భవిష్య మహా పురాణము
16. ప్రతిపత్కల్ప వర్ణనము
సుమంతురువాచ :
మూ ॥ ఇత్యుక్త్వా భగవాన్ర్బహ్మా స్త్రీ లక్షణ మశేషతః సద్వృత్తంచ తథాస్త్రీణాం జగామ స నిజాలయమ్
ఋషయశ్చ తథా జగ్ముః స్వానీ ధిష్ట్యాన్యశేషతః స్త్రీ లక్షణం తథా వృత్తం శ్రుత్వాకృత్స్నం మహీపతే
ఇత్థం లక్షణ సంపన్నాం భార్యాం ప్రాప్యమహీపతే కర్తవ్యం యధ్గృహస్థేన తదిదానీం నిబోధమే
వైవాహికాగ్నౌకుర్వీత గృహ్యం కర్మయధావిధి పంచయజ్ఞ విధానంతు పక్తిం కుర్యాత్సదా గృహీ
పంచసూనా గృహస్థస్యతేన స్వర్గం న గచ్ఛతి కుండికా పేషణీ చుల్లీ ఉదకుంభీ: ప్రమార్జనీ
ఆసాం క్రమేణ సర్వాసాం విశుద్ధ్యర్ధం మనీషిభిః పంచోద్దిష్టా మహాయజ్ఞా: ప్రత్యహంగృహమేధినామ్
అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞశ్చ తర్పణమ్ హోమోదైవో బలిర్భౌమస్తథాఽన్యోఽ తిథి పూజనమ్
పంచైతాన్యో మహాయజ్ఞాన్న హాపయతి శక్తితః సగృహేపి వసన్నిత్యం సూనాదో షైర్నలిప్యతే
దేవతాతిథి భృత్యానాం పితృణామాత్మనశ్చయః న నిర్వపతి పంచానా ముచ్ఛ్వసన్నచ జీవతి
శతానీక ఉవాచ :
యస్య నాస్తి గృహేత్వగ్నిః సమృతో నాత్ర సంశయః నస పూజయితుం శక్తో దేవాదీన్ బ్రాహ్మణోత్తమః
నిరగ్నికస్య విప్రస్య కథం దేవాదయోద్విజ!
ప్రీతాః స్యుః శాంతయే తస్య పరం కౌతూహలం మమ
తా ॥ సుమంతుముని ఇట్లనెను : బ్రహ్మదేవుడు స్త్రీ లక్షణములను, వారి ప్రవర్తన విధానములను గుఱించి ఇట్లు సాకల్యముగ వివరించి తన స్థానమునకు వెడలిపోయెను. ఋషులు కూడా బ్రహ్మచెప్పిన ఆ విషయములన్నింటిని సాంతముగ విని తమ తమ ఆశ్రమములకు పోయిరి. రాజా! 'ఇట్లు లక్షణ సంపన్నయగు భార్యను పొందిన పిదప గృహస్థుడేమి చేయవలెనో అతని కర్తవ్యము లేవియో నేను చెప్పెదను. తెలిసికొనుడు. వైవాహికాగ్నియందే గృహ్యకర్మ యధావిధిగా చేయవలెను. పంచయజ్ఞములను, వానికి కావలసిన పాకములను గృహియైన వాడెప్పుడును చేయచుండవలెను. జోలు, సన్నికల్లు, పొయ్యి, నీళ్ళ కడవ, పొరక (చీపురు) అను నీయైదు ప్రాణిహింసకములైన వస్తువులుపయోగించుచుండుట వలన గృహస్థునకు స్వర్గప్రాప్తి కలుగదు. వీనినన్నింటిని ఉపయోగించుట వలన కలుగు దోషమును పరిహరించి పారిశుద్ధ్యమును సంతరించుట కొఱకై గృహస్థులకు క్రమముగా ఐదంశములకు ఉద్దేశింపబడిన మహాయజ్ఞములు బుద్దిమంతులచేత నిర్ణయింపబడినవి. వేదాధ్యయనము (అధ్యాపనము కూడా) చేయుట; ఇది బ్రహ్మయజ్ఞము. పితృదేవతలకు తర్పణము చేయుట పితృయజ్ఞము. దేవతలకు హోమము చేయుట దేవ యజ్ఞము. భూతములకు బలియిచ్చుట భూతయజ్ఞము. ఇక అతిథులను పూజించుట మనుష్య యజ్ఞము. ఈ పంచ మహాయజ్ఞములను నిత్యము శక్తి కొలదిగ ఏ గృహస్థు నిర్లక్యము చేయక, చేయుచుండునో అతడు ఇంటిలో నివసించుచుకూడ సూనాదోషములతో లిపుడు కాడు. పైన పేర్కొనబడిన ఐదుదేవతలను, అతిథులను, పితరులను, భృత్యులను ఉద్దేశించి త్యాగము చేయక, వారిని తృప్తిపరుపక ఉండువాడు, శ్వాసించుచుకూడ మృతిచెందిన వానితో సమానుడు. శతానీకుడిట్లనెను. “ఎవని యింటిలో అగ్ని ఉండదో (ఔపాసనము) అట్టివాడు మృతుడనుటకు ఎట్టి సందేహము లేదు. అతడు బ్రాహ్మణోత్తముడైనను దేవతాద్యర్చనకు అర్హతలేని వాడగును. ఔపాసనము లేని బ్రాహ్మణుని శమము కొఱకు దేవతలేట్లు ప్రీతులగుదురో తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగ నున్నది.
సుమంతురువాచ :
మూ II సాధు పృష్టోస్మి రాజేంద్ర! శ్రూయతాం పరమం వచః అనగ్నయస్తు యే విప్రా స్తేషాం శ్రేయోఽభిధీయతే
వ్రతో పవాస నియమైర్నానాదానై స్తథానృప! దేవాదయో భవంత్యేవ ప్రీతా స్తేషాంన సంశయః
విశేషాదుపవాసేన తిథౌకిల మహీపతే! ప్రీతా దేవాదయ స్తేషాం భవంతి కురునందన !
శతానీక ఉవాచ :
భగవంస్త్వం తిథీన్ట్రూహి తిథీనాంచ విధింహిమే ప్రాశనం గృహ్యధర్మాశ్చ ఉపవాస విధీనపి
ముచ్యేమ యేన పాపౌఘా త్త్వత్ప్రసాద్ద్విజోత్తమ! సంసారాచ్చాపి విపేంద్ర! శ్రేయసే జగతస్తథా
సుమంతురువాచ :
శృణు కౌరవ! కర్మాణి తీథిగుహ్యాశ్రితానితు శ్రుతాని ఘ్నంతి పాపాని ఉషోషిత ఫలానిచ
ప్రతిపదిక్షీర ప్రాశనం ద్వితీయాయాం లవణవర్జనమ్ తృతీయాయాం తిలాన్నం ప్రాశీయాచ్చతుర్థ్యం క్షీరాశనశ్చ
పంచమ్యామ్ఫలాశనః సదా షష్ఠ్యాంశాకాశనః సప్తమ్యాం బిల్వాహారోష్టమ్యాంతు
పిష్టాశనోనవమ్యామనగ్నిపాకాహారోదశమ్యామేకాదశ్యాం ఘృతాహారో ద్వాదశ్యాం పాయసాహారః! త్రయోదశ్యాం
గోమూత్రాహారశ్చతుర్దశ్యాం యావాన్నాహారః కుశోదకప్రాశనః పౌర్ణమస్యాం హవిష్యాహారోఽమావాస్యాయామ్
ఏష ప్రాశన విధిస్తిథీనామేవ చానేన విధినా పక్షమేకంయో వర్తయతి
సోశ్వమేధఫలం దశగుణ ఫలమవాప్నోతి, స్వర్గె మన్వంతరాణి యావత్ప్రతి వసతి.
తా ॥ సుమంతుముని ఇట్లనెను. “రాజేంద్రా ! చక్కని ప్రశ్న వేసితివి. ఔపాసనము చేయని బ్రాహ్మణులకు శ్రేయ మనబడునదెట్లు కలుగునో చెప్పెదను వినుము, రాజా! వ్రతములు, ఉపవాసములు, వివిధములైన దానములు మొదలగు నియమములను పద్ధతుల ఉపవాసములచేత దేవతలు ప్రీతులగుదురు. శతానీకుడిట్లు ప్రశ్నించేను. “భగవాన్! ఆ తిథులను, ఆ తిథులలోని విధులను, తినవలసిన ఆహారము, ఉపవసించవలసిన విధానములను గృహ్యధర్మములను నాకు తెలియజెప్పుడు. ఓ ద్విజోత్తమా! దేనిచేత మేము పాప సమూహములనుండి విముక్తులమగుదుమో మి అనుగ్రహముచే దేనివలన సంసారబంధము నుండి విడుదల పొందుదుమో అది అంతయు జగచ్చైయము కొఱకు వినిపింపుడు”. దానికి సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “తిథులను గుప్తముగా ఆశ్రయించియున్న కర్మములను గుఱించి వివరించుచున్నాను వినుము. వానీని వినినంత మాత్రముననే పాపములు నశించిపోవును. ఉపవసించిన ఫలములుకూడ దక్కును. పాడ్యమినాడు పాలు త్రాగవలెను. విదియ నాడు ఉప్పులేకుండ భుజింపవలెను. తదియనాడు నువ్వుల అన్నము తినవలెను. చవితినాడు పాల ఆహారము నారగింపవలెను. పంచమినాడు ఫలములు, షష్ఠినాడు శాకములు, సప్తమి నాడు మారేడు. అష్టమినాడు పిండి పదార్థములు, నవమినాడు అగ్నితో పక్వముకాని పదార్థములు, దశమి ఏకాదశి నాడు నేతి వస్తువులు, ద్వాదశి దినమున పాయసము, త్రయోదశినాడు గో మూత్రము, చతుర్దశినాడు యవాన్నము. పూర్ణిమనాడు కుశోదకము, అమావాస్య దినమున హవిష్యాన్నమును భుజింపవలెను. ఇది ఆయా తిథులననుసరించి ఆయా ఆహారముల విధానము. ఈ విధానమును ఒక పక్షము వఱకు ఎవడనుసరించునో. వాడు అశ్వమేధ యాగ ఫలమును పదింతలుగా పొంది, స్వర్గ ప్రాప్తినంది అచట మన్వంతరముల వఱకు నివసించును.
మూII ఉపగీయమానోప్సరో గంధర్వైర్మాసత్రయ చతుష్టయమ్ సోశ్వమేధరాజసూయానాం శతగుణమవాప్నోతి
స్వర్గె ఉపగీయమానోప్సరో గంధర్వైశ్చతుర్యుగానందశ శతీర్యావత్ప్రతివసతి
తథాష్టమాస సఫారణేరాజసూయాశ్వమేధాభ్యాం సహస్ర గుణ ఫలమవాప్నోతి
స్వర్గే చతుర్దశ మన్వంతరాణి యావత్ప్రతివసతి ఉపగీయమానోప్సరో గంధర్వైర్య ఏవం నియమమాస్థాయ వర్షమేకం వర్తయతి
స సవితృలోకేకాలం మన్వంతరం ప్రతివసతి
య ఏవం నియమాన్రా జన్నాశ్వయుజ నవమ్యాం మాఘమాసస్య సప్తమ్యాం వైశాఖ తృతీయాయాం కార్తిక పౌర్ణమాస్యాం తిథివ్రతాని
గృహ్ణాతి బ్రహ్మచారీ గృహస్థో వనస్థో నారీ నరోవా శూద్రః ప్రయతమానసః దీర్ఘాయుష్యం సవితుః సాలోక్యం వ్రజతి
యైశ్చాపి పురారాజన్ననేన విధినా ఏతాసు తిథిష్వన్య జన్మాంతరే ఉపవాస విథి: కృతః దానాని దత్తాని
వివిధ ప్రకారాణి బ్రాహ్మణానాం తపస్విజనేషువా
త్రిరాత్రోపవాసినాం తీర్థయాత్రా తపోగురు మాతాపితృశుశ్రూషా నిరతానాం తేషాం స్వర్గాది భోగవాసనా దిహాగతానాం
ఫలనిష్పత్తి చిహ్నాని మనుష్యలోకే ప్రత్యక్షత ఏవ దృశ్యంతే
హస్త్యశ్వయానయుగ్య ధనరత్నకనక హిరణ్య కటక కేయూర గైవేయక కటిసూత్ర బ్రహ్మసూత్ర కర్ణాలంకార ముకుటవర వస్త్ర వర నారీవర విలేపన సరూప గుణ దీర్ఘాయుషో విగతాధివ్యాధయో దానోపవాసరతానాం ఫలాన్యేతాని నృత్యగీత వాదిత్ర మంగల పాఠక శబ్ధైరిహాద్యాపి పుణ్యకృతో బోధ్యమానా దృశ్యంత ఇతి
తథాకృతోపవాసా అపిహి దృశ్యంతే
తథా అదత్తదానా అకృత పుణ్యాశ్చ ప్రత్యక్షత ఏవ దృశ్యంతే
తద్యథా కాణ కుష్ఠి బధిర జడమూక వ్యంగా రోగ దారిద్య్రోప సర్గ వ్యాధి హతాయుషశ్చదృశ్యంతేఽద్యాపి మానవాః
తా ॥ అప్సరస స్త్రీలు, గంధర్వులు సమీపమున గానము చేయుచుండగా ఒక సంవత్సరము వఱకు అతడు అశ్వమేధ ఫలమును పదింతలుగా అనుభవించును. స్వర్గమునందు అతడట్లు గంధర్వాప్సరసల గానములతో వేయి మహాయుగముల వఱకు నివసించును. అట్లు ఎనిమిది మాసములుపవసించి పారణ చేసెనేని రాజసూయాశ్వమేధయాగముల వేయి రెట్ల ఫలమును పొందును. స్వర్గమునందు పదునాలుగు మన్వంతరముల వఱకు నివసించును. రాజా! ఆశ్వయుజ శుద్ధ నవమి, మాఘ మాస సప్తమి, వైశాఖమాస తృతీయ, కార్తీక పూర్ణిమలయందు నీయమముతో ఈ తిథి వ్రతములను స్వీకరించినవాడు బ్రహ్మచారియైనను, గృహస్థుడైనను, వాన ప్రస్తుడైనను, స్త్రీయైనను, పురుషుడైనను, శూద్రుడైనను పరిశుద్దమనస్కుడై దీర్ఘాయువును పొంది సూర్యలోకమునందును. ఎవరిచేత పూర్వ జన్మలలో ఈ విధితో ఈ తిథులయందు ఉపవాస దీక్ష చేయబడినదో, తపస్వులకును, బ్రాహ్మణులకును వివిధ ప్రకారములైన దానములీయబడినవో వారికి. మూడు రాత్రులు ఉపవాసము చేసిన వారికి, తీర్థ యాత్రలు చేసినవారికి, తపమాచరించినవారికి, ఎల్లప్పుడును తల్లిదండ్రుల సేవ చేసిన వారికిని, స్వర్గవాస భోగవాసన నుండి ఇహ లోకమునకు వచ్చినవారికి, ఫల నిష్పత్తి చిహ్నములు మనుష్యలోకమునందు కూడా ప్రత్యక్షముగా కనబడుచున్నవి. గజములు, అశ్వములు మొదలగు ప్రయాణవాహనములు, ధనము, రత్నములు, బంగారము, బంగారు కంకణములు, అంగదములు, కంఠాభరణములు, మొలనూళ్లు, యజ్ఞోపవీతములు, చెవులకు ధరించు భూషణములు, కిరీటములు, శ్రేష్టమగు వస్త్రములు, అందమైన స్త్రీలు, విలువైన మైపూతలు, సౌందర్యము, సద్గుణము, దీర్ఘాయువు మొదలగు ఫలములు ఉపవాసరతులకు దానశీలురకు కలుగును. ఇట్టి పుణ్యపురుషులకు ఆధి వ్యాధులుండవు. నృత్య గీత వాద్య మంగళ పాఠ శబ్దములతో తెలిసికొనదగినవారు నేడు కూడా ఈ లోకమున కనబడుచున్నారు. అట్లు ఉపవసించియున్న వారును కన్పట్టుచున్నారు. ఆ విధముగనే దానము చేయనివారు, పుణ్యమాచరింపని వారును ప్రత్యక్షముగా కనబడుచునే యున్నారు. నేడు కనబడు మానవులలో గ్రుడ్డివారు, కుష్టువ్యాధి పీడితులు, చెవిటివారు, బుద్ధిలేనివారు, మూగవారు, అంగ వికలురు, వ్యాధి పీడితులు, దారిద్ర్యముచే బాధపడువారు, ఉపసర్గ రోగ బాధితులు, రోగముల వలన చనిపోవువారు నేడు కూడ కనబడుచున్నారు.
శతానీక ఉవాచ :
మూ ॥ ద్విజేంద్ర! తిథయః ప్రోక్తాః సమాసేన త్వయాబుధ!
విస్తరేణేవ మే భూయః ప్రబ్రూహి ద్వీజసత్తమ!
రహస్యం యత్తిధీనాంతు దేవానాంచ విచేష్టితమ్ యానీష్టాని చ దేవానాం భోజ్యాని నియమాస్తథా
తాని మే వద ధర్మజ్ఞ! యేన పూతో భవేన్వహమ్ నిర్ద్వందోహి యథావిప్రలభేయాగ ఫలానితు
సుమంతురువాచ :
“రహస్యం యత్తిధీనాంచ భోజనం ఫలమేవతు యావచ్చయేన నియమో విశేషాత్ స్త్రీ జనస్యచ
ఏతత్తే సర్వ మాఖ్యామో రహస్యం తన్నిబోధమే యన్మయానోక్త పూర్వంహి కస్య చిత్సు ప్రియస్యచ
తత్తేహం సంప్రవక్ష్యామి యస్యదేవస్య యాతిథి: దేవతానాం రహస్యానీ వ్రతానీ నీయమాస్తథా
తాన్ శ్రుణుష్వ మహాబాహో! గదతో మమనారద సృష్టిం పూర్వం వదిష్యామి సంక్షే పేణ తిథిం ప్రతి
తమోభూత మిదం త్వాసీదలక్ష్యమని తర్కితమ్ జగద్ర్బహ్మా సమాగత్యాసృజదోత్మాన మాత్మనా
తా॥ శతానీకుడిట్లనెను. బ్రాహ్మణోత్తమా! తిథులను గుఱించి సాకల్యముగా చేప్పితిరి. ఇప్పుడు మఱల నాకు. తిథుల రహస్యమును, దేవతల విచేష్టితమును, వారికిష్టమైన భోజ్య పదార్థములను, నియమములను గుఱించి. సవిస్తరముగా చేప్పుడు. దానిచేనేను పవిత్రుడనగుదును. యాగ ఫలములెట్లు లభింపగలవో కూడా సెలవిండు”. దానికి సుమంతుడిట్లు బదులు పలికెను "తిధుల రహస్యము, ఆయా తిథులలో తీసికొనవలసిన ఆహారము, దాని ఫలము, ఎంత వఱకు ఏది నియమమో, ముఖ్యముగా స్త్రీల కేయే నియమములు కలవో. ఈ రహస్యమంతయు నీకు చెప్పెదము. తెలిసికొనుము. ఇంతకు పూర్వమి విషయములనెవ్వరికిని ఏ ఆప్తునికిని చెప్పియుండలేదు. ఏ దేవతకు ఏ తిధియో, ఏ దేవతకేది వ్రతమో, దేవతల రహస్యములు, నియమములు అన్నియు నేనిప్పుడు చెప్పెదను. మహాబాహూ! అవి యన్నియును చెప్పెదను వినుము, మొదట తిథిని గూర్చిన సృష్టిని గుఱించి సంక్షేపముగా నుడివెదను. మొట్ట మొదట ఇది సృష్టి అంతయు చెప్పుటకు, చూచుటకును అలవికాని తమస్సుగా నుండెను. పిదప బ్రహ్మ ఏతెంచి తనతోనే ఈ జగద్రూపమైన తనను రచించుకొనెను.
మూ. సంభూతాత్మైవ ఆత్మాసావండ మధ్యాద్వినిఃసృతః ఆత్మనైవాత్మనోహ్యండం సృష్ట్వా సవిభురాదితః
బ్రహ్మానారాయణాఖ్యోసౌ సృష్టిం కర్తుం సముద్యతః తాభ్యాం సోండ కపాలాభ్యాం దివం భూమించ నిర్మమే
దిశశ్చోప దిశశ్చైవ దేవాదీన్ దానవాం స్తథా తిథిం పూర్వామిమాం రాజంశ్చకారాథ విభుః స్వయమ్
తిథీనాం ప్రవరా యస్మాద్ర్బహ్మణా సముదాహృతా ప్రతిపాదితాపరే పూర్వే ప్రతిపత్తేన తూచ్యతే
అస్మాత్పదాత్తు తిధయో యస్మాత్త్వన్యాః ప్రకీర్తితాః అస్యాంతే కథయిష్యామి ఉపవాస విధిం పరమ్
కార్తిక్యం మాఘ సప్తమ్యాం వైశాఖస్య యుగాదిషు నియమోపవాసం ప్రథమం గ్రాహమేత విధాన విత్
యాంతిథిం నియమం కర్తుం భక్త్యాసమనుగచ్ఛతి తస్యాం తిథౌ విధానం యత్తన్నిబోధ జనాధిప!
యదాతు ప్రతి పద్యాం వైగృహ్ణీయాన్నియమం నృప!
చతుర్దశ్యాం కృతాహారః సంకల్పం పరికల్పయేత్
అమావాస్యాం నభుంజీత త్రికాలం స్నాన మాచరేత్ పవిత్రోహి జపేన్నిత్యం గాయత్రీం శిరసాసహ
అర్చయిత్వా ప్రభాతేతు గంధ మాల్యెర్ద్విజోత్తమాన్ శక్త్యాక్షీరం ప్రదద్యాత్తు బ్రహ్మామే ప్రీయతాం ప్రభుః
తా ॥ సృష్టి రూపమైన తత్వమే ఈ ఆత్మ (బ్రహ్మ, ఇతడు అండమధ్యమునుండి ప్రకటమయ్యెను. ప్రభువైన పరమాత్మ తనతోడనే తన ఈ అండమును మొదట సృష్టింప. దీన వెల్వడు నారాయణుడను వేద ప్రసిద్ధుడగు బ్రహ్మ జగద్రచనకు పూనుకొనెను. ఆ అండకపాలముల నుండి ఆకాశము, భూమి నిర్మించెను. దిక్కులు, ఉప దిక్కులు, దేవతలు, రాక్షసులు, పూర్వము పేర్కొనబడిన ఈ తిథి మొదలగువానిని తానే ఆజగత్ర్పభువు సృష్టించెను. తిథులన్నింటిలోనను శ్రేష్ఠమని బ్రహ్మ పేర్కొనుట చేతను, అన్నిటికన్నా ముందు దానిని ప్రతిపాదించుటచేతను మొదటి తిథి ప్రతిపత్తని చెప్పబడెను. ఈ పదము నాధారముగా గొనియే తక్కిన తిథులన్నియు ఆయా పేర్లతో కీర్తింపబడెను. దీని యందలి శ్రేష్ఠమైన ఉపవాస విధిని గుఱించి నీకు చెప్పబోవుచున్నాను. విధానము నెఱుంగువాడు కార్తీక పూర్ణిమ, మాఘసప్తమి, వైశాఖ శుక్ల తృతీయ దినములందు నియమ పూర్వకముగా ఉపవాస విధిని ప్రారంభింపవలెను. లేక ఏతిథియందు నియమ గ్రహణము చేయదలచి భక్తితో నుద్యుక్తుడగునో ఆ తిధియందలి నియమ విధానములను తెలిసికొనుము. రాజా! ప్రతిపత్తు నుండియే ఉపవాసదీక్ష గ్రహింపదలచినచో చతుర్దశినాడు భోజనము చేసిన పిదప ఉపవాస సంకల్పమును చేయవలెను. అమావాస్యనాడు భోజనము చేయకూడదు. త్రికాలములయందు స్నానము చేయవలెను. పవిత్రుడై వ్యాహృతిత్రయపూర్వకముగా గాయత్రీ మంత్రజపము చేయవలెను. ఉదయముననే గంధ పుష్పాదులచేత బ్రాహ్మణోత్తములను పూజించి యథాశక్తిగా వారికి క్షీర నివేదనము చేయవలెను. పిదప "బ్రహ్మ నాయెడ ప్రసన్నుడగుగాక' అని అనుకొనవలెను.
మూ. తతో భుంజీత గోక్షీర మనేన విధానానృప ఏష ఏవ విధిర్దృష్టః సర్వాసు తిథిషు నృప!
సంవత్సర గతేకాలే వ్రతమేతత్సమాప్యతే వ్రతాంతే యత్ఫలం తస్య తన్నిబోధ నరాధిప!
విముక్త పాపః శుద్ధాత్మా దివ్య దేహస్య దేహినః బ్రహ్మాదదాతి సంతుష్టో విమానమతి తేజసమ్ అవ్యాహత గతిం దివ్యం కిన్నరాప్సర సైర్యుతమ్
రమిత్వా సుచిరం తత్ర దేవతైః సహదేవవత్ ఇహచాగత్య విప్రత్వం దశ జన్మాన్య లభేత్
వేద వేదాంగ విద్యాశ్చ దీర్ఘాయుశ్చైవ సుప్రభః భోగీ ధనపతిరాతా జయతేఽసౌకృతే యుగే
విశ్వామిత్రస్తు రాజేంద్ర! బ్రాహ్మణత్వ జిగీషయా తపశ్చచార విపులం సంతాపాయ దివౌకసామ్ బ్రాహ్మణత్వం నలేభేఽసౌలేభే విఘ్నాననేకశః
తతస్తు నియమత్తేషాం తిథీనాం ప్రవరా తిథి: ఉపోషితా బహువిధా జ్ఞాత్వాబ్రహ్మప్రియాం తిథిమ్
తతోదేవో దదౌ బ్రహ్మా విశ్వామిత్రాయ ధీమతే ఇహైవ తేనదే హేన బ్రాహ్మణత్వం సుదుర్లభమ్
తిథీనాం ప్రవరా హ్యేషా తిథీనాముత్తమా తిథిః క్షత్రియో వైశ్య శూద్రౌవా బ్రాహ్మణత్వమవాప్నుయుః
ఏవం తిథిరియం రాజన్కామదా కంజజప్రియా స రహస్యా మయా ప్రోక్తా యా నోక్తాయస్యకస్యచిత్
హైహయైస్తాలజం ఘైశ్చ తురుష్కైర్యవనైః శకైః ఉపోషితా ఇహాత్రైవ బ్రాహ్మణత్వమభీప్సుభిః
ఇత్యేషా పరమా పుణ్యా శివా పాపహరా తథా పఠితో పాసితా రాజన్ శ్రద్ధయాచ శ్రుతా తథా
మాహాత్మ్యం చాపియోప్యస్యాః శృణుయాన్మానవోనృప! ఋద్ధిం వృద్ధిం తథాకీర్తిం శివంచాప్య దివం వ్రజేత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి
ప్రతిపత్కల్పవర్ణనంనామ షోడశోఽధ్యాయః
తా ॥ అప్పుడు తాను ఆవుపాలను గ్రోలవలెను. రాజా! అన్ని తిధులయందును ఉపవాస నియమము ఇట్లే కనబడుచున్నది. ఇట్లు ఒక సంవత్సరము పూర్తియయిన పిమ్మట వ్రతము సమాప్తమగును. రాజా! ఇక ఈ వ్రతము పూర్తిచేసిన కలుగు ఫలమును తెలిసికొనుము. పాపముక్తుడై, పరిశుద్ధమైన ఆత్మగలవాడై, దివ్య దేహముగలవాడైన మానవునకు బ్రహ్మదేవుడు సంతుష్టుడై ఒక తేజో మయమైన విమానమును ఇచ్చును. అది కిన్నరులు, అప్సరసలతోకూడి, నిరాటంకముగ పయనింపగల దివ్య విమానము. అచట స్వర్గమునందు దేవతలలో దేవతవలే సుదీర్ఘకాలము సుఖించి ఆ పిదప ఈ లోకమునకు వచ్చి పది పర్యాయములు బ్రాహ్మణ జన్మములను పొందును. తేజస్వియై, వేద వేదాంగ విద్యలనార్జించి, దీర్ఘాయుష్మంతుడై, భోగములనుభవించువాడై, ధనికుడై, దాతయై ఇతడు కృతయుగమున జన్మించును. రాజేంద్రా! విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వమును పొందగోరి దీర్ఘకాలము తపస్సు చేసెను. అది దేవతల సంతాపమునకు మాత్రము కారణమయ్యెను. అతడు బ్రాహ్మణత్వమును పొందకుండెను కాని అనేక విధములైన విఘ్నములను మాత్రమే పొందెను. అప్పుడు నియమవ్రతుడై తిధులలో శ్రేష్ఠమైనది, బ్రహ్మకు ప్రియమైనదిగా తెలిసి పాడ్యమినాడు ఉపవాస వ్రతమును ప్రారంభించెను. అప్పుడు బుద్ధిమంతుడైన విశ్వామిత్రునకు బ్రహ్మదేవుడు ఇహమునందలి అదే దేహమున దుర్లభమైన బ్రాహ్మణత్వము నిచ్చెను. ఇది తిథులలో శ్రేష్ఠమైనది. ఉత్తమమైనది. దీనియందు వ్రతమాచరించు క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను బ్రాహ్మణత్వమునందుదురు. ఇడ్లీ తిథి (వ్రతము) కోరికలనిచ్చునది. బ్రహ్మకు ప్రియమైనది. రహస్యమైనది. దీని గూర్చి ఎవరును ఎవరితోను చెప్పియుండలేదు. నేను నీకు చెప్పితిని. హైహయులు, తాలజంఘులు, తురుష్కులు, యవనులు, శకులు వీరిలో ఈ ఉపవాస వ్రతము నాచరించినవారు కోరిన బ్రాహ్మణత్వమును పొందగలిగిరి. ఇట్లు ఇది శ్రేష్ఠమైనది. పుణ్య ప్రదమైనది. శివంకరమైనది. పాపములను హరించునది. దీనిని పఠించినను, ఉపాసించినను, దీని గొప్పతనమును శ్రద్దగా వినినను. ఐశ్వర్య సమృద్ధిని, సర్వవస్తు పౌష్కల్యమును, కీర్తిని, సుఖమును పొంది ఆ పిదప స్వర్గమునకు పోవుదురు.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున ప్రతిపత్కల్ప వర్ణనమను పదునాఱవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 16 of the Bhavishya Mahā Purana is as follows:
The great kalpa-by-kalpa section of the Brahma Parva opens with the Pratipat Kalpa — the sacred observances of the first tithi of each lunar fortnight. The chapter introduces the framework of the entire section: each tithi has its presiding deity, its associated vrata, and its specific dietary and ritual requirements. The dietary rules appropriate to different tithis are explained, making clear which foods are permitted, which are to be avoided, and what the merit or demerit of transgression entails. The narrative of Viśvāmitra is invoked to illustrate the transformative power of tithi observance: the great ṛṣi's spiritual ascent is linked to his unwavering observance of these sacred time-markers in his long tapas.