భవిష్య మహా పురాణము
15. స్త్రీ ధర్మ వర్ణనము
బ్రహ్మోవాచ ।
మూ ॥ దుర్భగాచ పునర్నిత్యముపవాసాది తత్పరా బాహ్యేషు పతికృత్యేషు స్యాద్విశేషాభియోగినీ
న ప్రశంసా సపత్నీషు నిందించాపి తథాత్మని అసూయాం భర్తురీర్ష్యాం వా ప్రణయం వాపి దర్శయేత్
మద్విధా యాహి బహ్వేతత్తచ్చాత్యంతిక మశ్నుతే యదస్యాయుష్మతో యాయాద్భార్యా శబ్దాభిధేయతామ్
నచ నిర్భూషణా తిష్ఠేన్నచా ప్యుద్ధత భూషణా నాన్యదా గంథమాల్యాది గ్రాహ్యం పత్యుపచారతః
తన్న్యూనం సర్వశోగ్రాహ్యం వల్లభాయా విశేషతః భూషణం గంథమాల్యంతు తావత్కాలమలక్షితమ్
సంబంధానాం ప్రదేశానాం నిత్యం స్వేదాది మార్జనమ్ దంతనాసాది ఫంకానాం విగంధస్యచ శోధనమ్
నిమిత్తం భర్తురేతాసాం యత్కించిదభిలక్షయేత్ నానేన వా తయోర్యత్నం విదధ్యాదంగమార్జనే
సర్వాసాంచ సపత్నీనాం సర్వత్రానుగతాభవేత్ వైతసీం వృత్తిమాస్థాయ వల్లభాయా విశేషత:
అన్యస్యా యదను ష్టేయం యన్నసీదేత్సమర్పితమ్ భర్తుశ్చావిదితం యత్నాత్తత్కుర్యాదవిరోధిచేత్
కోశవస్త్రాన్న తాంబూల గంథపానౌషధాదికమ్ తత్సర్వమనియుక్తానాం దోషవత్వాద్విరుధ్యతే
తా ॥ భర్తచేత నిరాదరింపబడు దురదృష్టవంతురాలు ఉపవాసములు మొదలగు నియమములందు, భర్తకు సంబంధించిన పైపై పనులు నిర్వర్తించుటయందును నిమగ్నురాలై కాలము పుచ్చుచుండవలెను. సవతులను ప్రశంసించుటగాని, తనను తాను నిందించుకొనుట గాని చేయకూడదు. భర్త యెడల ఈర్ష్యాసూయలు గాని, ప్రేమగాని ప్రదర్శింపకూడదు. నా వంటి స్త్రీ ఇట్టి ఆయుష్మంతునికి 'భార్య' అను పేరుగల స్థానమును పొందుట, ఇంతటి సౌభాగ్యమును పొందుట-ఇదియే గొప్పదనము కదా యని భావింపవలెను. పూర్తిగా ఆభరణములు లేకుండా గాని, అతి మాత్రముగా ఆభరణములు ధరించి యుండుటగాని లేకుండ నుండవలెను. భర్త సేవకు సంబంధించిన గంధము, పుష్పములు మొదలగునవి ఎప్పుడును గ్రహింపరాదు. అతనికి పనికిరానివి, ముఖ్యముగా అతని ప్రియభార్యకు ఇష్టములేనివి ఎప్పుడైనను స్వీకరింపవచ్చును. వారికి లక్ష్యములేని ఆభరణములను గాని, గంధమాల్యాదులనుగాని వారికి అక్కఱలేనంతవఱకు తాను స్వీకరింపవచ్చును. "ఇతర భార్యలకు సంబంధించిన సంతానముల దంతనాసాది మాలిన్యములను కడిగివేయుట, వారి నివాస ప్రదేశములను తుడిచి శుభ్రము చేయుట, దుర్వాసనలను తొలగించుట మున్నగునవి చేయవలెను -6. ఇతర భార్యలకు గాని, వారి బిడ్డలకుగాని ఒడలుతోముటయందేవరికి ఏ కొంచెము తన తోడ్పాటు కావలసివచ్చినను, భర్తకోరకున్నను అతిని నిమిత్తముగ వారికి అట్టి తోడ్పాటునందింపవలేను. అంతటను తన సవతుల ననుసరించియే యుండవలెను. అందజీయెడ, ముఖ్యముగా భర్తకు ప్రియతమమైన భార్యయెడ ప్రణతిభావమును వహించి యుండవలెను. తోటి భార్యల యెడ ఏది అనుష్ఠింపవలెనో అది అనుష్ఠింపవలెను. వారు ఇచ్చినను, పుచ్చుకొన కూడనిది పుచ్చుకొనరాదు. విరోధము కాని యెడల భర్తకు తెలియకుండ వారికి చేయవలసిన మేలు చేయవలెను. ధనము, వస్త్రములు, భోజనము, తాంబూలము, గంథము, ఔషధము మొదలగునవి క్రొత్త వారికి ఇచ్చుట (వారి నుండి పుచ్చుకొనుట) దోషమైనందువలన నియమ విరుద్ధము.
మూ ॥ యత్తు ముక్తమను ష్ఠేయం గృహసంమార్జనాదికమ్ స్త్రీణా మనధికారో ఽపి ప్రాయస్తద్విధి రుచ్యతే
అభ్యంగోద్వర్తనం స్నానం భోజనం మండనానిచ కుర్యాద్భర్తురపత్యానాం ధాత్రీ కర్మాణి సాదరమ్
ఆత్మవత్తాన్య పత్యానీ సాధయత్యను యోగత స్వేనాప్యమిషాం విత్తేన విదధ్యాన్మండనాదికమ్
భోగః స్వయమపత్యైర్వా స్త్రీ విత్తస్య పతిర్విధా పూర్వం వయస్యభినంద్య పశ్చిమే చోపయోజయేత్
ఉపయోగిస్తు వా మా కర్మజః పృథగేవసః సద్వృత్తే త్వధికాంఖ్యాతంకుర్వీత క్రియయాపునః
నకాపీ దుర్భగా నామ సుభగానామ జాతితః వ్యవహారాద్భవత్యేష నిర్దేశోరిపు మిత్రవత్
భర్తృ చిత్తాపరిజ్ఞానా దననుష్ఠానతోఽపివా వృత్తైర్లోక విరుద్ధైశ్చయాంతిదుర్భగతాం స్త్రియః
ఆనుకూల్యాన్మనో వృత్తేః పరోఽపి ప్రియతాం వ్రజేత్ ప్రాతికూల్యాన్నిజోప్యాశు ప్రియః ప్రద్వేషతామియాత్
తస్మాత్సర్వాస్వవస్థాసు మనోవాక్కాయ కర్మభిః ప్రియం సమాచరేన్నిత్యం తచ్చిత్తాను విధాయినీ
యామన్యాం కామయేత్తాసాం తం తయా సంప్రయోజయేత్ కుపితాంచ ప్రియాం కాంచీద్యతా దస్మైప్రసాదయేత్
తా ॥ చేయక వదిలి పెట్టబడిన పనులు -ఇంటిని ఊడ్చుట మొదలగునవి చేయుచుండవలెను. అధికారములేకున్నను ప్రాయికముగా స్త్రీలు ఇట్టి పనులు చేయుట విధియని చెప్పబడును. అభ్యంగనము, నలుఁగు పెట్టుట, స్నానము, భోజనము, అలంకరణము మొదలగునవి తన భర్తపిల్లలకు దాదీవలే ఆదరముతో చేయవలెను. వారు కూడ తన బిడ్డలవంటివారే. అట్టి భావముతోడనే పనులు నిర్వర్తింపవలెను. తన బిడ్డలతో బాటుగా వారికి కూడ అలంకారసామగ్రి మొదలగునవి కొని పెట్టవలెను. సంతానము చేత, లేక స్త్రీధనమునకు భర్త సమకూర్చిన ఆస్పదముచేత సుఖజీవనమేర్పడుచుండును. యౌవన ప్రౌఢ వయస్సులలో జాగ్రత్త పఱచికొనిన సొమ్మును వార్ధక్యమున నుపయోగించుకొనవలెను. ఇద్దలు కలిసి ఉండినను లేకున్నను, అతడు వృత్తియందుండువాడు కనుక వేడైనవాడు. మంచి వృత్తికి సంబంధించిన మంచి పనుల చేత అధికమైన కీర్తిని గడింపవలెను. జాతిచేత ఏ స్త్రీ కూడ దుర్బగయనికాని సుభగయనికాని ఉండదు. ఈ నిర్దేశము మిత్రుత్వ శత్రుత్వములవలె వ్యక్తి వ్యవహరించు తీరువలన ఏర్పడును. భర్త చిత్తమును తెలిసికొనక, అతని మనోభావములకు అనుకూలముగ ప్రవర్తింపలేకపోవుట, లోక విరుద్ధమైన నడవడి-వీని వలననే స్త్రీలు దుర్భగలగుదురు. మనోవృత్తికి అనుకూలముగ ప్రవర్తించుట చేత పరుడు కూడ ప్రేమాస్పదుడగును. ప్రతికూలముగ ప్రవర్తించుట చేత ఆత్మబంధువుకూడ ద్వేషపాత్రుడగును. అందువలన అన్ని అవస్థలలోను, మనోవాక్కాయ కర్మలచేత భర్తచిత్తము ననుసరించుచు అతనికి ప్రియమునే చేయుచుండవలెను. భార్యలందతిలోను అతడు తనకంటే వేగు ఏ భార్యను ఇష్టపడునో ఆమెను అతనితో కూర్పవలెను. ఏకారణము చేతనైనను కోపించియున్న అతని ప్రియ భార్యను ఏ ప్రయత్నము చేతనైనను అతనియెడ ప్రసన్నురాలినిగా చేయవలెను.
మూ. తత్పాద పరిచర్యాయాం గాత్రసంవాహనే తథా పీడనే శిరసశ్చైవ పరం కౌశల మభ్య సేత్
పీడనం మృదు మధ్యంచ గాత్రావస్థా విశేషతః ముఖగాత్రాది భిర్లింగైః ప్రయోజ్యం తత్సుఖావహమ్
బాహూరూకటి పృష్ఠేషు స్కంధే శిరసి పాదయోః గాఢమర్దన మిచ్ఛంతి ప్రాయోన్యతాపి మధ్యమమ్
నిర్మాం సేషు ప్రదేశేషు నాభిమూలేషు మర్మసు హృద్గండక కపోలాదా విచ్ఛంతి మృదుమర్దనమ్
గాఢం జాగ్రదవస్థాయా మర్థసుప్తస్య మధ్యమమ్ కించిత్సపరిఘాతంచ మృదు సుప్తస్య నేతివా
విరుద్ధం సర్వగాత్రేషు లోమవత్సు విశేషతః ఉత్కండూయత్సు సోద్ధంర్షం స్నేహాక్తేషుచ మర్ధనమ్
స్పర్శాద్రోమాంచ జననం సనఖచ్ఛురితం శనైః పులకోల్లేఖనో పేతం శిరః కండూశ్చ పార్శ్వయోః
తేషు తేషు చ గాత్రేషు తత్వయోజ్యంతథాతథా నిద్రాగమాయ తత్కాలే రాగ సంధుక్షణాయచ
తిష్ఠతశ్చోప విష్టస్య జాగ్రతః స్వపతోపివా సంవాహనం ప్రశంసంతి యదత్యర్థ సుఖావహమ్
నైష్పంద్యం పులకోద్భేదో గాత్రాణామక్షిమీలనమ్ తత్ర్పదేశారణం కించిద్బోధ్ద్వికృతి దర్శనమ్
ఉరుమూలాది దేశేచ తత్పాణి ప్రతి పీడనమ్ లక్షయేన్నిపుణాయత్ర తత్రైవాధికమాచరేత్
ఏవమేవ యథోద్దిష్టం స్త్రీ వృత్తం యానుతిష్ఠతి పతి మారాధ్య సంపూర్ణం త్రివర్గం సాధిగచ్ఛతి
ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి
స్త్రీ ధర్మవర్ణనం నోమ పంచదశోఽధ్యాయః
తా ॥ భర్తకు పాద సేవ చేయుటయందును, ఒడలు పట్టుటయందును, అటులే తల ఒత్తుటయందును మంచి నైపుణ్యమును నేర్చుకొనవలెను. శరీర పరిస్థితిననుసరించి అతని ముఖభంగిమలను, శరీరపు కదలికలను గమనించి, సుఖముగా నుండునట్లు ఒత్తుటను గాఢముగను, మధ్యమ ప్రకారముగను, మృదువుగను చేయుచుండవలెను. భుజములు తొడలు, నడుము, వీపు, మూఁపులయందు, తల పైన, పాదములమీద గాఢముగా ఒత్తుటను ఇష్టపడుదురు. ఇతర స్థలములయందు సాధారణముగా మధ్యమ ప్రకారమగు మర్దనము చేయవలెను. మాంసము లేని తావులయందు, నాభి మూలములయందు, మర్మస్థానములయందు, హృదయము, చెవి క్రింది (ప్రక్క) స్థలములు, చెక్కిళులు మొదలగు వానియందు మృదువుగా మర్దనము చేయవలెను. జాగ్రదవస్థలోనున్నప్పుడు గట్టిగను, సగము నిద్రలోనున్నప్పుడు మధ్యమముగను, నిద్రించినపుడు మృదువుగను ఒత్తవలయును. గాఢనిద్రలోనున్నప్పుడు ఒత్తకుండుటయేలు. అన్ని అంగముల యందు ముఖ్యముగా వెంట్రుకలు గల వాని యందు వ్యతిరేకముగను, జిలగలతావులయందు, మీక్కుటముగను, నును పైన స్థలములయందు రాయుచును ఒత్తవలెను. స్పర్శవలన రోమములు నిక్కబొడుచును. మెల్లగా గోళ్లతో గోకుట మొదలగును. ఒడలిపై పులకాంకురములు కలుగును. తల ప్రక్కలలో గిలిగింత కలుగును. ఆయా అంగములయందు ఆయావిధములుగా, నిద్ర వచ్చుటకో లేక అనురాగము రాజుకొనుటకో ఒత్తుచుండవలేను. నిలబడి యున్నవానికిని, కూర్చోనియున్నవానికిని, మేల్కొనియున్నవానికిని, నిద్రించుచున్న వానికిని అంగమర్దనము (ఒడలు పట్టుట) మిక్కిలి ఇష్టమైనది. అది. ఎంతయో సుఖమునిచ్చుటయే దానికి కారణము. కదలకుండ కుదురుగనుండుట, అన్ని అవయములపై పులకాంకురములు మొలచుట, కన్నులు అరమూయుట, ఒత్తుతావుల నర్పించివేయుట, భావవికారము కనబడుట, ఇవి అంగమర్దన ప్రతిచర్యలుగా గ్రహింపవలెను. తొడల మూలమున లేక ఎచ్చటనేనియు చేతికి ఎదురొత్తుట గమనించినచో అచ్చట ఎక్కువ ఒత్తిడితో సంవాహనము చేయవలెను. నిపుణురాలైన స్త్రీ ఈ అంశమును గ్రహింపవలేను. ఇదియే శాస్త్రము చేతను లోకము చేతను ఉద్దేశింపబడిన స్త్రీ ప్రవర్తించవలసిన విధానము. ఏ స్త్రీ ఈ విధానముననుసరించుచు పతి నారాధించునో ఆమె ధర్మార్థకామములను సంపూర్ణముగా పొందును.
ఇట్లు శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మవర్ణనమను పదునైదవ అధ్యాయము.
Summary of chapter 15 of the Bhavishya Mahā Purana is as follows:
A wife's tender care for her husband's body — the art of aṅgamardana, the gentle pressing and massaging of tired limbs — is presented as one of the most intimate expressions of pativratā. The chapter teaches that such physical service, performed with genuine love and without expectation, generates immense dharmic merit for the wife. The neglected wife — she who is overlooked by a distracted or unkind husband — is given specific guidance on maintaining her dharmic composure and continuing her service regardless. The culminating teaching of the strī dharma section is that the pativratā who lives in complete devotion to her husband obtains the fruits of all three puruṣārthas — dharma, artha, and kāma — in this life, and liberation thereafter.