17. ప్రతి పత్కల్సమున బ్రహ్మపూజన విధి వర్ణనము

శతానీక ఉవాచ :

మూ ॥ బ్రూహిమే విస్తరాద్ర్బహ్మన్తి పత్కృత్య మాదరాత్ బ్రహ్మపూజా విధానంచ పూజనే యచ్చవై ఫలమ్

సుమంతురువాచ :

శృణష్వైకమనా రాజన్కథయా మ్యేషశాంతిదమ్ పూర్వమేకార్ణవే ఘోరే నష్టే స్థావరజంగమే

స్వయంభూరభవద్దేవః సురజ్యేష్ఠ శ్చతుర్ముఖః ససర్జలోకాన్ దేవాంశ్చ భూతాని వివిధానిచ

కాయేన మనసావాచా జంగమ స్థావరాణిచ పితాయః సర్వదేవానాం భూతానాంచ పితామహః

తస్మాదేష సదా పూజ్యోయతో లోకగురుః పరః సృజత్యేష జగత్కృత్స్నం పాతి సంహరతే తథా

రుద్రోస్యమనసోజాతో విష్ణుర్జాతోఽస్యవక్షసః ముఖేభ్యశ్చతురో వేద వేదాంగానిచ కృత్స్నశః

దేవాప్సరస గంధర్వాః సయక్షోరగరాక్షసాః పూజయంతి సదావీర! విరించిం సురనాయకమ్

 సర్వోబ్రహ్మమయోలోకః సర్వం బ్రహ్మణి సంస్థితమ్ తస్మాత్సమర్చయే ద్ర్బహ్మన్య ఇచ్ఛేచ్చ్రేయ ఆత్మనః                 

 యోన పూజయతే భక్త్యా సురజ్యేష్ఠం సురేశ్వరమ్ నసనాకస్య రాజ్యస్యనచ మోక్ష స్యభాజనమ్

 యస్తు పూజయతే భక్త్యా విరించిం భువనేశ్వరమ్ సనాక రాజ్యమోక్షేషు క్షిప్రం భవతి భాజనమ్

తా॥ శతానీకుడిట్లనెను “ఓ బ్రహ్మదేవా! నాయందనుగ్రహముంచి, ప్రతిపత్కృత్యమును బ్రహ్మ పూజనమును, పూజ వలన కలుగు ఫలమును వివరించి చెప్పుడు”. సుమంతు ముని ఇట్లు చెప్పెను “శాంతి నిచ్చెడు ఈ విషయమును గూర్చి చెప్పుచున్నాను. సావధాన మనస్కుడవై వినుము. పూర్వము స్థావర జంగమములన్నియు నశించి ప్రళయమేర్పడెను. ఒకే ఒక్క విశాలమైన కడలి మాత్రముండెను. దాని నుండి దేవతలలో పెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మ స్వయంభువుగా ఆవిర్భవించి లోకములను, దేవతలను, వేర్వేరు భూతములను సృష్టించెను. అంతేకాక వివిధ జంగమ స్థావరములను త్రికరణములచే రచించెను. అతడు దేవతలకు తండ్రియు, భూతరాశికి పితామహుడు -4. అందువలన అతడు అందజికిని పూజ్యుడైన లోక గురువు. జగత్తునంతయు అతడు సృష్టించును. పాలించును. సంహరించును. ఇతని మనస్సునుండి రుద్రుడు, వక్ష స్థలమునుండి విష్ణువు పుట్టిరి. ఇతని ముఖముల నుండి నాలుగు వేదములు, వేదాంగములన్నియు పుట్టెను. దేవతలకు నాయకుడైన ఈ విరించిన దేవతలు, అప్సరసలు, గంధర్వులు, యక్షులు, ఉరగులు, రాక్షసులు ఎల్లప్పుడును పూజించుచుదురు. ఈ లోకమంతయు బ్రహ్మమయము. అంతయును బ్రహ్మయందున్నది. కావున తన శ్రేయమును కోరుకొనువాడెవడైనను అతనిని చక్కగా పూజింపవలెను. సురేశ్వరుడైన అతనిని భక్తితో పూజింపనివాడు స్వర్గ రాజ్యమునకుగాని మోక్షమునకుగాని అరుడు కాడు. ఈ భువనేశ్వరుడైన విరించిని భక్తితో పూజించువాడు స్వర్గాది పుణ్యలోకములకు లేక మోక్షమునకు 'యోగ్యుడగును.

 మూ. తస్మాత్సౌమ్యమనాభూత్వా యావజ్జీవం ప్రతిజ్ఞయా అర్చయిత్వా సదా దేవమాపన్నోపి నరో నృప!

వరం దేహపరిత్యాగో వరం నరక సంభవః నత్వేవా పూజ్యభుంజంతి దేవంవై పద్మసంభవమ్

సదా పూజయతే యస్తు వీర భక్త్యా పితామహమ్ మనుష్య చర్మణా నద్ధః సవేధా నాత్రసంశయః

నహివేధోఽ ర్చనాత్కించిత్పుణ్యమభ్యధికం భవేత్ ఇతి విజ్ఞాయ యత్నేన పూజనీయః సదా విధి:

యో బ్రహ్మాణం ద్వేష్టి మోహాత్సర్వదేవ నమస్కృతమ్ నరో నరకగామి స్యాత్తస్య సంభాషణాదపి

బ్రహ్మణోర్చాం ప్రతిష్టాప్య సర్వయత్నైర్విధానతః యత్పుణ్యం ఫలమాప్నోతి తదేకాగ్రమనాః శృణు

సర్వ యజ్ఞ తపోదాన తీర్థవేదేషు యత్ఫలమ్ తత్ఫలం కోటి గుణితం లభేద్వేధః ప్రతిష్ఠయా

కంజజం స్థాపయేద్యస్తు కృత్వాశాలాం మనోరమామ్ సర్వాగమోదితం పుణ్యం కోటి కోటి గుణం లభేత్

మాతృజానితృజాంశ్చైవ యాంచైవోద్వహతే స్త్రియమ్ కులైక వింశముత్తార్య బ్రహ్మలోకే మహీయతే

భుక్త్వాతు విపులాన్భోగాన్ప్రలయే సముపస్థితే జ్ఞానయోగం సమాసాద్య సతత్రైవ విముచ్యతే

తా ॥ అందువలన మానవుడు ఆపదలో నుండినను సౌమ్యమైన మనస్సుగలవాడై జీవించియున్నంత కాలమును ప్రతిజ్జాపూర్వకముగ బ్రహ్మదేవుని పూజించుచుండవలెను. అట్లు పూజించినవానికి దేహపరిత్యాగమైనను నరకమైనను శ్రేష్ఠములే. ఏలయన బ్రహ్మ పూజనము చేయనివారు మాత్రము దానిననుభవింతురు, మిక్కిలి భక్తితో ఆ విరించిని అర్చించువాడు మనుష్య చర్మముతో కప్పబడిన బ్రహ్మదేవుడే యగుచున్నాడు. సందేహము లేదు. బ్రహ్మ పూజనము కంటే పుణ్యాధిక్యము నిచ్చునది వేడొకటిలేదని తెలిసికొని నియతముగా నిరంతరముగా తత్పూజనము చేయవలెను, అందు దేవతల చేత నమస్కరింపబడు బ్రహ్మను మోహవశమున నెవడు ద్వేషించునో, లేక అట్టి ద్వేష సంభాషణముచేయునో వాడు నరకమునకు పోవును. బ్రహ్మదేవుని అర్చామూర్తిని సర్వ ప్రయత్నములతో విధి విధానముగ ఎవడు ప్రతిష్ఠించునో వాడు పొందు పుణ్య ఫలమును గూర్చి సావధానుడవై వినుము. అన్ని యజ్ఞములు, తపములు, దానములు, తీర్థములు, వేదములలో ఏ ఫలము కలదో దానికి కోటి కోటి రెట్లు అధికముగా బ్రహ్మ ప్రతిష్ఠ వలన లభించును. ఒక సుందరమైన ఆలయమును నిర్మించి అందు బ్రహ్మను ప్రతిష్ఠించిన యెడల సర్వాగమములలో చెప్పబడిన పుణ్య ఫలమునకు కోటి కోటి రెట్లు అధిక ఫలము లభించును. బ్రహ్మ ప్రతిష్ఠ చేయువాడు తల్లి దండ్రుల యొక్కయు భార్య యొక్కయు ఇరువది యొక్క తరములను ఉద్ధరించువాడై బ్రహ్మ పద ప్రాప్తినందును. అచట విస్తారమైన దివ్య భోగములనుభవించి, ప్రళయము సంభవించినపుడు జ్ఞాన యోగమునంది అచటనే మోక్షము నందును.

మూ. అధవా రాజ్యమాకాంక్షే జ్ఞాయతే సంభవాంతరే సప్త ద్వీప సముద్రాయాః క్షితే రథపతిర్భవేత్

త్రిసంధ్యం యో జపేద్ర్బహ్మ కృత్వాష్టదల పంకజమ్ పౌర్ణమాస్యాం ప్రతి పది తస్య పుణ్య ఫలం శృణు

అనేనైవ సదే హేన బ్రహ్మా సంతిష్ఠతే క్షితౌ పాపహా సర్వ మర్త్యానాం దర్శనాత్స్పర్శనాదపి

ఉధృత్య దివి సంస్ధాప్య కులానామేక వింశతిమ్ తైః కులైః సహితో నిత్యం మోదతే గోగతోనృప!

 అప్యేక వారం యోభక్త్యా పూజయేత్పద్మసంభవమ్ పద్మస్థం మూర్తిమంతం వా బ్రహ్మలోకం సగచ్ఛతి

పుణ్యక్షయాత్ క్షీతిం ప్రాప్య భవేత్ క్షితిపతిర్మహాన్ వేద వేదాంగ తత్త్వజ్ఞో బ్రాహ్మణశ్చాపి జాయతే

నతత్తపోభిరత్యుగ్రైర్నచ సర్వైర్మహా మఖైః గచ్ఛేద్ర్బహ్మపురం దివ్యం ముక్త్యా భక్తి పరాత్మకాన్

మృద్దార్వైష్టక శైలైర్వాయః కుర్యాద్భ్రహ్మణోగృహమ్ త్రిః సప్తకులసంయుక్తో బ్రహ్మలోకే మహీయతే

మృన్మయాత్కోటి గుణితం ఫలం దార్విష్ట కామయే ఇష్టకాద్ద్వి గుణం పుణ్యం కృతే శైలమయే గృహే

 క్రీడ మానోపి యః కుర్యాచ్ఛాలాంవై బ్రహ్మణేనృప! బ్రహ్మలోకే సలభతే విమానం సర్వకామికమ్

తా ॥ ఒకవేళ రాజ్యమే కోరినచో సృష్ట్యంతరములో, జంబూ ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు, లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర శుద్ధజలములను సప్త సముద్రములతో కూడిన భూమికి చక్రవర్తియగును. అష్టదళ పద్మమును సిద్ధపఱచి పూర్ణిమనాడు పాడ్యమినాడును మూడు సంధ్యలలోను బ్రహ్మజపము చేయువాని పుణ్యఫలమును గూర్చి వినుము. ఈ దేహముతోడనే ఈ భూమియందే అతడు బ్రహ్మగా నుండును. మానవులందఱకును అతనిని దర్శించినను, స్పృశించినను పాపములన్నియు పటాపంచలైపోవును. అతడు తన కులమునకు చెందిన ఇరువది యొక్క తరముల పురుషులనుద్దరించి వారికి స్వర్గప్రాప్తి కలిగించి వారితో సహా తాను ఈ భూమియందే ఉండి సుఖించును. తామర పువ్వులో పుట్టి అందే విరాజమానుడైన బ్రహ్మదేవుని ఒక్క పర్యాయమైనను భక్తితో పూజించిన వాడు బ్రహ్మలోకమును పొందును. పుణ్యము తగి పోయిన పిదప ఈ భూమిపై జన్మించి గొప్ప చక్రవర్తియగును. భక్తి పరములైన ఇట్టి యత్నములతో కాక దివ్యమైన బ్రహ్మలోక నివాసము అత్యుగ్రములైన తపములచేతగాని, అనేక విధములైన యాగములచేతగాని అభింపదు. మట్టి, కఱ (లేక ఇత్తడి), ఇటుకజాయి, శిల - వీనిలో దేనితోనైనను బ్రహ్మకు ఆలయము నిర్మించినవాడు ఇరువది యొక్క తరముల వారితో గూడి బ్రహ్మలోకమున వెలుగొందును. మట్టితో లేక ఇటుకజాయితో నిర్మించిన ఆలయము వలన కోటి రెట్లు ఫల మధికముగ నుండును. ఇటుకలతో నిర్మించుటకంటే జాతితో నిర్మించిన రెండింతలు పుణ్యమధికముగ లభించును. రాజా! ఆడుచు నైనను బ్రహ్మాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకమున సర్వకామికమైన విమానమును పొందును.

మూ. పుష్పమాలా పరిక్షిప్తం కింకిణీ జాల భూషితమ్ దోలా విక్షేప సంపన్నం ఘంటాచామర భూషితమ్

ముక్తాదామ వితానేన శోభితం సూర్య సుప్రభమ్ అప్సరోగణ సంకీర్ణం సర్వకామ సుఖప్రదమ్

తత్రోషిత్వా మహాభోగీ క్రీడమానః సదాసురైః పునరాగత్యలోకేస్మిన్జా భవతి ధార్మికః

పశ్యన్సరి హరన్ జంతూన్మృదు పూర్వం మహీపతే శనైః సంమార్జనం కుర్వం శ్చాంద్రాయణ ఫలం వ్రజేత్

వస్త్ర పూతేన తోయేనయః కుర్యాదుసలేపనమ్ పశ్యన్పరిహరన్ జంతూర్ శ్చాంద్రాయణ ఫలం లభేత్

 నైరం తర్యేణయః కుర్యాత్పక్షం సంమార్జనార్చనమ్ యుగ కోటిశతం సాగ్రం బ్రహ్మలోకే మహీయతే

 తస్యాంతే స చతుర్వేదః సురూపః ప్రియదర్శనః ఆడ్యః సర్వగుణో పేతో రాజాభవతి ధార్మికః

కపటేనాపియః కుర్యాద్భ్రహ్మశాలాం సుమానద! సంమార్జనాదివై కర్మ సోఽపి ప్రాప్నోతి తత్ఫలమ్

తావద్భ్రమంత్రి సంసారే దుఃఖశోక భయ ప్లుతాః న భవంతి సురశ్రేష్ఠే యావద్భక్తా మహీపతే

సమాసక్తం యథా చిత్తం జంతోర్విషయగోచరే యద్యేవం బ్రహ్మణిన్యస్తం కోన ముచ్యేత బంధనాత్?

తా ॥ ఆ విమానము నలు ప్రక్కల పూలదండలచే చుట్టబడి, చిఱుగంటలతో అలంకరింపబడి, ఊయెలల కదలికలతో సొంపై, గంటలు, వీవనలతో నలరారుచు. ముత్యముల దండలతో శోభించెడి మేలు కట్టుతో, సూర్య ప్రభా భాసమానమై, అప్సరసల సంఘములచే నిండి, అన్ని కోరికలను తీర్చుటకు సమర్థమై. ఉండును. ఆ పుణ్య పురుషుడు ఆ విమానమున విరాజమానుడై, మహా భోగములనుభవించును, దేవతలతో కూడి క్రీడించుచునుండి తిరిగి ఈ భూలోకమున కేతెంచి ధార్మికుడైన రాజగును. రాజా! జాగ్రత్తగా పరిశీలించుచు ఏమైన క్రిమికీటకాది ప్రాణులున్నచో వానిని మృదువుగా పరిహరింపుచు ఊడ్చుట మొదలగు పారిశుధ్య కార్యములు చేయువాడు చాంద్రాయణ ఫలమును పొందును. ప్రాణి హననము జరుగకుండ చూచుచు వడబోసిన నీటితో అలుకువాడు చాంద్రాయణ ఫలమును పొందును. బ్రహ్మ మందిరమున ఒక పక్షము దినములు విడువకుండ ఊడ్చుట, శుభ్రము చేయుట, అలంకరించుట మున్నగు పనులు చేయుచు పూజించువాడు వంద కోటి యుగముల వఱకు బ్రహ్మలోక సుఖమును పొందును. ఆ పిదప అతడు చతుర్వేద పారంగతుడు, సౌందర్యవంతుడు, అందఱిచే ప్రియముగా చూడబడువాడు, ఒప్పిదమైనవాడు, సంపన్నుడు, సర్వ సద్గుణ శోభితుడు, ధార్మికుడు అయిన రాజగును. బ్రహ్మమందిరమును కపటముతో నిర్మించిన వాడైనను, ఆ మందిరమున ఊడ్చుట మొదలగునవి చేయువాడైనను అట్టి ఫలమునే పొందును. బ్రహ్మదేవునియందు భక్తిగలవారు కానంతవఱకు జనులు సంసారమునందలి దుఃఖ శోక భయముల నుండి దాటజాలరు. విషయ గోచరమైన ఈ సంసారమునందు జీవుని చిత్తమెట్లు తగులుకొని యుండునో అటులే ఆ చిత్తము బ్రహ్మయందు తగులుకొని యుండెనేని బంధము నుండి ఎట్లు ముక్తుడు కాకుండును?

మూ ॥ ఖండ స్ఫుటిత సంస్కారం శాలాయాంయః కరోతివై ఆరామావసథాద్యేషు లభతే మౌక్తికం ఫలమ్

నాస్తి బ్రహ్మ సమోదేవో నాస్తి బ్రహ్మ నమో గురుః నాస్తి బ్రహ్మ సమం జ్ఞానం నాస్తి వేధః సమం తపః

ప్రతి పద్యాది సర్వేషు దివసేషూత్సవేషుచ పర్వకాలేషు పుణ్యేషు పౌర్ణమాస్యాం విశేషతః

శంఖ భేర్యాది నిర్ఘోషైర్మహద్భిర్గేయ సంయుతైః కుర్యాన్నీ రాజనం దేవే సురజ్యేష్ఠే చతుర్ముఖే

యావత్పర్వాణి విధినా కుర్యాన్నీరాజనం నృప! తావద్యుగ సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే

స్నాన కాలే త్రిసంధ్యంతుయః కుర్యాన్నృత్య వాదనమ్ గీతం వా ముఖవాద్యంవా తస్య పుణ్యఫలం శృణు

యావత్యహాని కురుతే గేయ నృత్యాది వాదనమ్ తావద్యుగ సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే

 కపిలాపంచ గవ్యేన కుశవారి యుతేనచ స్నాపయేన్మంత్ర పూతేన బ్రాహ్మం స్నానం హి తత్స్కృతమ్

కపిలాపంచ గవ్యేన దధిక్షీర ఘృతేనచ స్నానం శతగుణం జ్ఞేయ మితరేషాం నరాధిప!

దేవాగ్నికార్యముద్దిశ్య కపీలామాహరేత్సదా బ్రహ్మక్షత్ర విశశ్చైవ నశూద్రస్తుకదాచన

తా ॥ పగుళ్లు వారిన, జీర్ణమైన, శిథిలావస్థలో నున్న, బ్రహ్మాలయములందుగాని, తోటలయందుగల, మందిరముల ప్రాంగణములందుగాని ఎవరు సంస్కారము చేయుదురో వారికి ముక్తి ఫలము లభించును. బ్రహ్మతో సమానుడైన దేవుడు వేజులేడు. బ్రహ్మతో సమానుడైన గురువు లేడు. బ్రహ్మతో సమానమైన జ్ఞానములేదు. బ్రహ్మతో సమానమైన తపస్సు గానీ లేదు. పాడ్యమి మొదలుకొని అన్ని దినములయందు, ఉత్సవములయందు, పుణ్యప్రదములైన పర్వకాలములయందు, ప్రత్యేకముగా పూర్ణిమనాడు. సురజ్యేష్ఠుడు, చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుని సన్నిధియందు, శంఖములు, భేరీ వాద్యములు మొదలగునవి మ్రోగించుచు, గొప్పనైన మంగళ గేయములు గానము చేయుచు నీరాజనమీయవలెను. విధి విధానముగ ఎన్ని పర్వదినములలో ఇట్లు నీరాజనార్చన చేయుదురో అన్ని వేల యుగములు బ్రహ్మలోకమునందు నివసింతురు. మూడు సంధ్యలయందును బ్రహ్మకు అభిషేకముచేయుసమయమున నృత్యము చేయుట, వీణాది వాద్యములను వాయించుట, గేయములనాలపించుట, ముఖముతో వాయించు వాద్యములు వాయించుట ఎవడు చేయునో వాని పుణ్య ఫలమును వినుము. ఇట్లెన్ని దినముల వఱకు గీత నృత్య వాద్యముల బ్రహ్మదేవుని సేవించునో అన్నివేల యుగముల పర్యంతమతడు బ్రహ్మలోకమున ఘనత నందును. పుల్లావు పాలు, పెరుగు, నేయి, పంచితము, గోమయములతోను, దర్భనీటితోను మంత్రపూతముగా బ్రహ్మకు స్నానము చేయింపవలెను. అదియే స్నానమనబడును. ఇతర వస్తువులతోడి స్నానము కన్నను కపిలా పంచగవ్యములతో, లేక పాలు, పెరుగు, నేయితో చేయబడు స్నానము వందరెట్లు ఎక్కువ ఫలమునిచ్చునది అని తెలియవలయును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, దేవకార్యములను, అగ్ని కార్యముల నుద్దేశించి ఎల్లవేళల నొక పుల్లావును ఆహారపానీయములిచ్చుచు పోషించుచుండవలెను. శూద్రుడెప్పుడును ఈ పనీ చేయరాదు.

 మూ. కాపిలయః పిబేచ్ఛూద్రో దేవకార్యార్థ నిర్మితమ్ సపచ్యేత మహాఘోరే సుచిరం నరకార్ణవే

వర్షకోటి సహస్రైస్తు యత్పాపం సముపార్జితమ్ సురజ్యేష్ఠ ఘృతాభ్యంగాద్ద హేత్సర్వం నసంశయః

కల్పకోటి సహస్రైస్తు యత్పాపం సముపార్జితమ్ పితామహఘృత స్నానం దహత్య గ్నిరి వేంధనమ్

ఘృత స్నానం ప్రతి పది సకృత్కృత్వాతు కంజజమ్ కులైక వింశముత్తార్య విష్ణులోకే మహీయతే

అయుతం యో గవాం దద్యాద్భక్త్యావై వేద పారగే వస్త్ర హేమాది యుక్తానాం క్షీర స్నానేన యత్ఫలమ్

సకృదాజ్యేన పయసా విరించిం స్నపయేత్తుయ: గాంగేయేన సయానేన యాతి బ్రహ్మ సలోకతామ్

స్నాప్య దధ్నాసకృద్వీర! కంజజం విష్ణు మాప్నుయాత్ మధునా స్నపయిత్వాతు వీరలోకే మహీయతే

స్నానమిక్షుర సేనేహ యోవిరించేః సమాచరేత్ సయాతి లోకం సవితు స్తేజసాభాసయన్నభః

శుద్ధోదకేన యోభక్త్యాన్నపయేత్పద్మ సంభవమ్ ఉత్సృజ్యపాప కలిలం సహత్యేవ సలోకతామ్

 వస్త్రపూతేన తోయేన స్నపయేద్యః సకృద్విభుమ్ స సర్వకాలం త ప్తాత్మా లోకవశ్యత్వ మాప్నుయాత్

తా ॥ బ్రహ్మదేవుని పూజకొఱకు సిద్ధము చేయబడిన కపిలధేనువు పంచగవ్యమును (లేక పాలు, పెరుగు మొ.) త్రాగు శూద్రుడు దీర్ఘకాలము వఱకు ఘోరమైన నరకార్ణవమునందు వండబడును. బ్రహ్మదేవునికి నేతితో తలంటు పోసిన యెడల వేయి కోట్ల సంవత్సరముల నుండి సంపాదింపబడిన పాపము భస్మమైపోవును. వేయికోట్ల కల్పములుగా ఆర్జించుకొనిన పాపము, బ్రహ్మదేవునికి చేసిన ఘృత స్నానము చేత అగ్నితో ఇంధనమువలె దహించుకొనిపోవును. పాడ్యమినాడు ఆ దేవునికి ఒక్కసారి ఘృతాభిషేకము చేసినవాడు ఇరువదియొక్క తరములను తరింపజేసి విష్ణులోకమును పొందును. పాలతో ఆ దేవునికి స్నానము చేయించువాడు వేద పారగుడైన బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారముతోకూడ పదివేల ఆవులను భక్తితో దానము చేసినవాడు పొందెడి ఫలమును పొందును. బ్రహ్మను ఒక్కసారి నేయితో, పాలతో స్నానము చేయించువాడు గాంగేయ (బంగారు) విమానమున బ్రహ్మలోకము పొందును. రాజా! ఆ దేవుని ఒకసారి పెరుగుతో అభిషేకించిన యెడల విష్ణువును పొందును. తేనెతో అభిషేకము చేసినవాడు వీరలోకము పొందును. చెఱకు రసముతో స్నానము చేయించినవాడు ఆకాశమును ప్రకాశమానము చేయుచు సూర్యలోకమునకు పోవును. భక్తితో ఆ పద్మసంభవుని స్వచ్చమైన జలముతో స్నానము చేయించిన వాడు తన అజేయమైన పాపమునంతయును విడిచి బ్రహ్మలోకము నందును. వస్త్రముతో వడబోసిన నీటితో ఒక్కసారి ఆ ప్రభువు నభిషేకించినవాడు అన్ని కాలములయందును తృప్తాత్ముడై యుండుటయే గాక లోకమును వశీకరించుకొనియుండు శక్తిని పొందును.

 మూ. సర్వౌషధీభిర్యో భక్త్యా స్నపయే త్పద్మసంభవమ్ కాంచనేన విమానేన బ్రహ్మలోకే మహీయతే

గంధ చందన తోయేన స్నపయేద్యోంబుజోద్భవమ్ రుద్రలోక మవాప్నోతి తేజసా హేమ సన్నిభః

 పాటలోత్పల పద్మాని కరవీరాణి సర్వదా స్నానకాలే ప్రయోజ్యాని స్థిరాణి సురభీణిచ

ఏషామేకతమం స్నానం భక్త్యాకృత్వాతు వేధసి విధూయ పాపకలిలం విధిలోకే మహీయతే

కర్పూరాగరుతో యేన స్నపయేద్యస్తు కంజజమ్ సర్వపాప విశుద్ధాత్మ బ్రహ్మలోకే మహీయతే

గాయత్రీశత జప్తేన విమలేనాంభసా విభుమ్ స్నపయిత్వాసకృద్భక్త్యా బ్రహ్మలోక మవాప్నుయాత్

విభుం శీతాంబునా స్నాప్య ధారోష్ణ పయసాతతః తతఃపశ్చాద్ ఘృతస్నానం కృత్వాపాపైర్విముచ్యతే

ఏతత్న్సానత్రయం కృత్వా పూజయిత్వాతుభక్తితః అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః

మృత్కుంభై స్తామ్రజైః కుంబైః స్నానం శతగుణం భవేత్ రౌప్యే లక్షోత్తరం ప్రోక్తం హేమైః కోటి గుణం భవేత్

 బ్రహ్మణో దర్శనం పుణ్యం దర్శనా త్స్పర్శనం పరమ్ స్పర్శనా దర్చనం శ్రేష్ఠం ఘృతస్నాత మతః పరమ్

వాచికం మానసం పాపం ఘృత స్నానేన దేహినామ్ క్షిణుతే పద్మజో యస్మాత్తస్మాత్స్నానం సమాచరేత్

తా ॥ అన్ని విధముల ఓషధులచేత బ్రహ్మదేవుని భక్తితో స్నానమాడించినవాడు బంగారపు విమానమున బ్రహ్మలోకముచేరి అచట గౌరవింపబడును. గంధపు నీటితో, చందనపు నీటితో అభిషేకించువాడు బంగారు వన్నె కాంతితో రుద్రలోకమును పొందును. తెలుపుమించు ఎట్ట గలువలు, తామరలు, నిలుకడైనవి పరిమళముగలవియైన కలువలు  వీనిని స్నాన సమయమున ఉపయోగింపవలెను. వీనిలో ఒక్కదానినైనను బ్రహ్మస్నానమున నుపయోగించిన పాప కలిలమును పోద్రోలి బ్రహ్మలోక గౌరవమునందును. కర్పూరము చందనము కలిపిన నీటితో బ్రహ్మకు స్నానము కల్పించినవాడు పాపములనుండి విడివడి, శుదుడై బ్రహ్మలోకమునందును. పరిశుద్ధమైన జలముతో, గాయత్రీ మంత్రమును ఒక వంద పర్యాయములు జపించుచు ఒకసారి భక్తితో బ్రహ్మదేవునకు స్నానము చేయించువాడు బ్రహ్మలోకమును పొందును. ప్రభువును మొదట చన్నీటితో, పిదప వెచ్చని నీటిధారలతో, ఆ పిదప నేతితో స్నానమాడించినవాడు పాపములనుండి విడువబడును. ఇట్లు మూడు విధములుగా అభిషేకముచేసి ఆ దేవుని భక్తితో పూజించు మానవుడు వేయి అశ్వమేధములు చేసిన పుణ్యమును పొందును. మట్టి కుండలతో, రాగి బిందెలతో స్నానమాడించిన నూడురెట్లు గుణమగును. వెండి బిందెలతోనైన లక్షకు మించియు, బంగారు కలశములతోనైన కోటిరెట్లు శ్రేష్ఠమైన ఫలమునొందును. బ్రహ్మదేవుని దర్శనము పుణ్యప్రదమైనది. దర్శనముకంటె స్పర్శనము మఱంతమేలైనది. స్పర్శనము కంటెను పూజించుట శ్రేష్ఠమైనది. దాని కన్నను ఘృత స్నానము శ్రేష్ఠతరమైనదీ. ఘృత స్నానము వలన బ్రహ్మదేవుడు సంప్రీతుడై మానవుల మనస్సంబంధమైన, వాక్సంబంధమైన పాపములను నశింపజేయును. అందువలన అది తప్పక చేయవలెను.

మూ ॥ స్నపయిత్వార్చయేద్భక్త్యా యథా తచ్ఛృణు భారత! శుచివస్త్రధరః స్నాతః కృతన్యాసశ్చ భారత!

చతుర్హస్తం లిఖేత్పద్మం చతుర్భాగ విభాగితమ్ మధ్యేతస్య లిఖేచ్చక్రం దలైర్ద్వాదశ భిశ్చితమ్

సరోజాని తతోన్యస్య అక్షరాణి సమంతతః అక్షరం విహితం చాన్య త్పత్రభాగే ప్రకీర్తితమ్

నానావర్ణక సంయోగాల్లిఖేచ్చైవానుపూర్వశః కృష్ణోత్కటంతు మధ్యం స్యాత్పీత రక్తం తథాపరమ్

సితం శుద్ధంతు కర్తవ్యం మధ్యభాగేతు వర్తులమ్ ప్రభాకుండలకై ర్బా హ్యైర్వేష్టయేచ్చక్రనాయకమ్

ఏవ మాలిఖ్య యత్నేన మూలమంత్రం తతోన్యనేత్ మూర్ద్నః పాదతలం యావత్ప్రణవం విన్యసేద్బుధః

నాదరూపం న్యసేత్తావద్యావచ్ఛబ్దస్య శూన్యతా తత్కారం విన్య సేన్మూర్ద్ని సకారం ముఖమండలే

వికారం కంఠదేశేతు తుకారం సర్వసంధిషు వకారం హృది మధ్యేతు రేకారం పార్శ్వయోర్ద్వయోః

 ణకారం దక్షిణే కుక్షౌ యకారం వామ సంజ్ఞకే భకారం కటినాభిస్థం ర్గోకారం జానుపర్వసు

 దేకారం జంఘయోర్న్యస్య వకారం పాదపద్మయోః స్యకార మంగుష్ఠయోర్న్యస్య ధీకారం చోరసి న్యసేత్

 మకారం జానుదేశేతు హికారం గుహ్యమాశ్రితమ్ ధికారం హృదయే న్యస్య యోకారం చౌష్ఠయోర్న్యసేత్

నకారం నాసికాగ్రేతు ప్రకారం నేత్ర మాశ్రితమ్ చోకారం తు భ్రువోర్మధ్యే దకారం ప్రాణమాశ్రితమ్

 యా కారం విన్య సేన్మూర్ద్ని తకారం కేశ మాశ్రితమ్ న్యాసం కృత్వాత్మనోదేహే దేవే కుర్యాత్తథానృప!

 సర్వోపచార సంపన్నం కృత్వా సమ్యజ్నిరీక్షయేత్

తా ॥ భారతా! ఆ దేవునికి స్నానోపచారము పిదప భక్తితో పూజించు విధానమును వినుము. స్నానాంతరము పరిశుద్ధమైన వస్త్రమును ధరించి న్యాసము చేయవలెను. నాలుగు భాగములుగా చేయబడిన నాలుగు మూరల పరిమాణముగల పద్మమును వ్రాయవలెను. దాని మధ్యభాగమున పన్నెండు రిక్కలచేత కూర్చబడినట్లు చక్రమును గీయవలెను. దాని చుట్టును ఉన్న తామరలు నిర్దుష్టముగా ఉండవలెను. దళ భాగములేవియు చెడకుండ నుండవలెనని శాస్త్ర విహితమైయున్నది. వివిధములైన గంగుల కమషమేళనముగా దానిని తీగవలెను. మద భాగమున మీకు టమైన నలుపు (వీలము) ఆపే పసుపును ఆ పెన ఎఱుపు వన్నేను నింపవలెను . చక్రవలయమధ్యమందు పరిశుద్ధమైన తెలుపు వర్ణమును పూరింపవలెను. చక్రనాయకుని వెలుపలి భాగమునుండి మెఱుపు పోగులతో గుండ్రముగా చుట్టవలెను. ఇట్లు లిఖించి మూల మంత్రమును న్యాసము చేయవలెను. బుద్ధిమంతుడు శిరస్సు నుండి పాదతలము వఱకు ఓంకారమును న్యాసము చేయవలెను. శబ్దమునకు శూన్యత్వమేర్పడువఱకు నాదరూపముగా దానిని న్యస్తము చేయవలెను. శిరస్సు నందు తత్ కారము, ముఖమండలమన ‘సకారము. కంఠమున 'వి' అను నక్షరము, సంధులన్నింటియందు తుకారము, హృదమునందు 'వ' కారము, రెండు ప్రక్కలయందు రేకారము. కుడి కడుపున 'ణ'కారము, ఎడమ కడుపున 'య'కారము, మొల నడిమి స్థలమున “భకారము, మోకాలి కణుపులయందు 'రో' కారము, పిక్కలయందు. 'దే'కారము, పాదపద్మములయందు వ కారము, బొటన వ్రేళ్ళయందు “స్య'కారము, జొమ్మున 'ధీ'కారము. మోకాళ్ల పై 'మ'కారము, గుహ్యమున 'హి'కారము, హృదయమున ‘ధి'కారము, పెదవుల యందు 'యో'కారము. నాసికాగ్రమున 'న' కారము కన్నులయందు 'ప్ర' అనునక్షరము, కనుబొమ్మనడిమి భాగమున 'చో'కారము ప్రాణమున `ద'కారము. శిరస్సున 'యా'కారము తలవెంట్రుకల పై 'త' కారము తన శరీరమున నిట్లు న్యాసము చేసి దేవునియందును అటులే చేయవలెను. ఉపచారములన్నింటికిని కావలసిన ద్రవ్యములన్నింటిని కూర్చుకొని మఱల ఒకసారి చూచుకొనవలెను.

 మూ ॥ కంకుమాగురు కర్పూర చందనేన విమిశ్రితమ్ గంధతోయ ముపస్కృత్య గాయత్ర్యాప్రణవేనచ ప్రోక్షయేత్సర్వద్రవ్యాణి పశ్చాదర్చన మాచరేత్

చక్రగ్రంధిషు సర్వాసు ప్రణవం వినివేశయేత్ భూయః ప్లుతం సముచ్చార్య ప్రణవం సర్వతోముఖమ్

విన్య సేత్పద్మ మధ్యేతు పీఠనిష్పత్తి హేతవే ఆసనే పృథివీజ్ఞేయా సర్వసత్త్వధరామతా హ్రస్వోంకారే మతాసాతు దీర్ఘోంకారేతు దేవరాట్ ప్లుతస్తు వ్యాపయేద్భావం మోక్షదంచామృతాత్మకమ్

యత్నస్థో న నివర్తెత యోగీ ప్రాణ పరాయణః ఆవాహనంతతః కుర్యాదక్షరేణ పరేణతు

ఆవాహ్య తేజో రూపంతు న్యసేన్మంత్ర వరాంస్తతః తతో విభావయేద్దేవం పద్మస్థం చతురాననమ్

తా ॥ కుంకుమ, అగురు, కర్పూరము, చందనము వీని మిశ్రమమును కలుపుట ద్వారా నీటిని లెస్సగా పరిమళీకరించి, ఓంకారముతో కూడిన గాయత్రీమంత్రము నుచ్చరింపుచు పూజాద్రవ్యములన్నిటి పైన ప్రోక్షణ చేసి, ఆ పిమ్మట పూజచేయవలెను. చక్రపు గనుపులన్నింటియందు ఓంకారమును న్యాసము చేయవలెను. మఱల ఓంకారమును మూడు మాత్రల కాలము ఉచ్చరించి, ఆపైన పీఠ నిష్పత్తి కొఱకు పద్మమధ్యమున సర్వతోముఖముగా. ప్రణవమును న్యాసము చేయవలెను. ఆసనమునందు, సర్వప్రాణులను ధరించు భూమి ఎఱుఁగదగినది. ప్రస్వోంకారమునం దాసనము (భూమి) దీర్ఘంకారమునందు దేవరాజైన బ్రహ్మ భావింపదగినవారు, అమృతమయము, మోక్షప్రదమునైన ప్లుతమును (మూడుమాత్రలకాలమున నుచ్చరించు నోంకారము) భావమునందంతటను వ్యాపింపజేయవలెను. చిత్తమును చాంచల్యము నందనీయని ప్రయత్నముతో, పరమతాత్పర్యయుక్తమైన ఏకాగ్రతతోను, పరమాక్షరమైన ఓంకారమునుచ్చరింపుచు బ్రహ్మదేవుని ఆవాహన చేయవలెను. అట్లు తేజోరూపుడైన బ్రహ్మను ఆవాహన చేసి అప్పుడు గాయత్రీమంత్రాక్షరన్యాసము చేయవలెను. చతుర్ముఖుడు, పద్మస్థుడునైన ఆ దేవదేవుని ధ్యానింపవలెను.

 మూ. స్రస్టారం సర్వజగతాం విష్ణురుద్రవిధానగమ్ సంభావ్య విధివద్భక్త్వా పశ్చాచ్చార్చన మాచరేత్

గంధ పుష్పాది సంభారాన్క్రమాత్సర్వాన్పకల్పయేత్ గాయత్రీ ముచ్చరన్మంత్రం సర్వకర్మాణి కారయేత్

 పుష్పం ధూపం తథా దీపం నైవేద్యం సుమనోహరమ్ ఖండ లడ్డుక శ్రీవేష్టకాసారాశోక వర్తికాః

స్వస్తికోల్లోపికాదుగ్ధ తిలావేష్టతిలాఢికాః ఫలానిచైవ పక్వాని లగ్నఖండ గుడానిచ

అన్యాంశ్చ వివిధాన్దద్యాత్పూపాని వివిధోనీచ ఏవమాదీని సర్వాణి దాపయేచ్ఛక్తితో నృప!

మూలమంత్రేణ దేవస్య తతో దేహం విభావయేత్ పూజయేచ్చాపి విధినా యేన తం తే బ్రవీమ్యహమ్

ప్రాణాయామ త్రయంకృత్వా దేహసంశోధనాయవై ఆవాహయేత్తతోనంతం ధారయంతం వచః సదా

ధ్యాత్వానంతం తతోరుద్రం పద్మకింజల్కమధ్యమమ్ ధ్యాయేద్విష్ణుం తతోదేవం న్యసేత్పద్మోదరోద్భవమ్

ఏవం త్రిదేవతారూఢం పద్మమధ్యేంబుజోద్భవమ్ పూజయన్మూల మంత్రేణ పద్మోదర భవం నృప!

ఋగ్వేదం తు యజుర్వేదం సామవేదంచ పూజయేత్ జ్ఞాన వైరాగ్యమైశ్వర్యం ధర్మం సంపూజయద్బుధః

తా॥ సర్వజగత్తును సృష్టించినవాడును, విష్ణురుద్రుల విధానములను తెలిసినవాడును అయిన బ్రహ్మదేవుని సంభావించి, ఆ పిమ్మట భక్తితో విధి విధానముగ పూజింపవలెను -91. గంధము, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను యథాక్రమముగా దేవునికి సమర్పించవలెను. పూజకు సంబంధించిన ఉపచార సమర్పణలన్నియును గాయత్రీ మంత్రము నుచ్చరింపుచునే చేయవలెను -92. పూలు, ధూపము, దీపము, మనోహరమైన నైవేద్యము, పులకండము, లడ్డువములు, దేవదారు ధూపములు, అశోక (కంకేళి) పుష్పములు, దీపమాలలు, (లేక అగరువత్తులు) -93. శుభప్రదములు, సమ్మోహనకరములైన వస్తువులు, (లేక క్షేమమును కలిగించు ప్రారముగల దేవగృహము), పాలు, నువ్వులతో చుట్టబడినవి, అంతటను నువ్వులుగల ఉండలు, పండిన పండ్లు బెల్లము, ఖండశర్కరతో కలుపబడినవి -94. ఇంకను ఇతరములైన వివిధ భక్ష్యవిశేషములు (పిండివంటలు) ఇవి మొదలుకొని శక్తికొలదిగ అనేక వస్తువులను బ్రహ్మదేవునికి సమర్పించుకొనవలెను -95. అప్పుడు మూలమంత్రముతో ఆ దేవతా స్వరూపమును ధ్యానింపవలెను. ఆ దేవుని ఏ విధితో పూజింపవలెనో చెప్పచున్నాను -96. శరీరము పరిశుద్దమగుట కొఱకు మొదట మూడు ప్రాణాయామములు చేయవలెను. అప్పుడు, ఎల్లవేళలలో వాక్కును ధరించుచుండిన ఆదిశేషుని ఆ వాహన చేయవలెను -97. ఆ పిదప పద్మమునందలి అకరువు పై రుద్రుని ధ్యానింపవలెను. విష్ణువును ధ్యానింపవలెను. ఆపైన పద్మమునందు బ్రహ్మను న్యాసము చేయవలెను -98. ఇట్లు ముగ్గురు దేవతలతో అధివసించిన బ్రహ్మదేవుని, పద్మమధ్యభాగమునందున్నవానిని, మూలమంత్రముతో పూజింపవలెను -99. పిమ్మట ఋగ్యజుస్సామవేదములను, జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ధర్మమును పూజింపవలెను -100.

మూ॥ఈశానాది క్రమాద్రాజన్విదిశాసు సమంతతః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛంద ఏవచ

జ్యోతిషంచ మహాబాహో! ఉపవేదాశ్చకృత్స్నశః ఇతిహాస పురాణాని యథాయోగ్యం యథాక్రమమ్

శిక్షా కల్పోవ్యాకరణం దేవస్యపురతస్సదా కల్పాదయస్తతశ్చాన్యే దిశాసు విదిశాసుచ

మహా వ్యాహృతయః సర్వాః ప్రణవేన సమన్వితాః పూర్వాది క్రమయోగేన పూజయే ద్విధినా నృప!

శక్తయో బ్రహ్మణ స్త్వేతా లోకరూపావ్యవస్థితాః పూజనీయాః ప్రయత్నేన మంత్రరూపాః స్థితాః స్వయమ్

అరకాంతర సంస్థాంశ్చ షట్ సముద్రాన్సమర్చయేత్ నక్షత్రాణి గ్రహాశ్చైవ రాశయశ్చ  విశేషత: పూజ్యాః సర్వేయధాన్యాయం సురాగ్రేషు వ్యవస్థితాః

నాగాశ్చ గరుడశ్చైవ పూజానీయస్తథాగ్రత: దేవతా ఋషయశ్చైవ సహితాః కులపర్వతాః తత్తేజోనిలయాః సర్వే పూజనీయాః ప్రయత్నతః

ఆచమ్య విధివత్పూర్వం మంత్రపూతేన వారణా హృదయా దీన్న్యసేదంగాన్ హృదయాదిషుకృత్స్నశః

శిఖానేత్రం తథాచర్మ అస్త్రంచ భరతర్షభ ! మహేంద్రాది దిశశ్చైతాః పూజయేద్విధావన్నృప!

హృదయం పురతః పూజ్యం శిరోదేవస్య పృష్ఠతః పూర్వం సంపూజయేద్దేవం మూలమంత్రేణ కృత్స్నశః

తా ॥ ఓ రాజా ! ఈశానాది క్రమమున విదిక్కుల కధిపతులైన దేవతలను, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందము -101. జ్యోతిషము, ఉపవేదములు, ఇతిహాసపురాణములను క్రమముననుసరించి యధాయోగ్యముగా పూజింపవలేను (102) శిక్ష, కల్పము, వ్యాకరణము ఎల్లప్పుడు దేవతకు ముందుభాగమునను, తక్కినవాని ఆయాదిక్కులయందును, మూలలయందును పూజింపవలెను -103 ప్రణవముతో కూడిన వ్యాహృతులను తూర్పుదిక్కునుండి మొదలుకొని క్రమముగా పూజింపవలెను -104. ఇవి లోకరూపములుగా వ్యవస్థితములై యున్న బ్రహ్మశక్తులు; స్వయముగా మంత్రరూపములై కూడనున్నవి. వీనిని పూజింపవలేను. -105. యంత్ర (పద్మ) దళాంతర్వర్తులైన ఆరు సముద్రములను పూజింపవలెను. దేవతల సమీపమునందుగల నక్షత్రములను, గ్రహములను, రాశులను యథావిధిగా పూజింపవలెను -106. ఆ పైన గరుడుని, నాగులను, దేవతలను, ఋషులను, కులపర్వతములను, ఆయా తేజములను ధరించియున్న వానినన్నింటిని శ్రద్ధగా పూజింపవలెను -107. మొదట మంత్రపూతమైన జలముతో ఆచమించి తన హృదయము మొదలగు అంగములనన్నింటిని దేవతా హృదయాద్యంగములయందు న్యాసము చేయవలెను -108. శిఖ, నేత్రము, చర్మము, అస్త్రము, ఇవి ఇంద్రుని దిక్కగు తూర్పు మొదలుగా గల దిక్కులు, వీనిని యథావిధిగ పూజింపవలెను -109. దేవుని హృదయముముందు, వెనుక శిరస్సును పూజింపవలెను. ఆది దేవుడైన బ్రహ్మను మూలమంత్రముతో అంతటను అర్చింపవలెను -110.

మూ॥ విసర్జయేద్దర్శయిత్వా ముద్రాంతు భరతర్షభ! అంకుశం నరశార్దూల! హ్యాహ్వానే కంజమాదిశేత్

యస్త్వేవం పూజయేద్దేవం ప్రతి పన్నిత్యమేవచ ఉపోష్యపంచ దశ్యాంతు సయాతిపరమం పదమ్

సుమంతురువాచ :

ఆపోహిష్ఠేతి మంత్రోఽయం హృదయం పరికీర్తితమ్ ఋతం సత్యం శిఖాప్రోక్తా ఉదుత్యం నేత్రమాదిశేత్

చిత్రం దేవానాం మస్తమితి సర్వలోకేషువిశ్రుతమ్ వర్మణాతే చ్ఛాదయామి కవచం సముదాహృతమ్

భూర్భువస్స్వరితి తథాశిరసే పరికీర్తితమ్ గాయత్రీమూలంత్రస్తు సాధకః సర్వకర్మణామ్

గాయత్ర్యాపూజయేద్దేవమోంకారేణాభిమంత్రితమ్ ప్రణవేనాపరాన్సర్వానృగ్వేదాదీన్ప్రపూజయేత్

ఆహ్వానే పూజనేవీర ! విసర్గే బ్రహ్మణస్తథా గాయత్రీ పరమో మంత్రో వేదమాతా విభావినీ

గాయత్ర్యక్షర తత్వైస్తు పూజయేద్యస్తు దేవతామ్ సగచ్ఛేద్ర్బహ్మణః స్థానం దుర్లభం యద్దురాసదమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం

బ్రహ్మేపర్వణి ప్రతిపత్కల్పే బ్రహ్మణోఽర్చనా విధి వర్ణనంనామ సప్తదశోఽధ్యాయః

తా॥ భరతర్షభా! ముద్రను చూపి చివర విసర్జనము చేయవలెను. ఆహ్వానమునందు బ్రహ్మదేవునకు అంకుశముద్ర (లేక ముకుళముద్ర)ను ప్రదర్శింపవలెను -111. ఇట్లు ప్రతిపదాదిగ నియతముగా బ్రహ్మను పూజించుచు, పూర్ణిమ, అమావాస్య దినములలో ఉపవసించువాడు పరమపదమును పొందును -112. సుమంతుముని ఇంకను ఇట్లు చెప్పెను. “అపోహిషామ” మంత్రము హృదయమని చెప్పబడినది. “ఋతం సత్యం” అను మంత్రము శిఖగా కీర్తింపబడినది. “ఉదుత్యం” అనునది నేత్రముగా చూపవలెను అని చెప్పబడినది. “చిత్రందేవానాం” అను మంత్రము మస్తకమని సర్వలోకములందు ప్రసిద్ధము. “వర్మణా తే చ్చాదయామి” అనునది కవచముగా ఉదహరింపబడినది -114. “భూర్బువస్సువః అనునది శిరస్సు కొఱకుగా కీర్తింపబడినది. సాధకుడు బ్రహ్మార్చన విషయికమగు కర్మలన్నింటియందును గాయత్రీమూల మంత్రమునే ప్రధానమని యెంచవలెను -115. ఓంకారముచేత అభిమంత్రితమగు గాయత్రీమంత్రముచే బ్రహ్మను పూజింపవలెను. ఇతరములైన ఋగ్వేదాదులను ఓంకారముతో మాత్రము పూజింపవలెను -116. బ్రహ్మదేవుని ఆవాహనమునందు పూజయందు, త్యాగమునందును గాయత్రియే శ్రేష్ఠమైన మంత్రము. అది వేదమాతగా ప్రశస్తీనందినది -117. గాయత్రీ మంత్రాక్షరతత్వములచే దేవతను పూజించువాడు దుర్లభము, దురాసదమునైన బ్రహ్మస్థానమును పొందును -118.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమున, ప్రతిపత్కల్పము నందలి బ్రహ్మను పూజించు విధిని గులించిన వర్ణనము అను పదునేడవ అధ్యాయము సమాప్తము.