భవిష్య మహా పురాణము
12. స్త్రీ ధర్మ వర్ణనము
బ్రహ్మోవాచ
మూ. వ్రీహీణాం కోద్రవాణాంచ సారధర్మముదారకః కంగు కోద్రవయోర్జ్ఞేయోవరటః పంచభాగకః
పంచ భాగాన్ప్రియంగూనాం శాలీనాం చ త్రయోఽష్టుచ చణకానాం తృతీయాంశః సమక్షుణ్ణం త్రయం విదు:
పానీయ యవ గోధూమం పిష్ట ధాన్య చతుష్టయమ్ తుల్యమేవావ గంతవ్యం ముద్గా మాషాస్తిలా యవాః
పంచ భాగాదికా ఘృష్ణా గోధూమాః సక్తవస్తథా కుల్మాషాః పిష్ట మాంసంచ సమ్యగర్ధాదికం భవేత్
సిద్ధం తదేవ ద్విగుణం పున్నాకో యావకస్తథా కంగు కోద్రవయో రన్నం చణకోదారకస్యచ
ద్విగుణం చీన కానాంచ వ్రీహీణాంచ చతుర్గుణమ్ శాలేః పంచగుణం విద్యాత్పురాణే త్వతీరిచ్యతే
క్రియాపాక విశేషాస్తు వృద్ధిరేవోప దిశ్యతే నిమిత్తస్య వరానస్య తద్వృద్ధిర్ద్విగుణాభవేత్
తస్మాద్భూయో విరూఢస్య చతుర్భాగో వివర్ధతే లాజా ధానాః కలాయాశ్చ భృష్టాద్ధ్విగుణ వృద్ధయః
భ్రష్టవ్యానామతోఽన్యేషాం పంచభాగోధికోమతః చాపకానాం చ పిష్టానాం పాదహీనాః కలాయజా:
ముద్గామాషా మసూరాణామర్థ పాదావరో భవేత్ క్లిన్న శుష్క వరాన్నానాం హానిర్వృద్ధిర్విశిష్యతే
తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఎఱ్ఱవడ్ల ధాన్యములోను, అళ్లలోను ఉదారకమను (సస్యము) ధాన్యము శ్రేష్ఠ గుణము కలది. కొఱలు, ఆళ్ళలోను హంసజాతి ఐదుపాళ్ళుమేలైనది. ప్రియంగువు (కొఱ)లలో ఐదు భాగములను, వరిలో పదకొండు పాళ్ళు, సెనగలలో మూడవ భాగము ఈ మూడును సమానములని స్పష్టము చేయబడినదిగా నెఱుగుదురు. యవ గోధుమ పానీయములు: పెసర, మినుములు, నువ్వులు, యవలు అను ధాన్యముల పిండి, సమానమైనవిగా భావింపవలెను. విసరబడిన గోధుమలు (పిండి), పేలపు పిండ్లు ఐదుపాళ్ళు మొదలుకొని (ఆ పైన) సారముగలవి. అలచందలు (కారు మినుములు), పొడిగా చేయబడిన మాంసము సగము మొదలుకొని అంతకేక్కువగా మేలైనవి. పున్నాకములు, కారు మినుములు; కొర్రలు, ఆళ్ళు సెనగలు, ఉదారకములు అన్నములు రెండింతలు శ్రేష్ఠమైనవి. చీనకములలో రెండింతలు, ఎఱ్ఱధాన్యములో నాలుగింతలు, శాలిధాన్యములో ఐదింతలు సారముండును. ఇవి ప్రాతవియైననింకను హెచ్చుగానుండును. క్రియలు, పాకములు మొదలగు విశేషములు మూలమున గుణవృద్ధిచెప్పబడును. శ్రేష్ఠమైన వంటకము కారణముగా ఆవృద్ధి రెండింతలగును. దాని నుండి మఱల మొలకలెత్తిన గింజలకు నాల్గుపాళ్ళు గుణ వృద్ధియగును. నాను బియ్యము, బొరుగులు (ధనియాలు) గుండ్రని సెనగలు, వేఁచబడిన వానికంటే రెండింతలు గుణవృద్ది కలవి. అందువలన నిది ఇతర జాజుధాన్యముల కంటే ఐదింతలేక్కువ. చాపకములలో, పిండ్లలోను గుండ్రని సెనగలు. నాలుగవ వంతు తక్కువ. పెసర, మినుము, చిరు సెనగలతో ఎనిమిదవ వంతు కడపటిది. శ్రేష్ఠములైన వంటకములలో తడిసీనది (పాసిపోయినది) హాని కలిగించును. తడియారినది (ఎండినది) గుణ వృద్దికలది యగును.
మూ. తథార్ధేనతు శోధ్యానామఢక్యా ముద్గమాషయోః మసురాణాంచ జానీయాత్ క్షయం పంచమభాగకమ్
షడ్భాగేనాతసీ తైలం సిద్ధార్థక కపిత్థయోః తథానింబ కదంబాదౌ విద్యాత్పంచమ భాగకమ్
తిలేంగు దీమధూకానాం నక్తమాల కుసుంభయోః జానీయాత్పాదకం తైలం ఖల మన్యత్ర్పచక్షతే
క్షేత్రకాల క్రియాదిభ్యః క్షయాదేర్వ్యభిచారతః ప్రత్యక్షీకృత్య తాన్సమ్యగను మిత్యావధారయేత్
క్షీరదోషే గవాం ప్రస్థం మహిషీణాంచ సర్పిషః పాదాధిక మజావీనాముత్పాదం తద్విదోవిదు:
సుభూమి తృణ కాలేభ్యో వృద్ధిర్వాక్షీరసరిషామ్ అతస్తేషాం విధాతవ్యోహ్యర్ధాదేవ వినిశ్చయః
ప్రత్యక్షీ కృత్యయత్నేన పక్ష మాసాంతరే తథా పయోర్వృత్తైర్గవా దీనాం కుర్యాత్సంభవ నిర్ణయమ్
కార్పాసకృమికోశౌ మౌర్ణక క్రైమాసికర్తనమ్ కుణి పంగ్వంధ యోషా భిర్విధవా భిశ్చకారయేత్
బాల వృద్ధాంధ కార్పణ్యే యత్కర్తవ్యమవశ్యతః వినియోగం నయేత్సర్వం ప్రియోపగ్రహపూర్వకమ్
కర్మణా మంతరాలేషు ప్రోషితే చాపి భర్తరి స్వయంవై తదనుష్ఠేయం నిత్యానాంచావిరోధతః
తా ॥ ఆ విధముగనే ప్రయోజన దృష్టితో, కందితో పోల్చిపరిశోధింపదగిన పెసర మినప, చిరు సెనగలలో ఐదువంతులు గుణము తక్కువ యని తెలియవలెను. తెల్లఆవాల, వెలగ నూనెలలో అగి సెనూనె ఆరువంతులు, అదే విధముగ, వేప, ఆవనూనెలు మొదలగు వానియందు ఐదవభాగము తక్కువ మేలైనదీ. నువ్వులనూనె, గారనూనె, ఇప్పనూనె, కానుగునూనే, కుసుమ నూనెలలో నువ్వులనూనె నాల్గవ వంతు శ్రేష్టమైనది. మిగిలినవి అధమములని చెప్పుదురు. అవి పండిన క్షేత్రములు, కాలములు, పెంచిన విధానము మొదలైన వాని చేత పొరపాటువలన ఏర్పడిన తెగుళ్ళు, తరుగులు వినన్నిటిని చక్కగా ఊహించితెలిసికొని జాగరూకులైయుండవలెను. ఆవుల పాలలో నుండు దోషపుకొలదియు, గేదెలనేతిలోనుండు దోషపు కొలదియు (కంటె) మేకలు మొదలగు వాని పాడి ఉత్పత్తిలో దోషపుపాలు ఒక పాదభాగమధికమని అది తెలిసిన వారు తెలియుదుర. మంచిభూమి, అచట ఆపశువులు మేసిన తృణ విశేషములు, అవి మేసిన కాలము మొదలైన వాని వలన పాలు, నేయి మొదలైన వానీ వృద్ధియు, అటులే వాని ప్రయోజనమునుండి భూతృణ కాలాదులు నిశ్చయింపదగును. ఒక పక్షము, మాసము వ్యవధిలో పూనికతో ఇవి-గోవులు మొదలైన వాని పాలు మొదలైనవానిని పరిశీలించి ఉచితమైన నిర్ణయము చేయవలెను. పశువుల ఒంటిమీద దూది, కృమి కోశములు, ఉన్ని (బొచ్చు), సౌర మొదలగునవి కత్తిరించుటకు, ఈచబోయిన (వంకరైన) చేతులుగలవారిని, కుంటి, గ్రుడ్డి, వితంతు స్త్రీలను నియోగింపవలెను. తప్పకుండ చేయవలసిన పనులయందు బాలురను, వృద్ధులను, గ్రుడ్డివారిని, అల్పులను (దీనులను), వారికి అనుకూలములగు కానుకలిచ్చుచు నియోగింపవలెను. పనుల మధ్యగలు వ్యవధిలోను, భర్త దేశాంతర గతుఁడైనప్పుడును ఇల్లాలు స్వయముగా అట్టి నిత్యకార్యములను నిస్సంకోచముగ చేయవచ్చును.
మూ ॥ శూద్రాణాం స్థూల సూక్ష్మత్వం బహుత్వంచ వ్యయావ్యమౌ మత్వా విశేషం కుర్వీత చేతన ప్రతి పత్తిషు
కారయేద్వస్త్ర ధాన్యాది స్వాప్తవృద్ధైరధిష్టితమ్ శూద్రాణాం క్షయ వృద్ధ్యాది మంతవ్యం వేతనానిచ
క్షౌమ కార్పాసయోర్విద్యాత్సూత్రం పంచమ భాగకమ్ దేశకాలాది భాగాత్తు ప్రత్యక్షాదేవ నిర్ణయం
అవఘాతేన తూలస్య క్షయో వింశతి భాగకః ఛన్నాం వ్యాప్తంతు వాతేన తద్వదూర్ణాం ప్రచక్షతే
పంచాశద్భాగికీం హానీం సూత్రేకుర్వీత లక్షణాత్ వృద్ధిస్తు మండ సంపర్కాద్దనైకాదశికా భవేత్
శ్లక్ష్ణ మధ్యమ సూత్రాణామర్ధాధిక సమంభవేత్ స్థూలానాంతు పునర్మూల్యాత్పాదోనం వాలచేతనమ్
కర్మణో భూరి భేదత్వాద్దేశ కాలప్రభేదతః తద్విద్భ్య ఏవబోద్ధవ్యో వాలచేతన నిశ్చయః
స్థూలం దీనత్రయం దేయం మధ్యమం చ త్రిరాత్రికమ్ సూక్ష్మమా పక్షతోమృష్టం మాసాత్తత్పరి కర్మకమ్
యదత్ర క్షయ వృద్ధ్యాది తదుత్సర్గా ప్రదర్శితమ్
కాలకర్త్రాది భేదేన వ్యభిచారోపి దృశ్యతే శయ్యాసనాన్యనేకాని కంబలాశ్చతురాశ్రికాః
కంబు కాశ్చావ కోషాశ్చ మధ్యారక్తాశ్చ భూరిశః గురుబాలాది వృద్ధానా మభ్యాగత జనస్యచ
తా ॥ శూద్రులలో స్థూల సూక్ష్మబహుత్వములను, వ్యయావ్యములను ఆలోచించి పశుప్రాప్తియందు విశేషమును చేయవలెను. తన కాపులైన పెద్దవారీ ఆశ్రయమున వస్త్ర ధాన్యాదులను చేయింపవలెను. పశుపాలకుల హెచ్చుతగ్గులను వారి జీతములను బాగుగసాలోచింపవలెను. నార, దూది మొదలగు పనులందు వానిలో ఐదవ భాగము కూలియిచ్చు ఏర్పాటు కలదు. దేశకాలములననుసరించి, ఇతరుల పద్దతిననుసరించియే ఇది నిర్ణయింపవలేను. కొట్టుట చేత, గాలివలన దూదికి ఇరువది వంతుల తగు ఏర్పడును, అటులే, కప్పబడినదైనను, వ్యాపించియుండినదైనను బొచ్చు (ఉన్ని)ని గురించి కూడ తగ్గుచెప్పుదురు. లక్షణమును బట్టీనూలునందు ఏబది వంతుల తఱుఁగును చేసికొనవలెను. అందునూనె (లేక గంజి ) కలయికతో ఇరువది యొక్కపాళ్ళు వృద్ధి కలుగును. జీవముల వెంట్రుకల మిక్కిలి సన్నగను లేక మధ్యమముగను ఉన్నచో వాని దారముల విలువ సగముకంటెను ఎక్కువకు తక్కువకాకుండనుండును. ఇక స్టూలముగనున్నయెడల నాల్గవ భాగము తగ్గిపోవును. పనితనపు భేదముల చేత, దేశకాలముల భేదముల చేతను, ఇంకను ఇట్టి అనేక భేదముల చేతను జంతువుల వెంట్రుకల విలువల నిర్ణయములను తెలిసికొనవలెను. స్థూలమైన దానిని శుద్ధిచేయుటకు మూడు దినములీయవలెను. మధ్యమమైన దానికి మూడు రాత్రులు సరిపడును. సూక్ష్మమైనది ఒక పక్షము వఱకు శుభ్రము చేయబడును. నెల దినములలో అది మొత్తముగా సంస్కరింపబడును. దాని సామాన్య క్షయ వృద్ధ్యాది విషయములిట చూపబడినవి. కాలము, కర్త మొదలగు భేదములచేత వానిలో మార్పులు కనబడుచుండును. పాన్పులు, ఆసనములు, కంబళములు మొదలగుననేక వస్తువులు అవి స్థిరపఱచు వారి నేర్పరి తనము నాశ్రయించియుండును. తలకు (మెడకు) చుట్టుకొనుటకు చిన్న శాలువలవంటివి, పెద్దకంబలములను నడిరకమైనదారముతో చేయబడినవి గురువులకు, వృద్ధులకు, బాలురు మొదలగువారికి, అభ్యాగత జనమునకును ఎక్కువగా ఇష్టమైనవియై యుండును.
మూ ॥ భోగాయానుగతో భర్తా కుర్యాద్వివిధమాత్రకమ్ యదస్యశ్వశురాదీనాం కల్పితం శయనాదికమ్
భర్తుశ్చైవ విశేషేణ తదన్యేన నకారయేత్ వస్త్రం మూల్యమలంకారం వీధృతం దేవరాదిభి:
నధారయేన్నచైతేషామాక్రమేచ్ఛయనానివా పిణ్యాకనక కుట్టాశ్చ కాలరూక్షాని యానిచ
హేయం పర్యుషితాద్యన్నం గోభక్తేనోపయోజయేత్ కులానాం బహుధేనూనాం గోధ్యక్ష వ్రజ జీవినామ్
కిలాట గవికాదీనాం భక్తార్థముపయోజయేత్ దద్న: సమాహరేత్సర్పిద్దు హేద్వత్సాన్నపీడయేత్
వర్షాశరద్వసంతేషు ద్వౌకాలావన్యధా సకృత్ తక్రం వాప్యుప యుంజీత శ్వ వరాహాదిపోషణే
పిణ్యాక క్లేదనార్థం వా విక్రేయం వా తదర్హయేత్ వృత్తిం ధాన్య హిరణ్యేన గోపాదీనాం ప్రకల్పయేత్
తేహి క్షీర వ్రతా లోభాదుపహన్యుస్తదన్వయాన్ దోహకాలం గవాం దోగ్ధా నాతి వర్తేత వై ద్విజాః
ప్రసరోదక యోర్గోపా మంథకస్యచ మంథకాః మాసమేకం యథాస్తన్యం మాసమేకం స్తనద్వయమ్
సతతం పాయయేదూర్థ్వం స్తనమేకం స్తనద్వయమ్ తిలపిష్టాభిః
పిండాభిస్తృణేన లవణేన చ వారిణాచ యథాకాలం పుష్ణియాదితి వత్సకాన్
తా ॥ భర్త, తన సుఖము కొఱకు భార్యను వెంబడించి యుండును. అతనికి వివిధములైన ఆనుకూల్యములను చేయవలెను. అత్తమామలకు కూడ పడకలనమర్చుట మొదలగు సేవలు చేయవలెను. ముఖ్యముగా భర్తకు సంబంధించిన పనులను ఇతరులచేత చేయింపకూడదు. మఱఁదులు మొదలగు వారు ధరించి విడిచిన వస్త్రములు, పుష్ప (హారములు, అలంకారములు. తాను ధరింపకూడదు. వారి శయ్యలు మొదలగునవి ఆక్రమింపకూడదు. తెలిక (గానుగ)పిండి, దంటు ముక్కలు, కాలము వలన మార్పునందిన వస్తువులు. అస్వీకార్య పదార్థములు, చలి(పాసిన) అన్నము మొదలగు వానినీ పశువుల ఆహారమునందు వినియోగింపవలెను. వివిధములైన ఆవులు మొదలగువానికి, పసుల కాపరులకు లేక పసులమందలోని జీవులకు. దూడలకు లేగలకు ఆహారపదార్థములుగా నుపయోగింపవలెను. పెరుగు నుండి వెన్న, నేయి తీయవలెను. పాలుపితుకవలెను. కాని దూడలను పీడింపకూడదు. వర్షరుపునందు, శరత్కాలమున, వసంతర్తువునందును, రెండు పర్యాయములు, ఇతర ఋతువులందు ఒకసారి పితుకవలెను కుక్కలు పందులు వాని పోషణకొఱకు, మజ్జిగవంటివి ఉపయోగింపవలెను. మజ్జిగ మొదలగువానిని గానుగ పిండిని తడుపుటకు ఉపయోగింపవచ్చును. అమ్ముటకు సిద్ధము చేయవచ్చును. పసుల కాపరులకు ధాన్య రూపముగా, లేక ధన రూపముగ జీతముల నేర్పాటు చేయదగును. వారే పాలకు (పాడికి) సంబంధించిన వ్యవహారములను నడి పెడి నీయమము గలవారు, కాని లోభము వలన ఆ వృత్తులను కట్టి పెట్టిరి. ఆవుల పాలు పితుకువాడు, పితుకుకాలమును అతిక్రమింపరాదు. గోపొలకులు కాయుటకు, నీళ్ళు పెట్టుటకును, చిలుకు వారు చిలుకుటకును సమయమును పాటింపవలెను. ఒక మాసము రెండు ఒక స్తనములు మఱియొక మాసము మజీ రెండు స్తనములను దూడ పాలు త్రాగుటకై వదలవలేను. గానుగ (నువ్వుల) పిండి ఉండలచేతను లేత గటికలచేతను, ఉప్పుచే, నీటిచేతను వలసినంత కాలము వఱకు లేగలను పోషింపు చుండవలెను.
మూ॥ జరద్గుర్గర్భిణీధేనుర్వత్సావత్సతరీ తథా పంచానాం సమభాగేన ఘాసం యూథే ప్రకల్పయేత్
ఏకో గోపాలకస్తస్య త్రయాణామథవాద్వయమ్ పంచానాం వత్సకశ్చైకః ప్రవరాస్తుపృథక్ పృథక్
గోచరస్యానయనార్థం వ్యాలానాంత్రాసనాయచ ఘంటాః కంఠేషు బధ్నీయుః శోభారక్షార్ధమేవచ
పశవ్యేవ్యాలనిర్ముక్తే దేశే భూరితృణోదకే అభూత దుష్టే వారణ్యేసదాకుర్వీత గోకులమ్
సగుప్తమటవీ వాసం నిత్యం కుర్యాదజావికమ్. ఊర్ణాం వర్షే ద్వీరాదద్యా చైత్రాశ్వయుజమాసయో :
యూథే వృషా దశైతాం, చత్వారః పంచదాగవామ్ అశ్వోష్ట్ర మహిషాణాంచ యథాస్యుః సుఖ సేవితా :
విద్యాత్కృషీవలా దీనాం యోగం కృషిక కర్మసు. భక్తవేతన లాభంచ కర్మ కాలానురూపతః
క్షేత్ర కేదార వాటేషు భృత్యానాం కర్మ కుర్వతామ్ ఖలేఘచ విజానీయా త్క్రియాయోగం ప్రతిక్షణమ్
యోగ్యతాతిశయం మత్వా కర్మయోగేషు కస్యచిత్ గ్రాసాచ్ఛాద శిరోభ్యంగైర్విశేషం తస్య కారయేత్
పద్మశాకాది, వాపానాం కందబీజాది జన్మనామ్ సంగ్రహః. సర్వబీజానాం కాలేవాపః సుభూమిషు
తా॥ ముసలి ఆవు, కట్టినది (గర్బిణి) పాలిచ్చునది, లేగదూడగలది, రెండవ వయస్సు ఇంచుక కలిగిన కోడే గలది. ఆయిన ఈ ఐదింటిని సమానముగా లేత పచ్చికను సమకూర్చవలెను. మూడు వందలకు ఒకడు లేక ఇద్దరు గోపాలురు, ఐదింటికి ఒక బాలుడు విడివిడిగా శ్రేష్ఠులు, తప్పిపోయిన ఎద్దును. (ఆవును) గుర్తించి తీసికొనివచ్చుటకు, సర్పాదులను భయపెట్టుటకు వాని కంఠములందు గంటలను కట్టవలెను. అవి వాని అందమునకు, రక్షణమునకును ఉపయోగపడును. పశువులకు కలిగెడి రోగాదులు కలుగకుండెడివి. పాములు లేకుండెడివి, పచ్చిక, నీరు సమృద్ధిగా దొరికెడివి, దుష్టభూతములు లేనివియయిన అడవులలోనే ఎప్పుడును పసుల మందలను ఉంచుచుండవలెను. గొఱ్ఱలు, మేకలు మొదలగువాని-మందలను గుప్తమగు. అడవులయందే ఉంచవలెను. వాని నుండి ప్రతి సంవత్సరము రెండు పర్యాయములు, చైత్ర, ఆశ్వయుజమాసములలో ఉన్ని (బోచ్చు) తీయవలెను. వీనీ మందలో పది మేక, గొళె)పోతులు, ఆలమంద ఒకటికి నాలుగైదు ఆబోతులు ఉండునట్లు చూడవలెను. అటులే గుఱ్ఱముల, ఒంటెల, గేదెల గుంపులలోను. వానికనుకూలమైన రీతిగ వీర్యవృద్దిగల పోతులనుంచవలెను. రైతులు (పాలేరులు మొదలగువారు తమతమ పనులు. చక్కగా చేయుచున్నదీ లేనిదీ తెలిసికొనుచుండవలెను. వారికి తిండి, జీతము వారివారి పనిని బట్టి, కాలమును. బట్టి ఏర్పాటు చేయవలెను. పొలములలోను, వరిమడులలోను, కూరతోటలలోను పనివారీ పనులు సాగుచుండవలెను, దుష్టుల విషయమున, వారు పనిచేయుచున్నది లేనిది. ప్రతిక్షణము. గమనించుచుండవలెను. పని వారిలో నెవరేని తన పనిలో ఎక్కువ కౌశలమును కనబఱచుచుండిన అట్టివారికి ప్రత్యేకముగా ఆహారపదార్థములు, కప్పుకొనుటకు బట్టలు, తలంటునూనెలు ఇచ్చుచుండవలెను. తామర, శాకములు మొదలగువాని విత్తనములు, గడ్డలు, దుంపలు మొదలగు వాని బీజములు, ఇంకను అనేక విధములైన విత్తనములను ఆయా కాలములలో సంగ్రహించి వానిని తగిన ఋతువులలో తగిన భూములలో విత్తుచుండవలెను.
మూ ॥జాతానాం రక్షణం సమ్యగ్రక్షితానాంచ సంగ్రహాః తేషాంచ సంగృహీతానాం యథావన్నివప క్రియా
గృహమూలం స్త్రీయశ్చైవ ధాన్యమూలో గృహాశ్రమః తస్మాద్ధాన్యేషు భక్తీషు న కుర్యాన్ముక్తహస్తతామ్
ధాన్యంతు సంచితం నిత్యం మీతో భక్త పరివ్యయః నచాన్న్తే ముక్తహస్తత్వం గృహిణీనాం ప్రశస్యతే
అల్పమిత్యేవ నావజ్ఞాం చరే దన్నేషువై ద్విజాః మధు వల్మీక యోర్వృద్ధిం క్షయందృష్ట్వాంజనస్యచ
యేకేచిదిహ నిర్దిష్టా వ్యాపారాః పురుషోచితాః దంపత్యోరైక్యమాస్థాయ తద్ధి దాన ప్రసంగతః
సంత్యేవ పురుషా లోకే స్త్రీ ప్రధాన సహస్రశః తేషుతాసాం ప్రయోక్తృత్వాదదోష ఇతి గృహ్యతామ్
ఏవం యోగ్యతయా యుక్తా సౌభాగ్యేనోద్యమేన సమ్యగారాధ్య భర్తారం తత్రైనం వశమానయేత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి స్త్రీధర్మ వర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః
తా ॥ పుట్టిన వానిని కాపాడుట, కాపాడిన వానిని చక్కగా సంగ్రహించియుంచుట, అట్లు సంగ్రహించిన వానిని సమయాను కూలముగ విత్తుట చేయుచుండవలెను. గృహమునకు మూలము స్త్రీ, గృహస్థాశ్రమము ధాన్యమే మూలముగా గలది. అందువలన స్త్రీలు ఆహార ధాన్యముల విషయమున మితవ్యవమును పాటింపవలేను. ధాన్యమును నిత్యమును సేకరించుచుండవలెను. వినియోగమున పొదుపు పాటింపవలెను. అన్నాదుల విషయమున స్త్రీలు 'దుబారా' చేయకూడదు. తేనె ఎట్లు కణకణముగా క్రమవృద్ధినొందునో, పుట్ట, ఎట్లు రేణువురేణువుగా పెరుగునో, కాటుక ఎట్లు కొంచెము కొంచెముగా వాడుచున్నను తరిగిపోవునో గమనించి ఆహారపదార్థముల విషయమునను అల్పమని నిర్లక్ష్యము చేయక సంగ్రహవ్యయములను జాగ్రత్తగా చేయవలెను. పురుషోచితములైన వ్యాపారములు నిర్దేశింపబడిన వారైనను వస్తుధనాదుల వినియోగ ప్రసంగమున మాత్రము భార్యాభర్తల ఐకమత్యమును పాటింపవలెను. లోకమునందు స్త్రీ ప్రాధాన్యముగల పురుషులెందఱో కలరు. వారియందు స్త్రీల ప్రయోక్తృత్వము దోషము కాదని గ్రహింపవలేను. ఈ విధముగ యోగ్యతతోకూడి, సుభగత్వము తోడను, కార్యనిర్వహణోద్యమము తోడను స్త్రీ తన భర్తను వశపఱచుకొనవలెను.
ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మ వర్ణనమను పన్నెండవ అధ్యాయము.
Summary of chapter 12 of the Bhavishya Mahā Purana is as follows:
The management of grain stores, the preparation and serving of food, the care of dairy animals, and the economy of the household are addressed in this chapter. Rules for which foods may be prepared on which days, the proper order of serving the husband and guests before eating oneself, and the prohibitions governing certain foods in the presence of illness or inauspicious conditions are enumerated. Dairy — particularly cow's milk, curd, and ghee — is given special attention as the substance most intimately tied to the household's prosperity and the quality of the food offerings made to deities and guests. The chapter reveals that strī dharma in the kitchen is simultaneously an economic and a ritual discipline.