండుగాక!-7. మా గోవులు సురక్షితముగ నుండుగాక. మా జనులు సురక్షితముగ నుందురుగాక-8. నా తోడబుట్టిన స్త్రీలు, మా దాంపత్యములోని కలతల వలన నష్టపడకుందురుగాక, ఎప్పుడును నీవు లక్ష్మితో నెట్లు కలిసియేయుందువో అటులే నేను కూడ ఎల్లప్పుడును ధన ధాన్యాది సంపదలతో విడువబడక ఉందునుగాక-9. అటులే నాభార్య(లు)కూడ నన్ను పాయకుండుదురు)గాక. హే వరదాయకా! ఎల్లప్పుడును లక్ష్మిలేకుండ నీవు శయనింపనటు-10. నాశయ్యకూడ ఎప్పుడును భార్యారహితముగ నుండకుండుగాక”. ఇట్లు స్తుతించి, లక్ష్మీనారాయణుల పూజచేసి-11. ప్రదోషకాలమున శ్రీ హరి కిష్టమైన వివిధ ఫలములను నివేదించి, రాత్రి సమయమున ఆలయమునందలి దేవునికి నమస్కరించి వాజీయముము కలవాడై ఆ ఫలములను భుజింపవలెను. (12)
మూ.బ్రాహ్మణాయ ద్వితీయేఽహ్నీ శక్త్యా దద్యాచ్చ దక్షిణామ్”
శతానీక ఉవాచ :
“కాని తాని అభీష్టాని కేశవస్య ఫలానితు యోజ్యాని శయనే విప్ర! దేవ దేవస్య కథ్యతామ్
కించ దానం ద్వితీయేఽ హ్నిదాతవ్యం బ్రాహ్మణస్యతు భోక్తైర్మరైర్ద్విజ శ్రేష్ఠ దేవ దేవస్య శక్తిత:”
సుమంతురువాచ :
“యాని తత్రమహాబాహో! కాలే సంతి ఫలానితు మధురాణి సుతీవ్రాణి న చాపి కటుకానీతు
దాతవ్యాని నృపశ్రేష్ట! స్వశక్త్యాశయనేనృప! మధురాణి ప్రదత్తాని నరో వల్లభతాంవ్రజేత్
యోషిచ్చకురుశార్దూల! భర్తుర్వల్లభతామియాత్ తస్మాత్కటుక తీవ్రాణి స్త్రీ లింగాని వివర్జయేత్
ఖర్జూర మాతులింగాని శ్వేతేన శిరసా సహ ఫలాని శయనే రాజన్యజ్ఞ భాగ హరస్యతు
దేయాని కురుశార్దుల! స్వశక్త్యాముంజకేశినే ఏతాన్యేవతు విప్రస్య గాంగేయ సహితానితు
ద్వితీయేఽహ్ని ప్రదేయాని భక్త్యాశక్త్యాచ భారత! వాసోదానం తథా ధాన్య ఫలదాన సమన్వితమ్ గాంగేయస్యవిశేషేణ ధాన్యదానం ప్రచక్షతే
తా ॥ రెండవ దినమున బ్రాహ్మణునకు యదాశక్తి దక్షిణనీయవలెను-13. శతానీకుడిట్లనెను. “విష్ణుదేవున కిష్టమైన ఫలములెవ్వి? ఆ దేవుని శయన కాలమున వేనిని సమర్పింపవలయునో నెలవిండు-14. రెండవ దినమున భక్తులేదానమును బ్రాహ్మణునకీయవలెను? శక్తి కొలదిగ దేవునకు సమర్పింవలసినవేవి?” -15. సుమంతుముని ఇట్లు చెప్పెను. “ఆ ఋతువునందేయే ఫలములు లభ్యములగునో పోనీలో మిక్కిలి తీయనివీ పుష్కలముగ సమర్పింపవలెను. కానీ పక్వముకానీ, రుచిలేనివి, అతిగా పండినవి, శ్రేష్టములు కానివి సమర్పింపకూడదు-16. దేవుని శయనకాలమున శక్తిననుసరించి ఇట్టి మంచి పండ్లను నివేదింపవలెను. తీయని పండ్లు సమర్పించిన మనుష్యుడు భార్య(ల)కు ప్రేమపాత్రుడగును-17. స్త్రీ సమర్పించినచో భర్త ప్రేమను చూరగొనును. అందువలన మిక్కిలిగా చెడినవి, స్త్రీలింగమున చెప్పబడునవి విడిచి పెట్టవలెను-18. స్వచ్చములు, తొడిమలుగలవి అయిన ఖర్జూరములు, మాదీఫలములు (ఇంకను ఇట్టివి) దేవదేవుడైన విష్ణువునకు . అతని శయన కాలమున సమర్పింపవలెను-19. స్వశక్తిననుసరించి విష్ణువున కిచ్చిన ఫలములువంటి ఫలములే బ్రాహ్మణునకు కూడ నారికేళములతో సువర్ణముతో కూడ-20. భక్తితో శక్తి కొలదిగ రెండవదినమున, సమర్పింపవలెను. ఇంకను నూతన వస్త్రములు, ధాన్యము, వివిధములైన ఫలములు, దానమీయవలెను. ధాన్యముతోబాటు సువర్ణదానమిచ్చుట విశేషమని చెప్పుదురు-21.
ఏవం కరోతి యః సమ్యజ్నరో మాస చతుష్టయమ్ తతో జన్మత్రయం వీర! గృహభంగో నజాయతే
అశూన్య శయనశ్చాసౌ ధర్మకామార్థసాధనః భవత్యవ్యాహతైశ్వర్యః పురుషోనాత్రసంశయః
నారీచ రాజన్! ధర్మజ్ఞా వ్రతమేతద్యథా విథి యా కరోతి నసా శోచ్యాబంధు వర్గస్య జాయతే
వైధవ్యం దుర్భగత్వంచ భర్తృత్యాగంచ సత్తమ! నాప్నోతి జన్మ త్రితయ మేతచ్చీర్త్వా మహావ్రతమ్
అదత్త్వా కటుకానీహ ఫలాని కురునంద న! ఖర్జూర మాతులింగాని బృహత్ఫల శ్రీరాంసి చ
దత్వాద్విజేభ్యో రాజేంద్ర మధురాణిపరాణి చ తస్మాత్స్వశక్త్యా యత్తేన దేయాని మధురాణి చ
ఇత్యేషా కధితా కృష్ణ ద్వితీయా తిధిరుత్తమా యాముపోష్యనరో రాజనృద్ధిం వృద్ధిం తథావ్రజేత్"
శతానీక ఉవాచ :
భవతా కథితేయం వై ద్వితీయా తిథిరుత్తమా అశ్విభ్యాం ద్విజశార్దూల! కథమస్యాం జనార్ధన :
సంపూజ్యః ఫల సంజ్ఞాయాం కధితః పద్మయా సహ తదత్రకౌతుకం మహ్యం సుమహజ్జాయతేద్విజ!”
సుమంతురువాచ :
“ఏవమే తన్న సందేహో తదావదసి భారత! అశ్వినోర్వై తిథిరియం కింతు వాక్యంనిబోధమే
అశూన్యశయనా దత్తా విష్ణోరమిత తేజసః అశ్విభ్యాం కురుశార్దూల! ప్రీతయే ముంజకే శినః
తావేవ కురుశార్దూల! పూజ్యేతేఽత్ర మహీపతే నా సత్యౌ భగవాన్విష్ణుర్దత్తశ్చ శ్రీర్విభావ్యతే
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధసాహ్యం సంహితాయాం బ్రా హ్మే పర్వణి
ద్వితీయా కల్పసమాప్తో వింశోఽధ్యాయః
తా॥ ఇట్లు నాలుగు మాసములు ఈ వ్రతమును చక్కగానాచరించు వానికి మూడు జన్మలు గృహభంగముకాదు-22. ధర్మార్థకామములు సాధింపగలుగు నీ అశూన్యశయన వ్రతమాచరించువాడు అవ్యాహతమగునైశ్వర్యము గలవాడగుననుటలో సందేహము లేదు-23. ఈ వ్రతమును యధావిధిగ నాచరించు స్త్రీ ధర్మజ్ఞురాలై బంధు వియోగ సంబంధమైన దుఃఖము లేక హాయిగ నుండును-24. వైధవ్యముగాని, భర్తచేత నిరాదరింపబడుటగాని, విడిచి పెట్టబడుట గాని లేకుండ మూడుజన్మలు సుఖముగ జీవించును-25. ఖర్జూరములు, మాదీఫలములు మొదలగు శ్రేష్ఠమైన ఫలములు, చెడనివి, అపక్వములు కానివి, క్రుళ్ళిపోనివి అయిన మంచి పండ్లిచ్చుట చేత మాత్రమే ఈ సత్ఫలము కలుగును-26. రాజేంద్రా! బ్రాహ్మణులకు శక్తికొలదిగ మధురములైన శ్రేష్ఠములైన, స్వచ్చమైన ఫలములే దానము చేయవలెను-27. ఇట్లు కృష్ణద్వితీయ అనెడి ఉత్తమమైన తిథిని గూర్చి చెప్పబడినది. ఈ తిథియందుపవాస వ్రతము నాచరించు మానవుడు సకల వస్తు సమృద్ధిని పొందును”-28. శతానీకుడిట్లనెను. “మీరు ఈ ఉత్తమమైన విదియ తిథి గూర్చి వివరించి చెప్పితిరి. కాని అశ్వినీ కుమారుల కొఱకు ఉత్తమమైన ఈ తిథియందు విష్ణువేట్లు-29. పూజ్యుడయ్యెను? ఫల సంజ్ఞతోనొప్పెడు నీ తిథినాడు లక్ష్మీదేవితో సహా విష్ణువు పూజింపబడుటెట్లు? తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలము కలుగు చన్నది-30. సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “ ఇది సందేహింపవలసిన విషయము కాకున్నను నీ వట్లడుగుచుంటివి. ఇది అశ్వినుల తీథియే. కాని నేను చెప్పునది తెలసికొనుము-31. ఏమన అమిత తేజస్వియైన విష్ణుదేవునకు, అతని ప్రీతికొఱకై, అశ్వినీ కుమారులు ‘అశూన్య శయన'నతని కిచ్చిరి-32. సత్యవ్రతులైన వారే అతినినాదినమున పూజించుకొందురు, భగవానుడైన విష్ణువునకు ఆనాడు లక్ష్మీ ఈయబడినట్లు భావింపబడుచున్నది-33.
శతార్ధ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ద్వితీయా కల్ప మాప్తియను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 20 of the Bhavishya Mahā Purana is as follows:
The Puṣpa-dvitīyā vrata is elaborated: the offering of specific flowers to Viṣṇu on the second tithi of each fortnight, accompanied by specific prayers for the protection of the marriage bond. A second great vrata is introduced — the Aśūnyaśayana — in which Bhagavān Viṣṇu is worshipped resting alongside Mahālakṣmī on his divine couch. The symbolism of the paired divine presence is interpreted as a cosmic affirmation of the sacred bond between husband and wife. Offerings of fruit, fragrant flowers, and lamp-light are made, and the woman who observes this vrata is promised that her husband will never be taken from her — that the bond of marriage will remain unbroken across births. The fruits of Puṣpa-dvitīyā are summarised as health, spousal devotion, and the grace of Lakṣmī.